Thursday, April 13, 2017

అలంకారం; మతం - తత్త్వం

అలంకారం

పెరటి మొక్క మందుకు పనికిరాదు
ఆప్త వాక్యం వేప వలె చేదు చేదు
దేశస్థుల సన్మార్గోపదేశములు పనికిరావు
విదేశీయుల మాటలు "అక్షర సత్యాలు"


ఎవరికీ పొరుగింటి పుల్లకూర రుచి; పరాయి తీపి;
స్వాధ్యాయ నిరతులు సమ్యక్ దృష్టి కలవారు; ఇతరం
మోజులో స్వంతం అడుక్కి చాలా మంది నవీనులకు
సనాతనుల ఇంగితం బోధనలు స్వారస్యం లేనివని

అపోహలు; మంచిని చెప్పే మనదానిని మాత్సర్యమున
కనము; పరాయి వారిది వెఱ్ఱి యైనను సమ్మతము;
అంతయు దృష్టి లోపము; ఆస్వాదన తెలియని పసి
తనము; విరసము; సౌమస్యము లేని వితండ వాదము

సామ్యవాదము కన్న సౌమ్య వాదము మిన్న
గ్రామ్యము కన్న సంస్కృతమైన శబ్దము మిన్న
లేని తనము కారాదు అర్హత దేనికైనా; సభ్యత
సంస్కారం పాండిత్యం మేధ అలంకారం ఎవరికైనా

**********

 మతం

ప్రతి మతంలోనూ భగవంతునికి అనుయాయులకు మధ్యలో మత గురువులనబడే మధ్యవర్తులుంటారు.
ఇలా ప్రతి మతంలోనూ ఎందుకు ఉంది? చాలా మంది అనుయాయులు సామాన్యులు కాబట్టి. వారికి మతానికి సంబంధించిన పూజలు పునస్కారములు, ప్రార్ధనలు, నమాజులు, అవి చేసే విధానం తెలియదు కాబట్టి.
ఇలా మధ్యవర్తులు లేని మతం లేదు. తత్త్వం వేరు. మతం వేరు. మతానుసరణానికి మధ్యవర్తులు కావాలి.
తత్త్వానుసరణానికి అవసరం లేదు.


తత్త్వ సాధనలో చాలా మంది గురువు ప్రాముఖ్యం, ఉనికిని, వారి స్థానాన్ని, అవసరాన్ని, ప్రస్తుతిస్తూ, గురువు లేక తత్వసాధన లేదని, ఉన్నా నిరర్ధకమని అంటారు.

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ) దక్షిణామూర్తయే నమః

అనే శ్లోకం ఇష్ట దైవము, మానుష గురువులతో సరి సమానంగా వ్యక్తిలో గల స్ఫూర్తి, లోపల కలిగే స్ఫురణలు కూడా మనిషిని బ్రహ్మానుభవం వైపు పయనింపజేసి, బ్రహ్మవేత్తని చేస్తాయని చెబుతుంది. ఇది శాస్త్ర వచనము కూడాను. ఎందరో మహానుభావులు, పెద్దలు (రమణ మహర్షి వంటి వారు) అలా అయ్యారు కూడా.

మధ్యవర్తులు లేని తత్త్వానుభవము సమంగానే ఫలిస్తుంది. పరిఢవిల్లుతుంది. పరిమళిస్తుంది.
తత్త్వము మనిషిని సర్వతంత్ర స్వతంత్రుణ్ణి చేస్తుంది.

బ్రహ్మ విద్ బ్రహ్మైవ (బ్రహ్మా ఏవ) భవతి!

బ్రహ్మ విదుని ‌మనసు నిర్మల కాసారము. ప్రశాంత మానస సరోవరము. ఆనందాంబుధి. మౌనలహరి. ప్రజ్ఞాన ఘనము. శుద్ధ ఙ్ఞానము. పరుని నిలయము. నిరంజనము. నిస్పృహామయము. నిరహంకార నిధానము.

సమస్త సన్మంగలాని భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీపరమేశ్వరార్పణమస్తు!

*********

Every Human being has three shades of personality; first, what others think the individual is; second, what individual thinks about oneself what he/she is; and third, which only his intimate near and dear know and not necessarily even the individual knows he/she is.

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - ఐదవ భాగము

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - ఐదవ భాగము

ఆదినాథుని దర్శనం

మేము భావనగర్ నుంచి​ అరవై కిలోమీటర్ల దూరంలో కల పాలీతానాకు టాక్సీలో వెళ్ళాము. మా హోటల్ మేనేజర్
టాక్సీ కుదిర్చిపెట్టాడు. పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరి తీరాలని చెప్పాడు. మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి పంపాడు. పొద్దున్నే లేచి ఐదు గంటలకల్లా తయారై పోయాము. టాక్సీ రెడీగా ఉంది. పాలీతానాకు ఆ చల్లని ఉదయం బయలుదేరాము. దారిలో ఒక చోట టీ తాగడానికి ఆపాడు డ్రైవర్. అక్కడ టీ బాగుంది.

ఏడు గంటలకు పాలీతానా చేరాం. అది తాలూకా కేంద్రం.

