Monday, October 8, 2018

కవిత్వం‌; దృక్-దృశ్య వివేకము; పునాదుల పెకలింపు; భగవంతుడు-మనుషులు;Disunited Hinduism

కవిత్వం‌ అంటే‌ లోకువేమో అందరూ కవితలు రాసేస్తారు
కవితలు చదవడం కష్టమేమో‌ ఎవరూ చదవరు కనీసం చూడరు! ఉత్పత్తి ఎక్కువ వినియోగం తక్కువ అయిన సరుకు కవిత్వం‌; సున్నితత్వం పోయి సుమారుతనం రాజిల్లుతూ ఏలుతోంది!
********

దృక్-దృశ్య వివేకము
దృక్ అంటే చూపు.
దృశ్యం అంటే చూడబడేది.
సాధారణంగా కన్ను విషయంలో ఈ మాటలు ఉపయోగిస్తాము. తత్త్వం లో ఈ మాటలకు విస్తృతార్థము ఉంది.
సత్ దృక్. జగత్ దృశ్యము.
సత్ కే ఆత్మ, బ్రహ్మము అని పేరు.
చూపు ఒక్కటే ఉంటే అద్వైతము.
చూపులో జగత్ ఉంటే ద్వైతము.
చూపునే గమనిక, దృష్టి అనీ అంటారు.
దృశ్యం అంటే కంటికి మాత్రమే పరిమితం అయినది కాదు.
జగత్ - విషయ ప్రపంచం, విషయానుభవములైన వాసనలు, వాటిని చూపించే అంతఃకరణములు - మనోబుద్ధ్యహంకారచిత్తములు విరమింపబడి - మాయ వివర్తనము - పురోధాన, తిరోధాన యుత వర్తనము - పొందక, నిర్మల మానసిక స్థితి అనుభవమై ఉంటే, ఇదంతా ఆత్మ చూస్తూంటే దానిని విశ్రాంత దృష్టి అంటారు.
ఇది అద్వైత స్థితి.
జాగ్రత్ సుషుప్తి - మెళకువతో కూడిన నిద్ర, సుషుప్తి - గాఢనిద్ర - నిర్మల మానసిక దశలు అద్వైత స్థితి దశలు. వీటిని ఆత్మ దశలు అనీ అంటారు. ఇప్పుడు చూపు జ్ఞానముగా మాత్రమే ఉంటుంది. జ్ఞాత, జ్ఞేయము ఉండవు. త్రిపుటి ఏర్పడి ఉండదు.
ఆత్మదృష్టిలో, ఆత్మ చూపులో - గమనికలో మానసిక కార్యకలాపాలు - మాయా పరిణామములు - పురోధాన, తిరోధాన - సంభవించి, అంతఃకరణములు దృశ్యములై, విషయ, విషయానుభవములు (వాసనలు, జ్ఞాపకములు, స్మృతి) వాటికి దృశ్యములు అయితే, అది ద్వైత స్థితి. ఇదే త్రిపుటీ విభజనము - జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము గా - విడివడి ఉండి తెలుస్తూండడము.
మనసు జ్ఞానేంద్రియాల ద్వారా బయటి భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తోంటే అది బహిర్ముఖ దృష్టి. దీనికే జాగ్రత్, మెళుకువ అని పేర్లు.
మనసు, ఇతర అంతఃకరణములు; ప్రపంచంగా పిలువబడే విషయ ముద్రలు, వాసనలుగా పిలువబడే విషయానుభవములు గ్రహిస్తే వరుసగా అవి తలపులు, మానసిక స్థితులు గా చెప్పబడతాయి. అప్పుడు దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. దీనికే స్వప్న, కల అని పేర్లు.
బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు మానసిక దృష్టులు. ద్వైతానుభవములు. అవి ద్వైత స్థితులు.
మన దృక్ (చూపు) విశ్రాంత, అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులుగా మారి - జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - జాగ్రత్ సుషుప్తులుగా మన మానసిక కార్యకలాపాలు జరిగేలా చూస్తుంది. జరుపుతూ ఉంటుంది.
మానసిక కార్యకలాపాలు విరమింపబడిన స్థితినే శాంత, మౌన, ఆనంద, ముక్త, మోక్ష, భక్తి, తత్పర, తాత్పర్య, పరా స్థితులు అంటారు. శుద్ధాహం, శుద్ధ జ్ఞాన స్థితి అన్నా ఇదే.
అలా దృక్ అంటే చూపు. భావములు, అనుభవములు, గ్రహణలు, గ్రహింపులు, వ్యక్తీకరణలు ఈ చూపుకి దృశ్యములు.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
***********
7-10-2019:
మగవాళ్ళందరూ దుష్టులు కారు;
ఒక అమ్మాయి రేప్ చెయ్యబడితే
మొత్తం పురుషజాతినే దుమ్మెత్తి
పోస్తారు, నెటిజన్లు, సమాజ సేవకులు
ఆ పురుషుల్లో దుమ్మెత్తి పోసేవారి బాయ్ ఫ్రెండ్,
తండ్రి, భర్త, సోదరుడు, కొడుకు ఉండరు; అలా ప్రతి వాళ్ళకి
కన్సెషన్ ఇచ్చుకుంటూ పోతే మిగిలే దుష్టులైన
పురుషులెవ్వరు? రేప్ లు చేస్తున్నదెవరు?
**********
పునాదుల పెకలింపు
కన్నవారి తోటి, పెళ్లి చేసికున్నవారి తోటి కలిసి మెలిసి ఉండలేని స్త్రీ పురుషులు తమ జీవితాలను ఎలా గడుపుతారు? ఆఫీసే జీవితం, ఫుడ్ జాయింట్లలలో తినడమే సౌభాగ్యం అనుకుంటే కుటుంబాలు ఏమి నిలుస్తాయి? సంసారాలు ఏమి సాగుతాయి?
ఆధునికులు ఈ సత్యాన్ని విస్మరించి తోచినట్లు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దాని వల్ల నష్టపోయేది తాము కూడా అని వారికి తట్టకపోవడం ఇంగితం లేకపోవడం.
ఏ మనిషీ ఇంకో మనిషి సాయం తీసుకోక, తోడు లేక జీవిత పరిసమాప్తి చేయలేడు.
ఇతరులకి సాయం చేయడానికి మనకు తీరిక లేకపోతే మనకు సాయం చేయడానికి ఎవరికి మాత్రం తీరిక ఉంటుంది? అనారోగ్యాలు, శారీరక, మానసిక బాధలు, వేదనలు, వ్యథలు ఇవి రాకుండా జీవితం పూర్తి అవదు. రాత్రింబవళ్ళలా సుఖదుఃఖాలు, లాభనష్టాలు జీవితంలో భాగం అవుతాయి.
ఈ సత్యాన్ని విస్మరించి జీవించబూనడం మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం. మన ఇంటి పునాదులు మనమే పెకలించుకోవడం.

