Monday, August 22, 2016

మనసు సౌందర్యం

మనసు సౌందర్యం

మాట మనసు యొక్క శబ్ద స్వరూపము.

తలపు మనసు యొక్క గతి.

అనుభవము మనసు యొక్క స్థితి.

ఆనందము మనసు యొక్క లీనత.


శాంతి మనసు యొక్క నిద్ర.


మౌనము మనసు యొక్క నిశ్శబ్దము.


నిర్మలమైన మనసే ఆత్మ.


అదే బ్రహ్మము.


మనసు యొక్క విరామ సమయమే ఆత్మారామ సమయము.


మనసు ఆత్మ ఒకటవడమే అద్వైతము.


రెండుగా ఉండి వివిధ మానసిక కార్య కలాపములను నిర్వహించే స్థితే ద్వైత స్థితి.


ద్వైతాద్వైతస్థితుల ఏక సమయ వర్తనమే మన మనసు పనిచేయడము.


"మనః ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయో"

మనసే బంధములని కలిగిస్తుంది. మనసే వాటిని తొలగించుకుని ఆత్మగా మారుతుంది.

అటువంటి మనసుకు నమస్కారము. మనసు లేక రమణీయత లేదు. రాసిక్యము లేదు. ప్రేమ లేదు. భక్తీ లేదు.
.
బాధ, వ్యథలు కూడా మనసు కల్పితములే అనుకోండి.

అయినా అన్ని జ్ఞానముల, కళల, పనితనముల ను నేర్వడము, నేర్పడము మనసు లేక జరుగవు.

కాబట్టి మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే అని పాడుకుంటూ మనసు పాడు చేసుకోక, మనసే అందాల

బృందావనం అని పాడు కుందాము.

మానసేశ్వర్యై నమః.

Sunday, August 21, 2016

ప్రకృతి రామణీయకము - మనసు గానము, నర్తనము - పరమాత్మానుభవము





ప్రకృతి రామణీయకము - మనసు గానము, నర్తనము - పరమాత్మానుభవము


ఎదురుగా లోయలో వయ్యారములు చిందించుచున్న
కృష్ణవేణీ జన్మస్థాన సౌందర్యములు, సరసీ తారుణ్యములు
నింపినవి మనసున ఆనందము, మౌనము, శాంతము
అల్లరి పిల్ల మనసు ప్రౌఢయై తనివిచెంది పొందినది బ్రహ్మానుభవము


కొండలు, లోయలు, కృష్ణను, కనుచున్న నాకు చలివేయని చల్లనిగాలి
సోకుచు మనమును ఊయలలూపినది ఆ రామణీయకము; హత్తుకన్నది
హృదయమున; డెందము చేసినది ఆనందపు నర్తనము; పరమాత్మయే
దర్శనమొసగి దగ్గరకు తీసికొన్న అనుభూతి మనసున నిండి, ధన్యత
కలిగి మైమరచితిని; ప్రకృతి భగవత్ స్వరూపము, రమణీయ కావ్యము,
శాంతి సంతోషములనిచ్చు భగవతీ అనుకంపన, అనురాగము

గానము చేసినది మనసు ఆ దృశ్యముల "శ్రావ్యతను"
విరామమునంది అనుభవింపజేసినది రామ తత్త్వమును

స్నానమాచరించితిని కృష్ణానదీ సుందరదృశ్య సలిలములందు
ప్రేయసీ వంటి ప్రకృతిలో లీనమై పరవశించితిని నిర్వాణమునందితిని

Thursday, August 18, 2016

వృత్తి - నివృత్తి- యోగ దర్శనము

వృత్తి - నివృత్తి

వృత్తి పదము యోగశాస్త్రమునకు సంబంధించిన పదము.

మనందరకు పరిచయమైనదే.

