Thursday, October 26, 2017

హిందూ మత ఆధ్యాత్మికత; దేశ దరిద్రములు;తీరికలేని జీవితాలు; ఆ అవనియే తను; నాడ -నేడు; రుద్రాక్షలు - సాలగ్రామాలు; చదువు

Touching hearts through love and affection is greatest human action.
********
హిందూ మత ఆధ్యాత్మికత గుళ్ళు, గోపురాల సందర్శనలో, ఉద్ధరణలో, పూజలు, పునస్కారాల గందరగోళంలో, ప్రవచనముల ఊపులలో మాత్రమే లేదు.
హిందూ మత సంస్కృతికి ఇల్లాళ్ళైన స్త్రీలు, సకల తత్త్వావగాహన, మంచీ చెడులు తెలిసిన బ్రాహ్మణోత్తములు పట్టుగొమ్మలు. వీరిద్దరు లేక హిందూ మతం పునరుద్ధరింపబడదు. సన్యాసులు, ఆర్. ఎస్. ఎస్. ల వల్ల కాదు.
హిందూ మతానికి ఊపిరి అయిన గృహస్థులు, గృహిణులు లేక హిందూ మతం, సంస్కృతి మరింత దిగజారతాయి.
**********
దేశ దరిద్రములు
ట్విట్టర్ ఖాతాలతో ఎన్నికలు గెలుస్తారా?!
నిపుణులను పెట్టుకొని అధికారానికి రాగలరా?!
సిద్ధాంతాలను అటకెక్కించి, మేనిఫెస్టోలను
తుంగలోకి తొక్కి; డబ్బులు పంచి, "కల్లు" పోయించి తాయిలాలు ఆశపెట్టి, పౌరులను కుల,మత, ప్రాంతీయ భేదాలతో విడదీసి అధికార పీఠాన్నెక్కడం
రివాజైనపుడు ఎన్నికల్లో గెలవడానికి ట్విట్టర్ ఖాతాలెందుకు, నిపుణుల నియామకాలెందుకు?
నాయకులు కారు, నైపుణ్యం లేదు, దేశ పరిస్థితులపై, పౌరుల అవసరాలపై, ఆకాంక్షలపై కించిత్ కూడా
అవగాహన లేదు, దృష్టి పెట్టలేరు; ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి అయిపోవాలి; ఇది ఆశయో, పేరాశో దురాశయో? భారత దేశపు ప్రజాస్వామ్యం చేతకాని
వారి చేతుల్లో అల్లల్లాడుచున్నది; రూపు కోల్పోయింది

ప్రజల మభ్యపెట్టుట, ప్రలోభపెట్టుట తెలిసినంతగా
పాలించుట తెలియని వారసత్వ రాజకీయులు
ప్రజలకు, దేశానికి భారం, అరిష్టం; దేశాధికారము తండ్రి తాతల సొత్తులా తలుస్తూ తమని తాము సహజ వారసులుగా‌ భావించు దారీ తెన్నూ తెలియని అంధులు; ఈ "రాకుమారులు" దేశ దరిద్రములు
*********
తీరికలేని జీవితాలు

కోపములో ఆడువారు అందముగా ఉందురు
ఆ కోపము ఎప్పటికీ తగ్గకపోతే మగవారు దీనముగానుందురు

కృష్ణునికి సత్యభామ అలక తీర్చడానికి స్వర్గం నుంచి
పారిజాతం తేవాల్సివచ్చింది
లక్ష్మీ దేవి అలకలో విష్ణుమూర్తి శ్రీనివాసుడై ఏడు కొండలపై ఉండాల్సివచ్చింది
అలకలు కలికి లకు అలంకారం
ఎప్పటికి తీరునోనని మగవారికి
ఆరాటం; పిల్లికి చెలగాటం ఎలక్కి
ప్రాణసంకటం; మగవారి జీవితములే
ఆడువారి అలకలకు ముచ్చట్లకు అంకితం;
ఇదంతా పురాణం; ఇప్పుడు యువతులు
అలగరు; ఇంకా అప్పటికి మగళ్ళుండరుగా!
బాయ్ ఫ్రెండ్సే ఆ తంటాళ్ళు పడతారు
స్త్రీలు పురుషులు ఇదివరకటి
జీవితాలు జీవించడం లేదు;
అంతా, మనసంతా ఉద్యోగం
ఆపై సమయము ఉంటే మాల్స్
మల్టీప్లెక్స్, రెస్టారెంట్; గృహముల
ముచ్చట్లే మాయమాయెను; ఎప్పుడో
బుద్ధి పుట్టినప్పుడు పెళ్ళిళ్ళగుచున్నవి
జగమంతా ఉద్యోగం మయమాయెను
మరే వ్యాపకం, జీవితం లేకపోయెను
విధి విపరీతమొ, విధులపై అంత మక్కువో
మనుషులు ఉద్యోగం చేసేసరికే రోజు
గడచిపోవుచున్నది; ఇంక తీరికేది జీవించుటకు?
**********
ఆ అవనియే తను

