పదార్థములు 1
పదార్ధము పదము ఒక్కొక్క శాస్త్రములో ఒక్కొక్క అర్థములో ఉపయోగించబడుతుంది.
నిజానికి వివిధ శాస్త్రములలో పరిజ్ఞానం కల మనుషులే తక్కువై పోతున్నారు ఈ రోజుల్లో.
నిజానికి వివిధ శాస్త్రములలో పరిజ్ఞానం కల మనుషులే తక్కువై పోతున్నారు ఈ రోజుల్లో.
చదువుకోవడం ఉద్యోగం సంపాదించుకోవడానికి మాత్రమే అని మనం రూఢిగా నమ్మి ఆచరిస్తున్న ఈ వేళ ఒకే వ్యక్తికి వివిధ శాస్త్రాలతో, తత్త్వాలతో, విషయాలతో పరిచయం ఉండాలని అనుకోవడం సాహసమే. వివిధ శాస్త్ర పరిజ్ఞానం కలవారు కావాలి అనడం చెవిటి వాని ముందు శంఖం పూరించినట్టే; గ్రుడ్డివానికి అద్దం చూపించినట్లు.
గూగుల్, వికిపీడియా విస్తృతంగా వాడే ఈ రోజుల్లో ఒక వ్యక్తి కొన్ని కావ్యాలను,శాస్త్రాలను, తత్త్వాలను, పఠించాలి, ఒక అవగాహనకు తను స్వంతంగా రావాలి అనేది చాదస్తపు ఆలోచన అని చాలా మందికి అనిపిస్తుంది.
మనిషికి, జంతువులకు తేడా ఈ మేధ; భాషా, శాస్త్ర, తత్త్వ జ్ఞానాలే అనడం ముసలి తనపు లక్షణాలలో ఒకటి అని ఎక్కువ మంది ఈ నాడు నిర్ణయించేస్తున్నారు. పండితుడై, జ్ఞానియై రసాస్వాదకుడై మనిషి సంపూర్ణ జీవితం గడపాలనడం మా తరం వాళ్ళ స్వప్నం.
మనిషి అలా మేధని మనసుని, బుద్ధిని ఉపయోగించి అధ్యయనం చేసి జ్ఞానులమై కొంగ్రొత్త విషయాలు ఆవిష్కరించడం మా తరం వారికి నాగరికత సంస్కృతి, సంస్కారం, హాబీ. ఊపిరి. జీవనంలో జీవం.
లేని పోని, వెగటు కలిగించే, ప్రలాప, వాద, వితండ వాద, రాద్ధాంత సృష్టులతో కుసంస్కారంగా పబ్బం గడుపుకోవడం మాత్రమే ఎందరో "మేధావులకు", వారి అనుయాయులకు నేడు తెలిసిన విద్య.
జ్ఞాన సముపార్జనలో కాక అజ్ఞానానికి ప్రతీకలుగా జీవించడం ఒక సంస్కృతిగా, నాగరికతగా మారింది.
తిట్టిపొయ్యడాలు తెలిసినంతగా వివిధ భాషా, శాస్త్ర, తత్త్వాగాహన కలిగించుకోవడం ఎందరో ఆధునిక మేధావులకు ఎబ్బెట్టుగా ఉంది.
తిట్టిపొయ్యడాలు తెలిసినంతగా వివిధ భాషా, శాస్త్ర, తత్త్వాగాహన కలిగించుకోవడం ఎందరో ఆధునిక మేధావులకు ఎబ్బెట్టుగా ఉంది.
ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్టే మహా వృక్షమైనట్టు; నోటికొచ్చినట్టు లాగే, వాగే "ప్రసిద్ధులైన", ప్రచారం చేసుకోగల అనాగరికులైన ఆచార్యులు, సంఘంలో చోటునాక్రమించి, ప్రజ్ఞా పాటవములు కలిగి విజ్ఞులైన మేధావులకు చోటు లేకుండా చేస్తున్నారు. వారు మాత్రమే మేధావులుగా చెలామణీ అవుతున్నారు.