యోగః చిత్తవృత్తి నిరోధః - అని ప్రసిద్ధమైన పతంజలి యోగసూత్రము. ప్రస్తుతము "యోగా" అనే పదనిర్దేశనతో
యోగము ఖండ ఖండాంతరములకు ప్రాకింది. మన కేంద్ర ప్రభుత్వమైతే "యోగా" కి పెద్దపీట వేసి ఎంతో ప్రచారము నిర్వహిస్తోంది. ఎందరమో యోగా కి అతుక్కుపోయేము కూడా. "యోగా" హిందూమతానికి సంబంధించినదని ఎందరో దానిని దూరంగా ఉంచుతున్నారు. ఎవరి అవగాహన వారిది. "పుఱ్ఱెకో బుద్ది జిహ్వకో రుచి" కదా.
ఎందరో కొన్ని ఆసనములు వేసి వ్యాయామము చేసి యోగా అయిపోయిందనిపిస్తున్నారు. నిజానికి యోగము వేరు, ఇప్పుడు ప్రాచుర్యములో ఉన్న యోగా వేరు.

యోగమునకు రెండు అంగములు. భౌతికము, మానసికము. భౌతికంగా యోగా చేసేసి ఫలితముల కోసం
ఎదురు చూస్తున్నాము.

మానసిక అంగమును తెలుసుకొని, అవగాహనకు తెచ్చుకొని ఆచరిస్తే తప్ప యోగము పూర్తి ఫలితములు
మనకు అందవు.

పతంజలి యోగసూత్రములలో ఈ మానసిక క్రమము చాలా విశదముగా చర్చించబడినది. అది ముందర మనసుకు ఎక్కితేనేకాని యోగాచరణము వృథా కాలయాపనము.

మనకు పెద్దల ద్వారా జ్ఞాన, కర్మ, భక్తి యోగములు అందాయి. వాటి మీమాంసలో, తర్జన భర్జనలలో చాలామంది సమయము గడుపుతారు. మనసు పాడు చేసుకుంటారు. యోగగమ్యమైన నిర్మల మానసిక స్థితిని
పొందలేరు. ఈ మూడూ ఒకటే. వాటి గమ్యము, ఫలితము ఒకటే. మన మానసిక ప్రవృత్తిని బట్టి మనకు ఒక యోగము నచ్చుతుందంతే. ఒక యోగము ఇంకో యోగము కంటే తక్కువ, ఎక్కువ అని ఏమీ లేదు.
మనకు షడ్దర్శనములున్నాయి. న్యాయవైశేషికములు ఒక జట్టు. ఇవి అణు సిద్దాంతాన్ని ప్రతిపాదించాయి. సాంఖ్యయోగములది మరియొక జట్టు. ఇవి ప్రకృతీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస (వేదాంతము) లది ఒక జట్టు. ఈ జంటలన్నిటికీ సూత్రములున్నాయి.

ఆ సూత్ర వ్యాఖ్యానముల ద్వారా ఆయా దర్శనములు ప్రచారము లోనికి తేబడినాయి. ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల ప్రభావము షడ్దర్శనముల పుట్టుక, పరిణామములపై ఉంది. షడ్దర్శనములు, ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వములు చెప్పిన వాటిని పరిశీలించి; అంగీకరించి, నిరాకరించి, పరిహరించి, ఉంచి పరిణమించాయి. పరస్పర అవగాహన ఈ పరిణామములకు ఊతం ఇచ్చింది.

ఉపనిషత్తుల నుంచి బౌద్ధజైనతత్త్వముల ద్వారా, షడ్దర్శనముల తోడ్పాటుతో ఎదిగిన భారతీయ తత్త్వ శాస్త్రము ఆత్మజ్ఞాన గంగా కూలంకష.
(All these schools of thought have contributed to Indian spirituality by being both supplementary and complementary. Thus all these schools of thought must be given equal respect. Fighting over them and their superiority or inferiority is childish. They all together define and make Indian intellect, intuition, aesthetics and scholarship.)

మన వృత్తి దగ్గరకు వద్దాము.

