Saturday, November 22, 2014

ప్రణయ తుషారములు

 

ప్రణయ తుషారములు

మనసు చల్లబడ పూసినది చెలి
స్న్సేహగంధాలు సౌరభము వెదజల్ల
క్రొత్త చిగురులు తోదిగినది డెందపు మామిడి
చెలియయే వసంతమై అందముగ అడుగిడగ


చెలిచూపులు ప్రసరించినవి
చల్లని వెన్నెలలు మనసుపై
నిండు చందురుడే కదా చెలి మోము
పున్నమియే కదా ఎన్నడు నా మానసరాత్రుల


హృదయమంతా నిండిఉన్న చెలి చిత్తరువు
పదే పదే కలిగించును తీయనైన మత్తులు
వీణియగా చేసి ప్రణయిని మేనిని ఆలాపించ వలె
జగత్తు పులకింప ప్రణయరాగము


చెలియ ఒంపుల ఒంటి నునుపు
తలదన్నునో పూరేకుల మెత్తదనము
నా రాణి పెదవుల అంటియున్న జుంటు తేనియలు
సిగ్గిల చేయునేమో మకరందపు తీయదనాలు


కొండల అంచుల చెంగి దూకు ఒంపుల సెలయేరో చెలి
వలపుమెండుగ కాయు వేసవి ఎండల చల్లని వృక్ష ఛాయయో చెలి స్నేహము

అందినది నాకు ఆనందము మది నిండగచిందినవి ప్రణయ తుషారములు
చెలి ప్రణయార్ద్రతా కావేరిని తేలియాడెదను తరగలనై తన్మయుడనై

No comments:

Post a Comment