Friday, January 12, 2018

ముఖపుస్తకము-అంతర్జాలము టపాలు కథా కమామీషు; దృష్టి; Consciousness and Mind;శుష్క వచనములు - శూన్యహస్తములు; Idea of India being spoiled

ముఖపుస్తకము-అంతర్జాలము టపాలు కథా కమామీషు

మనలో చాలా మందికి, మన కుటుంబ విషయాలు మనకున్నంత ఇష్టముగా, ఆసక్తికరంగా అంతర్జాలంలోని ఇతరులకు, మన స్నేహితులైనా (ముఖ పుస్తకపు లేదా అటువంటి) అంత హుషారుగా, ఆసక్తికరముగా ఆకర్షణీయముగా ఉండవని తెలుసో లేదో తెలియదు. ఒక్కోసారి మన చాదస్తం వారికీ ఇబ్బందీ కలిగించవచ్చు.
అంతర్జాలములో కలిగే స్నేహము నీటిపై రాతల వంటిది. ఈ క్షణం ఉంటుంది. మరుక్షణము ఉండకపోవచ్చు. ఉండదు కూడాను. మనము అందరమూ ఒకరికి ఒకరము ఏమీ మానసిక బందీలము కాము. ఎవరి గోల వారిది. ఎవరి గోడ వారిది. కుటుంబ, స్వంత జీవితపు అన్ని విషయాలు మనలోనే, మన అంతర్జాలపు బయటి స్నేహితులకు పరిమితమైతేనే మంచిది.
ఇక్కడ అంతర్జాలములో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. ఎదో కాలక్షేపం బఠాణీలు .
సారస్వత, రాజకీయ, ఇతర సిద్ధాంత రాద్దాంతాలలో తల దూర్చడం అస్సలు అనవసరం. తల దూర్చకపోవడం మానసిక ఆరోగ్యకరం. ఇంకొందరు వారికి ఇష్టమైన సిద్ధాంతమో, భాషో (మాతృభాష కూడా కావచ్చు) మనమీద రుద్దడానికి ఉత్సుకులై ఉంటారు. మనమీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మనలని నియంతలలా నిలదీస్తారు. ఉపన్యాసాలు ఇస్తారు. మనకి ఎంతో చిరాకు కలిగిస్తారు.
ముఖ్యముగా ఆంగ్ల, సంస్కృత భాషలకు వ్యతిరేకముగా, తెలుగు భాషకు అనుకూలముగా ఎంతో చెబుతారు. మనలని మొహమాటపెట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. మనకి అభిరుచులు ఇష్టాయిష్టములు ఉంటాయని పట్టించుకోరు.
అలాగే హిందూ మతము, సనాతన ధర్మముల గురించి ఎన్నో టపాలు చూస్తూంటాము. వాటిని పెట్టేవారికి ఆ పెట్టిన విషయములో ఏమీ పరిజ్ఞానము గాని అవగాహన కానీ లేవని మనకు తెలుస్తూంటుంది. వారికి తెలియదు. చిలక పలుకులలా తమ టపాలను పలికిస్తారు. అలా చేయడము మతానికి, ధర్మానికి ఎంతో సేవ అని దర్పము పొందుతూ పుంఖానుపుంఖాలుగా టపాలు పెట్టేస్తూంటారు.
కానీ తాము పెట్టే తపాలా సారాన్ని వంటబట్టించుకుని బాగుపడుతున్నట్టు కనిపించరు. అంతా సమాజం కొరకే అన్నట్టుంటారు. ముఖపుస్తకములో, అంతర్జాలములో కావలిసినంత కాలక్షేపము, వినోదమూను. పెద్దల వయసులో ఉన్న పిల్ల, పిన్న మనస్కులు ఎక్కువైనారు. అందరమూ శత కోటి లింగాలలో ఒక బోడి లింగంలము.
********
Being unaware of self-consciousness is bliss; peace; silence.
*********
దృష్టి

ద్వైతము వారికి పడదు అద్వైతము
విశిష్టాద్వైతమునకు పడవు ద్వైతాద్వైతములు
భారత దేశమున బ్రహ్మసూత్రములకు
భగవద్గీతకు ఉపనిషత్తులకు ఎన్నో
పరస్పర విరుద్ధ వ్యాఖ్యానములు; గందరగోళము

సృష్టించు బహు ఆచార్యులు; వారి అనుయాయులు
వ్యాఖ్యానమునకో మతము, దృష్టికో సతమతము
అవగాహనలు పలువిధములు ఆ ప్రస్థాన త్రయమునకే;
అదెటుల సాధ్యము? పుస్తకములకన్నా దృష్టి ;ప్రధానమైనది కనుక
**********
Success is the result of continuing effort!
*******
Certain things must remain a mystery and should be mysterious. I am for we need not know every thing that fancies us. This mystery keeps us active mentally and inquisitive
********
To find a common language with a person, one should learn to be silent.
********
Consciousness and Mind
*Consciousness is mechanical form of energy, the result of breathing process.
**Mind in biochemical and biophysical form of energy undergoes transformations reversibly under the guidance and gauze of consciousness enabling humans/ vertebrates in cognition and communication.
***Mind as sense/ experience/ intuition/ insight/ understanding/ volition/ pain/ happiness/ ache is biochemical in nature. 
****Mind as thoughts/ feelings is electrochemical in nature.
*****Utterance/ speech/ gesture is transduction of thoughts/ feelings in electrochemical form into sound/ mechanical form of energy.
******Concept, awareness and feeling of passage of time are thought/ feeling forms, and are transformations of psychic energy in elctrochemical form; forward as speech and gestures into mechanical and and backward into sense, idea, understanding, experience as biochemical forms respectively. Awareness of time is the result of transformation of energy. When energy does not transform as experiences, thoughts, feelings;, the state of mind is called time-transcendent.
*******All our consciousness, mind and their functions in association with sense and action organs are biological in nature, the result of presence and transformation of energies in various forms as cited above.

********

శుష్క వచనములు - శూన్యహస్తములు

అందరూ కవులే కవిత్వం చదివేవారే అరుదు
అందరూ నాయకులే ప్రజాసేవ చేసేవారే అరుదు
అందరూ మేధావులే వారిలో మేధ మాత్రం అరుదు
అందరూ గురువులే పరమాత్మను దర్శించిన వారే అరుదు
అందరూ స్కూళ్ళు నడిపేవారే చదువు రావడమే అరుదు
అందరూ సంఘసేవకులే ఇళ్ళల్లో మాత్రం సేవ అరుదు
అందరూ సమాజాన్ని నడపాలనుకునేవారే నడపగలిగిన వారు మాత్రం అరుదు
అందరూ జీవకారుణ్య ఉపన్యాసకులే కోడి, మేక, పంది
మాంసములను తినని వారే అరుదు
కబుర్లు ఘనం ఆచరణకు గ్రహణం
నేటి మన భారత పర్వం ఒక నిరంతర
ఆషాఢభూతుల మయం రెండు నాలికల
ధోరణులు ప్రబలం అంతా శూన్యహస్తం
****
Idea of India being spoiled

India is becoming a land of pseudo-citizens. Many do not like the idea of India tuned to wisdom of the past generations;.and many "intellectuals", "rationalists" and caste and community leaders are practicing a hatred-centered policy towards all ancient Indian without any commonsense or sense. Their reverse discrimination is obstructing the idea of India and its progress and development. Their idea of India does not exit in a positive way. Their opposition to Ancient Indian thought and culture itself working as their ideology. Very narrow-minded and foolish practice.
****