ఈ స్థితిలో పదార్థము వివిధ శాస్త్రాలలో ఎలా వాడబడింది అని చెప్పబూనడం, చర్చించబూనడం
వింతగా అనిపించొచ్చు.
వింతగా అనిపించొచ్చు.
కాని విజ్ఞులైన, మేధావులైన, రసాస్వాదకులైన, పాఠకులు, రచయితలు, కవులు, నిజం అర్థంలో మేధావులు, ఇంకా విరివిగా ఉన్న నేడు మము బోంట్లకు ఇలాంటివి రాయాలనే ఉత్సుకత జీవించే ఉంటుంది. మనసు, మేధ ఉత్సాహం నింపుకుని సతతమూ మనకి ఉపయోగపడి వివిధ శాస్త్రాలలో మనలను నిష్ణాతులు చేస్తాయి. మనిషిగా పుట్టినందుకు జీవితం సఫలమౌతుంది. బ్రతుకుకి ఒక పరమార్థం, పరిపూర్ణత లభిస్తుంది.
పదార్థములు 2
భౌతిక శాస్త్రము
భౌతిక శాస్త్రం లో పదార్థము నిజం matter అనే అర్థంలో ఉపయోగిస్తారు. Matter అంటే విషయము అనే అర్థమూ ఉంది. ఈ రెండూ నామవాచకములు. matter నిజం క్రియగాను ఉపయోగిస్తారు! It matters little అని. ఒకే పదాన్ని నామవాచకం గాను, క్రియగాను, ఇతర భాషా భాగములుగాను ఉపయోగించడం అన్ని భాషల్లోనూ ఉంది.
భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థముల స్థితులు నాలుగు రకములు. అవి ఘన, ద్రవ, వాయు మరియు ions.
ఇవి ఒక పదార్థ స్థితి నుంచి మరొక పదార్థ స్థితి కి శక్తి సహాయంతో మారుతాయి. ఈ శక్తి రకరకములు.
ఇవి ఒక పదార్థ స్థితి నుంచి మరొక పదార్థ స్థితి కి శక్తి సహాయంతో మారుతాయి. ఈ శక్తి రకరకములు.
యాంత్రిక, ఉష్ణ, కాంతి, విద్యుత్, అయస్కాంత, విద్యుదయస్కాంత, అణు, పరమాణు, కేంద్రక శక్తులు. అలాగే శక్తి రూపము పదార్థము ద్వారా, పదార్థము సహాయంతో మారుతుంది. ఇలా శక్తి, పదార్థములు పరస్పర సహాయంతో రూపము, స్థితి మార్చుకోవడమే భౌతిక శాస్త్ర సర్వస్వము.
కాలము, చోటు (ఆకాశము, అవకాశము), శక్తి, పదార్థముల కలయికతో, కలయికలో భౌతిక శాస్త్రం ఉద్భవిస్తుంది. వీటి కలయికతో జరిగే వివిధ చర్యలు, ప్రతి చర్యలు సమాహారమే భౌతిక, రసాయన, జీవ మరియు వివిధ ప్రకృతి శాస్త్రాల ఉనికికి కారణమౌతాయి.
చోటు లేక పదార్థము లేదు. శూన్యము అంటే పదార్థము యొక్క అభావము (లేకుండుట). పదార్థము, శక్తి పరిణామములు లేక కాలము లేదు. కాలమునకు స్వంతంగా ఉనికి లేదు. పదార్థ స్థితి మార్పు కాని శక్తి రూప పరిణామము కాని కాలమును సృష్టిస్తుంది. ఈ పరిణామాలు లేక కాలము ఉనికి ప్రసక్తి లేదు. కాలగమనము అని మనము భ్రమ పడేది పదార్థ గమనము (కదలిక), పదార్థ, శక్తుల పరస్పర సాహాయ్యక మార్పులు కాని, జీవి పరిణమించడం కాని కాల గమనము, కాల ప్రవాహం, అని మనం అనుకుంటాం. శక్తి పరిణామమే కాలమని, పరిణామమే కాలమని తత్త్వజ్ఞుల ఉవాచ.