బాంద్రా నుంచి పాలీతానాకు డైరక్ట్ రైలు ఉంది. మేము టాక్సీ దిగుతూనే మమ్మల్ని ఓ పదిమంది చుట్టేసారు -
డోలీ కావాలా అంటూ. పాలీతానా పక్కనే ఉన్న పర్వతం పై ఆదినాథుని జైనాలయం ఉంది. 3000 - మూడు వేల మెట్లు ఎక్కి వెళ్ళాలి. నడిచే వెళ్ళాలి. లేదా మనుషులు మోసే డోలీ ఎక్కి వెళ్ళొచ్చు. ఇద్దరు మోసే డోలీ కి పన్నెండు వందలు. నలుగురు మోసే డోలీకి రెండు వేలు తీసుకుంటారు. మనుషులు మోసే డోలీ ఎక్కడం నాకు, మా‌ ఆవిడకి సుతరామూ ఇష్టం లేదు. అదీ కాక మేము ఆ మూడు వేల మెట్లు ఎక్కి దిగగల శరీర ధారుఢ్యం మాకు ఉంది. అంచేత కాలినడకనే వెళ్లి రావడానికి నిశ్చయించుకున్నాము. కింద ఉన్న నాలుగైదు తీర్థంకరుల ఆలయములు సందర్శించుకొని హోటల్ వాళ్ళిచ్చిన బ్రేక్ఫాస్ట్ దర్శనం అయ్యాక పైన తిందామని కూడా తీసికొని బయలుదేరాము. మంచినీళ్ళ బాటిల్ కొందామనుకుంటే, మంచినీళ్లు దొరుకుతాయని చెప్పారు. వంద మెట్లు ఎక్కేసరికి. మా చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ పొట్లం చూసి వాలంటీర్లలా ఉన్న నలుగురు యువకులు మమ్మల్ని ఆపారు. లోపల ఏమున్నాయో చూసి తినుబండారాలు ఏవీ పైకి తీసుకెళ్లకూడదని, పొట్లం వాళ్ళకిచ్చేసి దిగేటప్పుడు తీసికోవచ్చని చెప్పి మా పొట్లం తీసుకున్నారు.

అప్పటికి పొద్దున్న ఏడైంది. నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలెట్టాము. ఎక్కుతూంటే చుట్టుపక్కల ప్రకృతి ఎంతో
ఆహ్లాదకరంగా ఉంది. కింద ఒక నది పర్వతాన్ని అనుకుని చుట్టూ ప్రవహిస్తోంది. దాని పేరు శత్రుంజయ అని తర్వాత
తెలిసింది. దారిలో ప్రతి వంద మెట్లకి ఒక మండపము, అక్కడ చల్లని మంచినీళ్లు అందించే వ్యవస్థా ఉన్నాయి. మరేమీ లేవు. తినుబండారాల వంటివి అస్సలు లేవు.

ఐదు వందల మెట్లేక్కేక ఒక చిన్ని అమ్మవారి ఆలయం ఉంది. దానికే ప్రాముఖ్యత లేదు. 2300 వందల మెట్లేక్కేక
పద్మావతీ దేవి ఆలయం ఉంది. జైన సంప్రదాయం లోని పద్మావతి ఈవిడ. అక్కడ కొందరు అమ్మవారికి దీపం చూపించడం, వింజామర వీచడం, హారతీయడం లాంటి సేవలు చేస్తున్నారు. అక్కడ 24 తీర్థంకరుల చిన్న విగ్రహాలున్న ఆలయ సమూహం ఉంది. అన్ని జైన దేవాలయాల సమీపంలోనూ ఇలా 24 తీర్థంకరుల ఆలయ
సమూహములుంటాయి.

మౌంట్ అబూ సమీపంలోని అందమైన పాలరాతి జైన దేవాలయాలు కల దిల్వారా ఆలయ సముదాయం లోనూ 24 తీర్థంకరుల దేవాలయాల సమూహం ఉంది. అదీ తప్పక చూడాల్సిన ప్రదేశం.మెట్లు ఎక్కడానికి వీలుగా ఉన్నాయి. నడిచి ఎక్కుతున్నట్టే ఉంది. అలసట అనిపించలేదు. కాని ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. ఇంక వంద మెట్లెక్కాలనగా ఒక వలంటీరు పక్క దారమ్మట వెళితే పూజా టిక్కెట్ ఇస్తారని చెప్పాడు. స్నానం కూడా చేయడం అటే అని చెప్పాడు. అటు ఎవరూ వెళ్లడం లేదు. అయినా మేము అటే వెళ్ళాము. మా వెనకాల ఒకావిడ, ఒకాయన వస్తున్నారు. ఆవిడని అడిగాను.

ఆవిడ చెప్పింది: జైనులకి ఈ యాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఎంతో ప్రాధాన్యత కలదనీ, హిందువులకి కాశీ, రామేశ్వరాలు, తిరుపతి ఎటువంటివో జైనులకు ఈ యాత్ర అంత పవిత్రమైనదనీ చెప్పింది. ఆవిడ రెండు మూడేళ్ళకోసారి ఈ యాత్ర చేసుకుంటుందట. ఆమె అహ్మదాబాద్ నివాసి. ముప్ఫైయ్యేళ్ళుండవచ్చు.
పూజ టిక్కెట్ తీసుకుని, అక్కడ స్నానం చేసి అక్కడ పక్కనే ఉన్న దర్గాను సందర్శించి ఆదినాథుని దర్శించి
అక్కడ పూజ చేసుకోవడం యాత్రా విధానం. అక్కడ ఉన్న ఆ దర్గాలో ఇద్దరు ముస్లింలు ఉండి దర్గాను చూస్తూంటారు.

జైనులకు తప్ప మరెవ్వరికీ ఆ దర్గాలోకి ప్రవేశం లేదు.

మేము దర్గా చూడలేదు. అక్కడ స్నానమూ చేయలేదు. పూజ చేయాలనుకోలేదు. ఆ విధి విధానాల గురించి సరిగ్గా తెలియదు కాబట్టి హిందువులను పూజ చేయనిస్తారో లేదో; ఈ రెండవ మార్గంలో కొన్ని అర్వాచీన తీర్థంకరుల
ఆలయాలు దర్శించుకుంటూ ప్రధాన ఆలయానికి, బయలుదేరిన రెండు గంటల తర్వాత, తొమ్మిది గంటలకు చేరాము. కొండ ఎక్కడానికి రెండు గంటలు పడుతుంది.

ప్రధాన ఆలయంలో ఫొటోలు తీయకూడదు. సెల్ఫోన్ తీసికెళ్ళనిస్తారు. ఈ విషయం నాకు చాలా నచ్చింది.
ప్రధాన ఆలయం పురాతన కట్టడం. ఎంత పురాతనమో అక్కడి వారు చెప్పలేదు. ఆలయం నిర్మించిన రాయి లేత ఆకుపచ్చనిది. అందంగా ఉంది. ప్రధాన ఆలయం లోకి ప్రవేశించి అక్కడ ఎంతసేపైనా దేవుణ్ణి చూస్తూ కూర్చోవచ్చు. దేవుడు ఎంతో బాగున్నాడు. కన్నులు ప్రకాశిస్తూ దివ్యంగా, సుందరంగా ఉన్నాయి. భగవంతుని చూస్తూ అరగంట సేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని ఎంతో ఆహ్లాదాన్ని పొందాము.

