Showing posts with label అజ్ఞానపు ఘనులు. Show all posts
Showing posts with label అజ్ఞానపు ఘనులు. Show all posts

Wednesday, August 31, 2016

అజ్ఞానపు ఘనులు, గనులు

అజ్ఞానపు ఘనులు,  గనులు

అవధానములెన్నియో అనవధానములెన్నియో నిర్లిప్తత
లెన్నియో; సంఘమున స్వోత్కర్షలు పరనిందలు పెచ్చు
పెరిగినవి అందరు ఘనులే ఇతరుల తూలనాడుటయందు
ముసలి ఆంబోతురకములెక్కువైనవి; అవి చేయలేవు

మరొకరిని చేయనీయవు; అంతయు కుల భూతద్దమున
చూచుచు భాషను, జ్ఞానమును, శాస్త్రములను భ్రష్టు
పట్టించు బాధ్యతారహితులు మేధావులుగ చలామణీ
అవుచున్నారు; ఉన్నది విద్వేషములతో కూడిన అసూయ

తాము ప్రతిభావంతులై సంఘమును ముందుకు తీసికొని
పోవు సమర్ధతలేక,‌ ఆడలేక మద్దెల ఓటన్నట్టు ఇతరులపై
పడి ఏడవడం ఒక రివాజయింది; ప్రతిభావ్యుత్పన్నతలతో
భాషకు, జ్ఞానమునకు, శాస్త్రములకు కొంగ్రొత్త రూపుల

నిచ్చు పటిమ లేక కులగజ్జి మనసంత పట్టించుకొని
సమస్తమును విధ్వంసము చేయుచున్న మూర్ఖకులజులు
ఆ గజ్జినంతా సంఘమునకు పట్టించి తాము మహా
మేధావులమనుకొను మూఢులు సంస్కృతీ సస్యమునకు

పట్టిన చీడలు; భాష మాటలాడుటకు మాత్రమే
పరిమితమైనది కాదని, అందు సమస్త సాహిత్యము
శాస్త్రములు, జ్ఞానములు సృష్టించుటకు నిర్దుష్ట భాష
అవసరమన్న అర్థము కాని పొగరుబోతులు, సంస్కార

హీనులు కులగజ్జిచే అవస్థపడు, అవస్థపెట్టు అజ్ఞానులు
జ్ఞానరహితులు; సంఘమునకు, సంస్కృతికి, వన్నెతెచ్చు
చక్కని రచనలు చేయు సంభావ్యత లేక అలమటించు
కులభవరోగ మనస్కులు, మానసికరోగులు, దౌర్భాగ్యులు