మనకు కాల స్పృహ మెళకువ, కల మానసిక దశలలో మాత్రమే ఉంటుంది. గాఢనిద్ర, మెళకువతో కూడిన నిద్ర (జాగ్రత్ సుషుప్తి) దశలలో కాల స్పృహ ఉండదు. జంతువులకు మనకున్నట్టుగా కాల స్పృహ, కాల గమనము లేవు. వాటి కాలం జ్ఞానము వేరు.
పదార్థములు 3
అభావము : లేకుండుట
శూన్యములు - "లేకుండుట" లోని ఉపయోగములు
శూన్యము అనే సంస్కృత పదానికి ఒకే అర్థం - లేకుండుట. ఈ
లేకుండుట వివిధ శాస్త్రాలలో, తత్త్వాలలో
ఎంత ఉపయోగకరమో పరిశీలిద్దాం. విషయబోధకంగానూ, సరదాగానూ
ఉంటుంది.
సున్న:
శూన్యము అంటే సున్న అని అర్థం. సున్నకు ఏ విలువ లేదు. అలా
విలువ "లేకుండుట" సంఖ్యాశాస్త్రంలో సున్న వలన ఎంత ఉపయోగమో మనందరికీ
తెలుసు.
రిక్త ప్రదేశము:
శూన్యమునకు మరియొక అర్థం రిక్త ప్రదేశము అని. రిక్త
ప్రదేశము - పదార్థాభావము - ఉండడం వల్లే పదార్ధము వహించ బడుతోంది.
పదార్ధము యొక్క ఘన, ద్రవ, వాయు స్థితుల ఉనికి శూన్యం ఉండడం
వల్ల వీలవుతోంది.
పదార్థాభావము శూన్యము.
పదార్థాభావము శూన్యము.
అలాగే సాంకేతిక శాస్త్రంలో సెమి కండక్టర్ ఫిజిక్స్ లో
ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రాను ఖాళీ చేసిన రిక్త ప్రదేశాన్ని "హోల్"
అంటారు. ఈ అవగాహన సృజించడం వలన ఈ ఎలక్ట్రానిక్స్ లో ఎంతో ఎదుగుదల జరిగింది.
అలా ఎలక్ట్రాన్ "లేకుండుట" అనే ఆలోచన
ట్రాన్సిష్టర్ ఎలక్ట్రానిక్స్ కి పాదు వేసింది.
మనసు లేని, జగత్
కనుపింపని, వాసనలు
ప్రకోపింపని స్థితి:
తత్త్వశాస్త్రం లో శూన్యము అనే ఆలోచన, అనుభవము ఎంతో గంభీరమైనది. గహనమైనది.
విలువైనది. ఉపయోగకరమైనది. శాంతానందములు కలిగించేది.
శూన్యం పదాన్ని ఎక్కువగా బౌద్ధం తో ముడిపెడుతూ ఉంటారు.
ద్వైత స్థితిలో త్రిపుటి - జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము ఏర్పడి
దృష్టిలో ఉంటాయి. జ్ఞేయమేమీ దృష్టిలో లేక జ్ఞాత,
జ్ఞానం మాత్రమే దృష్టిలో ఉంటే అప్పటి స్థితిని శూన్యస్థితి
అంటారు. ఇక్కడ శూన్యమయ్యేది జగత్ - విషయ, విషయానుభవ
సమాహారం. ఏ తలపులు, అనుభవములు
కలుగవు. దృష్టి విషయరహితంగా ఉంటుంది. శూన్యత దానిదే. విషయ, విషయానుభవము లకు మాత్రమే.