మానవుని మానసిక కార్యకలాపములను జ్ఞానేంద్రియములు, అంతఃకరణములు, కర్మేంద్రియములు కలిసి నిర్వహిస్తాయి. ఇది సాంఖ్య నిర్వచనము. ఇందులో 24 భాగములు ఉంటాయి.

ఈ మానసిక కార్యక్రమమును చిత్తవృత్తి అంటుంది యోగము.

వృత్తి అంటే అంతఃకరణ పరిణామములు. మనోబుద్ధ్యహంకారచిత్తముల పరిణామములు. ఇవి ఒక దిశలో (పురోధాన) జరుగుతే మనం గ్రహిస్తాము. వ్యతిరేక దిశలో (తిరోధాన) జరుగుతే మనం అంతఃకరణములు, కర్మేంద్రియములద్వారా చేష్టిస్తాము. ప్రతిచర్యలు జరుపుతాము.

అన్నిరకముల జ్ఞాన సముపార్జనము జ్ఞానేంద్రియముల ద్వారా మొదలై, అంతఃకరణముల మాధ్యమమున భావగతి, అనుభవ, అర్థ స్థితి నొంది తాత్పర్యము గా, తత్పరత‌ గా నిలుస్తుంది, వికసిస్తుంది. ఇదే మరల మన ప్రతిచర్యలను జరిపిస్తుంది.

అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తముల ద్వారా వృత్తి ఈ రెండు దిశల మానసిక కార్యకలాపములలోను ఏర్పడుతుంది.

మానవుని మానసిక శక్తి - అణుజనితమని న్యాయవైశేషికములు, మాయాజనితము, రెండు దిశల పరిణామ సహితము అని అద్వైత వేదాంతము, ప్రకృతీజనితము, భరితము అని సాంఖ్యయోగములు చెబుతాయి. దేని వల్ల జనించినా మనిషికి మానసిక శక్తి కలదు.

ఈ మానసిక శక్తి పరిణమిస్తే (పురోధాన మైనా, తిరోధాన మైనా) చిత్తవృత్తి ఏర్పడుతుంది.

ఈ చిత్తవృత్తిని నిరోధించడమే యోగమని పతంజలి యోగసూత్రములలో నిబద్ధమై ఉంది.

చిత్తవృత్తి నిరోధము చాలారకాలుగా చేసుకోవచ్చు- భక్తి, జ్ఞాన, కర్మ యోగముల ద్వారా. యోగాచరణము మన ఇష్టము. మన తత్త్వాన్ని‌బట్టి ఈ యోగము వారు మనం ఆకర్షింపబడతాము. అంతే. ముందే చెప్పినట్టు యోగము లలో ఎక్కువ తక్కువలు లేవు.

వృత్తిని లేకుండా చేసికొనడమే నివృత్తి. దీనినే కొందరు నివృత్తి మార్గము అంటారు.

ఆదిశంకరులు శివానందలహరి లో భక్తి పరంగా ఇదే మాట చెబుతారు.

"చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే" - అన్నారు.

చిత్తవృత్తి అన్నా చేతోవృత్తి అన్నా ఒకటే. చిత్తవృత్తి నిరోధము అన్నా "చేతోవృత్తిరుపేత్య తిష్టతి" అన్నా ఒకటే.
అలాగే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధము జ్ఞాన మార్గమును అనుసరించే వారికి వారికి తెలిసీ, తెలియక చిత్తవృత్తి నిరోధము జరుగుతుంది.

నదీనాం సాగరో గతిః లా అన్ని మార్గములు, అన్ని యోగములు పరమాత్మానుసంధానము చేస్తాయి. ఇతరము పట్టించుకోక మన మార్గములో శ్రద్ధతో పయనించడమే ఆధ్యాత్మికత. ముముక్షత్వము.

ఇది తెలిసి నిశ్చింతగా మన అనుష్ఠానానములు మనం చేసికుంటే మనసు పరిణితి చెంది, పరిపక్వతనంది నిర్మల మానసము గా విరాజిల్లుతుంది.