Thursday, January 11, 2018

మా తురా (మేఘాలయ) పర్యటన

మా తురా (మేఘాలయ) పర్యటన 1
19, 20-11-2017
జీవితం అనే పెద్ద ప్రయాణం లో మనం ఎన్నో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటాము. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన ఈ రోజుల్లో దూరాభారాలు లెక్క చెయ్యకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటాము. 
బస్సులు, రైళ్ళు, టాక్సీలు, విమానాలు తేలికగా అందుబాటులో ఉన్న ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ పెట్టుకుంటున్నాము. మన పెద్దవాళ్ళు ఇన్ని ప్రయాణాలు చేసేవారు కాదు. రవాణా సౌకర్యాల లేమి, ధనం అంతగా లేకపోవడం, ఇళ్ళల్లో పనులు ఎక్కువగా ఉండడం కారణాలు.
అదీకాక దారిలో క్రూర మృగాల, దొంగల, దోపిడీ దారుల భయాలు ఎక్కువ. అందుకే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడు సమానం అనుకునేవారు. మనకు ఇటువంటి సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
రకరకాల కారణాలు పెట్టుకుని దగ్గర, దూరం ప్రయాణాలు చేస్తున్నాము. మేము డిసెంబర్ 14, 2016 నుంచి నెలకు రెండు ప్రయాణాలు దగ్గరివి,
దూరాలవి చేస్తున్నాము. మొన్నే మిజోరమ్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ కి వెళ్ళాము. అంత క్రితం ఆగష్టు లో ఖాట్మండు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మేఘాలయ వెళుతున్నాము. జాతకంలో గోచారంలో గ్రహాల సంచారములో మార్పు వచ్చినపుడు ఇలా వరుస ప్రయాణాలు తగులుతాయని జాతకులు అంటూంటారు. నాకు జాతకాలు, జ్యోతిషాలలో ప్రవేశం, వాటిపై అవగాహన లేవు.
తురా మేఘాలయలో ఒక ప్రాంతం. North Eastern Hill University (NEHU), షిల్లాంగ్ యొక్క ఒక శాఖ తురా లో ఉంది. ఇక్కడ కామర్స్ డిపార్ట్మెంట్ లో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో ప్రజెంట్ చేయడానికి నా పరిశోధనా పత్రం ఎన్నిక అయింది. దానిని సమర్పించడానికి తురా బయలు
దేరాము. సదస్సు నవంబర్ 23, 24 లలో జరుగుతుంది
భీమవరం నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి వచ్చి అక్కడ సికింద్రాబాద్- గౌహతి ఎక్స్ప్రెస్ కి మారి గౌహతి వెళుతున్నాం. రేపు ప్రొద్దున్నే 21- 11-2017, 6 గంటలకు చేరతాము. అక్కడినుంచి తురా బస్ మీద 4' 5 గంటల ప్రయాణం.
మా తురా (మేఘాలయ) పర్యటన 2
21-11-2017
శ్రీ కామాఖ్యాదేవి ఆలయ సందర్శనం
మేము సికింద్రాబాద్-గౌహతి ఎక్స్ప్రెస్ లో మూడుగంటల ఆలస్యంగా ఉదయం 9 గంటలకు గౌహతి చేరాం. గౌహతి ప్రవేశిస్తూ ఉండగా బ్రహ్మపుత్రా నది స్వాగతం పలికింది. మనకి బ్రహ్మపుత్ర అయిన ఈ నదికి దీని జన్మస్థలం అయిన టిబెట్ లో మరియొక పేరు. నామ, రూపములని బట్టి వస్తువులు మనలో ముద్రలు వేస్తాయి. ఒకే వస్తువు వేరు వేరు భాషల్లో, సంస్కృతులలో వివిధ భావాలు పుట్టిస్తాయి. మన ప్రేమాస్పదత, అభిమానాలు, ఇష్టాయిష్టాలు, ఆవేశ కావేషాలు ఈ మాటల మీద ఆధారపడి ఉంటాయి. భాష మన మొదటి సంస్కృతి. దానిమీదే అన్ని శాస్త్రాలు, వేదాంతాలు, తత్త్వాలు, కావ్యాలు ఆధారపడి నిర్మింపబడతాయి. సృష్టించబడతాయి. మన జీవనానికి, సంస్కృతీ సాంప్రదాయాలకి, నాగరికతకి భాష జీవనాడి.
బ్రహ్మపుత్ర నది దాటిన వెంటనే కామాఖ్యా రైలు స్టేషన్ వస్తుంది. ఆ తరువాత గౌహతి. మేము రైల్వే వెయిటింగ్ హాల్ లో రిఫ్రెష్ అయ్యి సామాన్లు క్లోక్ రూమ్లో పెట్టిన కామాఖ్యాదేవి ఆలయ సందర్శనానికి
బయలుదేరాము. గౌహతి స్టేషన్ నుంచి సిటీ బస్ లో ఒక సెంటర్ కి వెళ్ళి అక్కడ నుంచి దేవస్థానం బస్లో
కొండ పైకి వెళ్ళాము. కొండ కింద నుంచి ఇతర రకాల
వాహనాలు లభ్యమౌతాయి.
కొండ పైకి మెట్లు ఎక్కీ వెళ్ళవచ్చు. కొండ మరీ ఎత్తు లేదు. అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. సతీదేవి వివిధ అంగాలు వివిధ ప్రదేశాల్లో పడి అవన్నీ శక్తిపీఠాలు గా మారినట్లు మనకి ఐతిహ్యం. సతీదేవి యోని ఇక్కడ పడ్డట్టు పురాణం. తిరుపతిలో లాగా ధర్మదర్శనానికి కంపార్ట్మెంట్ లు ఉన్నాయి. జనం ఎక్కువగా ఉన్నారనిపించి దర్శనం కోసం 501/- రూపాయల టిక్కెట్లు తీసి కున్నాము. అమ్మవారి ఆలయ పరిసరాలు, ప్రాంగణం అందంగా, నిశ్శబ్దంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. అమ్మవారి ఆలయం రాతి కట్టడం. శిల్పాలు సకకృత్తుగా ఉన్నాయి.