6-10-2018:
జ్ఞానదేవులు ఒక చోట అంతఃకరణములు పరమాత్మ విభూతులే కావున పరమాత్మను దర్శించడానికి అవి సరిపోవు అన్నారు. కాని వాటి సాయం తీసికోవచ్చు. జ్ఞానానుభవం జరిగే సమయంలో అవీ జ్ఞానంలో కలిసిపోయి తమ ఉనికిని కోల్పోతాయి. అప్పుడు శాంతి, ఆనందం, మౌనం వెళ్లివిరుస్తాయి.
5-10-2018:
భగవంతుడు-మనుషులు
భగవన్నిర్వచనము
న దేవో విద్యతే కాష్ఠే
న పాషాణే న మృణ్మయే
భావేషు విద్యతే దేవః
తస్మాత్ భావోహి కారణమ్
భావము: భగవంతుడు చెక్కతో చేసిన బొమ్మలో గాని, రాతి విగ్రహములో గాని, మట్టి బొమ్మలో గాని ఉండడు. భగవంతుడు మన భావములలోనే ఉన్నాడు. అంచేత భావములే, భావించ గలగలడమే, భావించడమే అంతకూ, అంతటా పరమాత్మని చూడగలగడానికి కారణం.
न देवो विद्यते काष्ठे
न पाषाणे न मृण्मये।
भावेषु विद्यते देवः
तस्मात् भावो हि कारणम्॥