నేను ఎలా ప్రార్ధించాలి అని కొంత మీమాంసకు లోనయ్యాను. అందరూ నారాయణుని అవతారాలు కథా అనిపించి అలా ప్రార్ధించాను. మా ఆవిడ మాత్రం మరింత విజ్ఞతతో భగవంతుని శాంత స్వరూపునిగా ప్రార్ధించింది.
అక్కడే ఆలయం అంతర్భాగంలో భగవంతుని ఎదురుగా పూజలు చేసికుంటున్నారు. ఆ సన్నివేశం, దృశ్యం చాలా రమణీయంగా ఉంది. పిల్లలు రెడీమేడ్ ధోవతులు కట్టుకుని కళాత్మకంగా కనిపించి కనువిందు చేశారు.

ప్రధాన ఆలయం లోకి ప్రవేశించే ముందు ప్రదక్షిణం చేశాం.
ఆ సందర్భంలో ఆదినాథుని మరొక ఆలయంలో స్వామికి
దీపం చూపించడం, వింజామర వీచడం, అద్దంలో దేవుని
విగ్రహ ప్రతిబింబం చూడడం వంటి సేవలు చేశాము.

ఆదినాథుని దర్శనం ప్రశాంతతను కలిగించింది. పూజ టిక్కెట్ - ఉచితంగానే - తీసికున్నవారు ప్రధాన ఆలయం
లోపలికి వెళ్ళి అర్పణలు చేసి, స్వామిని తాకి పులకిత మనస్కులై దర్శనం చేసుకుంటున్నారు. జనం ఉన్నా తొడతొక్కిడి లేదు.
ఆలయం ప్రాంగణంలో ఆదినాథుని పాదములు ఉన్న ఆలయం ఉంది. అందరూ భక్తి శ్రద్ధలతో వాటికి నమస్కరిస్తున్నారు. ఆ పక్కనే ఒక చెట్టు ఉంది. అదీ ఎంతో పురాతనమైనది. హిందీలో ఆ చెట్టు పేరు రైనా.
ఆ చెట్టు దగ్గర కూర్చుని స్త్రీలు జట్లు జట్లుగా పూజలు చేస్తున్నారు. ఆ చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాం. అప్పుడు ఆ చెట్టు పైనుంచి ఆకు రాలి మనపై పడితే ఈ జన్మలో మనకు మోక్షం తథ్యం. నామీద గాని, మా ఆవిడ మీద గాని ఆయన చెట్టు ఆకులు రాలలేదు.

లోపల ప్రధానాలయ అంతర్భాగంలో భగవంతుని ఎదురుగా కూర్చుని చేస్తున్న స్తోత్రాలలోఎన్నో సంస్కృత పదాలు వినిపించాయి నాకు.

అక్కడ బయట ప్రాంగణంలోనే ఒక వేలంపాట జరుగుతోంది. రోజుకు పదకొండు మంది ఆదినాథునికి మకుట ధారణ చేయవచ్చు. ఆ భాగ్యం ఎవరు దక్కించుకుంటారు అనే దానికి వేలంపాట అది. జైనులందరూ స్త్రీ, పురుష, బాలలందరూ రమ్య వస్త్రధారణలో అందగిస్తూ పూజలు చేస్తూ ఆనందంగా భగవద్దర్శనం చేసుకోవడం
చూస్తూంటే ఎంతో బాగుంది. వారి భక్తి శ్రద్ధలు ముచ్చట గొలిపాయి.

తనివితీరా ఆదినాథుని సందర్శించాము. మన తిరుపతి దర్శించుకున్న అనుభూతి కలిగింది. స్వామి రూపు మది నిండా నిండి సంతోషాన్ని కలిగించింది. చల్లని మంచి నీళ్ళు తాగి సేదదీరాము. పైన తినడానికి ఏమీ దొరకదు. దానికి సిద్ధపడే వెళ్ళాలి. నడిచే ఎక్కాలి. ఎక్కలేని వాళ్ళు డోలీలలో వెళ్లొచ్చు. పైన ఎంతో శుభ్రంగా ఉంది.
అప్పటికి పొద్దున్న పదకొండయింది. ఎండ తీవ్రత పెరిగింది. అలానే నెమ్మదిగా దిగాము. ఇబ్బందేమీ అనిపించలేదు. దిగడానికి రెండు గంటలు పట్టింది. ఇది శ్వేతాంబరుల ఆలయం. జైనులలో శ్వేతాంబరులు​, దిగంబరరులు అని రెండు తెగలు. మేము కొల్హాపూర్ దగ్గరి ఒక జైనాలయం 300 మెట్లు మాత్రమే ఎక్కేది చూశాము. అది దిగంబర జైనుల ఆలయము.

ఇక్కడ జైన సన్యాసినులు, సన్యాసులు కింద ఆరామంలో ఉంటారు. వారు, ఎంతో పెద్దవారు కూడా ఉన్నారు, చక చకా ఎక్కి చక చకా దిగుతున్నారు. వారి శరీరాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.

భారత దేశంలో పాలకులు  ఎవరైనా, ఏ మతం వారైనా "భిన్నత్వంలో ఏకత్వం" శతాబ్దాల నుంచీ ఎంతో బాధ్యతాయుతంగా గౌరవింప బడుతూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు సంకుచిత రాజకీయ నాయకుల చేతుల్లో భ్రష్టు పట్టిపోయింది. ఓట్లకోసం, పదవి దొరుకుతుందని దేశాన్ని కులముల, మతముల, ప్రాంతముల, సిద్ధాంతముల మధ్య రణరంగం చేశారు.

ఎప్పటికి బయట పడతామో.

భారతీయ సంస్కృతి, తత్త్వ జ్ఞానము ఉపనిషత్తుల కాలం నుంచి, బౌద్ధ జైన చార్వాక వైష్ణవ శైవ వీర వీర వీర వైష్ణవ వీర శైవ మతాలు, ఆధునిక కాలంలో సాంఘిక విప్లవకారులకు చోటు కల్పించి ఉన్నతంగా ఎదిగింది. దాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత భారతీయులందరిదీ.