మా తురా (మేఘాలయ) పర్యటన 3
కామాఖ్యాదేవి సందర్శనం 2
22-11-2017
కామాఖ్యా దేవి విగ్రహం రూపంలో లేదు. నిన్ననే గౌహతి లో కామాఖ్య అమ్మవారి ఆలయం దర్శించాము. ఆలయంలో అమ్మవారి దగ్గరకు వెళ్ళేముందు ఒక పీఠంపై మూడు మూర్తులు ఉంటాయి. మధ్యలో కామాఖ్య అమ్మవారి మూర్తి, కుడిపక్కన కామేశ్వరి దేవి, ఎడమ పక్క కామేశ్వరుడు ల ఉత్సవ విగ్రహాలవంటివి. వెనుకవైపు భూగృహంలో అమ్మవారు జలధార లా ప్రవహిస్తూంటారు. అదే అమ్మవారు. అమ్మవారికి వేరే విగ్రహం లేదు. ఈ విగ్రహం, ఈ 15 ఏళ్ళకొకసారి అనేది అబద్ధం. ఈ వాట్సాప్ లలో ఎన్నో అబద్ధాలు రౌండ్లు కొడుతున్నాయి. నేనూ దానికి బలి అయ్యి ఆ ఫొటో షేర్ చేశాను. ఇదీ కథ.
మేము కామాఖ్య అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ప్రవేశించాము. ఆలయ పరిసరాలు, ప్రాంగణంలో చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. గుడి పురాతనమైనది. వినాయకుని ఒక ప్రతిమ, కొన్ని శిల్పాలు ఆలయం గోడలపై ఉన్నాయి. ఆలయంలోకి 50 మంది చొప్పున పంపిస్తారు. క్యూ తిరిగి పీఠంపై ఉన్న ప్రతిమలను చూసినప్పుడు ఎంతో హాయి కలుగుతుంది. అక్కడ అరటిపండ్లు, కొబ్బరికాయలు ఉండవు.
పూలదండలు, తలకు చుట్టుకునే - जै श्री माता అని రాసి ఉన్న గుడ్డలు అమ్ముతారు. ఆడ, మగా కొనుక్కుని అమ్మవారి దర్శనానికి వస్తారు. పసుపు, కుంకుమ, చీర ఇచ్చే వారు ఇవ్వచ్చు. ఇవన్నీ మూల దేవి దగ్గర ఇవ్వాలి. మూర్తుల దర్శనం తర్వాత మూలదేవిని దర్శస్తాము. భూగృహంలో జలధారయే అమ్మవారు. నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని మనం చేతితో తీసుకుని తలపై జల్లుకుంటాము. అక్కడ ఉన్న పూజారి కుంకుమ బొట్టు పూస్తారు. లోపల భూగృహంలో ప్రమిదలలో నూనె/నెయ్యి దీపాలే ఉంటాయి. వాటి వెలుగే వెలుగు. అక్కడ ఎంతో చల్లగా పవిత్రంగా ఉంది. మనసు నెమ్మదిని పొందింది.
ఖాట్మండు లో కూడా అమ్మవారు గుహ్యేశ్వరీ విగ్రహం రూపం లో ఉండరు. నీటి ఊటే అమ్మవారు. 
కామాఖ్యా అమ్మవారి కరుణతో ఆవిడ దర్శనం చేసుకుని, అక్కడ కల్పించిన సదుపాయంతో భోజనం చేసి, బ్రహ్మపుత్రా నదిని దర్శించి తురా వెళ్ళడానికి సిద్ధం అయ్యాము. ఎంతోమా తురా (మేఘాలయ) పర్యటన 4
21, 22, 23-11-2017.
తురా ఆగమనం
కామాఖ్యా దేవి దయతో ఆవిడని దర్శించుకొని ఆలయం ప్రాంగణంలో కూర్చుని తల్లికి మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొని, నమస్కరించి బయలుదేరాము. బయట ఆలయం నిర్వాహకులు యాత్రీకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పెసరపప్పు తో ఉడికించిన అన్నం, ఒక కూర, పరమాన్నం, అప్పుడు ఆధరువులు. బాగానే ఉన్నాయి. అన్నీ మారు వేశారు కాని అప్పడం వేయలేదు. మనం మన ప్రాంతం విడిచాక మజ్జిగ అన్నం, పెరుగు అన్నం గురించి మర్చిపోవాలి.
ఈ ప్రాంతాల్లో మజ్జిగ అన్నం తినే అలవాటు లేదు.
బస్సులో స్టేషన్ కి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. గౌహతి నుంచి తురా కి ప్రొద్దున్న 6-30కి, మధ్యాహ్నం 1-30 కి, రాత్రి 9 గంటలక రవాణా సదుపాయం ఉంది. సుమోలు అలాంటి ఇతర వాహనాలు షేర్ చేసికొని వెళ్ళవచ్చు. టాక్సీలు ఉంటాయి. 4 వేలు అడిగాడు.
మధ్యాహ్నం 3 అయింది కాబట్టి ఇవేమీ లేవు. రాత్రి 9 గంటలకు బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. గౌహతి స్టేషన్ నుంచి ISBT - Inter State Bus Terminal - కి వెళ్ళాలి. ఇంటర్ స్టేట్ బస్ లన్నీ అక్కడ నుంచి బయలు దేరతాయి. తురా మేఘాలయ రాష్ట్రంలో ఉంది. గౌహతి స్టేషన్ నుంచి 2 గంటలు ముందే బయలుదేరాము. స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ ఉంది. అక్కడ నుంచి ఐ ఎస్ బి టి కి గంటన్నర పట్టింది. ఐ ఎస్ బి టి చాలా పెద్ద బస్ స్టాండ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం లకు బస్సులు అక్కడ నుంచి బయలు దేరతాయి.
మా బస్ 9 కి బయలుదేరింది. అది ప్రయాణీకుల బస్సుల్లో కంటె రవాణా బస్ అనవచ్చు. మాకు తెలియక అటువంటి బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. సీట్లున్నాయి. అందరూ మగవారే. కామేశ్వరి తప్ప ఆడవారు లేరు. కొద్దిగా అనిపించింది. కానీ అంత భయపడనవసరం లేదనీ అనిపించింది. అక్కడ రాత్రి బస్ ప్రయాణాలు చెయ్యరని తెలిసింది. అందరూ పగలే ప్రయాణం చేసేస్తారు. గౌహతి నుంచి తురా కు 5 గంటల ప్రయాణం. బస్ తెల్లవారుజామున 4 గంటలకు తురా చేరింది. మధ్యలో ఒక ధాబా దగ్గర గంట పైగా ఆపేశారు.
మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ కి ఆటో వచ్చింది. ఎక్కువగా ఏమీ తీసికోలేదు. మనుషులు మంచివారు. మా గెస్ట్ హౌస్ 8 కిలోమీటర్ల దూరం ఉంది. మమ్మల్ని జాగ్రత్తగా గెస్ట్ హౌస్ దగ్గర దించాడు. కేర్ టేకర్ వెంటనే రూం ఇచ్చాడు. అతను వెనకాల ఇంటో ఉంటాడు. అది హాస్టల్ కూడాను. అందులో ఉన్న అమ్మాయిలు కేర్ టేకర్ ని లేపడంలో
సాయం చేశారు. వారి మేలు ప్రశంసనీయం.
మేము బాగా‌ అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపోయాం. ఎనిమిది గంటలకు లేచాం. కాన్ఫరెన్స్ 23, 24 లలో. 22 పొద్దున్నకి తురా చేరాం. మేము ఉన్న గెస్ట్ హౌస్ పేరు
SMELC
Social Mobilization for Employment and Learning Center.
Dakkopgre
West Fargo Hills
Tura
మేఘాలయ గవర్నమెంట్ వారి డిఆర్డిఎ శాఖ నిర్వహణలో ఉన్న భవంతి. దానికి ఆనుకొని ఒక మెస్, క్లాస్ లు జరపడానికి మరొక భవంతి ఉన్నాయి. ఆవేళ్టికి పూర్తిగా రెస్ట్ తీసుకున్నాము. మెస్ లో భోజనం చేశాము. మేఘాలయలో వరి అన్నం తింటారు. మాకు బ్రేక్ ఫాస్ట్ పూరీ కూర, మధ్యాహ్న భోజనం అన్నం, మూడు కూరలు, పల్చగా ఉన్న పెసర పప్పు నలుచుకొందుకు పచ్చిమిర్చి ముక్కలు, కారట్, ఉల్లిపాయ, కుకుంబరు ముక్కలు ఇచ్చారు. పన్నీర్ తో చేసిన కూర వీళ్ళకి ఇష్టం. అది స్పెషల్ గా, ఇష్టంగా తింటారు.
ఇక్కడ మాంసాహారం, శాఖాహారం పక్క పక్కనే ఉంటాయి. అడిగి తెలుసుకోవాలి. అందరూ మాంసాహారులే. క్రిస్టియానిటి మతము. హిందీ, ఇంగ్లీష్ అందరికీ రాదు. మేనేజ్ చేసుకోవాలి.
మరునాడు యూనివర్సిటీ కి వెళ్ళడానికి బయిటకు వచ్చినప్పుడు ఊరు ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఎత్తులు, పల్లాలలో ఊరు ఉంది. తురా మేఘాలయ రాష్ట్రంలో రెండవ పెద్ద పట్టణం. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. ఈ వాతావరణం ఎంతో ఆనందిస్తాం.
మేము వెళ్ళవలసిన కాన్ఫరెన్స్ NEHU - North East Hill University, Shillong యొక్క ఆఫ్ సైట్ కేంపస్. ఇది వరకు పార్లమెంటు స్పీకర్ గా పనిచేసిన పి.ఎ. సంగ్మా ఊరు. ఆయన వల్లే ఈ శాఖ 10 ఏళ్ళ క్రితం పెట్టబడింది. ఇక్కడ హిస్టరీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, వంటివి పది డిపార్ట్మెంట్ లు ఉన్నాయి. పొద్దున్న 9 గంటలకు మాకు యూనివర్సిటీ బస్ వచ్చింది. మేమున్న చోటునుండి కె మమ్మల్ని కేంపస్ కి తీసికెళ్ళింది.
NEHU తురా కేంపస్ ప్రొ ఛాన్సలర్ ప్రొఫెసర్ సింగయ్య గారు తెలుగాయన. హిస్టరీలో ఇద్దరు, మేనేజ్మెంట్ లో ఒకరు మన తెలుగు వారు పనిచేస్తున్నారు. కాన్ఫరెన్స్ కెరోల్ సింగింగ్ తో మొదలైంది. ఇది మేఘాలయ సంప్రదాయం. విద్యార్థినీ విద్యార్థులు పాడారు. విజయవాడ తెలుగబ్బాయి ఒకతను ఎం బి ఎ చేస్తున్నాడు.
కన్వీనర్ బిస్వాల్ నా అభ్యర్థన మన్నించి నా ప్రెజెంటేషన్ 23 సాయంత్రం పెట్టారు. నా ప్రెజెంటేషన్ బాగా రిసీవ్ చేసుకున్నారు. Demonetization and digitization: A common man's perspective దాని శీర్షిక. ఆ సాయంత్రం గెస్ట్ హౌస్ కి చేరి మరునాడు షిల్లాంగ్ వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని నిద్రించాము. మిగతా తరువాతి భాగంలో.