The Lord lives not in the wooden carving
Nor in the sculpture made of stone or clay;
The Lord lives in our thoughts
And it is through our thoughts that we see him dwell in everything.
ఇది భగవంతుని యొక్క ఒక నిర్వచనము. ఈ నిర్వచనం ఆస్తికులకీ నచ్చదు, నాస్తికులకీ నచ్చదు. భగవంతుణ్ణి అలా భావములకు పరిమితం చేయడం ఆస్తికులకు నచ్చదు. అసలు భగవంతుడు అనే పదం ఉచ్చరించడమే నాస్తికులకు నచ్చదు. భగవంతుని ఉనికి ఏ విధంగానూ లేదని వారి వాదన, నమ్మకం.
అన్ని వాదనలు ఆగిపోయిన పిమ్మట మనలోనే భగవంతుడు వెలుగుతాడు అని ఒక తత్త్వం.
భగవంతుని ఉనికి గురించి ఇలా వివిధములైన ఊహలు, అపోహలు, నమ్మకం, స్ఫూర్తి, స్ఫురణలు ఉండడం మానవజాతికి అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. భగవంతుని విషయమై యుద్ధాలు, కొట్లాటలు, నరమేధముల గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత శాంతి.
సర్వవ్యాపకుడు, దీనజన రక్షకుడు, కరుణాంతరంగుడు, జగన్నాటక సూత్రధారి, జగన్నాథుడు తన ఉనికి గురించి మానవులు పడే మల్లగుల్లాలు చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏమో?
భగవన్నియామకంగా అంతా జరుగుతుందని చాలా మంది ఆస్తికులు నమ్ముతారు. తాము మాత్రం భగవంతుడు నిషేధించినవి కూడా నిర్లక్ష్యంగా చేస్తూంటారు. ఇదో వింత. ఇందులో గురువులు, ఆచార్యులు, భక్తులు ఉంటారు.
నాస్తికులెంతసేపూ తమ నమ్మకాన్ని విద్వేష పూరితంగా వెళ్ళగక్కుతూ ఉంటారు. ఆస్తికుల మనోభావాలను తమ మాటలతో, వ్యాఖ్యలతో
గాయపరుస్తూంటారు. మనసా, వచసా, కర్మణా అహింస పాటించడం ఎందరో నాస్తికులకి తెలియదు.
భారతదేశంలోని నాస్తికులు హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తూ, నిందిస్తూ, అది తమ వాక్ స్వాతంత్ర్యం అంటూ విచ్చలవిడిగా చరిస్తారు. ఇదంతా ఒక గుంపు.
భగవంతుడు మతానికి మాత్రమే చెందుతాడా?
జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ వెలుగు అర్చామూర్తిని కొలిచే వారిపైనే ప్రసరిస్తుందా? వేదాంతములు, తత్త్వములు స్వతంత్రత కలిగి లేవా?
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు భగవంతుని సాయంకోరతారని భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ.
సామరస్యంగా, ప్రశాంతంగా, సౌమనస్యంతో, మనసుని నిర్మలంగా ఉంచుకోగలగడం అర్చామూర్తిని కొలవని వారికి నిషిద్ధమా? కుదరదా?
భగవంతుని నిర్వచనం పైన ఉటంకించిన శ్లోకం తాత్పర్యం కాదా? అలా నిర్వచించడం సరి కాదా? సరి పోదా? ఏమో!!
4-10-2018:
మనందరికీ తెలిసిన విషయమే, కాని మనలో ఎక్కువ మంది దృష్టిలో లేని విషయం ఏమిటంటే, మనం బాధలో ఉన్నప్పుడు, వ్యథ అనుభవిస్తున్నప్పుడు ఆత్మీయుల సాన్నిధ్యం, సామీప్యం, ప్రియమైన మాటలు ఇచ్చే ఉపశమనం, కలిగించే ఆహ్లాదము ఎన్ని ఏప్ (app) లు అయినా కలిగించ లేవు.
ఎన్ని పుస్తకాలు అయినా, సామాజిక సాలెగూళ్ళు అయినా, వినోద సాధనాలైనా ఆత్మీయులిచ్చే, కలిగించే శాంతిని కలిగించలేవు. వ్యాకులత పోగొట్టడానికి ఆత్మీయులే సమర్ధులు.
మనం వినోద సాధనాలతో పాటు ఆత్మీయులను కలిగి ఉండాలి. జీవితం సంక్లిష్టమైనది.
మన సుఖదుఃఖాలు, వేదనలు, వ్యథలు, లాభనష్టాలు ఆత్మీయులతో పంచుకోవడం మన మానసిక సమతౌల్యాన్ని నిలుపుతుంది.
**********
Truth is to be experienced, not lectured about!
3-10-2018:
అందరికీ తప్పొప్పులు తెలుసు. తప్పు చేసినా శిక్షించబడటం లేదు కాబట్టి అందరూ తప్పే చేస్తున్నారు. తప్పు చెయ్యకూడదని తెలియక కాదు. అంతా సాగుబడి రోగం. మంచి మాటలకి ఎందరో మనుషులు కాదు.
************
India is a country for the marginalized. So it is converting all citizens as the marginalized except for the politicians, their families, kith and kin, and near and dear. Great achievement is made its own on its own.
********
Disunited Hinduism
Hindus are not United because their first affiliation is to caste, next region, next language and culture and then sub-nationality and no affiliation to Hinduism. And then you have traditional philosophical differences as Advaita etc.,
And thus "Hindus" are divided thoroughly and completely. Community interests are dominating over great Indian culture interests.
So Hindus are in minority because of divisions and self-centred feelings. It is very difficult to make them transcend their selfish interests!
 ********
మనకు నచ్చినవన్నీ ప్రపంచానికి నచ్చవు. మనకు కావలసినట్టు ప్రపంచం మారిపోవాలనుకోవడం పసితనం. వీలయితే ప్రపంచంలో జరిగే, మనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండ
గలిగితే మన జీవితంలో మన బాధ్యతలు మనం నిర్వర్తించడానికి మన మనసుకీ, బుద్ధికీ వెసులుబాటు దొరుకుతుంది.
*************
మనసు పారవేసుకొనుట తృటిలో పని
సంయమనము చూపుట అభ్యాస గరిమ
మనసుకు రమ్యత కావాలి
వెనుక పొంచి ఉన్న ప్రమాదం తెలియదు
ప్రమోదమే కావాలి అస్తమానూ;
నిగ్రహమంటే చిరాకు మనసుకి
ఊహల పల్లకి ఎక్కడం
ఊసుల ఉల్లాసంలో తేలిపోవడం
రక్తిని కామించడం
మనసుకు ప్రకృతి
ఇటూ అటూ తిరిగి అలిసిపోయి
శాంతి కావాలని అంగలార్చడమూ
దానికి సహజమే; పసిపిల్ల మనసు;
కోరిన వెంటనే కోరినది అందాలి
పసిపిల్లయో, పడుచు పిల్లయో
మనసు మనల ఆడించుచునే ఉండును
2-10-2018:
The quota politicians and intellectuals
In India there is a political class consisting of leaders from various political parties and intellectuals from various communities and ideologies, whose survival instinct is to harp on outdated quota politics.
They do not have any other ability, credibility or commitment for the nation and society.
They are making a living on quota issue.
*********
ప్రజాస్వామ్యం లో ప్రజలు ఏమి కోరుకుంటే అదే వారికి లభిస్తుంది, నాయకుల రూపంలో 
********
We humans waste most of our time in praising, admiring, appreciating, adoring and spreading all good, good leaders, culture, and everything good on earth.
But we do not have time, aptitude or desire to practice all that is good. Humans are experts in vain talkTop of Form
*******