మేము భావనగర్ తిరిగి వచ్చి మరునాడు బొంబాయికి​ ప్రయాణం అయ్యాము, క్షేమంగా చేరాము కూడా.

Monday, April 10, 2017

Renouncing the world

Renouncing the world

Renouncing the world is popularly understood as sacrificing outer physical world and relations happened and cultivated during the course of life since our birth. But the real spiritual meaning of renouncing the world is different.

na karmanaa, na prajayaa, na dhanena; tyagenenaiva amruta masnuvanti -

means it is not through actions, not through creations, not through money, only through sacrifice one attains immortality.

The Sanskrit word for world is jagat - meaning - moving, changing, - whose presence is virtual - meaning which is reflected (in medha) and not original, which is transitory in the awareness of mined i.e., the thoughts, feelings, experiences etc., psychological functions. It is not the outside physical world as many love to interpret.

One must, though observing the presence of these mental happenings, and "experiencing" them, only mentally, one must realize that they are in the awareness temporarily and if you are not bonded to "I" as an individual and related ego, you can easily dismiss them as projections of the mind because of its "ignorance". One must only observe these mental happenings and not be involved or engaged in them as partner - as doer, experiencing the fruits of one's actions, and must remain as seer and mere observer.

This realization occurs if one is aware of the various phases of mind one goes through the course of the day - knowingly or unknowingly. Mental phases are four. They are termed as wakeful sleep, wakeful, dream and deep sleep conscious states. Mind is in working condition providing awareness and functioning or taking rest in these phases simultaneously or alternatively.

In both wakeful and dream phases of mind, mind gets tuned to the outside physical world and inner mental world - which is nothing but the impressions created in brain by the cognition through sense organs - eyes, ears, tongue, nose, skin - and mind - and experiences caused by these cognition-related object energies (light, sound, chemical energies as smells and tastes of food materials, mechanical energies as mechanical and heat energies, heat and cold) - and works simultaneously providing cognition, re-cognition, action, reaction, interaction, and communication abilities to the individual.

Renouncing world means to ignore these happenings as happening to the individual - which are just projections of mind and are not real; are mere virtual presences in the simultaneous dream conscious state of mind recognizing already cognized elements of the physical world in the wakeful conscious state of the mind.

Thus the prapancham created in the brain by combined operation of mind and sense organs gets impressed in the brain during wakeful conscious state of mind and is stored by dream-conscious mind.

This prapancham - asti bhaati priyam naama roopam cha it amsa panchakam aadya trayam brahma roopam tato dwayam jagat roopam.

Prapancham when re-cognized by the dream-conscious mind becomes jagat - the moving, the transitory experiences, moods, feelings, thoughts, utterances, communications - through movements of legs, hands, vocal chords (ability to speak), movement of reproductive organs, and bowels.
And it is this jagat, which appears and disappears second by second - precisely every one tenth of a second - and changes every one tenth of a second, must be renounced - sacrificed - ignored not getting involved in its contents (the experiences, feelings, thoughts, communications related to the individual's ego and cognition of outside physical world and re-cognition of the impressions of those physical objects of outside physical world - and remain a mere witness, seer, unaffected by these mental happenings which are mithya - unreal. Mind and its functions are unreal projections on the mental screen, the Self being the eternal observer, the Real I.

Mind and its functions are mere projections and super-impositions on the Self-screen - masking in the process - and making one involved and bonded to physical object- and physical object-created experiences - which are the super-impositions - because of false identification of I as individual and individual's ego and related bonds and thus created happiness, griefs, pains, aches, etc., moods, understanding or other wise mental abilities.

And jagat is nothing but these mental projections on the Self-screen during the wakeful and dream consciousness states relating to outside physical world and ego of the individual. And this jagat the virtual mental projection must be renounced i.e., undermined in the awareness and ignored, not getting involved in these unreal mental happenings. This is the Upanishadic understanding, exposition, meaning and insight.

Renouncing has nothing to do with not getting married, not having family, being a sanyasi and etc., misinterpreted sayings and commentaries. A sanyasi is also having samsaara - the sukha dukhaanubhavam - experience of happiness and unhappiness, pain, grief etc., as most of these sanyaasis identify themselves as the yogi, sanyasi, they became and material empire so created ignoring the spiritual empire they are expected to rule.

If individuals have self-consciousness same and similar as house-holders and related bonds, happenings and like them, the sanyaasis, yogis,ammas and fake religious and spiritual gurus replace the house-holder identity with the yogi, guru, amma, baba, identities. The real identity of I is Unoccupied - by cognitions, experiences, feelings, thoughts, utterances, communications, through mind, sense and action organs - Awareness.

Merely changing the name or attire will not and cannot make one the real Self. Only ignoring the mental functions - renouncing the active and dynamic mental worldly happenings during wakeful and dream conscious states and remain as unaffected seer to them - makes one the real Seer and Self.
Renouncing the world means - consciously cultivating this ability to remain an unaffected witness - during the midst of happenings in the physical world and related mental impressions created in the brain and its activity as jagat - because of falsely getting identified with these, with ego and outside physical world. It has nothing to do with one becoming a sanyasi or like changing name and attire and appearance.

That is becoming an aananda, a swami, teertha, saraswati, bharati, bapu, baba, amma, or any such spiritual beings will not automatically make one renouncing the world by not merely getting married and having a family; because samsara means not getting married and having a family but having sukha dukhaanubhavam - impressions in the brain by identifying oneself as this or that - householder or sanyasi - and be happy or grieve accordingly when one's vasanas (cognition-related experiences or genetically present urges or cravings) are activated.

A householder is the Real I - the Self - the Atman or Brahman - when one ignores the mental happenings and steadfastly riveted to one's real Identity - the Unoccupied Awareness - Pure Consciousness - Content-free Contentment.

This is the actual utterance of the Upanishads when they they say renunciation of the world.

Isaavasyam idam sarvam
yat kim cha jatyam jagat
tena tyaktena bunjeethaah
maa grudha kasatviddhanam

samasta mangalaani bhavantu!
etat sarvam sree parameswaraarpanamasteu!