తురా  నుంచి షిల్లాంగ్ ప్రయాణం

23, 24-11-2017

ఈ ప్రయాణం భగవదనుగ్రహంతో హాయిగా జరిగింది. లేకపోతె చాలా ఇబ్బంది కలిగేది. కష్టపడేవాళ్ళము.
మేము 23 ప్రొద్దుటే లేచి ఆరున్నరకు తయారై ఆరు నలభై కి తురా బస్సు స్టాండ్ చేరాము. అక్కడ ఒక్క బస్సు కానీ, సుమో కానీ ఇతర ప్రయాణ వాహనాలు కానీ లేవు. తురా బస్సు స్టాండ్ ఒక జంక్షన్ మాత్రమే.
మేము ఆటో దిగి అక్కడి ఏ విధమైన వాహనములు లేకపోవడం చూసాము. అప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడు, ఇక్కడనుంచి గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్ళాలి. ఇక్కడనుంచి గౌహతి వెళ్లే అన్నిరకముల వాహనములు ప్రొద్దుట ఆరున్నరకు వెళ్లి పోతాయి. మళ్ళీ రాత్రి బస్సు లే శరణ్యం అన్నాడు.

పై ప్రాణం పైనే పోయింది. ఇంతలో అక్కడ ఉన్న ఒక టాక్సీ డ్రైవర్ మా ఇబ్బంది, కంగారు గమనించాడు. ఫోన్లో ఎదో మాట్లాడాడు. మాదగ్గరకొచ్చి ఆటో అతనిని అక్కడనుంచి 10 కిమీలలో తనకు తెలిసిన గౌహతి వెళ్లే టాక్సీ ఆపి ఉంచుతానని, ఆటో అతనిని మమ్మల్ని అక్కడకు తీరికెల్లమని అన్నాడు. ఆటో డ్రైవర్ ఉత్సాహము చూపించలేదు. అప్పుడు ఆ టాక్సీ డ్రైవరే తాను తీసికెళతానని రెండు వందలు ఇమ్మని అడిగాడు. మేము వెంటనే ఒప్పుకున్నాము. ఆటను మూడు టాక్సీని ఆపివుంచి మమ్మల్ని అక్కడకు చేర్చాడు. ఇది ఏంటో గొప్ప ఉపకారము. ఎందుకంటే రెండువందల కాదు ఎంత ఇచ్చినా మమ్మల్ని పాటించుకునేవారు లేరు. రాత్రిదాకా ఎక్కడ ఉండాలీ? అన్ని ఇబ్బందులే, బాధలే.

ఆవిధముగా అతను మానవధర్మం గా మాకు ఉపకారము చేసాడు. మేము రెండవ టాక్సీ ఎక్కి గౌహతి చేరాము. రెండవ టాక్సీ డ్రైవర్ ఫోన్ లో మాట్లాడి గౌహతి outskirts నుంచి మామ్మని షిల్లాంగ్ తీసికెళ్లే టాక్సీని ఆపి అందులో కి మార్చాడు. అల్లా ఎంతో ఇబ్బంది, కష్టం పడాల్సిన మేము ఎంతో హాయిగా షిల్లాంగ్ చేరాము. భగవంతుని అనుగ్రహము, దయ అంటాము కానీ భగవంతుడు మనుషుల ద్వారానే మనకు సాయము చేస్తాడు. భగవంతునితో పాటు ఆ మనుషులకు కూడా మనము కృతజ్ఞత చెప్పుకోవాలి

మేము మా స్నేహితుడు చెప్పిన హోటల్ కి  మధ్యాహ్నము 2 గంటలకు చేరి అందులో విశ్రమించాము. మరునాడు హోటల్ వాళ్ళ ద్వారా ఒక టాక్సీ కుదుర్చుకుని షిల్లాంగ్ చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాము. ముందుగా షిల్లాంగ్ పీక్ పాయింట్ కి వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఎత్తున ఉంది. విమాన బలాల ఆధ్వర్యం లో ఉంది. వారి అనుమతి తీసుకుని లోపలకి ప్రవేశించాలి.

ఈ పీక్ పాయింట్ నుంచి షిల్లాంగ్ ఊరు, నగరము దృశ్యము ఏంటో బాగుంది. అక్కడ కొంతసేపు గడిపి, చిన్న జలపాతము ఉన్న చోటికి వెళ్ళాము. అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. అదే దాని మీదుగా చిరపుంజి 50 కిమీ దూరంలో ఉంది. టాక్సీ డ్రైవర్ ఊరించాడు గాని, మాకు వరుస కార్/బస్ ప్రయాణాల వల్ల ఓపిక లేకపోవడం, అది వర్షాకాలం కాదు కాబట్టీ మేము ఉత్సాహము చూపించ లేదు. ఇంకా రెండు మూడు మ్యూజియం లు పెద్ద చర్చిలు చూసి ఒక సరస్సు చుట్టూ ఉన్న వనమునకు వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఆకట్టుకుంది. రెండు గంటలు అక్కడే కూర్చుని హాయిగా గడిపాము. చల్లని గాలి మనసుని పరవశింపచేసింది. తరువాత షిల్లాంగ్ రేస్ గ్రౌండ్ మీదుగా హోటల్ చేరాము.

షిల్లాంగ్ ఎంతో అందమైన నగరము. ఊటీలా ఉంది. లోపల నగరము పాతవాసనలతో, చుట్టూ, అన్ని ప్రక్కల ప్రకృతి సౌందర్యం తో అలరారుతూ ఉంది. చాలా చల్లగా ఉంది. పగలే 13-18 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. షిల్లాంగ్ నగరము గారో కొండల మధ్య ఉంది. ప్రస్తుతము అది మేఘాలయ ముఖ్యపట్టణము. 1980 వరకు మేఘాలయ అస్సామ్ తో కలిసి ఉంది. అప్పుడు షిల్లాంగ్ అస్సాం రాజధాని.
మొత్తము మేఘాలయ, కాశి (తురా ప్రాంతము), గారో (షిల్లాంగ్ ప్రాంతము), జయంతియా కొండల మధ్య ఉంది. అంతా పర్వతమయము. గౌహతి షిల్లాంగ్ రోడ్ మాత్రము ఎక్కువ ఎత్తు పల్లాలు లేక సమ ప్రదేశముగానే ఎక్కువ భాగము ఉంది.