ఆ అవనియే తను;
అవనిక తొలగించిన రంగస్థలం
సఖి ప్రణయములు
ప్రమాణములు
అక్కర్లేని ప్రీతి ప్రవాహములు
చెలి చెంత భావముల లేమియే శాంత,
ఆనంద సుధాబ్ధియందు మునకలు
వేయించు; మౌనమున ముద్దు తీర్చు
ఆత్మీయుని చెంత
తనకే తెలియని లోతుల మర్మాలతో
తమకముల పదనిసలు; మృదంగ
ధ్వానములు; జతులు, లయలు జతలు
*********
నాడు - నేడు

కాలము గడిచేటప్పటికి బళ్ళు ఓడలవ్వడం, ఓడలు బళ్ళవ్వడం జరుగుతుంది. ఇది మనందరకూ ఎఱికే.
వివిధ విషయాలపై మన అభిప్రాయాలు, మన సంస్కృతులు, నాగరికతలు గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి.
నలభై ఏళ్ల క్రితం వరకు మగవారు ఉద్యోగం చేయడం, ఆడువారు ఇంటిని చక్కబెట్టుకోవడం జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు.
ఆడువారు మగవారితో సమానం అని ఇన్నాళ్ళూ అనేవారు. ఇప్పుడు అన్నింటిలోనూ మగవారి కంటే ఆడువారు నిపుణులు అంటున్నారు.
పూర్వకాలంలో విదేశీ వాసము దుర్ యోగము అనుకునే వారు, అనేవారు. ఇప్పుడు ఇంటినుంచి ఎంత దూరంగా ఉంటే అంత గొప్పగా చూస్తున్నారు. విదేశీ వాసం సంఘంలో ఎంతో గౌరవంగా, గొప్పగా చూడబడుతోంది.
అమెరికా, యూరపు దేశాల్లో వాసం మనుషుల అంతస్తుని ఎంతో పెంచేస్తోంది.
ఒకానొకప్పుడు విరక్తి కలిగి సన్యాసము తీసి కునేవారు. ఇప్పుడు సన్యాసవ్వడం లాభసాటి వ్యాపారంగా మారింది.
పూర్వ కాలంలో నటులను, విదూషకులను, విటులతో సమానంగా చూసేవారు. ఇప్పుడు నటులు భగవంతుని మించిన భక్తులను కలిగి ఉన్నారు.
పూర్వ కాలంలో జ్ఞానానికి, తత్త్వావగాహనకు పెద్దపీట వేశేవారు. ఇప్పుడు ఆడంబరానికి, అక్రమ సంపాదనకు పెద్దపీట వేస్తున్నారు.
పూర్వ కాలంలో పెద్దలను, పండితులను గౌరవించే వారు. ఇప్పుడు కుహనా మేధావులను మెచ్చుకోలుగా చూస్తూన్నారు. మనుషులను అగౌరవంగా చూడడం, దూషించడం సంస్కృతిగా మారింది.
ఇది వరకు భక్తి మనసుల్లో ఉండేది. ఇప్పుడు ఆడంబరంగా పూజలు, పురస్కారాలు చేయడంలో అహంభావం ప్రదర్శించడంగా తయారైంది.
***********
రుద్రాక్షలు - సాలగ్రామాలు

రుద్రాక్షలలో మాత్రమే రుద్రుడు వసించడు;
సాలగ్రామాలలో మాత్రమే నారాయణుడుండడు
శివకేశవుల నివాసము మన హృదయాకాశము
వారి తత్త్వములు మన బుద్ధి వికాసములు;
చెట్టు కాపులలో నదీ గర్భ పాషాణాలలో వారికై
శ్రమించుట వృథా ప్రయాస; మనలోని దైవముల
బయట చూచు వాంఛలేల; విలువ మన మనసుది
బయటి వస్తువులు సరిరావు నిర్మలమానసమునకు
**********
చదువంటే తెలియని వారు

చదువంటే తెలియని వారు చదువుకు‌ సిద్ధం
చదువంటే తెలియనివారు చదువులో పెట్టడం
చదువంటే తెలియని వారు చదువు "చెప్పడం"
చదువంటే తెలియనివారు చదువుకు ఋణాలివ్వడం: 
చదువును భ్రష్టు పట్టించిన ఇందరు
చదువంటే ఐఐటి/ఏఐఐఎమ్ఎస్ ల్లో సీటు
తెచ్చుకునే ప్రయత్నంలా తయారైంది:
భాష, విజ్ఞానం, జ్ఞానం, సంస్కృతి, నాగరికతలను
నేర్పుట నేర్చుకొనుట చాదస్తమైంది;
మూర్ఖులు విద్యారంగమునేలుచు పసికూనల
చావులకు కారణమగుచు విద్యాభ్యాసమును
ప్రమాదకరముగ మార్చిరి; విద్య కార్పొరేట్ల పాలైంది

Thursday, October 19, 2017

అంతః శుచి - బాహ్య శుచి; Solitude; ప్రవచనమ్ములు మనకేల; బంగారాలు - ఇంగితాలు;వ్యక్త స్వరూపములు.