Monday, October 1, 2018

నిష్క్రమణం (కథానిక)

నిష్క్రమణం 
డా. వారణాసి రామబ్రహ్మం 

మరణం అనేది ఒక విరామ చిహ్నమో,  ఫుల్స్టాప్పో తెలియదు.

మనం జీవించి ఉన్నప్పుడు మనలో ఉండి, మనం మరణించే సమయంలో శరీరాన్ని ఆత్మ వీడుతుందని తరువాత మరొక శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతలో చెప్పబడింది. ఎలా చింకిపాతైన బట్టను వదిలి కొత్త బట్టను కట్టుకుంటామో అలా ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతపై వ్యాఖ్యానాలలో మనం చదువుతాము. 

ఆత్మ ఇలా శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశించడాన్ని ఒక ఉపాధి వదిలి ఇంకో ఉపాధిని ఆశ్రయించడం అని సాంకేతికంగా తత్త్వ ప్రియులు చెబుతారు.

ఇటువంటి వ్యాఖ్యలు,  వ్యాఖ్యానాలు మరణం పిదప మనం పునర్జన్మ పొందుతాం అని సూచిస్తాయి. 

కాని నాకు ఇటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలపై నమ్మకము లేదు. కాని ఈ విషయమై నేను వాదాల్లోకి, వివాదాల్లోకి దిగను. ఎందుకంటే ఈ వాదాలు, వివాదాలు మన నమ్మకాల మీద, మతం పైననే ఆధారపడి ఉంటాయి. 

నేను మా అమ్మగారికి, నాన్నగారికి ఒకే సంతానాన్ని. నన్ను వారిద్దరూ ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచారు. ఆ గారాబం వల్ల నేను చెడిపోలేదు.

బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో ప్రవేశించాను. నా ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని, ఇతర హాబీలని వదలకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. నా భార్య నా జీవన కచేరిలో శ్రుతిలా నాకు చేదోడు వాదోడుగా ఉండి గృహ నిర్వహణ ఎంతో శ్రద్ధగా, ఆదరాభిమానాతో చేస్తోంది. సంసారాన్ని నేను ఈదేలా చేస్తోంది. అలా మా జీవితం ఒక యుగళ గీతంలా సాగిపోతోంది.

మా నాన్నగారు నాకు ఉపాధ్యాయులు, తత్త్వవేత్త, మార్గదర్శకులు, మంచి స్నేహితుడు కూడా. ఆయన అందరికీ నచ్చిన మంచివారు, దయా సముద్రులు. నేను జీవితం గురించి ఆయన ద్వారా, ఆయన నుంచి నేర్చుకున్నాను.ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి పదవీవిరమణ చేశారు. నా ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఆయన భిక్షే.

ఆయన ప్రస్తుతం చాలా అనారోగ్యంగా ఉన్నారు. ముసలితనం వస్తున్నకొద్దీ మన శరీరం ఎలా నెమ్మదిగా చిక్కిపోయి, ముడుతలు పడి, జీర్ణమై, వ్యాధులు కలిగి, పనికిరాకుండా పోతుందో గమనిస్తూంటే మనసు సుడులు తిరుగుతుంది.
మా నాన్నగారి శరీరం అల్లా అయిపోవడాన్ని నేను ఎంతో వేదనతో గమనిస్తున్నాను. 

ఆయన శరీరం మాంసం, కండరాలు, కొవ్వు కరిగి పోయి అస్థిపంజరంలా తయారయ్యారు. మా డాక్టర్ నా క్లాస్మేట్. మా నాన్నగారు బ్రతికుండేది ఇంక రోజులు మాత్రమేనని చెప్పాడు.  మా నాన్నగారితో శాశ్వత వియోగం ఇంక రోజులలో అని తెలిసే సరికి విహ్వలుణ్ణి అయ్యాను. విషణ్ణత నా హృదయాన్ని ఆవరించింది. 

మా నాన్నగారి వాత్సల్యం, ఆపేక్ష, ఆత్మీయత, అనురాగములలో ఎలా నేను పసివానిగా, బాలుడిగా, టీనేజర్ గా, యువకుడిగా, మధ్య వయస్కునిగా ఎదిగానో తలుచుకోవడం నాకిష్టం. ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ ఉంటాను.

మా నాన్నగారి పట్ల నాకున్న ప్రేమ, గాఢ అనుబంధము  ఎంతైనా, "జాతస్య మరణం ధ్రువమ్  అనే నిజాన్ని మార్చలేదు. ఈ సత్యం అంత స్పష్టమైనది. 

ప్రకృతి నియమానుసారం మన శరీరము చనిపోవాలి. మన విషాదాలు, వేదనలు మరె విధమైన విచారగ్రస్త హృదయాలు ఈ సంఘటనని ఆపలేవు. అయినా మన మనసు రోదించక మానదు. 

ఆ రోజున మానాన్నగారికి నలభై ఏళ్లుగా సహోద్యోగి, అరవై ఏళ్లుగా మిత్రులు అయిన  శాస్త్రిగాను మా నాన్నగారిని చోడడానికి వచ్చారు.  వారిద్దరి జీవితాలు ఇంచుమించు ఒకేలా జరిగాయి. ఎటొచ్ఛీ ఆయనికి యెరులు కొడుకులు, ఒక కూతురు, మా నాన్నగారికి నేనొక్కడనే. మా అమ్మగారి లాగానే ఆయన భార్య కూడా మరణించి పదేళ్లు అయింది. ఇద్దరికీ సమ వయస్సు, 85 సంవత్సరాలు. 

ఆయనొచ్చాక వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు ఆయన మా నాన్నగారికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా అన్నట్టు సాగాయి. మా నాన్నగారు ఇంకా రోజులలో ఉన్నారని ఆయనకు తెలుసు. వారిద్దరూ 
రామాయణ, మహాభారతాలు, భాగవతం, భగవద్గిత ల గురుంచి మాట్లాడుకున్నారు. భగవద్గిత, ఉద్ధవ గీతలలో శ్రీకృష్ణుని ఉపదేశాల గురించి తులనము చేస్తూ మాట్లాడుకున్నారు. 

ఇన్నాళ్లు వారు కలిసి జీవించారు. ఇద్దరూ సాంప్రదాయ కుటుంబాలనుంచి వచ్చినవారే.కానీ ఆధునికతని కూడా అంతగా సంతరించుకున్నవారు.  ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్లేవారు. 