గౌహతి నుంచి షిల్లాంగ్ వెళుతుంటే 10 కిమీ ముందునుంచి ఒక పెద్ద సరస్సు రోడ్ పక్కాగా తగులుతుంది. దాని పేరు Umiam lake. ఆ సరస్సు గొప్ప ప్రకృతి దృశ్యం. కొన్ని వేల చదరపు కిమీ వైశాల్యం కలది. కొండల మధ్య కులుకుతూ ఏంటో అందముగా ఉంది. మేము 24-112017 ఉదయం గౌహతి రావడానికి టాక్సీ బుక్ చేసికొని, దారిలో ఈ సరసు అందాలు తిలకించి గౌహతి చేరాము. టాక్సీలో షిల్లాంగ్, గౌహతి మధ్య ప్రయాణము 2 గంటలు అంతే. అదే తూటాక్సి అతనిని అడిగి బుక్ చేసికొని బ్రహ్మపుత్ర నదిని చూడడానికి వెళ్ళాము.

గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర ఎంతో విశాలముగా ఉంటుంది. మధ్యలో  ద్వీపములు ఉంటాయి. ఆ ద్వీపములలో దేవాలయములు ఉన్నాయి. మేము అక్కడకు వెళ్ళలేదు. మన గోదావరిలాగానే ఉంది బ్రహ్మపుత్ర నది. టిబెట్లో పుట్టి ఇంకో పేరు కలిగి మన దేశములో ప్రవేశించిన వెంటనే బ్రహ్మపుత్రగా పిలవబడే ఈ నది వస్సముకు వరదాయిని, దుఃఖదాయిని కూడా. బ్రహ్మపుత్ర నీళ్లు శిరసుపై చల్లుకొని, ఆ నదీమ తల్లికి నమస్కరించి ఒడ్డున ఉన్న కాళీ ఆలయం లో అమ్మవారిని దర్శించి గౌహతి స్టేషన్ చేరాము. 54 గంటలు పయనించి (దిబ్రుగఢ్ - కన్యాకుమారి ఎక్సప్రెస్ - భారతదేశములో పయనించే పొడవాటి రైలు ప్రయాణము దూరము కల రైలు) 12 గంటలు ఆలస్యముగా రాజమండ్రి చేరి, సర్కార్ ఎక్సప్రెస్ పట్టుకుని సాయంత్రం 6 గంటలకు భీమవరం చేరి ఇల్లు చేరి స్వస్థులమైనాము.

మా గౌహతి, తురా,షిల్లాంగ్ పర్యటనా ప్రయాణము ఆనందముగా ముగిసింది.



Sunday, January 7, 2018

Celebrities and Coverage by Media; Wisdom; Discretion and Discrimination; Role models of Indian Youth

Celebrities and Coverage by Media

The media is inundating their news columns with details of lives of celebrities, their marriage, divorce, kids, their lives, as if we are here to devour only that stuff and it is our only requirement. This is really underestimating our tastes, goals in life, intellectual and cultural preferences and civilized affiliations.
The media is covering this useless stuff to get more revenue. It is not known whether they are ruining our cultural sensitivities or we are inviting this stuff so that our tastes to be degraded. In any case it is an onslaught on our cultural outlook. Our civilization is guided by individuals if lesser taste and aesthetic preferences.

**********
Wisdom

Wisdom consists not merely of knowledge, intellect, rationalism, intelligence, reasoning abilities, logic but also of applied skills, aesthetic, artistic, skillful attitude towards life. Wisdom is another name for commonsense. It can be possessed by even illiterate persons because wisdom is not merely learning but is also combination of intuition and faith. Wisdom is application of knowledge in action.
************
Discretion and Discrimination
Let us cultivate discretion and discrimination
No happening in this world takes place according to the feelings of sensitive people. Reality is harsh and insensitive. We cannot frame it in an ideal or idea. Many insensitive people also dominate this world. Wise thing is, let us not be sensitive to all happenings in this world and mind our life limited by and to our near and dear. Though we can dream and imagine without limits, we cannot take the world with us according to our dreams, however virtuous and caring they are. Realistic living sets peace in our heart and mind; though this limitation appears "selfish and uncultured and uncivilized", it is always wise to ignore things which we cannot do anything about. Else our life will be full of mental disturbance and peaceless-ness.
************

Role Models for Indian Youth

Celebrities are not our role-models. Actually present youth is not having any role-models other than CEOs or successful software industrialists. It is interesting that even though India is having second most scientists' population, the scientists are not known outside their chosen temples of learning or places of work. Professors of universities or prestigious private educational institutions are absent in the list of role models for the youth.
Most of the youth is carried away by the modern gadgets and information contained in them and shared on them and are building an inner world far away from real world.
Youth is not having other than parents to emulate. But unfortunately most of the parents are as good or bad as their children in these matters.
So the space is mostly vacant which is being partially filled by past intellectuals, scholars, scientists and the like. Present is unable to produce any worth while individuals from noble professions to emulate their lives and utterances. This also mostly due to all these intellectuals or scholars are themselves most confused. And they are only spreading their confusion and ignorance. Most of the current intellectuals are confined to their social affiliations and are refusing to come out of their well.
Society bereft of role models is vulnerable to extremists and prone to get plunged into chaos and disturbances because all most all intellectuals or scholars holding public positions or are popular are subjective and are not objective at all on issues or disciplines and subjects of learning.
Youth having role models of objective attitude is essential for the welfare and well-being of youth themselves, nation, society and within of the individuals.
Even spiritual and religious people are not up to standards to be role models to the youth. Mere recitation of spiritual, religious texts and wearing certain clothes are failing to make them ideal.
Normally in India it is the house holders who have been guiding the youth and society. But now householders have become very weak in all aspects and swamis and babas and ammas are replacing them with disastrous consequences.
There are no statesmen or women to enthuse youth and guide them. All we have are only narrow-minded and disruptive politicians.
A householder in the form of parents, again reigning supreme is necessary for youth to have role models and necessary guidance for life and living. Let us see how things turn.

Wednesday, January 3, 2018

No Owners; Caste Politics

No Owners

No one owns a language, religion, region, caste, community, ideology or a cause; even the followers. They have right to follow that's all. Because they are following, it won't give them any special rights to cause public unrest and bedlam destroying properties, causing lot if inconvenience to fellow citizens.

In India governments want to appease rather than govern. And a government cannot simultaneously appease two warring groups which are at cross purposes. Government must keep law and order and should not allow rowdy elements in whatever garb they are to take law and order into their hands.

Governments must learn to be firm in dealing with all kinds disrupting elements whatever cause they claim to be representing. A few rowdy elements cannot take rest of the population to ransom whatever noble and mighty cause they represent and are agitating for.

It is governments' responsibility to separate rowdy elements, assert itself and punish them. Governments' must be capable to call spade a spade and expose the uncivilized elements taking the guise of social justice keepers. They can't allow their lawlessness and give them free hand for all happenings.

Any pretext is not grand to cause unrest in the society and take things into agitators' hands. Politicized police force is incapable of dealing serious situations.

Every rude group can not be allowed to play with lives and daily life of rest of the citizens whatever justice they want to fight for. Else anarchy prevails over nation and society.