అంతః శుచి - బాహ్య శుచి

అంతఃశుచి గురించి మాట్లాడేవారు, బాహ్యశుచిని మాత్రమే పట్టించుకుని కులపరంగా విచక్షణ చూపేవారిని నిలదీయడానికి ఉపయోగిస్తారు.
బాహ్యశుచి పాటించేవారు అందరూ కుల పరంగా మాట్లాడేరు అనుకోనక్కరలేదు. బాహ్యశుచీ అవసరమేగా! వేమన, కబీర్ వంటి వారు పండితులను, బ్రాహ్మణులను నిరసించడానికి మాట్లాడడం బాగానే ఉంది కానీ వాళ్ళపేరుతో అనామకులు కూడా మాట్లాడడం గమనిస్తున్నాము.
శుచి పాటించే వారందరికీ కుల విచక్షణ ఉంది అనలేము. బాహ్యశుచి మాత్రమే సరిపోదు. అవును. ఇలా మాటాడే వారిలో (మేధావులకు) ఎందరికి అంతఃశుచి ఉంది.
స్వచ్ఛ భారత్ లో ఉన్నది బాహ్య శుచి మాత్రమే కదా. కొందరు చాదస్తులు కులానికి, శౌచానికి ముడిపెట్టి ఉండవచ్చు. అందుకేగా కబీర్, వేమన ఆ దృష్టిని ఎండగట్టారు!!!?? కబీర్, వేమన వందల సంవత్సరాల క్రితం వాళ్ళు.
ఇప్పటి పరిస్థితి ఏమిటి? అశౌచాన్ని పాటించేవారు ఎంతో తగ్గిపోయారు. అంతఃశౌచం లేకున్నా దానిని గురించి మాట్లాడేవారు ఎక్కువ అయ్యారు. వీరెవరూ కబీర్, వేమన్న స్థాయి వారు కాదు. కాలం చెల్లిన చాదస్తాలు, ఆచారాలు, విమర్శలు ప్రస్తుతం సంఘ సంస్కరణకు ఏమీ ఉపయోగించకపోవచ్చు. ఇప్పటి సమస్యలకు ఇప్పటి ఆలోచనలు, పరిష్కారాలు అవసరం. చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకు? ప్రయోజనం లేని విషయం.
************
Solitude is always simple. In ambition there is no solitude. Only a gap of leisure between work schedules.
*************


ప్రవచనమ్ములు మనకేల
గోవిందుడు తన కేల బట్టి
మనల నడిపించుచుండ;
నారాయణ నామస్మరణ
పారాయణమున మనసు
ఓలలాడ ఏల ఆడంబరము
నిండిన పూజలు పునస్కారములు;
శ్రీహరి స్తుతిజేయుచు ధన మాన
ప్రాణములు శ్రియఃపతికి సమర్పించి
స్థిమితముగనుండుట తెలివి, విజ్ఞత;
శ్రీవత్సాంకిత వక్షసుని హృదయమున నిలిపి
భజించిన చాలును దీక్షలు, నామాంకితములేల;
ముక్తి నిచ్చు పరంధాముడు; తనలో
ఐక్యము చేసికొనును పరమాత్మ
ఆయనే మన నిరంతర దృష్టియైన;
పరబ్రహ్మము ఆయన ప్రకృతికి పరుడును;
అట్టి నారాయణుని శరణనక ప్రపత్తి చూపక
ప్రవచనములేల పూజలు పురస్కారములేల;
యాత్రలు అవసరము లేదు ఫలం పత్రం పుష్పం
తోయములతో నిర్మలాంతఃకరుణులమై తండ్రిని కొలిచిన; పరులకై ఆధ్యాత్మికత కాదు; పరునికై
************

బంగారాలు - ఇంగితాలు

"ధన్ తేరా" లు, "అక్షయ తృతీయ" లు
వినలేదు మేము మా చిన్నప్పుడు
ఎవరికి కావల్సిన బంగారం వాళ్ళు
గుప్ చుప్ గా కొనుక్కునేవారు
ఇప్పుడు అక్రమ సంపాదన ఎక్కువైంది
డబ్బు ఇళ్ళల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉంటోంది
ఈ విషయం తెలిసిన వ్యాపారులు
దాన్ని వాణిజ్యంగా మార్చుకున్నారు
ప్రకటనలపై ప్రకటనలు గుప్పించి
అక్కరే లేని వారిచే కూడా కొనిపిస్తున్నారు
ఆ తిథుల రోజుల్లో బంగారం కొనకపోతే నామోషీగా
మారింది; వెఱ్ఱి వేయివిధాలలా మన జీవితాల్లోకి
ఇతరుల ప్రమేయం అధికమైంది; బంగారం కొనడం లోను, పిల్లలను పెంచడం లోనూ; కుర్చీలో ఏ సి
గదుల్లో పనిపాటలు లేక పీఠం వేసికొని ఆడపిల్లల్ని
మగ పిల్లలతో సమానంగా పెంచడంలో ఉచిత సలహాలు పారేస్తున్నారు; వారి పిల్లలు కాదు కదా!
బయటి ప్రపంచం ఘోరంగా ఉంది, మన నిర్ణయాలు
మన్ని తీసుకోనివ్వరు; అన్నింటిలోనూ పిలవని
పేరంటానికి తయారు; బంగారంలా చూసుకోవల్సిన
ఆడపిల్లల్ని సమానత్వం పేరుతో అర్థరాత్రి అపరాత్రి
లేకుండా బయట తిరగమంటారు; ఆడపిల్లలకీ ఇది
నచ్చింది; కానీ ఇందులోని సాధక బాధకాలు తెలియకుండా తల్లిదండ్రులని నిలదీస్తున్నారు
ఆరిపోయే దీపాలు అవుతున్నారు; వారి
తల్లిదండ్రుల దుఃఖం వేదన వ్యథ ఎవరికీ అక్కర్లేదు
అంతా మీడియా, మేధావుల పరం ఫోరం అయ్యింది
మన పిల్లలపై మనకే హక్కులు లేనట్టు తయారైంది
ఇంగితం లేని సమానత్వం
కొరివితో తల గోకుకోవడం
***********
మాట మనసు - తలపు యొక్క వ్యక్త స్వరూపము.
మనసు - తలపు అనుభవము యొక్క వ్యక్త స్వరూపము.
మాట, తలపు, అనుభవము ఆత్మయొక్క వ్యక్త స్వరూపములు.
మనిషి - వ్యక్తిత్వ భావము బ్రహ్మము యొక్క వ్యక్త స్వరూపము.
ఇవన్నీ ప్రజ్ఞానమునకు గ్రహణ‌ విషయములు.

