శివ తత్త్వము
శ్లోII శివరూపాత్ జ్ఞానమహః త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖి రూపాత్ ఐశ్వర్యం భాస్కరాత్ ఆరోగ్యం చ భవంతి ll (సాంబకృత సూర్య స్తోత్రం)
शिव रूपात् ज्ञानमह: त्वत्तो मुक्तिं जनार्दनाकारात्
शिखि रूपात् ऐश्र्वर्यम् भास्करात् आरोग्यं च भवन्ति (साम्ब कृत सूर्य स्तोत्रं)
తాత్పర్యము: శివుని వలన జ్ఞానము, విష్ణువు వలన మోక్షము, సుబ్రహ్మణ్యస్వామి వలన ఐశ్వర్యము, సూర్యభగవానుని వలన ఆరోగ్యము కలుగుతాయని పెద్దల ఉవాచ.
అలా శివుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానప్రదాత కూడా.సత్-చిత్-ఆనందస్వరూపుడైన పరమాత్మ, సత్య-శివ-సుందరుడు కూడా. ఇక్కడ 'చిత్', 'శివ' - శబ్దములు జ్ఞానసంబంధములు.
'చిదానందరూప శివోహం' అనీ మనకు తెలుసు. సరియైన జ్ఞానము కలిగితే, కుదిరితే, మనసు నిండా ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రశాంతమయం అవుతుంది. మనసు పున్నమి చందమామయై పరమాత్మనుంచి పడిన జ్ఞాన కిరణములను ఆహ్లాదరూపంలో ప్రతిఫలిస్తుంది. మనము ఆనందమయులమై పరమాత్మతో విలీనం చెంది అద్వైతానుభూతిని అనుభవిస్తూ సివులము అవుతాము. మన ఉనికికి మూలమైన ఆత్మయే ప్రజ్ఞానము. శుద్ద జ్ఞానము ఇదే. ప్రపంచము ఏర్పడడానికి మూలకారణమైనది పరమాత్మ. ఈ రెండు ఒకటే.
ఉll ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వా
డెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్! [ పోతన భాగవతం (8 -73)]
అని భాగవతం విశదీకరించిన పరమాత్మ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివ కేశవాద్వైతుడు.
పూర్ణ భక్తియే జ్ఞానము. శంకరుడు భక్తజనకింకరుడు. జ్ఞానవైరాగ్య స్వరూపుడైన మౌనియు సదాశివుడే. భక్తపాలనా కళాశీలుడు ముక్కంటి. మార్కండేయుని కాలుని నుంచి కాచి చిరంజీవిని చేసిన భక్త సులభుడు రుద్రుడు. మనందరి క్షేమమూ చూసే తండ్రి. వసిష్ఠ, వామదేవ గౌతమాది ఋషులు ఎన్నో శివ స్త్రోత్రములను ఇచ్చారు. కాశ్మీరముతో సహా భారతావని అంతటా ప్రాకిన శివ తత్త్వము, శైవారాధన ఈశ్వరుని శివుని చేసాయి. తమిళ దేశములో నాయనమారులు, ఆంధ్రదేశమున నన్నెచోడుడు, పాలుకురికి సోమన, శ్రీనాథుడు మొదలైన శివకవులు; ఆరాధించిన, మనసార నుతించిన, స్తుతించిన, కీర్తించిన దైవము; భక్తజన వశంకరుడైన శంకరుడే. కన్నడ దేశములో ప్రభవించి, శివతత్పరులై, శివ సాయుజ్యమునొందిన, బసవేశ్వరుడు, అక్కమహాదేవి గణనీయులైన శివభక్తులు. పై అందరు మనకు ఆదర్శ భక్తులు. అనుసరణీయులు. తెజస్వ్సరూపుడైన అరుణాచలేశునికి శ్రీ రమణ మహర్షి అనుంగు బిడ్డ. జ్ఞానభాస్కరుడైన ఈశునికి దీటైన జ్ఞానదీపిక. కణిక.
ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు వెల్లివిరిసే ప్రదేశాలు మొదలుగా అంతటా విలసిల్లే ఈశ్వరుడు భక్తపరాధీనుడు, గంగాధరుడు, పార్వతీ సహచరుడు, పశుపతి.
మౌనియై, సంచారియై, సరళ జీవితానికి ప్రతీకయై సుఖస్వరూపుడై వెలిగే విశ్వేశ్వరుడు అపర్ణా కళత్రుడు. సదా తాపమున ఉంటూ తల్లి హైమవతిని పరిణయమాడి గృహస్థైన శివుడు అర్థనారీశ్వరుడు. స్త్రీపురుష అద్వైతానికి నిదర్శనం.