The chauvinistic and fanatic among lovers of language, religion, region, caste, community, ideology, sub-nationality beyind and above the nation must be
controlled and curbed. Else they have the potential to divide India along language, religion, region, caste, community, ideology, sub-nationality lines and cause havoc and make India vulnerable as a nation to within and without evil forces.
*********
Caste Politics
Caste politics will devour India. The identity of Indian is consumed by other social affiliations. 70 years of pampering by all political parties has brought India to such a pass that no genuine intellectual can find a solution to this artificial claims of injustice.
Social justice has become a tool to disrupt more than getting justice. All political parties are afraid to speak the truth and are and will pamper certain social sections for fear of losing their votes. This kind of justice will also fully damage the idea of India as a nation.
India becomes a collection of groups antagonistic to one another and warring and fighting for respective justices. A nation led by divisive caste leaders suffers much more and societal peace and harmony will be the causalities. None of the present day politicians is capable of emotionally integrating India. They can neither solve the problem nor allow the problem to be solved.
********

మన వాక్పటిమ, భాషాపాటవము, హాస్యభరిత భాషణము ఇతరులను ముగ్ధులను చేస్తాయి.
మౌనం వహించ గలగటం మనలను ముగ్ధులను చేస్తుంది.
మౌనము భాషల మూలము, భాషల సారమూను.
*********
The vast expanse of awareness sans thoughts is the Self. The Atman. The Brahman.
******
I love two words; love and serenity. Love gives serenity. And serenity blossoms love.
********
జామ పూవు తెల్లన 
అమ్మ చూపు చల్లన 
నాన్న మనసు గుంభన
కన్నయ్య రూపు నల్లన
చల్లనయ్య గోవిందుడు మనకు రక్షణ

Sunday, December 31, 2017

ప్రజాస్వామ్యము - సాంఘిక న్యాయము; Fame and Popularity; Indian diversities

ప్రజాస్వామ్యము - సాంఘిక న్యాయము

మొన్న జరిగిన తెలుగు మహాసభల్లో అందరూ "అమ్మ భాష" అంటూ కొత్త ప్రయోగాన్ని ఉపయోగించారు ఇటువంటి ప్రయోగాన్ని ఇంతవరకు వినకపోవడం వల్ల ఆ వాడుక ఎదో నోటికి అడ్డుపడినట్టుంది. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది .సమాసము ఒక తెలుగు పదము, ఒక సంస్కృత పదము పక్క పక్కన పెట్టి తయారుచేశారు. ఆ పదము తయారు చేసిన వారికి అందులో ఏమి సరదాయో అర్థం కాలేదు. ఆలోచించగా అర్థం అయ్యింది. వారికి మాతృభాష అనే పదము వాడడము ఇష్టము లేదు. అటువంటప్పుడు శుభ్రంగా "అమ్మ బాస" అని రాయచ్ఛు కదా? ఏమిటో ఈ గజ్జిలు!
ఈ సందర్భంగానే ఒక తెలుగు పి.హెచ్ డి ఆయన పక్షిని శుభ్రం గా పిట్ట అనక ఖగం అంటారేమిటి అని ప్రశ్నించాడు. ఖగం అంటే ఆకాశము అని కూడా ఆయనకు తెలియదు. ఆయన తెలుగులో ఇన్నిఅక్షరాలు ఎందుకు, గుణింతాలు, సంయుక్తాక్షరాలు కష్టంగా ఉన్నాయి, అవి తీసేసి భాషాధ్యయనాన్ని సులభం చేయాలి అని కూడా అన్నాడు. సంస్కృతంవల్లే తెలుగులో ఇన్నీ అక్షరాలు వచ్చాయి, గుణింతాలు, సంయుక్తాక్షరాలు కూడాను , అని వాపోయాడు! తెలుగు భాష మీద అభిప్రాయాలు ఇవి. తెలుగుభాషని ఎవరికి ఇష్టము వచ్చి నట్టు వారు మార్చెస్తే మిగిలేది ఏ భాష? తెలుగు భాషలో ఎన్నో భాషల నుంచి పదాలు వచ్చి చేరాయని, అందులో సంస్కృతం కూడా ఒకటని తెలియదా వీరికి?
ఏమైనా కుల, ప్రాంతీయ తత్త్వములతో భాషల్ని చూసి మార్చెయ్యాలంటే అది ప్రజాస్వామ్యమా? సాంఘిక న్యాయమా?
శాస్త్రములు, జ్ఞానములు ప్రజాస్వామ్యానికి అతీతము. ఐంస్టీన్ రిలేటివిటీ సిద్ధాంతము పృథివిలో 99 శాతానికి అర్థము కాదుకదా అని దాన్ని తీసివేయమని ఎవరైనా అంటే ఎంత మూర్ఖత్వము?

*********

Fame and Popularity

Literature and culture are created every second in any civilized society. And the creators must learn to enjoy creation more and also are contented if known around their place of living and not necessarily through the globe. Conductors f world conferences may not know their existence at all.
Though this expression appears to profess satisfaction in limitation, the reality is it is not possible for any and every creator to be popular through the globe; and even in one's own area, district, region, state, or nation.
Before globalization to this much extent, creators are famous around their region and state and it was giving satisfaction, popularity and livelihood to some of them.
Now a days, in these times of internet reach and other technological advances, famous are becoming more famous, popular become more popular, rich earners are becoming more rich and no scope is available to most of the rest of the creators.
This situation is a boon to some successful creators of any fine-arts wing and not so for most others of same genre but less popular or famous.
The earlier generations' contentment of being known around their region is gone and in its place a mood of non-recognition and lack of encouragement is experienced by many creators. But we should also look into the quality of creation too.
But when mediocre creations are praised and "recognized", the quality of creation is not being considered at all in most cases.
Thus it may be wise and prudent for creators in all fine-arts wings
to find contentment in creation most and enjoy if popularity, fame and money visit, as they are not solely dependent on quality of creation. No one really know and can explain which quality makes works famous and "great".
Observation informs that this fame and popularity like becoming rich and wealthy acquiring various materialistic assets are more fate-determined, luck-dependent than the merits of the creator or his/her creation.
And very few are capable of assessing a work objectively. In these realistic situations it is highly advisable to enjoy creation and leave rest to luck if one is not dependent on his creation for his/her livelihood.
Living like a saint or seer by not expecting any from one's creation is next to impossible for many but there is no alternative.
**********
Can anyone say nominating Rahul for president's post and not Priyanka, is male chauvinism of the party? What will the intellectuals and ism-lovers say?
*********
భారతదేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు ప్రియమైన పనుల్ని, అవి exchequer కి ఎంతో ప్రియమైనవి అయినా పట్టించుకోకుండా చేయించితీరాలని ఉత్సుకత, "పట్టుదల" తో ఉన్నారు.
అవి ట్రైన్, ముఖ్యపట్టణం.
*******
Rationalism is always against emotion. Human beings are more emotional than rational. Rationalism spoils the beauty of romanticism and intuitive nearness.
********
India is a nation of diversities in social structure, religion, region, culture, language, complexes, no union or intersection of social, communal and intra- and interreligious sets.
Added to it selfish politicians in the guise of social justice are widening the cracks into wider gaps transforming society and nation into disjointed set. Citizens in the form of voters are helping the leaders to keep the gaps and further widen them.
Though this is a usual lamenting, the continuance of such a situation is completely ruining the idea of India as a nation.

So this share.

Politics and celebrities; Indian citizens and democratic functioning

Politics and Celebrities


In India elections can be fought and won on freebies, caste, religious reservations or celebrities. Ideology or commonsense has no place and role to play. That is why celebrities are finding it easier to enter politics by their popularity and nothing else. They lack in leadership qualities, do not know any thing about administration like hereditary and region-, caste-, religion-, selfishness-centered ordinary politicians.

In India poverty is rampant for various reasons and one of them is the rule by inefficient and hereditary politicians as leaders of major national and regional political parties since independence 70 years back.

These celebraties have no idea of legislation, executive, judiciary and cooperation among these mutually checking constitutional institutions. Every one has been playing with Indian constitution and its sanctity has been gradually eroded by various popular leaders.

These celebrities after getting elected want to be hegemonic towards every other constitutional authorities and institutions and want then to attend to their whims and fancies.