Monday, October 16, 2017

నాకు మళ్ళీ తెలిసింది; ఒంటరి బతుకులు; కవులు-రవులుభగవత్ స్మరణ ;


నాకు మళ్ళీ తెలిసింది

నాకు మళ్ళీ తెలిసింది
జనాలకు కవిత్వం కంటే
కవి మీదే దృష్టి ఎక్కువ
కవి చుట్టూ తిరుగుతారు
కవిత్వం మరుస్తారు
అలానే మురుస్తారు


*************


ఒంటరి బతుకులు

ఎవరికెవరు ఏమగుదురు?
ఎప్పుడో ఒక క్షణమున
కట్టెలగుదురు;

ఈలోపుననే హెచ్చుతగ్గులు
బానిసలు యజమానులంచు
వదరుటలు;
సౌభాగ్యము లేని
జీవనములు వాడుకాయె
వేడుకాయె
కుటుంబముగనుండుట
వెగటాయె; బాధ్యతలు
వహించుట సగటాయె
తనవారికి ఉపయోగపడుట
అరుదాయె; ఆ మాటే తగదాయె
సమానత్వపు తగవుల
హెచ్చుతగ్గులు గణించుట
రివాజాయె;
కలిసి జీవించుట
కనుమరుగాయె
వ్యక్తిత్వముల
గోల హద్దులు
లేక శ్రావ్యతను
మింగి వేసె
మేధావులో జీవనశైలిలో మార్పులో
మనుషుల జీవితాలు ఒంటరి బతుకులాయె
***********
కవులు-రవులు

అందరము కవులమే
ఆనందపు రవులమే
పాఠకులే కరువు
విమర్శకులకు బరువు
తామర తంపరగ
కవులు ఉండుట
శ్రీ శ్రీ పుణ్యమో?
కవిత్వమల్లుట
కుటీర పరిశ్రమాయె
కవన కుసుమములు
పదే పదే విరియుచున్నవి
తేనెలు లేవు
తీరులు లేవు
కుక్కపిల్ల అగ్గిపెట్టె సబ్బుబిళ్ళ
కవితా వస్తువులలాయె
పుంఖానుపుంఖాలుగా
కవితా సంపుటాలు
ప్రజల మీదికి వదలపడుచుండె
పాఠకులెవరో
తెలియని వింత స్థితిని
కవిత్వములుండె
కవన కుతూహలము
పెచ్చరిల్లిన నేడు
కవి ఎవరో, కవిత్వమేదో
తెలియని నాడులాయె
వాదులు కవులు
వాదములు కవిత్వములాయె
ఏమైనను
పైసా రాబడి లేకున్నను
వేలు ఖర్చగుచున్నవి
కవితల ప్రచురణకై
అంతా కవులమే
ఆనందపు రవులమే
********
భగవత్  స్మరణ

భగవంతుణ్ణి స్మరించుకోవడము మన కృతజ్ఞతని వెల్లడించు కోవడము. ఇంతటి వనరులు కల భూమిని సృష్టించి మనలని దానికి రాజాధి రాజులని చేసి; ఎన్నో ఆనందాలను మనం అనుభవించేలా చేసిన ఆ పరమాత్మకు మన సంస్కార యుత నమస్కారము. ఆ నమస్కారము ఆయన కోసము కాదు. మనకోసము.

పాప పంకిలం; సెల్ఫీలు, బోతీలు; వస్తువు పేరు

పాప పంకిలం

మౌనము వహించిన మనసే ‌బ్రహ్మము. దివ్యము. భగవన్మయము.
మనసు మౌనమైన వినిపించును భగవద్వాణి;

తస్య వాచకః ప్రణవః.

ప్రణవ శబ్దము ప్రాణం నుంచి వచ్చింది. ప్రణవం ప్రాణ శక్తి. ప్రాణశక్తి ధ్వని శక్తి. వినిపించని ధ్వని. చెవులకు వినిపించని ధ్వని. (Infra-sonic). Frequency between 1 to 20 Hz.