Sunday, April 9, 2017

Indian citizens; మానసిక రుగ్మత; The meaning of success; Indian journalism



Indian citizens lack in emotional integration. That is why third rate politicians who cater to their narrow-minded feelings, prejudices, ego, arrogance, foolishness, get votes and fool every body arrogantly.
 

Very good and well-contemplated observation is most Indians are frogs in a well. Most politicians and citizens do not travel beyond and know 100 km beyond their place of living. Touring whole of India by the time one finishes secondary schooling must be made compulsory in education system.
Then the boys and girls know and understand the unity in diversity and appreciate Indian thought, culture and civilization and will not fall prey to divisive leaders and think beyond their limited geography, culture and social practices. 

Present privatization of education further demoralized education system and reduced education to the level of merely aspiring to get a seat and a job faring well in respective competitive examinations​. Stress on and use of overall exposure of students to arts, culture, civilizations, literature, fine arts must be emphasized and made to be implemented in schools. But unfortunately there is a danger of parents themselves opposing such a reform fearing their wards will be rendered unemployable by all these "unnecessary" diversions.

Education has lost its true meaning and benevolence under present misplaced stress on equating education as mere per-requisite and rote learning before getting a job.

Thus the nation is suffering from the idiotic persons in every field, politics, intellectuals, litterateur, creative people from entertainment and media. Most of them lack in minimum language efficiency, minimum general knowledge, common sense, empathy, compassion, willingness to accommodate dissent, imagining beautifully, possession of idea of diversity in India and its colorful combination.
Citizens can only be educated through schools. But unfortunately the spirit of schools and imparting education in all its hues is missing in Indian education system of the day.

 **********

ద్వేషము, విద్వేషం రంగరించి రాసిన కవితలు, రచనలు​ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు దురదృష్ట పరాకాష్ట. వీరందరూ ఒక విధమైన మానసిక రుగ్మతకు లోనైనవారు. సనాతన ధర్మం, హిందూ మతం, అగ్ర కులాలను​ మాత్రమే ఉద్దేశించిన ఈ దాడి వీరి పిరికితనాన్ని సూచిస్తుంది. త్రిపుల్ తలాక్ తో కష్టపడుతున్న తోటి స్త్రీలు వీరికి ఆనరు. ఆనతారు కాని ఈ పిరికి వాళ్ళకి భయం, వాళ్ళ గురించి మాట్లాడితే ప్రాణం ఎక్కడ తీసేస్తారో అని.

ఏ ప్రభుత్వాలు ఈ విషయాలను రకరకాల కారణాల వల్ల, భయాలవల్ల‌ పట్టించుకోవు. సనాతన ధర్మము, ఎక్కువ మంది హిందువులు, అగ్రకులాల వారు, రకరకాల కారణాల వల్ల హింసా ద్వేషులు, అశాంతి అంటే గిట్టని వారు. అందుకే ఈ సంస్కార రహిత దుండగీడు సాహితీవేత్తలు. కవుల, రచయితల, కుహనా మేధావుల ఆటలు, ఆగడాలు పెరిగిపోయాయి. చెల్లుతున్నాయి.
********
The meaning of success

 The meaning of success varies from individual to individual. For some earning lots of money, property and the like material possessions is achieving success.
For some attaining scholarship and be learned is success.
For some becoming rulers and enjoying authority without responsibility is success.
But for very few spending their lives in the service of parents, near and dear and if possible fellow human beings, life-systems and take care of environment is success.
Success varies from individual to individual and from nation to nation.


*************

Indian Journalism
 
Indian media is biased for or against certain ideologies, individuals, faiths and also lack in objectivity in reporting news. They color news, hide facts to suit their likes and dislikes; and are more a paid reporters than independent an dignified news personnel.

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మూడవ, నాలుగవ భాగములు

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మూడవ భాగము

కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భారత దేశం లోని ఎక్కువ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు సర్వ మానవ సమానత్వం, సర్వ మత సహిష్ణుత ఉగ్గు పాలతో రంగరించి పోస్తారు. దుర్మార్గులైన, మూఢులైన ప్రభువులు, పాదుషాలు, సుల్తానులు, ఓట్లకోసం కక్కుర్తి పడే రాజకీయ నాయకులు ఈ వాతావరణాన్ని కలుషితం చేశారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు. కాని సామాన్యులకు ఈ మూర్ఖత్వం, తీవ్ర వాదం అంటవు. ఈ పౌరులవల్లే భారత దేశం ఇంకా మనగలుగుతోంది. భారత దేశ పౌరులు శాంతి కాముకులు. వారు తమ మతాన్ని అనుసరిస్తూ, ఇతర మతాలను గౌరవిస్తూ జీవిస్తారు.

ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని సామాన్య ప్రజలు తాము జీవిస్తున్నారు. తమ తోటి వారిని జీవించనిస్తున్నారు. రాజకీయ నాయకుల; మత, కుల, ప్రాంతీయ, స్త్రీ, దళిత వాద మూర్ఖ శక్తుల, వీటిలోని తీవ్రవాదుల దారుణాలకు తట్టుకుని సర్వ మానవ సమానత్వ జెండాని సంయమనంతో వ్యవహరించి
ఎగరేస్తున్నారు.

ఆ సంస్కృతి, సాంప్రదాయాల నుంచి వచ్చిన నాకు ఈ సర్వ మానవ సమానత్వ దృష్టి, సర్వ మత సహిష్ణుత చిన్నప్పటి నుంచే అలవడ్డాయి. మా ఇంట్లోనూ ఈ నాగరికత పరిఢవిల్లేది. పరిఢవిల్లుతోంది. పరిఢవిల్లుతూనే
ఉంటుంది. అందుకని నాకు జైన దేవాలయ సందర్శనం విష్ణు, శివాలయ సందర్శనం​లాగే ఉంటుంది. మా ఆవిడకి, పిల్లలకూ అంతే. కోడళ్ళకు అంతే. మనవలు, మనుమరాండ్రకు అంతే.
దానితోపాటు మేము స్మార్తులము. మాకు శివ, కేశవ అభేదము. అందరు దేవుళ్ళని, దేవతలని, దైవాల్ని
సమానంగా అర్చిస్తాము. ప్రార్ధిస్తాము. తలుస్తాము. అన్ని దేవాలయాలని సమాన భక్తి శ్రద్ధలతో దర్శిస్తాము. అలా ఇతర మతాలను గౌరవిస్తూ ఆ యా ఆలయ సందర్శనం చేస్తూంటాము.

తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో వైష్ణవ శైవ బౌద్ధ జైన చార్వాక మతాలు, వాటి మతస్థులు ఉండేవారు. అందుకే రాజరాజనరేంద్రుడు సనాతన ధర్మం వైపు మొగ్గినా, ఆయన తండ్రి విమలాదిత్యుడు తన జీవిత చరమాంకంలో జైనం స్వీకరించేంతగా జైనం ప్రాబల్యం ఉంది. రాజరాజనరేంద్రుని కులగురువు, పురోహితుడు,
ఆస్థాన కవి నన్నయ భట్టారకుడు మహాభారతాన్ని సనాతన ధర్మం ప్రకారం, సనాతన ధర్మప్రచారం కోసం ఆంధ్రీకరించినా, కన్నడ కవి త్రయములోని రన్న మహాభారతాన్ని భీముని నాయకుని చేసి జైనధర్మాన్ని చొప్పించి కన్నడ భాషలోకి అనువదించాడు. అప్పటి కన్నడ ప్రభువులు జైన ధర్మాన్ని రాజధర్మం చేసి పాలించేవారు.
అదే సమయంలో రాజస్తాన్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలలో ఎన్నో జైన కట్టడాలు వెలిశాయి. ముందే చెప్పినట్టు శ్రావణ బెళగొళ లోని బాహుబలి దిగంబర విగ్రహం దాని చుట్టూ ఆలయాలు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దిలోనే నిర్మించబడ్డాయి. జైనం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు వెలసినది పాలీతానా ఆదినాథుని జైనాలయం అనుకోవచ్చు.

జైనులు మాత్రం దీన్ని ఎంతో పురాతన కట్టడంగా భావిస్తారు.
మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - నాలుగవ భాగము

భావనగర్ వద్ద సముద్రంలోని శివ లింగ దర్శనం

శివరూపాత్ జ్ఞానమహః త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖి రూపాదైశ్వర్యం భవతశ్చ ఆరోగ్యమిచ్ఛామి.

ఇది సాంబ కృత ఆదిత్య స్తోత్రములోని ఒక శ్లోకం.

భక్తులు పరమశివుని జ్ఞానం కోసం, శ్రీమన్నారాయణుని ముక్తి కోసం, సుబ్రహ్మణ్య స్వామిని (అగ్నిదేవుని అని కొందరంటారు), సూర్యనారాయణ మూర్తి ని ఆరోగ్యం కోసం ప్రార్ధించాలి అని పెద్దల మాట.

పరమశివుడు భక్తజనకింకరుడు. భోళా దేవుడు. ఆడంబర రహితుడు.

ప్రణమామి శంకరం భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరం పార్వతీ సహచరమ్

అని స్తుతిస్తే ఎంతో పొంగిపోతాడు.

మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే
గండూషాంబ నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిత్ భక్షిత మాంస శేష కవలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్ అహో! వనచరో భక్తావతంసాయతే
 
శివానందలహరిలో శంకరుల ఆశ్చర్యం ఇది. నమ్మకం కూడాను.

భక్తి ఉంటే నడకకి ఉపయోగించే చెప్పు శివ నిర్మాల్యం తీసే కూర్చ (ఊడ్చేది) అవుతుంది. పుక్కిట పట్టి నోటితో ఎంగిలి
చేసిన లాలాజలము అభిషేక జలం అవుతుంది. కొంత కొరికిన మాంసపు ముక్క నైవేద్యం అవుతుంది. భక్తి చేయలేనిది ఏముంది? చెంచువాడిని భక్తవతంసుని చేస్తుంది.

చల్లని కొండ కైలాసము మీ నివాసము
చల్లని తల్లి హైమవతి మీ సగ భాగము
చల్లని రాజు చంద్రుడు, చల్లని నీటిని వహించు
పావని గంగా భవాని మీ శిరసున సహవాసులు
చల్లని చూపుల మమ్ము చల్లగ చూచు
చల్లని దేవులు మీరు శంకరా!

ఇటువంటి చల్లని దేవులు

రామ నామము జపియించుచు మీరు తల్లి పార్వతి తోడు కాగ
పాలింతురు సకల జగముల; ఆపన్నుల కాచుట ఆనంద తాండవము
మీకు; భోళా శంకరులు మీరు; ఎల్ల వేళల యందు మమ్ము
కరుణ చూచు మిమ్ము హృదయమున పూజింతు శంకరా!

ఇలా మనలను కాస్తూ ఉంటారు. ఆయన విగ్రహ సహితులు. విగ్రహ రహితులూను. నిరాకారమైన లింగ స్వరూపం ధరించి నిర్గుణ తత్త్వాన్నీ తెలియజేస్తారు.

పరమేశ్వరుడు జ్ఞాన కల్పవృక్షము. నాయనమారుల పట్ల ప్రేమాస్పదుడై ఉండి వారితో ఆడుకుంటూ వారికి
శివసాయుజ్యము నొసగిన కామధేనువు.

మేము భావనగర్ లోని మా అబ్బాయి బుక్ చేసిన Gen X హోటల్లో దిగాము. హోటల్ బాగుంది. ఆతిథ్యం, ఫుడ్ ఎంతో బాగున్నాయి. ప్రొద్దుట పదిగంటలకు భావనగర్ పర స్టేషన్లతో దిగాము. భావనగర్ టెర్మినస్ అని మరొక స్టేషనూ ఉంది. రెండూ ఊరికి దగ్గరే. కాకినాడలో లాగ కాకినాడ టౌన్, ఊర్లోను, పోర్ట్ స్టేషన్ ఊరిచివర లా ఉంటాయమో అనుకుని, పర స్టేషన్ కి రిజర్వ్ చేశాను. భావనగర్ టెర్మినస్ కే చేయించుకోవాలి.