Mr. Ramachandran, Rama Rao, Jayalalita have been dictatorial and in their hurry to eradicate poverty resorted to popular politics which ruined the financial, administrative and economic health of the respective states.
Popular politics, freebies and hurry to eradicate poverty by hook or cruck will not succeed; this has been proved many times in these 70 years both at national and regional levels.
Only efficient administration with an ideology will help eradicate poverty. Nothing else. No one else.
So the entry of another celebrity from south India will not be different. So will be in Andhrapradesh; any celebrity trying to enter electoral politics will be of no help.
Ruling a nation and running administration are not so simple and incapable people only degrade administration.
Love for poor need not be live for all citizens. Any administrator must take into account needs of all citizens and just not "poor" and underprivileged.
A nation grows, develops and shines by sound economic, administrative and objective policies.
Popular politics and hereditary leaderships are bane to Indian politics. Indian economically and financially poor citizens can be helped only by encouraging them to participate in nation-building and never by making them beggars to alms of political parties.
Any leadership from celebrities and or inefficient hereditary - sons, daughters, sons-in-law, wives, companions will not be able to deliver any useful results.
************

Even though time and tide wait for none, we can hold time still in the company of our near and dear. Then only bliss is experienced without reference to past or future. We merely live in the present. To cultivate and be able to live in the present is the essence of all spirituality; such a living gives us serenity and we live life delightfully and delightedly.
*********
Modern women and men are putting themselves in impossible situations and are punishing each other unable to handle the piquant situations.
*******
I see many people admiring Sanskrit language but their interest ends with admiration. None comes forward to learn the language and enjoy the works in Sanskrit.

Then another set of people exists; that set of people always are against Sanskrit language despite its scientific construction and great works available in it in relation to all human endeavors, just because, in their limited knowledge and hatred towards a particular religion and community, denounce and dismiss it without spending any time going through it and its legacy.
Both types of people are headache and nu-sense to society and its harmony.
*********
Citizens of our nation and society seem to be solely rights' conscious; and not at all duty-conscious. So many right's activists are available; but none to instruct about our duty towards nation, society, fellow human beings and living beings.
A human being learns by imitation and mimics one's behavior observing around.
When no role models are available during education process or in society except for cricketers, cine artistes, celebrities of all hues, the society will suffer from atrocities.
Merely expressing sympathy and solidarity is of no use.
Empathy will not solve problems.
We must also be aware of human animal natures and take care not become an easy prey to animal-natured persons.
Popular expressions are not realistic guidelines.
Wish ancient Indian wisdom is used extensively in the formation, cultivation, nurture and termination of human relationships. Menorah women, none is safe before hardened criminals, corrupt politicians or animal-natured persons.
Let us be realistic and deal things as animal nature versus human, humane behaviour; not as a problem between cruel men and sensitive and gullible women.
As long as crimes are divided as against women and men, the problem can not be properly tackled and solved.
All men are not demons.
Situations also create "animals".
And the rest innocent and vulnerable.
Let us be aware of our limitations, rights and duties-cum-responsibilities.
*********
India is a nation of diversities in social structure, religion, region, culture, language, complexes, no union or intersection of social, communal and intra- and interreligious sets.
Added to it selfish politicians in the guise of social justice are widening the cracks into wider gaps transforming society and nation into disjointed set. Citizens in the form of voters are helping the leaders to keep the gaps and further widen them.
Though this is a usual lamenting, the continuance of such a situation is completely ruining the idea of India as a nation.
So this share.
*******
I do not know whether Lord Vishnu is superior to Lord Siva or Lord of one religion is superior to Lords of other religions. But I am taught and read that Divinity is one and names are different. Names are our choice and the essence is the Divinity they represent, contain and hold.
*******
ఈనాడు ప్రపంచంలో ఇతరులను మారమని చెప్పడం ఎక్కువై పోయింది. అందరకూ అన్ని విషయాలలోను పరిజ్ఞానం అపరిమితం అయిపోయింది. అద్దంలో ఎవరూ చూసుకోవడం లేదు. చేతి వేళ్ళు ఇతరుల లోపాలను ఎత్తి చూపడంలో మునిగి పోయి ఉన్నాయి.
మతము, సంస్కృతి, నాగరికత, సిధ్ధాంత గరిమ లేని వారు అన్నిటిని, అందరిని దుయ్యబట్టడం వాడుక అయింది.
ధర్మమునకు, ధర్మసూక్ష్మమునకు తేడా తెలియని ఆధునిక ఛాందసుల, అజ్ఞానుల ఉనికి తామర తంపరగా పెరిగి పోయింది. భాషాపటిమ, పాండిత్యం, వివిధ శాస్త్ర, విజ్ఞాన, జ్ఞాన పరిచయము లేక, ఏ విధమైన రామణీయకత తెలియని హృదయములు కలిగి జ్ఞానాంధత తో గుడ్డిలై వదరుతున్నారు. పంది పన్నీటిని మెచ్చలేదు కదా!
ఇన్ని తరముల జ్ఞానము, అనుభవములను అవగాహన లేక విపరీత వ్యాఖ్యానములను చేస్తూ విజ్ఞుల లెక్కచేయక విష మనస్కులై ఉన్నారు.
ఇన్ని నాళుల ఇంతటి సంస్కృతిని, నాగరికతను, విజ్ఞతను, ఇంగితాన్ని ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాము. మేధావుల నిర్వచనమే మారిపోయి అడ్డమైన వాడు అడ్డంగా మాట్లాడే నేటి స్థితి మార్చే స్థిత ప్రజ్ఞులు సంఘానికి అవసరం. అందరినీ కలుపుకు పోయే అందరి వారు వెలవాలి. సంఘం వారిని ప్రోత్సహించాలి. లాభపడాలి. మరొక దారి లేదు.
శుభం భూయాత్! సర్వే జనా: సుఖినో భవంతు!

Thursday, December 14, 2017

Indian Intellectual Scene; ప్రపంచ తెలుగు మహాసభలు; ముక్తిని కలిగించు ఆస్వాదనము; మేధావులు - ఆత్మీయులు ; భారతరత్న

Indian intellectual scene
It is peculiar to India that a person is labeled an intellectual or a rationalist or a thinker or anything of that sort not when he/she stands for something but stands against something which he/hates. This is a negative estimation and calculation.
A person is useful when one tells us what his expressions on things and events are and actions suggested, but what is not good. He can condemn what is not good to society according to him but can't stop there. He has to express positively too.
But in India we have a group of intellectuals and thinkers who always find fault with this or that but never utter what the alternative is.
You can destroy an old bridge after you constructed a replacement. But merely destroying makes things hayward and only confusion and inconvenience results in.
This simple commonsensical thought is missing from the thinking of the self-proclaimed and self-aggrandizing intellectuals, scholars, writers, ideologists and like non-conforming individuals better provide an alternative and then criticize ancient Indian ethos and tradition.
It will make them responsible. And they can strive to implement and spread their teachings. Else it will be a futile quarrel.
********
Music and poetry are like twins. They make both the composer and listener blissful.
********
House-wife - Home-maker is the best, the noblest and the most useful professional in the world
********
Loving is cessation of self-consciousness, identity and person. So love too is freedom from "self'. 
*******
Cults
Cults themselves are not spiritual ultimate. They are primary as primary education and are starting points. They are not end in themselves. We need or need not start in a cult but must not remain bound to that. We must enlighten and enlarge our horizon of spirituality. Great seers never expected or expect us to confine to their sayings and expressions and be mere parrots. Spirituality is liberty and freedom not slavery to thought, experience, cult or person. Transcending all these and knowledge therein and de-learning of what all we learnt is essential for spiritual awakening and peace, silence and bliss to be experiences then and thereafter incessantly; this facilitates to perform our ordained duties efficiently and calmly.
********
ప్రపంచ తెలుగు మహాసభలు 

ప్రపంచ తెలుగు మహాసభలో
ప్రపంచ తెలంగాణా తెలుగు మహాసభలో
హడావుడి హడావుడిగా ఉంది
భాగ్యనగరంలో; భావముల సదస్సులో
పుంభావ, వనితాభవ సృష్టుల నాట్యం
ఎందరికో లభించిందా సావకాశం
అస్తమానూ జరుగుతాయి సాహితీ
సంస్కృతీ సృష్టులు; ఇలాంటప్పుడు
గుదిచేసి సంస్కృతీ మాలలల్లుతారు
ఆ గుబాళింపులకు మది పరవశిస్తుంది
తెలుగు మహాసభలు సగం
దేశంలో సగర్వంగా జరుపబడుతున్నాయి
శుభప్రదం జయప్రదంగా జరుగుగాక!
సంస్కృతీ ప్రియులందరిదీ ఈ పండుగ
*********
ముక్తిని కలిగించు ఆస్వాదనము