ధ్వని శక్తి యాంత్రిక శక్తి. మౌనము ప్రణవమే.

అన్ని లోకములు, సృష్టులు ప్రణవమయములు. ప్రణవ నాదం జగత్తంతా నిండి ఉంది. లోక్యతే ఇతి లోకః. చూడబడేది లోకం. దేని చేత, ఎవని చేత?

అంతఃకరణముల చేత. వ్యక్తి (జీవ భావము కల ఆసామీ) చేత.

జగత్ అంటే బ్రహ్మ జ్ఞాన పరంగా అవగాహన చేసికోవాలి. ఈ జగత్, మనం అనుకునే బయటి భౌతిక జగత్తు (ప్రపంచం) కాదు.

భగవంతుడు ప్రణవమయుడు. మౌన స్వరూపుడు.

మౌనము వహించిన మనసే ఆత్మ. బ్రహ్మము.

మౌనము ప్రణవమే. ఈ ప్రణవ సంబంధమే శబ్ద బ్రహ్మ సిద్ధాంతానికి ఆయువుపట్టు. బ్రహ్మజ్ఞానము, అద్వైత సిద్ధాంతములని ఆధారము చేసుకొని, శబ్ద బ్రహ్మ సిద్ధాంతము పతంజలిచే ప్రతిపాదించబడినది. భర్తృహరి చేత సాక బడింది. భాషాశాస్త్ర మూలము ప్రణవము.

దీనిని వ్యాకరణ (భాషా) శాస్త్రవేత్తలు "స్ఫోట" అన్నారు. వేదాంతులు దీనినే "చిదాభాస" అన్నారు. అద్వైతులు "మాయ" అన్నారు. సాంఖ్య, యోగములు "ప్రకృతి" అన్నాయి. న్యాయ, వైశేషికములు "అణువులు" అన్నాయి.

విశిష్టాద్వైతులు శ్రీ అన్నారు. శివాద్వైతులు శక్తి అన్నారు. ఇంతకు ముందు ఐంద్ర మతము వారు తటిల్లత (శచీదేవి) అన్నారు.

ఇవన్నీ మాట్లాడేది ఒకటే. ప్రాణ శక్తి. అది స్వర శక్తి, దివ్య శక్తి అని రెండు విధములు. దివ్యము మానసిక శక్తి. కాంతి, జ్యోతిర్ శక్తి అనబడేది ఇదే‌.

స్వరము యాంత్రిక శక్తి. భాషా సంబంధమైన స్ఫోట దీనినుంచే జనించింది.

ఈ విషయాలు ఏమీ తెలియని నేటి ఆధ్యాత్మిక గురువులు, స్వాములు, వ్యాపారులై వేదాంతాన్ని మెట్ట వేదాంతం చేసి, పబ్బం గడుపుకుంటున్నారు. ధన, కనక, కాంతా ( స్త్రీ స్వాముల విషయంలో పురుష), వాస్తు, వాహనములు అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మిక సామ్రాజ్యములు కాక లౌకిక సామ్రాజ్యాలు ఏర్పరచుకుంటున్నారు.

గృహస్థుల మించి లౌకికానందాలు, విషయానందాలు అనుభవిస్తున్నారు. ధన సంచయం విపరీతంగా చేస్తున్నారు. నల్లడబ్బు సమీకరణలో పాలు పంచుకుంటున్నారు. సంన్యాసి ఆశ్రమానికి అపప్రధ తెస్తున్నారు. సన్నాసులుగా జీవిస్తున్నారు.

ఇన్ని శాస్త్రాల, వేదాంతాల సారాన్ని అమ్ముకుంటున్నారు.

నిజానికి జనానికి అబద్ధం నచ్చినట్లు నిజం నచ్చదు. రమ్యోక్తుల పారవశ్యంలో తమని తాము మరచి స్వప్నలోకాల్లో విహరిస్తున్నారు. ఆధ్యాత్మికతను విస్మరిస్తున్నారు.

ఏవో రమ్య ఊహాలోకాల్లో గురువు, శిష్యులు ఓలలాడుతూ గమ్యాన్నే మరుస్తున్నారు.

పటాటోపాలు, ఆడంబరాలు నేర్చి ఆధ్యాత్మికతను హాస్యాస్పదం, అభాసు పాలు చేస్తున్నారు. నాస్తికులను మించి భగవంతుని ఉనికి యందు నమ్మకం లేక అఘోరిస్తున్నారు. పాప పంకిలంలో దొర్లుతున్నారు.
**********
A thing is the same though differently called in different languages.
*******
సెల్ఫీలు, బోతీలు

సెల్ఫీలు, బోతీలు
అన్నీ మన ఫొటోలు;
ఆధార్ కార్డ్ లోని
ఛాయా చిత్రముల వలె
అందగించును;
ఆనందము ఇతరుల
మనసుల నిండును;
ఫొటోలు తీయుట
తీసి కొనుట వేలం
వెఱ్ఱి అయిన ఈ వేళ
పరాకాష్ట ఇవి
ఆ చోద్యములకు
మెమొరీ తగ్గిపోవుచుండును
ఫోన్లకు!
మన మస్తిష్కంలకు
********
వస్తువు పేరు ప్రతి భాషలో తలొకటి, కాని వస్తువదే!