ఏతత్సర్వమ్ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు!

Wednesday, August 17, 2016

మతముల మొండితనములు, మూర్ఖత్వములు; "బడాయిలు"

మతముల మొండితనములు, మూర్ఖత్వములు

భగవంతుడెంతో భక్తుడూ అంతే కొన్ని మతములలో
భగవంతుని కన్న భక్తుడే మిన్న మరి కొన్ని మతములలో
భక్తుడెప్పుడూ భగవంతుని తో సమము కాడు, వేరే,
మరి కొన్ని మతములలో; ఇంతకూ ఏది నిజం? ఏమో!


విష్ణువు మాత్రమే దేవుడని వైష్ణవులు
శివుడు మాత్రమే దేవుడని శైవులు
అమ్మ వారు మాత్రమే దేవతని శాక్తేయులు
దేవుళ్ళు దేవతలు ఎవరూ లేరని విమతానుయాయులు

విదేశముల నుంచి దిగుమతైన మతముల
దేవుళ్ళు వేరే; కొందరు ఆకారులు, మరి కొందరు
నిరాకారులు; వారు మాత్రమే దేవుళ్ళని వారి వారి
వాదన; వివిధ మతముల వారి దైవారాధన క్రమములు

వేరు; పద్ధతులు వేరు; ప్రార్ధనా విధానము వేరు; ఎవరి
మట్టుకు వారే మొండివారు; ఇతరమేమీ వినని మూర్ఖము
సంఘంలో ఇంత గందరగోళము, రభస, గొడవ అంతా దేవుని
గురించే! ఆయన పేరు, రూపముల గురించే వాదనలు,

పట్టుదలలు; విననిచో నరకుటలు, మారణ
హోమం సృష్టించుటలు! అంతా మత మూఢత్వము;
మతమును నిర్వచించుటకు పదములే కరువు;
ఆలోచించే కొద్ది మనసులు బరువు; సుఖశాంతులు

శూన్యము; నిర్మల మానసమే దైవమని, మనశ్శాంతియే
మతము పరమార్ధమని, దివ్యుని అందరూ తమలోనే
కాంచవచ్చను మాటలు హితములు కావు; అటుల
చెప్పేవారు హితులు కారు; అంతయు మిథ్య, మాయ,

గోలగా పరిఢవిల్లుచున్నది‌ మతానుసరణము; నరుల
దివ్యుల చేయవలసిన మతములు వారిని రాక్షసులుగ,
మూర్ఖులుగ, మొండివారిగ, అనుకంపనారహితులుగ
మార్చుచున్నవి; మతమన్న ఇష్టమని, లోకో భిన్న‌ రుచిః

అని, ఇందు అందరకు స్వాతంత్ర్యము కలదని, ఒక్కడే
దేవుని తమ తమ దేవుళ్ళుగ పూజించవచ్చని, ప్రార్ధించ
వచ్చని ఎవరు చెప్పగలరు ఈ మూర్ఖులకు? తమ తమ
 మూఢత్వములతో అంతను, అంతా ఛిన్నాభిన్నం, ధ్వంసం

చేస్తున్నారని, చివరకు ఏ మతములు మిగలక, క్రూరత,
రాక్షసత్వములు ప్రపంచము నేలునని నచ్చచెప్పలేము;
అలా అని మన సుఖసంతోషములు, శాంతి,
ఆనందములను ఈ దుర్నీతులకు వదలలేము;
మేధావులందరూ ఈ మూఢత్వమునో, ఆ రాక్షసత్వమునో
వెనకేసుకొచ్చినన్నాళ్ళూ మన మనుగడ దుఃఖభరితము

 *******************

"బడాయిలు"