శ్రీ దక్షిణామూర్తి స్వరూపుడై వటతరుమూలవాసి అయిన జగత్పిత శివుడు తన మౌనాశీస్సులతో మనకు జ్ఞాన వైరాగ్యములనొసగి ధన్యులచేసి కాచుగాక.
श्रीर्भूयात् శ్రీర్భూయాత్
SIVA TATVA
The word Siva is
synonym for Knowledge.
Sivaroopaat
jnaanamahaha tvatto muktim janaardanaakaaraat
Sikhi roopaat
eiswaryam bhaaskaat aarogyam bhavanti
( saambakruta
soorya stotram)
Purport: We
obtain knowledge from Siva,
liberation from Vishnu, wealth from Subrahmanya and health from Sun.
Thus Siva is embodiment of Knowledge and also giver of
knowledge. The paramaatma Lord Siva
who is sat-chit-aananda is also satya-siva-sundara. Here the words “chit” and “siva” relate to knowledge – both secular and spiritual.
We are aware of the beautiful saying “chidaananda roopa sivoham”. When right knowledge sets in us, our
mind and heart will be filled with bliss and peace. The mind becomes full moon
and reflects the rays of knowledge in form of pleasantness. We, in bliss get
absorbed in the Lord and become one with the Lord and be Siva.
Atman as Prajnaanam is the root and basis for our being. It
is pure consciousness too. The Brahman is the chief cause for the formation of prapancham (world – inner mental world).
Atman and Brahman are one and the same.
Evvaniche janinchu
jagamevvani lopala nundu leenamai
Evvaniyandu dindu
parameswarudevvadu moola kaaranam
Bevvadu anaadi Madhya
layudevvadu; sarvamu taanayaina vaa
Devvadu; vaanini
aatmabhavun eeswaru ne saranambu vededan
[
Bammera Potana Bhaagavata (Telugu) 8-73]
Purport: By Whom the world is born, and resides
absorbed in Him and dissolves into Whom; who is the Lord, who is the root for
all these, who is the origin, substance and dissolution; Who is everything;
such Eeswara, the offspring of the Atman I pray and take refuge.
Like this Bhagavata has
described the parmatma, Eeswara,
Parameswara who is non-dual to Siva and Kesava.
Full devotion is Knowledge. Lord Sankara is servant to His devotees (bhakta kinkara). Sadaasiva
the embodiment of knowledge is Silence-Incarnate. The Three-Eyed is adept in
taking care of His devotees and is artistic in protecting His devotees. He took
care of Markandey;, protected him from Lord Yama and made Markandeya a chiranjeevi (who lives
eternally). He is such care-taker of His devotees and is always available and
His devotees can reach Rudra at any
time in any circumstances. Lord Siva is our Father and takes care of us as one.
Sages like Vasistha, Vaamadeva, Gautama, have composed so
many stotrams (praises and prayers) on Lord Siva. Right from
Kashmir to Kanyakumari the Siva Tatva
has spread and the worship of Lord Siva has transformed paramaata eeswara as Siva.
The Nayanamaars of
the Tamil land, the Saiva poets Nannechoda, Paalkuriki Somana,Srinaatha
of the Andhra, have worshipped, and sung the praises of the Lord to their
hearts’ content and composed lyrics and poetry on Lord Siva and imprisoned Him
in their hearts. Basaveswara,
Akkamahaadevi of the Kannada Desa
have become one with Siva with their devotion and surrender. The above Siva devotees
are role models for us and examples of receiving showers of Siva’s compassion
and love. All these are our guides and leaders in Siva Bhakti. Sri Ramana Maharshi is the dear child, of Arunaachaleswara the embodiment of
brilliance of Knowledge. And also Sri Ramana Maharshi is lamp of and for Siva /
Paramaatma Tatva and is golden
replica in Knowledge of the Lord Arunaachaleswara.
The 12 Jyotirlingas,
5 pancha bhoota lingas, and the like
many great and auspicious temples adorn the length and breadth of the land of
spirituality, our India. Such a Siva is under the whims and fancies of His
devotees, bears Ganges on His head, is Consort of Goddess Parvathi and is Lord of the Pasus
(Pasupathi).
The Visweswara,
the venerated Spouse of Goddess Aparna is
Embodiment of Silence, roams always, an example for simple living is Form of
Happiness and shines as It. The Tapasvi,
who is always in Meditation, married
Haimavathi and became a house-holder. Such Siva is Arthanareeswara and is an embodiment of advaita (sameness) of man and woman.
Being the Form of Dakshinaamoorthy,
who resides under the Banyan Tree, is Father to the World. Let that Siva
make Knowledge and Dispassion dawn in us making us blessed and protect us
through His Silent Blessings.

No comments:
Post a Comment