క్రీస్తు క్రైస్తవులను మాత్రమే
రక్షిస్తాడంటారు మిగతా వారిని పట్టించుకోడా?
ఏమో?
అల్లా మాత్రమే అంత మంచిని చేయగలడని
అదీ తన అనుయాయులకు మాత్రమే నని,
ముల్లాల డబాయింపు; విద్వేష ప్రసరణము;
విష్ణువు మాత్రమే అందరికీ దేవుడంటారు
వైష్ణవ స్వాములు; శివుడు ఇతరులు ఆయన
తరవాతేనంటారు;
శివుడు మాత్రమే దేవుడని మిగిలిన
దేవతలు, దైవములు ఆయన కిందేనంటారు
శైవ మఠాధీశులు;
ఏ మతం వాళ్ళు వాళ్ళ దేవుడే గొప్ప
అంటారు;
సంఘమున ఎన్నో మతములు
ఎందరో దేవుళ్ళు;
గుళ్ళు, చర్చ్ లు, మసీదులు,
ఆయా దేవుళ్ళ ఆలయములు
రూపాంతర దేవాలయములు
వాటిని ఆశ్రయించి జనులు;
సర్వులకూ దేముళ్ళు కాని
ఏమి ఈ దైవత్వములు;
కావా భూమికి భారములు
ఈ సంకుచిత మతాధీశుల
మఠాధీశుల ప్రవచనములు?
దేముళ్ళందరూ ఇష్టాగోష్టిగా
సమయము గడుపునపుడు
నవ్వుకోరా ఈ మతగురువుల
అజ్ఞానములు; శుంఠత్వములు?
"దైవమెవరైతేనేమి? రూపు ఏదైతేనేమి?
రూపము లేదనుకుంటే నేమి? ఏ మతము
వా రినైనను మేము దేముళ్ళము కాపాడుదుమని
తెలియని పసికూనల ఎవరు రక్షించగలరు?
శ్రద్ధ భక్తి ముఖ్యము కాని పేరులో ఏమీ లేదు
వస్తువు పేరు ప్రతి భాషలో తలొకటి; కాని వస్తువదే;"
ఈ చిన్ని విషయము తెలియనివారు కొట్టుకు చచ్చెదరు; మారణహోమముల అన్యుల చంపెదరు;
ఒకరిని చూసి ఒకరు పేట్రేగిపోయెదరు; భూమిపైననే
అన్యమతస్థులకు నరకం చూపెట్టెదరు; , సౌమనస్యము, ఇంగితం కలిగి సమన్వయము సామరస్యము బోధించు వారిని తిట్టిపోసెదరు;
తమ వలె అజ్ఞానానికి లోను కాలేదని
వారిని "మార్చ" బూనెదరు; అంతయు
శుంఠల సంఘము; ఉన్మత్తుల సంచారము;
మతమొ, లేని సమ్మతమొ మూర్ఖుల చేత
చిక్కి విలవిల లాడుచున్నవి మతములు;
ప్రతిరోజూ ఈ మూర్ఖత్వముల సుళ్ళు తిరుగుచున్నారు జనులు; ధన, ప్రాణ
మానముల పోగొట్టుకొనుచున్నారు విహ్వలులై
*********
మనందరం ఇతరుల కోసం అంతర్జాలంలో సూక్తులు పెడతాము.

Sunday, October 15, 2017

కబుర్లు - పనులు; హిందూ మతం; Spirituality; Means of Knowledge; Dumping Literature; Mind - Energy Forms; Intellectuals; Economics

కబుర్లు - పనులు

ఇది వరకు రోజుల్లో ఆడకి గాని, మగకి కాని పని చెయ్యడానికి తప్ప కబుర్లు చెప్పడానికి ఖాళీ ఉండేది కాదు.
ఇప్పటి వాళ్ళకి కబుర్లు చెప్పడానికి తప్ప పని చెయ్యడానికి ఖాళీ ఉండడం లేదు.

పూర్వకాలంలో పనులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు పనులు మానేసి కబుర్లు చెప్పుకుంటున్నారు.

అందుకే అంతర్జాల మాధ్యమం అంత బిజీ గా ఉంటోంది.
************
హిందూ మతం

హిందూ మతం అనబడే సనాతన ధర్మానికి దానిని గురించి ఏమీ తెలియకుండా అవాకులు చవాకులు వాగే మేధావులతో సరిసమానంగా, దానిని గురించి ఏమీ తెలియకుండా దానిని ఎత్తేసేవారి వల్ల కూడా ఎంతో అపకారం జరుగుతోంది.

ఏమీ తెలియని వారు మౌనంగా ఉంటే సమాజంలో సుఖశాంతులు వాటంతట అవే నెలకొంటాయి.

ఈ దూషణ భూషణ తిరస్కొరములు పాడు చెయ్యడానికి తప్ప మరెందుకూ పనికి రావు.