హోటల్లో రిఫ్రెష్ అయిన వెంటనే మధ్యాహ్నం ఎండగా ఉన్నా, అక్కడికి​ 27 కిమీ దూరంలో ఉన్న సముద్రంలో శివలింగాన్ని చూడటానికి టాక్సీలో బయలుదేరాము.

అది ఫక్తు పల్లెటూరు. బీచ్ లేదు దగ్గర ఉండే షాపులు ఉన్నాయి. ఒడ్డునుంచి ఒకటిన్నర కిలోమీటర్ రెండు అడుగులు వెడల్పు కలిగిన నీటిజాలులో నడవాలి. మోకాళ్ళ దాకా నీళ్ళు రావు. కింద బురదగా ఉంటుంది కానీ కాళ్ళకు ఇసక తగులుతూ నడవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక పేద్ద సిమెంట్ చప్టా మీద ఐదు శివలింగాలు ఉన్నాయి. మూడు పాత లింగాలు. రెండు కొత్తవి. ఈ ఐదు పాండవులచేత ప్రతిష్టింపబడ్డాయని ఐతిహ్యం.

ఇద్దరు పూజారులు ఉన్నారు. ఇంకే కట్టడాలు లేవు. సముద్రం ఆటులో ఉండడం వల్ల దూరంగా ఎక్కడో ఉంది.
నేను ఇంకా రమ్యంగా ఊహించుకున్నాను. దృశ్యం అంత రమ్యంగా లేదు. కొద్దిగా నిస్పృహ చెందాను.
సాయంత్రం 3 గంటల నుంచి పోటు మొదలై ఆ ప్రదేశమంతా సముద్రంలో మునిగి పోతుంది. మేము అప్పటి దాకా ఉండలేదు.

సముద్రపు గాలి చల్లగా ఉండడం వల్ల ఎండగా ఉన్నా వేడి తెలియలేదు. అలా అక్కడ ఒక గంట సేదదీరాక వెనక్కి భావనగర్ బయలుదేరాము. అక్కడ మా ఆవిడ ఫేవరెట్ అయిన చెఱకు రసం తాగాము. బాగుంది.
హోటల్ కి చేరి విశ్రాంతి తీసుకున్నాము. మరునాడు పాలీతానా సందర్శించి వద్దామని అనుకున్నాము.

Thursday, April 6, 2017

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మొదటి రెండు భాగములు

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర

కాకినాడ-భావనగర్ వారానికోసారి వెళ్లే రైలు వేసినప్పటి నుంచీ నాకు ఆ రైలు మీద భావనగర్ వెళ్లి రావాలనే కోరిక ఉదయించింది. ఎందుకో తెలియదు. అది అంతే. నాకు ఇలాంటి కోరికలే కలుగుతాయి. ఇతరులకు నవ్వు పుట్టించ
వచ్చు. చిన్నప్పటి నుంచి నాకు రైలు ప్రయాణం, రైళ్ళను గురించి తెలుసుకోవడం ఇష్టం.

మా నాన్నగారు మలకపల్లి, వేగేశ్వరపురం లలో పనిచేస్తున్నప్పుడు బస్ మీద నిడదవోలు వచ్చి మా ఊరు భీమవరం వెళ్ళడానికి రైలు ఎక్కేవాళ్ళం. అప్పుడు అన్నీ పాసింజర్ రైళ్ళు. క్వార్టర్లీ, హాఫియర్లీ, వేసంకాలం శలవలకు భీమవరం వచ్చి శలవలు గడిపి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అలా ప్రతి శలవలకు భీమవరం వచ్చి రోజూ ఓ సినిమా చూసినట్టు చూసే వాళ్ళం. ఎనిమిది టాకీసులుండేవి.

ఆ ప్రయాణాల్లో రైళ్ళ మీద ఆసక్తి కలిగింది. మా నాన్నగారు రైలు టైం టేబిల్ కొనేవారు. దాన్ని నేను బట్టీ పెట్టేవాడిని అంటే అతిశయోక్తి కాదు. ఏ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుంది, ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది, ఆ స్టేషన్ల గురించి చదివేవాడిని. అప్పుడు ప్రతి స్టేషన్ పేరు పక్కన కొన్ని గుర్తులు పెట్టేవారు. ఆ స్టేషన్లో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి ఆ గుర్తులు తెలిపేవి. త్రిభుజం ఉంటే కూలింగ్ వాటర్ దొరుకుతుందని, చతురస్రం ఉంటే రిటైరింగ్ రూమ్లు
ఉన్నాయని (సరిగ్గా జ్ఞాపకం లేదు), bk అని ఉంటే బుక్ స్టాల్ ఉందని, శాఖాహార, మాంసాహార భోజనశాలలకు
మరియొక గుర్తు, జం. అంటే జంక్షన్ ఇలా ప్రతి స్టేషన్ వివరం ఉండేది. అవన్నీ చదివి గుర్తు పెట్టుకునే వాణ్ణి.
అలా నా రైల్వే పరిజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించింది​.

ఇంతకీ మేము భావనగర్ ఆ రైలులో వెళ్లలేదు. బొంబాయి నుంచి బాంద్రా టెర్మినస్-భావనగర్ టెర్మినస్ రైలులో వెళ్ళాము. మా అబ్బాయి బొంబాయిలో ఉంటాడు. వాడే మంచి హోటల్లో రెండు రోజులకి రూమ్ బుక్ చేశాడు. మేము సోమనాథ్ వెళ్లినప్పుడు లాగే నేను ఆన్ లైన్ లో రానూ పోనూ టిక్కెట్లు నాకు, మా ఆవిడకి​ బుక్ చేసికున్నాను. ఈమధ్య నేను నేర్చుకున్న విద్య ఇది.