"స్వచ్ఛ భారత్" ఊపులో పౌరులు వీధులని, ఇతర ప్రదేశాలను శుభ్రం చేసే పనిని నెత్తినేసుకొంటే‌ అలా చేస్తూనే ఉండాలి. అంతటి సమయం, ఓపిక, నిరంతర ఉత్సాహము ఉన్నాయా, ఉంటాయా కూడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చెత్త రోజూ పోగు పడుతూంటుంది కదా! మరి శానిటరీ వర్కర్లు, తత్సంబంధ ఇతరులు ఏమి చేస్తారు?
ప్రభుత్వము వారు "స్వచ్ఛ భారత్" సెస్ కూడా విధించారు. ఆ ధనాన్ని ఎలా వినియోగిస్తారు? పేపర్లలో చదివినట్టు ప్రతినిధులు, మంత్రులు, వారి వారు ఈ సెస్ తో చెత్త సేకరించి, తీసికెళ్ళి, ఎక్కడో పడేసే పనిముట్టులు, వాహనముల కొనుగోళ్ళ కమీషన్ లలో మునిగి తేలుతూంటారా?
పౌరులు తమ తమ జీవితాలే జీవిస్తారా, ఉద్యోగాలే చేసుకుంటారా, ఇతర వ్యక్తిగత పనులే చూసుకుంటారా?
సంఘంలో లేని శాంతిభద్రతలకై కూడ ఉద్యమిస్తారా, రక్షకభటులై?
అలవిమాలిన బాధ్యతల నెత్తినేసుకొంటే‌ అలా వేసుకుంటూనే ఉండాలి. మరి ప్రభుత్వాలు ప్రజలకోసం ఏమి చేస్తాయి, ప్రతీదీ ప్రజలే చేసికుంటే?
ఆదర్శము, ఆవేశము వేరు, వాస్తవము వేరు. ప్రభుత్వ సంస్థలు చేయవలసినవి అనే చెయ్యాలి. మన వంతు సాయం, చెత్త ఇష్టంవచ్చినట్టు పడేయకుండా, శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా జీవించాలి. మన జీవితాలు జీవించడానికే మనకు తీరిక, ఓపిక, శక్తి యుక్తులు లేవు. అస్తవ్యస్త పాలనలలో మగ్గుతున్నాము.
ఇంగితము ఉపయోగించి జీవించాలి. తోటి వాళ్ళని జీవించనివ్వాలి.
స్వచ్ఛీకరణ నిరంతర బాధ్యత.
మనసునీ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనసు స్వచ్ఛత గురించీ‌ శ్రద్ధాసక్తులు ఉండాలి. మనసు స్వచ్ఛమైతే అన్ని స్వచ్ఛతలు అవే కలుగుతాయి.
ఫొటోలు దిగడం కోసం, చప్పట్లు కొట్టించుకోవడం కోసం, సంఘంలో వేలం వెఱ్ఱిని పంచుకోవడం కోసం జీవించలేము. ఈ ఊపులన్నీ తాత్కాలికములు. ప్రభుత్వాలు వాటి పని అవి చేసేలా చూస్తే పుణ్యము, పురుషార్ధము. మిగతావన్నీ బడాయిలు.
కుక్క పని గాడిద చేయరాదు. చేసినా ప్రయోజనముండదు.

Tuesday, August 16, 2016

Consciousness and Awareness of Time

Consciousness and Awareness of Time

A process taking place or happening is the physical reality. How long it happens is guided by relevant natural forces generated by size, charge, mass of matter and form of energy associated at that space range.

If outside monitoring of duration of that process taking is done it yields time. Time is created by processes and is the consequence of processes happening.

Time has no role in the initiation, on going or termination of a process. That aspect is taken care of by respective matter, energy forms interacting under the supervision of relevant natural forces.
Time is human concern and counting. Time is neither a physical reality or nor a controlling parameter. Time is simply measure of duration of energy transformation through matter or change of phase of matter by the aid of energy.

Passage of time is mental observation of processes, events, phenomenon taking place or happening in the universe. Time is neither absolute or relative.