ఏదైనా ఒక మంచి ఉపన్యాసం వింటే ఉపన్యాసం లోని విషయాలకు మనసు పారేసుకోరు. మనసుకు పట్టించుకోరు. ఉపన్యాసకుని పేరిట సంఘాలు‌ స్థాపిస్తారు. ఆధ్యాత్మికత విడిచి ఆ గందరగోళంలో
తల మునకలౌతారు చాలామంది "ముముక్షువులు".
పాయసంలో గరిటలా రస హీనంగా, ఆస్వాదనా రహితంగా, ఉండడానికే అందరి తాపత్రయం. పాయసం రుచి చూసే ఉద్దేశ్యం ఎవరికీ లేదు.

***************
Spirituality helps to cultivate, develop, increase and retain and make one's own, the enduring capabilities of the individual to face pleasant and unpleasant realities arising out of mundane life during its course.
***********
Pramaanaas - means of Knowlwedge
Great people present us with the essence and essentials of the knowledge, information, distilling through their minds, scholarship, intuition, intellect and experience through their works. We save lots of time and energy and can grasp knowledge even if our minds are originally inadequate to assimilate.
This is the third pramana (means of cognition); the remaining two pramanas being pratyaksha (thorough sense organs through the mediation of mind) and anumaana (inference).All knowledge -secular, including scientific, or spiritual is acquired through these three pramaanaas (means or ways).
The first means (pramaana) is also known as sabda or aagama pramaana.
*************
Dumping Literature

Dumping on the society
Whatever we compose
May not be labelled as 
Literature; literature now a days
Seems to be the possession of
A few committed to respective
Isms; pure, sans ism composition
Has few takers; literature and
Criticism have become monopoly
Of rationalistic thinkers; even though
Poetry is outpouring of heart; heart
Does not, need not, cannot and should
Not be subservient to logic and ism
*************
ఇది వరకు వారు ఇళ్ళల్లో చెప్పుకునే కబుర్లు ఇప్పుడు అంతర్జాలమున ఫేస్బుక్, వాట్సాప్ లలో పోస్టింగ్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. కాలక్షేపం తీరులు తరం తరానికి మారుతాయి.
***********
Mind and its energy forms:
Thought arises from understanding, insight. Feeling arises from mood. Both thought and feeling are expressed through speech; movement of eye balls, gestures in face, lips.(smile etc.,), movement of hands or legs. All expressions are mechanical, (Speech is from mechanical movement of vocal chords).
Thoughts and feelings are electrochemical in nature, energy form.
Understanding, insight, experience, mood, sense, meaning, intuition, are biochemical in nature and energy form.
Observation of all these is done by Self.
Self is infra-sonic in nature and energy form.
From the experience/understanding/insight/mood etc., of speaker it reaches the listener through words or gestures.
***********
Intellectuals and Ancient Indian Tradition

In India some intellectuals and followers of Buddhism or Jainism, or Christianity or are atheists, have a peculiar notion that if they like Buddhism, Christianity, Jainism or are atheists or some "followers" of these, that they have inherent life long rights to abusively criticize ancient Indian thought, culture, or civilization other than their favourites. They are proud of their theism or rationalism only in comparison to Ancient Indian expressions. They take liberty to say anything about ancient Indian tradition.
But they never criticize among themselves? They never compare among themselves?
Why?
Are they superior in their thoughts or feelings?
Are the other faiths and isms so blemish-less? So perfect? Are they so perfect or naive or arrogant?
*******
Economics

Welfare economics got one Nobel prize. Behavioural economics got another. Is economics getting converted into other subjects recently, other than mathematics and statistics?
Welfare economics appears to be social study and behavioural economics appears to be sociological study and analysis. Any social studies subject uses statistics. The flavour of statistics and mathematics as theories is missing from economics many times it seems.

Tuesday, October 10, 2017

Sectarian Writings; Social Scientists and Governments' Apathy; భక్తి నిండిన హృదయము

Sectarian Writings

Poets and poetesses are branded as belonging to various isms and they are comfortable with it.

A verse-composer is expected to think about and compose for whole humanity. But this sectarian attitudes are welcomed rather than discouraged. If literary creators are divided like this, the critics and readers are forced to like and long for sectarian creations. Really sad state of affairs is existing.

When intellectuals and scholars can not think and feel for beyond their isms, it is misery of love and compassion.

***********

Professors and Social Scientists in India: The Governments'
lukewarm response and inaction and negligence

Both the chief ministers of the states and the ministers are not able to say any thing about the hurting writings of the self-proclaimed social scientist because of caste reasons. They are worried about their vote-banks.
The two upper castes that are ridiculed are not potent by nature. So our professors\'s antiques are going on un-tackled. If any other upper castes are ridiculed like this, the professor might have got his response as should be. He is discreet in choosing the castes to "blame" and criticize about. Professors are "intelligent' any way.
But they are also timid.They are not actually committed to any justice. They are self-centered and crave for "fame" and recognition by their sponsors and public; and of course the money aspect is any way there. This purpose is being served unhindered and happily.
Even though they changed the religion to one which do not care for castes, they are not able to "forget" their castes of birth for obvious advantages and criminally. It is like having the bread and eating it too.
But unfortunately in India there are no human rights for upper castes especially the ones targeted by the concerned professor.