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - కీర్తన సంగీత పరంగా, సాహిత్య పరంగా ఎంతో గొప్ప కీర్తన.
గొప్ప సంగీతజ్ఞుడు, తపస్వి, పండితుడు, భక్తుడు, తత్త్వజ్ఞుడు మాత్రమే వెలయించగలిగిన కృతి.
నాకు సంగీత పరిజ్ఞానం లేదు. కాని విద్వత్తు గల సంగీతజ్ఞులు ఈ కీర్తన పాడినప్పుడు ఎంతో రసానందాన్ని అనుభవిస్తాను. విన్నప్పుడల్లా అలౌకిక పరమానందం పొందుతాను.
అలౌకిక ఆనందంలో వ్యక్తిగా నేను ఉండను. నన్ను మరచిన స్థితే ఆ అలౌకిక స్థితి. ఇలా నిర్మల మానసిక స్థితిని అనుభవిపజేసే "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" నన్ను పరవశింపజేసే
సంగీత, సాహిత్య సృష్టి.
సాహిత్యం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.
మానసవర సంచారము నిలిపి
మానసవర సంచారము సలిపి
అని రెండు పాఠములు ఉన్నాయి. త్యాగరాజస్వామి రాసినది ఏదో తెలియదు కాని, రెండూ ఆయన తత్త్వానికి, విద్వత్తుకు సరిపోతాయి.
మానసవర సంచారము సలిపి - అంటే సగుణము.
మానసవర సంచారము నిలిపి - అంటే నిర్గుణము.
మూర్తిని బాగుగ పొడగనడం మనకు అనుభవం అవుతుంది. మాత్రా ఛందస్సు పరంగా నిలిపి, సలిపి - సమానమే. తాత్పర్యం ఒకటే. విధానమే వేరు, వేరు. గమ్యం ఒకటే.
మనకూ రసాస్వాదన చేయగల హృదయం, భక్తి, ప్రపత్తులు ఉంటే ఈ కీర్తనా శ్రవణము మోక్షప్రదమే.
********
మేధావులు - ఆత్మీయులు 

ఈ ప్రపంచంలో మేధావులు చాలా మందే ఉన్నారు.
అవసరాన్ని మించి వారి సంఖ్య ఉంది. డిమాండ్ కన్న సప్లై ఎక్కువగా ఉంది.
మనసు క్రుంగినపుడు అక్కున చేర్చుకుని ఉపశమనం కలిగించే ఆత్మీయులు అరుదై పోతున్నారు.
అందరూ, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, వాళ్ళ బుద్ధికి తోచింది చెప్పేవాళ్ళే.
కాని క్రుంగిన మనసుని పైకెత్తడం చేతనైన వారు తక్కువ. మనకు కావలసినది మనల్ని ఆప్యాయంగా పలకరించి ఆత్మీయత పంచేవారు. ఇలా జరగాలంటే మనమూ ఆత్మీయత పంచగలగాలి.
ఆత్మీయత అందితే ధనవంతులం కాకపోయినా మధ్యతరగతి కుటుంబాలకు జీవితంలో స్థిమితానికి లోటు ఉండదు.
కుటుంబ జీవితాలపై శ్రద్ధ తగ్గుతున్న ఈ వేళ ఈ విషయం మధ్యతరగతి వారు గుర్తించాలి.
************
ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు 

ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక గురువులు ఇంతలా "పెరిగి పోయిన" ఈ వేళ, మంత్రాల కన్నా తుప్పర్లు ఎక్కువైనట్టు, సాధన కన్నా షోకులు ఎక్కువయ్యాయి.
ఫలానా గురువు గొప్పదనం గురించి మాట్లాడేవారే తప్ప ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించే వారు తక్కువై పోతున్నారు. ఇతరుల ముందు గొప్ప కోసమే ఆధ్యాత్మికత అన్నట్టు తయారైంది.
బయటి వాళ్ళకి ఏమిటి ఈ భక్తుల ఆర్భాటాలు, ఆడంబరాలు అనిపిస్తుంది.
మౌనంగా మన ఆధ్యాత్మిక మార్గంలో మన పయనించాలి తప్ప ఇతరులను "మన గురువుద్వారా" (మన ద్వారా) ఉద్ధరించాలి అనుకోవడం పసితనం. అమాయకత్వం, అవసరం లేని దర్పము. కొండొకచో అతియైన చిరాకు పుట్టిస్తుంది.
*******
అపర బ్రహ్మలో - కసాయి లో?!

తరలిపోయిరి రాములవారు తెలంగాణా విడతీతలో
భద్రాచలము ప్రాంతీయ తత్త్వమునకు‌ భళీ! ఆయెను
ఒంటిమిట్ట ఇనవంశ కులజుడు ఓం ప్రథమముగ
ఆంధ్రదేశ రాజలాంఛనములతో పెండ్లియాడెను
మైథిలిని జనకవంశ సంజాతను సుగుణోపేతన్ సీతన్! 

దైవముల ప్రాంతములకు పరిమితి చేసితిరి
రాజుల మించిన ప్రజాస్వామ్యపు దొరలు, ప్రజల
అభిమానములు చూరగొని ఇచ్చవచ్చినటుల
పై పై మార్పులు మాత్రము చేయగల దిట్టలు
పొట్ట చించితే అక్షరం ముక్క లేని నిరక్షర కుక్షులు
సంస్కృతి సంప్రదాయముల కురుచ చేయగల
అపర బ్రహ్మలు, మనసుల చీల్చుటలో కసాయిలు
ఇదంతయు వారి ప్రతిభయొ పౌరుల నిర్లక్ష్యమో?! 
దైవములకే తప్పనిసరాయెను ప్రాంతీయపోటులు!
*********
భారతరత్న 
భారతరత్న బిరుదుకు రాజకీయ రంగు పులిమి ఎప్పుడోనే దాని ప్రశస్తిని, గొప్పతనాన్ని కాలరాసారు. ఎవరికైనా ఇచ్చెయ్యచ్చు. చచ్చిపోయిన వాళ్ళకైనా, పుట్టబోయే వాళ్ళకైనా.
భారతమునందు రాజకీయనాయకులే సర్వస్వము. రాజకీయనాయకులదే సర్వస్వము. వారు ఆర్ధిక రంగాన్ని శాసిస్తారు. వైద్య రంగాన్ని దునుమాడుతారు. విద్యా రంగాన్ని పనికి మాలిన దానిని చేస్తారు. గుళ్ళని, గోపురాలని నాస్తికులమంటూ కూడా ఏలుతారు. ఆధ్యాత్మిక రంగాన్ని స్వాములు, ఆనందాలు, అమ్మలు ద్వారా గుప్పిటనుంచుకుంటారు. రాజకీయనాయకులకు
కాదేదీ వేలు పెట్టకూడనిది.
మరే వృత్తి యైనా వీరి కనుసన్నలలో మెలుగాల్సిందే. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. రాజకీయనాయకుడు సర్వోపగతుడు. సకల భ్రష్ట కారకుడు, పౌరులారా వింటిరా!
******
పదవి కైపెక్కించిన నిషాలో ప్రజాప్రతినిధుల ఊగులు
పెదవి పృథివి దాటినా సిగ్గులేని ప్రజాధన దోపిడీలు
పాడుచేయని వ్యవస్థ లేదు వారు, వేలుపెట్టని చోటు, 
కార్యకలాపాలు లేవు; అంతా వారిష్టం, మనకే నష్టం