మా భీమవరానికి రెండు కిలోమీటర్లలో పెదమిరం అనే ఊరు ఉంది. అక్కడ మొదటి జైన తీర్థంకరులైన ఆదినాథుని ఆలయం ఉంది. అక్కడికి​అప్పుడప్పుడు వెళుతూ ఉంటాము. ఆ వెళ్ళడాలలో భావనగర్ కి 60 కిలోమీటర్ల దూరంలో పాలీతానా అనే ప్రదేశంలో ఆదినాథుని జైన మందిరం ఉందని తెలిసింది. దానిని చూడాలనిపించింది. మొన్న సోమనాథ్ వెళుతున్నప్పుడు తోటి ప్రయాణీకుల మాటల్లో భావనగర్ పక్కనే అరేబియా సముద్ర తీరంలో ఒక శివాలయం ఉందని అది సముద్రం ఆటుపోట్లకు కనిపించి, మళ్ళీ సముద్రంలో మునిగిపోతుందని విన్నాము. ఇవి చూడటానికి బొంబాయి నుంచి భావనగర్ బయలుదేరాము.


భారత దేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. మరెన్నో మతాలకు మెట్టినిల్లు. ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ, జైన, చార్వాక, వైష్ణవ, శైవ, వీర వైష్ణవ, వీర శైవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, సుబ్రహ్మణ్య మతములుగ పరిణమించి, పరిఢవిల్లిన తత్త్వమయ సమన్వయ, సామరస్య భూమి భారత దేశం. జొరాష్ట్రియన్ -పార్శీ, ఇస్లాం, క్రైస్తవ, యూదు మతములకు మెట్టినిల్లు.

మతం మత్తుమందని ఉద్ఘాటించి, తానే ఒక మతంగా మారిపోయిన కమ్యూనిజము, నక్సలిజం, రేషనలిజము, దళిత, స్త్రీవాద, వెనుకబడిన కులాల,జాతుల,వర్గవాద, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్, ఇలా సాంఘిక విప్లవకారులకు, మరెన్నో కుల, జాతి, వర్గ, ప్రాంతీయ వాదముల భూయిష్ఠమైన నాస్తికత్వము, కొండొకచో అస్తిత్వములకు, ఇలాగే ఎన్నెన్నో మతాలకు, ఇజాలకు, వర్గ వాదాలకూ నిలయం భారతదేశం.

భారతీయ తత్త్వ జ్ఞానము, సంస్కృతి ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ జైన చార్వాక వైష్ణవ శైవ వీర వైష్ణవ వీర శైవ శాక్తేయ సౌర గాణాపత్య సుబ్రహ్మణ్య మతములుగ, పైన నుడివిన ఆస్తిక, నాస్తిక వాదములుగ పరిణమించి, సాంఘిక సంక్షేమ కాంక్షులైన విప్లవకారులకు, కవులకు, రచయితలకు, వివిధ లలితకళా నిపుణులకు ఆలవాలమైంది.
 
క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుంచి ఇప్పటి దాకా ఈ అన్ని వైరుధ్యభూయిష్ఠమైన తత్త్వాలు, మతాలు, వాదాలు, విప్లవాలు పరస్పరం సహకరించుకుంటూ, కలహించు కుంటూ భారతదేశంలో సహజీవనం చేస్తున్నాయి, వివాహం బంధంలో ఇరుక్కుపోయిన భార్యాభర్తల్లా, ఇష్టం లేకపోయినా, కష్టమైనా.

ఉపనిషత్తుల కాలం నుంచి నేటిదాకా పయనించిన భారతీయుల నాగరికత సంస్కృతి, భారతీయుల జీవితం, జీవన విధానం ఎన్నో ఒడిదుడుకులకి, మార్పులకు లోనయ్యాయి. ఏ ప్రభువుకు ఏ మతం, తత్త్వం, సంస్కృతి ఇష్టమైతే వాటికి ఆలంబన లభించింది. ఇతర మతాలు, తత్త్వాలు, సంస్కృతులు ప్రజాబలంతో నిలిచే ఉన్నాయి. దానికి తోడు ప్రభువులు తామే మతాన్ని, తత్త్వాన్ని అభిమానించి, ఆదరించినా, వీలైనంత వరకు సర్వమత సమానత్వాన్నిఆదరించారు. రాజకీయంగా, ఇతర కారణాల వల్ల ఇలా జరిగింది.

తూర్పుచాళుక్యులను చోళులు ఓడించినా, అప్పటి రాజనీతి ప్రకారం సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. అలా రాజరాజచోళుడు తూర్పు చాళుక్య వేంగీ రాజైన విమలాదిత్యునికి తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకే రాజరాజనరేంద్రుడు జన్మించాడు. చోళులు హిందూ మతావలంబులు. కానీ అప్పటికీ, అప్పటికే భారత దేశం అంతటా బౌద్ధ జైనాలు వ్యాపించి ఉన్నాయి. వాటి ఆరామాలూ ఎన్నో చోట్ల ఉన్నాయి. ప్రజల్లోనూ ఆ మతావలంబకులున్నారు. అవీ సజీవంగానే ఉన్నాయి.

తూర్పు పశ్చిమ కోస్తాలలో అప్పటికే నిర్మించబడిన ఆరామాలలో ఆ మతాలు తమ తమ మతానుసరణం, వ్యాప్తిలలో అగ్రగణ్యంగానే ఉన్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాలలో బౌద్ధ జైనాలు పరిఢవల్లాయి. ఎన్నో ఆలయాలు, ఆరామాలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రముఖమైనది పాలీతానా దగ్గరి ఆదినాథుని జైనాలయం.

ఆదినాథునికి ఆలయములు అరుదు.
 
కర్ణాటక లోని శ్రావణ బెళగొళ లోని బాహుబలి దిగంబర విగ్రహం ఎంతో ఎత్తైనదీ, శిల్పకళా చమత్కృతిలో ఎన్నికైనది. శ్రావణ బెళగొళ దర్శనీయ స్థలాల్లో ​ఒకటి. శ్రావణ బెళగొళ (జైనాలయం), హళేబీడు (శివాలయం), బేలూరు (వైష్ణవాలయం) కర్ణాటకలో హసన్ దగ్గర పక్క పక్కనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో నేను వీటిని దర్శించాను. ఎంతో ఆనందించాను కూడా.
 
తమిళ నాట చోళుల ప్రాబల్యం, ప్రాభవం ఉన్న సమయంలోనే కడలూరు - పాండిచ్చేరి పక్కనే- లో శ్రమణ మఠములుండేవి. జైనులను శ్రమణులనీ అంటారు.