********

*********
భక్తి నిండిన హృదయము


భక్తి నిండిన హృదయమున
ఆనందము వెల్లివిరుయును
ఆడంబరము చూపు వ్యక్తి యందు
అహంభావము తొంగి చూచుచుండును
భగవంతుని స్నేహము కావలసిన
ప్రసన్న హృదయముండవలెను
భగవంతుని యందు ఐక్యము
కావలయునన్న వ్యక్తిత్వం వదలవలెను
శాంతి సౌఖ్యములు కావలెన్న
కరుణ ప్రేమ మనమున నిండవలెను
మౌనము ఆనందము అనుభవము
కావలెనన్న కృష్ణ పరమాత్మను భజించవలెను

Monday, October 9, 2017

శ్రియః పతి; Loving; అనవసర పరిజ్ఞానం ; Intelligent Lifestyle;

శ్రియః పతి

అహంభావము వదిలి
మమకారముల నుంచి సడలి
నారాయణ నామస్మరణ
నామ సంకీర్తనముల మనసు
నుంచిన, సతతము మెదులు
మనసు నేర్చును నెమ్మది;

మనసన్ననేమి భావముల‌ వరుస
అభావముల నేర్వగల సరస
మనసు నిర్మలమైన అదియే
శాంతి, ఆనందము, మౌనము

నిర్మలమైన మనసే బ్రహ్మము
నిరాకులత పొందిన మనసే ఆత్మ
జీవభావము వదిలిన క్షణముననే
అనుభవమునకొచ్చును పరమాత్మ

సరస శృంగార నాథుడు శ్రీకృష్ణుడు
రాధా మనోహరుడు రమ్య కవితా
వనితా రంజనుడు నిరంజనుడు
భగవద్గీతాచార్యుడు భవ బంధ

విమోచకుడు విరించి జనకుడు
వివిధ వేదాంతవేద్యుడు నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూపుడు
హరి, ఉపనిషత్ జ్ఞాన దీప్తి మోక్ష ప్రదాత

నారాయణుడు నరసింహుడు
భక్తుల పాలిటి కామధేనువు
కల్పవృక్షము కమనీయ రూపుడు
నరాద్వైతుడు నవనీతచోరుడు

మనసున నిండి మమతల పండించి
ఆ పై తత్త్వమును నేర్పు అచ్యుతుడు
మధుసూదనుడు శ్రియః పతి మనల
బ్రోచుగాక! తనలో లీనము చేసికొనును గాక

************

In loving, yes, the individuality should be respected; but in true love we do not mind losing our identity. Loving is merging two selves into on Self. Loving is a spiritual experience and journey together and merging individuality in Love to shine as Love and be blissful, peaceful and serene for life.

************

అనవసర పరిజ్ఞానం 

మనుషులకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ అశాంతి‌. అనవసరమైన మట్టుకే జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానము సంపాదించడం మంచిది. అనవసర జ్ఞాన, పరిజ్ఞాన, విజ్ఞాన సేకరణ సమయాన్ని వృథా చేసికోవడం, లేని పోని అశాంతిని కొని తెచ్చుకోవడం.
నేడు ఎక్కువ మంది నాగరికులు తమకు సంబంధము లేని సంఘటనల గురించి తెలుసుకుంటున్నారు. వాటిపై ఇష్టాయిష్టములు ప్రకటిస్తూ, మనసు పాడు చేసుకుంటూ కొరివితో తల గోక్కుంటున్నారు. మనసు నెమ్మదిని, ప్రశాంతతను కోల్పోతున్నారు.
తాము చేయగలిగినది ఏమీ లేక పోయినా ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని, సంఘటనను, వార్తలను మనసుకు పట్టించుకుంటున్నారు. అంతర్జాలములో ఆవేశకావేషాలు,
అనాగరికములు, అసభ్యతలు, ఆందోళన కారకములను
మనసుకు హత్తించుకుని జీవితములో ప్రశాంతతను భగ్నం చేసికుంటున్నారు.

అయిన దానికి, కాని దానికి, అనవసరమైన దానికి, అనవసరమైన దానికి స్పందించడం నాగరికతలో భాగం అనే భ్రమలో కొట్టమిట్టాడుచు‌న్నారు ఎందరో నేటి "నాగరికులు".
ఇంగితము మరచి వ్యవహరిస్తున్నారు. తమకు తాము అపకారం చేసుకుంటున్నారు. చదువును ఉపయోగించు కోలేక పోతున్నారు.
పూర్తిగా అనవసరమైన ఘటనలను నెత్తికెక్కించుకుని
అశాంతికి రాజులవుతున్నారు. మనమేమీ చేయలేని విషయాలను పట్టించుకోక పోవడం నేర్చుకుంటేనే గాని ఆధునికులకు శాంతి, సౌఖ్యము లేవు.
అందరము ఈ విషయము గమనించుకుందుము గాక!
**********
Intelligent Lifestyle

Renouncing the world by sadhus, swamis,
Anandas,, criminal babas is, enjoying freely
People's money and assets as owners;
They do not have familie means
Mating with honeys and adopting
Them as daughters; spirituality in India
Has become free for all; all intelligent
Persons are spiritual teachers
Less intelligent are politicians
Still less intelligent are professionals;
Front benchers are least intelligent
Life is not about Knowledge
Life is about exploiting the gullible