Human concern of time has made its nature complex - real and imaginary. There is no passage of time. Past is human memory. Future is human anxiety, fear, imagination, apprehension.
Both past and future are thought forms in the present awareness which is a series of observation and lasts for one tenth of second at a time and changes thus continuously as an output wave form of an oscillator whose frequency is 10 Hz.

Time as a real parameter is duration of a process. Time as an imaginary parameter is past, present and future.

While a process is happening like our mental awareness - the result of psychic energy transformation - past, present and future imagined. And human mind tries to correlate these thought forms - generated by memory as past, by anxiety, fear, apprehension, imagination as future, in the present (awareness). But for this human correlation, past and future are do not have physical reality now, at this moment, at this point of temporality.

Time and space are thought forms. Human mind as a juggler juggles these phenomenon to give us various perceptions, experiences, insights, intuitions, calculations, mis-calculations and like.
A serene mind sees things as they are. A juggled mind sees colored by its perception and acquired or inherent knowledge.

Serene mind sees and recognizes Truth and makes it an enlightened experience. Juggled mind is entwined in reality and imagination and lacks in clarity of phenomenon.

Mind and its functions are object/objects of observation to the Consciousness. Then Consciousness is termed as Awareness.

Resting mind is also object of observation to Consciousness. Then Consciousness is known as Pure Consciousness or Unoccupied Awareness or Content-free Contentment.

Consciousness is nothing but resting mind. Awareness is functioning mind. In Consciousness there is no cognition except for the experience of Peace, Bliss, Silence and Serenity. In Awareness we have all cognitions, cognition-related experiences and communications.

Concepts of time and space are mental phenomena. They are aspects of human mental awareness. For resting mind there is no Awareness of Time or Space. Mere cognition-, communication- free Awareness is present. This is also called time-, and mind transcendent
Awareness.

Monday, August 15, 2016

గురువు - జ్ఞానము



గురువు - జ్ఞానము  


గురు శబ్దానికి భారతీయ సంస్కృతిలో ఏంటో గౌరవము ఉంది. గురువుకు పెద్ద పీట వేసింది భారతీయ తత్త్వము.
అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును కలిగించువాడు గురువు. ఇది తత్త్వశాస్త్ర నిర్వచనమే అయినా ఇది అందరు గురువులకు వర్తిస్తుంది. మానవునకు లౌకిక విద్య బోధించే వారు, సాంకేతిక విద్య బోధించేవారు, నేర్పరితనములు (skills) నేర్పేవారు, ఆధ్యాత్మిక విద్య నేర్పేవారు, తత్త్వావగాహన కలిగించేవారు - ఇలా గురువులు మనకు ఎన్నో సందర్భములలో ఎన్నో రూపములలో దగ్గరై మనకు ఆయా విద్యలను, నేర్పరితనములను బోధిస్తారు. ఇందరూ మన గురువులే. 

శ్లో గురుర్బ్రహ్మా గురువిష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః 

ఇలా గురువును బ్రహ్మవిష్ణుమహేశ్వరులతోను, పరబ్రహ్మముతోను పోల్చి మన జీవితములలో గురువు యొక్క విశిష్టత మాన్కు తెలియజెప్పారు మన పెద్దలు. 

నిజానికి మనిషి జీవితములో తల్లి మొదటి గురువు. తండ్రి మలి గురువు. ఆపై విద్యాలయముల లోని గురువులు మనకు ఆయా జ్ఞానములు కలిగిస్తారు. మనము జీవితములో వడిదుడుకులు అనుభవించి మానసికముగా ఎదిగిన తరువాత ఆధ్యాత్మికత వైపు దృష్టి మరలుతుంది. నేర్చుకునే విజ్ఞత ఉంటె సర్వము గురుస్వరూపమే అనీ పెద్దలన్నారు. 