ఇద్దరూ కలిసి మా వూళ్ళో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవములసంగీత కార్యక్రమములకు వెళ్లేవారు. గణపతి, దసరా నవరాత్రి, అమ్మవారి ఉత్సవాలకు వెళ్లి నాటకములు, హరి, బుర్రకథలు, చూసేవారు. 

మా నాన్నగారు మరణించాక ఈ అనుబంధము ఏమవుతుందో? శాస్త్రి గారు విధి నియమాన్ని గ్రహించి, హృదయములో ఇదంతా దాచుకుని తన జీవితాన్ని జీవిస్తారు  అనుకుంటా. 


బతికి ఉన్నన్నాళ్ళు మనం అందరమూ పోట్లాడుకుంటాము, మన అహంభావములను, అహంకారములను, గొప్ప, తక్కువలను చూపిస్తూ ఉంటాయు. మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలలా చూసారు అంటాము. అబ్బుకి, అంతస్థుకి , ఆస్తిపాస్తులకి ఎంతో విలువ ఇచ్చి మనుషులను దూరము చేసికుంటాము.  ఈ భూమిపై మన ఉనికి కాసేపే అయినా ఎన్నో శాశ్వత ప్రణాళికలు వేసికుంటూ, అయినా వాళ్ళని తీసిపారేస్తూ, అందినంత సక్రమ మార్గములలో సంపాదించి చివరకు మట్టిలో కలిసిపోతాము. 

ఇదంతా ఆలోచిస్తూంటే నాకు ఎంతో ఆశ్చర్యము కలిగి, నవ్వు వస్తూ ఉంటుంది. విస్తుపోతూంటాను. కవి అయినా, సామాన్యుడు అయినా, తత్త్వవేత్త, మహారాజు, సన్యాసులు, రాజకీయ నాయకులు, సినీ తారలు అందరికి  ఈ పృథ్విపై నివాసము తాత్కాలికం. అశాశ్వతము. 

మనము పుట్టాము అంటే మరణించి తీరాలి. ఇవాళో, రేపో మన గమ్యము స్మశానము. ఈ జ్ఞానము కలిగితే మన సంఘములో జరిగే దారుణాలు, అకృత్యాలు, అవినీతి ఇంతలా పెచ్చుమీరి ఉండేవి కాదు. మన జీవితాలతో ఆడుకునే కునాయకుల, నేరస్థుల, దుర్మార్గుల, కుల, మత, సిద్ధాంత దురభిమానుల ఆగడాలు తరిగిపోయేవి. 

మరణము అందరిని సమస్థాయికి రప్పింస్తుంది. అన్ని ఆహ్మ్భావాలు, అహంకారాలు, విజయములు, ఓటమిలు అన్నిటికి విలువ లేకుండా చేసే ఏకైక న్యాయ వేత్త మరణం. 

అయినా మనం శత్రుత్వాలు, ఇతరులను హించించడం మానము. మన స్వార్థానికి అన్ని అకృత్యములు, అన్యాయములు చేస్తాము. 

మరణం గురించి విచారిస్తే మనుషులు కొంత సన్మార్గులు అవుతారు. 

మనలో ఒకరు మరణించాక మనము మళ్ళీ ఎప్పటికీ కలవము.  ఎంతో బాధాకారమైన, మనము భరించలేని ఈ వాస్తవము సత్యము. 

మనకు అయినవాళ్లు, ఆత్మీయులు మరణిస్తే మనము ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాము. అదే ఒక బయటి వ్యక్తి మరణిస్తే మనకు ఏమీ అనిపించదు. ఏ దుఃఖము కలగదు. మన అనుబంధమే ఈ వేదనని కలిగిస్తుంది. ఇదే రాగము. అందుకే విరాగము నెమ్మదిగా పెంచుకోవాలని వేదాంతులు సలహా ఇస్తారు. మన ప్రియతముల మరణాన్ని, తద్వారా కలిగే బాధాకరమైన వియోగాన్ని తట్టుకోవడానికి ఈ వైరాగ్యము ఉపకరిస్తుంది.  

 ఎంత వేదాంతము అలవరచుకున్నా తండ్రికి వీడ్కోలు పలికే సమయము వస్తే గుండె బ్రద్దలై పోతుంది. గాఢ నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వతమైన నిద్ర అంటారు పెద్దలు. ఈ నిద్రనుంచి మనము మళ్ళీ లేవము. 