ఈ స్థితిలో విషయాభావముంటుంది కాని గమనికా ఉంటుంది. అందుకే
అది - దృష్టి - శూన్యము అని తెలుస్తుంది. అలా జగత్ శూన్యస్థితిలో గమనిక ఉండడం వల్ల, అది సహజ మానసిక స్థితి అవడం వల్ల
శాంతము, ఆనందము
అనుభవింపబడతాయి. మనసు ప్రసన్నంగా
ఉంటుంది.
ఉంటుంది.
బౌద్ధులు శూన్య స్థితి అన్నది వేదాంతులు పూర్ణ స్థితి
అన్నారు. పూర్ణస్థితిలో మనసుకు ఉనికి శూన్యం. అలా మనసుండదు. మనసు
"లేకుండుట" అలా వ్యక్తిత్వ రహిత స్థితిని అనుభవింపజేస్తంంది.
ఈ విధముగా, ఇన్ని
విధములుగా శూన్యము మానవ జీవితంలో, శాస్త్రాధ్యయనం
లో ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో మేలు చేస్తోంది.
ఏదైనా "ఉండడం" ఎంత ఉపయోగకరమో, "లేకుండటం" కూడా అంతే ఉపయోగం.
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు!పదార్థములు 4
వైశేషిక దర్శనము
భారతీయ తత్త్వానులోకనము బుద్ధికి, మనసుకు మంచి వ్యాయామము. ఉపనిషత్తులు, బౌద్ధము, జైనము, షడ్ దర్శనములు, అద్వైతము, శాక్తాద్వైతం, ద్వైతము, తదపరి జ్ఞానులు, పెద్దలు భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశారు.
పదార్థము వేరు వేరు దర్శనములలో వేరు వేరుగా నిర్వచించబడింది. భౌతిక శాస్త్ర పదార్థానికి ఈ పదార్థాలకు నిర్వచనంలో, ఇతరంగా అస్సలు సంబంధం లేదు. పదం ఒకటే, అంతే. అలాగే వైశేషిక దర్శనములో ఉపయోగించిన "అణు" శబ్దమునకు, భౌతిక శాస్త్రం లోని అణువు, పరమాణువులకు ఏమీ సంబంధం, సారూప్యత లేవు.
అన్ని భారతీయ తత్త్వదర్శనములు భౌతిక శాస్త్రం చెప్పే భౌతిక ప్రపంచం గురించి ఏమీ చెప్పలేదు. అన్ని తత్త్వ దర్శనములు జ్ఞాన బోధ మీమాంసా పరంగా మాట్లాడాయి. అవి ఉపయోగించిన పారిభాషిక పదాలకు, భౌతిక, ఇతర ప్రకృతి శాస్త్రాల పారిభాషిక పదాలకు సంబంధం లేదు. పదములు ఒక్కటే. అది మాత్రమే సారూప్యత. అర్థము, తాత్పర్యము వేరు.
పదముల పోలిక, సారూప్యతలని బట్టి ఆధునికులు, కొండొకచో పురాతనులు అపార్థం ఎక్కువగా చేసికొని తత్త్వదర్శనములు దేనిని గురించి మాట్లాడాయి, ఏమి చెబుతున్నాయి, దేనిని ప్రతిపాదిస్తున్నాయి అనే విషయంలో ఎంతో గందరగోళం సృష్టించారు. వాద, ప్రతి వాదములతో కలవరానికి కారణమయ్యారు.
పదముల పోలిక, సారూప్యతలని బట్టి ఆధునికులు, కొండొకచో పురాతనులు అపార్థం ఎక్కువగా చేసికొని తత్త్వదర్శనములు దేనిని గురించి మాట్లాడాయి, ఏమి చెబుతున్నాయి, దేనిని ప్రతిపాదిస్తున్నాయి అనే విషయంలో ఎంతో గందరగోళం సృష్టించారు. వాద, ప్రతి వాదములతో కలవరానికి కారణమయ్యారు.