జ్ఞానము ఎన్నో రకములు. జ్ఞానమును జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము, అజ్ఞానములుగ విడదీయవచ్చు.
తెలియవలసినది తెలియకపోవడం, తెలిసినది తప్పుగా తెలవడం అజ్ఞానం. జ్ఞానము కానిది.
సకల శాస్త్రములు విజ్ఞానము. నేర్పరితనములు, ఇతర సాంఘిక, రాజకీయ, వర్తక వ్యాపార జ్ఞానములు పరిజ్ఞానము. ఇదంతా ఉపనిషత్ పరిభాషలో అవిద్య - విద్య కానిది.

మన అసలు స్వరూపమును తెలిసికొని అడిగా మనము నిలవడము జ్ఞానము. దీనినే ఉపనిషత్తులు విద్య అన్నాయి.

ఇలా లౌకిక, అలౌకిక విద్యలను గరపే వారందఋ మనకు గురువులు. ఇవన్నీ మనకు గురువులు బోధిస్తారు. మన పాఠశాలలలో, కళాశాలలలొ, విశ్వవిద్యాలయములలో, సాంకేతిక విద్యాలయములలో రకరకాల శాస్త్రములు, సాంకేతికతలు, నేర్పరితనములు నేర్పే వారు - స్కిల్స్, కుటీర పరిశ్రమలలో నేర్పేవి-, సంగీతము, ఇతర లలిత కళలు, - మరెన్నో రకరకాల స్థాయిలలో మనకు గురువులు నేర్పుతారు.

శ్లోll గురవే సర్వ లోకానాం భిషజే సర్వరోగానాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణా మూర్తయే నమః
అన్నిలోకములకు గురువు, అన్ని రోగములకు (భవ, భావ రోగములకు) వైద్యుడు, అన్నివిద్యలకు నిధి అయిన దక్షిణామూర్తికి నమస్కారము.

శ్లోll అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః
భావము:
అజ్ఞానమనే చీకటిని - గుడ్డితనాన్ని, జ్ఞానము అనే అంజనము పూసి రూపు మాపి చూపు నిచ్చేవాడు - కన్నులు తెరిచేవాడు అయిన గురువునకు నమస్కారము.

శ్లోll జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవమ్ ఉపాస్మహే
భావము:
జ్ఞానము, ఆనందముల రూపునిర్మలస్ఫటికాకృతి కలిగి అన్ని విద్యలకు ఆధారమైన హయగ్రీవునకు నమస్కారము.
పరమగురువు బ్రహ్మము
స్మరణ మాత్రమున పొంగు పొంగించు దివ్య వాక్కు;
స్మృతి శాస్త్ర పురాణములకు యోని; మనసుకు
ద్రుతినిచ్చు, శ్రావ్య హృదయ గానములకు శృతి
శ్రుతులకు శ్రుతి, నాదమునకు ధృతి శబ్దబ్రహ్మము

పరమ సత్యము
బ్రహ్మా సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మా ఏవ న అపరః

భావము:

అస్తమానూ (సర్వ కాల సర్వావస్థలయందు) ఉండేది బ్రహ్మము. జగత్తు (మానసికము - భావనా మయము) వచ్చి పోయేది. కలిగి మలిగేది. ఒక సారి ఉంది ఒకసారి ఉండనిది.

వ్యక్తియే బ్రహ్మము. వేరు కాదు.

అనే ఈ అద్వైత వేదాంత సారము పరమ గురువై మనల ఉద్ధరించుగాక! తరింపచేయుగాక!

ఈ పరమ సత్యమును మనకు అనుభవముగా చేయు పరమగురువులకందఱకు నమస్సులు!

సత్యానుసారిణీ లక్ష్మీ
కీర్తి:త్యాగానుసారిణీ
అభ్యాసానుసారిణీ విద్యా
బుద్ధి: కర్మానుసారిణీ.
ఈ శ్లోక తాత్పర్యమును ధ్యానించుచు ఇహపరములను సుఖప్రదముగా మార్చుకొందుము గాక!
శ్రీరస్తు! శుభమస్తు! సమస్త