ఇన్ని తత్త్వాలు, వేదాంతాలు, పెద్దల సుద్దులు, అన్నీ కూడా వగచి హృదయానికి తొందరగా స్థిమితము కలిగించడానికే ఉద్దేశించ బడ్డాయి. వరాగ్యముతో ఈ ధ్రువము, తప్పనిసరి ఆయినదాన్ని సంయమనంతో భరించడానికే ఈ మాటలన్నీనూ. మనము ఈ వాస్తవాన్ని, ప్రక్రుతి నియమాన్ని అంగీకరించి తీరాలి, నెమ్మదిగా సర్దుకోవాలి. మళ్లీ మన జీవితాలు మనం జీవించాలి. 

తత్వవేత్తలు మన తాత్కాలికమైన జీవితాన్ని, మానవ ఉనికిని, దృష్టిలో ఉంచుకొని, నిరాసక్తముగా, నిర్వేదముగా, వైరాగ్యముతో జీవిస్తారు. జీవితములో కలిగే వడిదుడుకులను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ప్రియములను, అప్రియములను సంయమనం నిండిన మనసుతో తీసికొని తమ తమ విధ్యుక్త ధర్మములను నిర్వహిస్తారు. బ్రతుకులలో శాంతి, సౌఖ్యములను నింపుకుంటారు. కరుణ నిండిన మానసముతో హాయిని అనుభవిస్తూ ఉంటారు. 

నాకు చిన్నప్పటినుంచీ మనిషికి పునర్జన్మ, జనన మరణములు మనందరమూ అనుకునేట్లుగా, భగవద్గీతను అర్థము చేసికున్నట్టుగా, లేవు, అని ఒక స్ఫురణ ఉండేది. మా నాన్నగారితో శాశ్వత ఎడబాటుని తలుస్తూ, ఆ సమయమునకై  మానసికముగా సిద్ధపడుతూ ఉండేవాడిని.  మా నాన్న గారికి శాశ్వత వీడ్కోలు చెప్పడానికి గుండె దిటవుగా ఉంచుకున్నాను. 

మేము ఇద్దరమూ మళ్ళీ కలవము. కానీ మేము ఇద్దరమూ ఎంతో ఆపేక్షతో, ప్రేమగా, ఆత్మీయముగా, స్నేహితులవలె కలిసి జీవించాము. మా మా విధ్యుక్త ధర్మములను చక్కగా సంతృప్తిగా   పాటించాము.  మన జీవితాల లక్ష్యము, పరమార్థము అదే కదా!

కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారికి అంతిమ క్షణాలు సమీపించాయి. నన్ను దగ్గతికి రమ్మని నా ఒళ్ళంతా ఆప్యాయముగా తడిమి, ప్రేమ నిండిన చూపులతో నా చెవిలో గుసగుసలాడేరు. 

"నేనింక నిద్రపోతాను రా" అని కోమాలోకి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత పరమపదించారు. 

ఎవరూ ఆపలేనంతగా ఏడ్చాను. మా ఇద్దరి వియోగము జరిగిపోయింది. 

ఆయన భౌతిక శరీరము జడము అయ్యి ఉండవచ్చు. కానీ నా స్మృతిలో శాశ్వతముగా ఉంటారు. 

ఇప్పుడు కూడా నాకు మరణము విరామ చిహ్నమో, ఫుల్స్టాప్పో తెలియదు. 