లేని పోని మత్సరాలతో ప్రతి దర్శనాన్ని ఒక మతంగా మార్చారు. సమన్వయంతో దర్శనములలోని ప్రతిపాదనలను అనునయంగా సమీక్షించలేదు. ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు, ఇతర తత్త్వములు ఒకదానికి ఒకటి పోటీగా నిలిచి ఖండన ముండలు చేసినా, వాటికి తెలిసీ తెలియకుండా మన ఇప్పటి తరానికి జ్ఞాన బోధ మీమాంసా భాండాగారాన్ని అందించాయి.
ఏవిధమైన మత్సరములు, ద్వేష, విద్వేషాలు, కోపతాపాలు లేకుండా ఈ తత్త్వ దర్శనములను సమీక్షిస్తే మనకు జ్ఞానము కలుగు విధము, మానసిక కార్యకలాపాల నిర్వహణ మీద, భాషాధ్యయన, భాషణముల మీద ఎంతో అవగాహన ఏర్పడుతుంది.
All these spiritual and philosophical texts have illuminated the nature, form, structure, function of consciousness, mind and its functions; its control, its phases, states and cognitive scientific elements (జ్ఞాన బోధ మీమాంసా).
వైశేషిక దర్శనము పదార్థములు ఆరు అంది. అవి ద్రవ్య, గుణ, కర్మ, విశేష, సామాన్య, సమవాయములు. తరువాతి వైశేషికులు అభావమును కూడా కలిపారు.
న్యాయ, వైశేషికములు ఈ సప్త పదార్థములను, ప్రతిపాదించాయి. సాంఖ్య యోగములు, ప్రకృతిని పదార్థము అన్నాయి. పూర్వ, ఉత్తర మీమాంస లు
బ్రహ్మమును పదార్థము అన్నాయి. అదే శక్తి రూపంలో చిత్ శక్తి.
బ్రహ్మమును పదార్థము అన్నాయి. అదే శక్తి రూపంలో చిత్ శక్తి.
ఉపనిషత్తులు, అన్ని దర్శనములు, మనసు, మానసిక కార్యకలాపాల గురించి మాట్లాడాయి. ఈ పదార్థ ప్రతిపాదన, మనసు దేనిచే (ఎలా ) నిర్మింపబడింది, ఎలా పనిచేస్తుంది అనేది చర్చించారు. ఈ దర్శనములు మనకి కనిపించే బయటి భౌతిక ప్రపంచం గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ బయటి భౌతిక ప్రపంచం యొక్క మానసిక ముద్రల గురించి మాట్లాడాయి. వీటికి శబ్ద బ్రహ్మ సిద్ధాంతం కలిసి భాషా వ్యాకరణ శాస్త్రాలను సృష్టించింది. ఇవన్నీ కలిపి మనం ఎంతో అవగాహన చేసుకోవచ్చు. మనసు, మానసిక కార్యకలాపాల గురించి ఎంతో చెప్పొచ్చు.
పదార్థములు 5
శ్లో:
నామ రూప వినిర్ముక్తం యస్మిన్ సంస్థితే జగత్ తమ్ ఆహుః
కేచిన్ ప్రకృతీమ్ కేచిన్ మాయామ్ అన్యే పరేత్వచ అణూన్
నామ రూప వినిర్ముక్తం యస్మిన్ సంస్థితే జగత్ తమ్ ఆహుః
కేచిన్ ప్రకృతీమ్ కేచిన్ మాయామ్ అన్యే పరేత్వచ అణూన్
తాత్పర్యము:
నామ, రూపములు లేని జగత్ దేనియందు ఇమిడి ఉంటుందో, దానిని కొందరు ప్రకృతీ అంటారు; కొందరు మాయా అంటారు; మరికొందరు అణువులు అంటారు.
నామ, రూపములు లేని జగత్ దేనియందు ఇమిడి ఉంటుందో, దానిని కొందరు ప్రకృతీ అంటారు; కొందరు మాయా అంటారు; మరికొందరు అణువులు అంటారు.
భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఈ శ్లోకము సమన్వయ పరుస్తుంది. జ్ఞాన బోధ మీమాంసా పరంగా భారతీయ తత్త్వశాస్త్రాన్ని సమన్వయ పరచవచ్చు. ఈ ప్రయత్నంలో మిడి మిడి జ్ఞానవంతుల్ని, తత్త్వ శాస్త్రాలను కించిత్ కూడా చదవకుండా శంకరుల, రామానుజులు, మధ్వాచార్యుల, ఇతర ఆచార్యుల, తత్త్వ వేత్తల వెనుక దాగి, ఇతర అవగాహనలను అవగాహన చేసికోకుండానే విమర్శించే ఆచార్యులని, ప్రవచనకర్తలని, సామాన్యులని, జ్ఞానులని ఈ నూతన భాషలో పురాతన తత్త్వాన్ని దర్శించే మముబోంట్ల ప్రకటనము, దర్శనము సంతృప్తి పరచలేవు. అది వేరే విషయం.
భారతీయ తత్త్వానులోకనము భౌతిక పదార్థముల, బయటి భౌతిక ప్రపంచాల గురించి చెప్పలేదని, ఇప్పటి భౌతిక శాస్త్రానికి మన దర్శనములలో ఉపయోగించిన పారిభాషిక పదాలకు ఒక్క పదములు గానే సారూప్యత అని, అర్థము, పరమార్థము, ఉపయోగించిన తీరు, సందర్భాలు, వేరు అనీ; ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు, ఆ తర్వాతి జ్ఞానులు, వ్యాఖ్యాతలు మాట్లాడినది జ్ఞాన బోధ మీమాంస గురించి అనీ అనుకున్నాము.
వైశేషిక దర్శనములో పదార్థములు ఆరు, ఆ తర్వాత ఈ ఆరు పదార్థములకు తరువాతి వైశేషికులు అభావమును కలిపారని కూడా అనుకున్నాం. ఆ తర్వాతి వైశేషికులు పదార్థములు పది అన్నారు.
న్యాయ దార్శనికులు పదార్థములు పదహారు అన్నారు. సాంఖ్య, యోగ దర్శనములు ప్రకృతీ ని పదార్థము అన్నారు.
బ్రహ్మజ్ఞానము ఒక్కటే పదార్థము అంది. అది బ్రహ్మ పదార్థము.
నామ, రూప, వాసనా రహిత వస్తువు పదార్థము అని ఆత్మజ్ఞానము అంది.
భాషా, వ్యాకరణ శాస్త్రములు:
పతంజలి భాషా, వ్యాకరణ శాస్త్ర వివరములను తెలిపే తన శబ్ద బ్రహ్మ సిద్ధాంతమును బ్రహ్మజ్ఞానం ప్రాతిపదికగా రూపొందించాడు. భర్తృహరి తన వాక్యపదీయము గ్రంథంలో చాలా విపులంగా శబ్దబ్రహ్మ సిద్ధాంతం గురించి చర్చించాడు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం పదార్థములు నాలుగు.
స్ఫోట ప్రణవ రూపం. ప్రణవము,
స్ఫోట, మాయా, చిదాభాస, ప్రకృతి సమానములు, జగన్నిర్మాణ పదార్థము/శక్తి.
స్ఫోట, మాయా, చిదాభాస, ప్రకృతి సమానములు, జగన్నిర్మాణ పదార్థము/శక్తి.
ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు జ్ఞాన బోధ మీమాంసా పరంగా వ్యాఖ్యానించినపుడు ఇవన్నీ కలిపి మన ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగ పడతాయో ఆయా వ్యాసములలో చూద్దాం. ప్రస్తుతానికి పదార్థము, అణువు, పృథ్వి, అప్, తేజస్, వాయువు, ఆకాశ పదములకు జ్ఞాన బోధ మీమాంసా పరంగా వేరు అర్థాలు ఉన్నాయి అని తెలిస్తే చాలు.
సమస్త సన్మంగలాని భవంతు!