హిందూ మతం - సనాతన ధర్మం; నాయకస్వామ్యం

నాయకస్వామ్యం

నాయకుల నిజస్వరూపాలు రోజూ తెలుస్తూనే ఉంటాయి
అయినా జనం గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు
ఆ మోసగాళ్ళనే నమ్ముతారు
తాము మునుగుతారు అసమర్ధులకు తమ ఓట్లేసి
అందరినీ ముంచుతారు
భారతదేశమున లేదు ప్రజాస్వామ్యం
పరిఢవిల్లుచున్నది నాయకస్వామ్యం
********
పెళ్ళన్న తర్వాత ఎంత జాగ్రత్తగా చూసి చేసినా తన్నుతూంటుంది.
ఇది భగవన్నియమం ఏమో! మనం మానవ మాత్రులం మాత్రమే అని నిరూపించడానికేమో!
*******
సంస్కారం నేర్పని చదువు వ్యర్థం.
చదువులేని మనిషి వింత మృగం.
*******
హిందూ మతం - సనాతన ధర్మం
హిందూ మతం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సూటియైన సమాధానం కనిపించదు.లభించదు.
రాధాకృష్ణన్ పండితులు ఎప్పుడో చెప్పిన "A way of living" తప్ప మరేమీ లేదు. హిందూ మతం అంటే "A way of living" మాత్రమేనా?
ఒక్క మాటలో హిందూ మతం గురించి చెప్పలేము. వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, షణ్ముఖము అని చెప్పాలి. వాటిలోనూ ఎన్నో తెగలు. ఈ తెగలన్నీ ఇవాళ కూడా పరస్పరం కలహించుకుంటున్నాయి. పరస్పరం కలహించు కునేవి ఒకే మతానికి ఎలా చెందుతాయి?
ఈ ఇబ్బంది పోగొట్టుకోవడానికి సనాతన ధర్మం అని వాడతాం. ఇది ధర్మమే కాని మతం కాదు. మతానికి ఉండే అవలక్షణాలు ధర్మానికి ఉండవు.
హిందూ మతం ఫలానా అని చెప్పలేని స్థితిలో ఉన్నాము.
కులగజ్జి కల పెద్దలు, నాస్తికులు, ‌సాంస్కృతిక సంస్థలు, ప్రాంతీయ దిగ్గజాలు, భాషా దురభిమానులు, ఉపజాతీయతా దురంహంకారులు హిందూ మతం అంటే ఒక లోకువని మాత్రం సృష్టించారు. అయోమయంలో పడేశారు. పోట్లాటలు తప్ప అన్యోన్యత లేదు.
సాంస్కృతిక సంస్థలు, పై వివిధ తెగలకు చెందిన వారు చెప్పేది హిందూ మతం కాదు. వీరు హిందూ మతాన్ని ఉద్ధరించలేరు. వీరికి తోడు వివిధ ఆశ్రమాల స్థాపకులు ఎంతో వీరంగం చేస్తూ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.
ఆధ్యాత్మిక గురువులు మరింత అయోమయంలో ఉన్నారు. వీరిలోనూ ఎన్నో తెగలు. వైష్ణవాశ్రమములు, శైవాశ్రమములు, నాస్తికాశ్రమములు, ఎందరో గురువుల - బాబాలు అమ్మలు, స్వాములు, ఆనందా లు, పేరిట వెలసిన
ఆశ్రమములూ తమ వంతు గందరగోళం సృష్టిస్తున్నాయి. తాము అసలు హిందువులమే కాదంటున్నారు.
వీరెవరూ హిందూ మత ప్రవక్తలు కారు. సంస్కర్తలు అసలే కాదు. ఏదో పొట్ట కూటికి ఆశ్రమాలు పెట్టుకున్న వారే ఎక్కువ. సాంప్రదాయాన్ని రక్షించే, నిలబెట్టే ఆశ్రమ నిర్వాహకులు వీరిలో అతి
తక్కువ. సాంప్రదాయాన్ని బ్రతికించే సత్తా, సంస్కారం, సమయజ్ఞత, వివేకము, విచక్షణ, కరుణ, జ్ఞానం కలవారు ఈ ఆశ్రమ యజమానులలో దాదాపు ఎవరూ లేరు. ఎందరో మానసిక బానిసలని మాత్రం తయారుచేయగలరు, అంతే.
ఈ విపత్కర పరిస్థితుల్లో, హిందూ మతం అంటే సరిగా నిర్వచించలేని నేడు హిందూ మతం పేరుతో ప్రాకులాడడం మూర్ఖత్వం.
ధర్మో రక్షతి రక్షితః - అంచేత ధర్మాన్ని పాటిస్తూ బ్రతకాలి. రామాయణ, మహాభారతాలలో, భాగవతంలో, సాంఘిక ధర్మాలను నిర్వచించారు, రామాది దివ్య పాత్రలు మన ప్రవర్తనకు ఆదర్శంగా నిలిపారు. మన బాధ్యతలను సరిగా, నైపుణ్యంతో నిర్వహించడమే ధర్మం.
క్రతువులు, యాగాలు, పూజలు, పునస్కారములు, అభిషేకములు మతంలో భాగమే కాని, ధర్మంలో భాగం కావు. వీధి వీధికి ప్రతి పండగకీ డబ్బులు వసూలు చేసి అసహ్యంగా, అసభ్యంగా నిర్వహించే ఉత్సవాలు కూడా హిందూ మతంలో భాగంగా చెలామణీ అయిపోతున్నాయి. ఇంత దారుణమైన స్థితికి హిందూ మతం చేరుకుంది.
మతం రూపంలోకి మారిపోయిన ఇటువంటి ఉత్సవాలు, పద్ధతులు మన్ని ఉద్ధరించవు. మనకి విపరీతమైన విసుగు, కాలుష్యము కలిగించి మనలను ఎన్నో ఇక్కట్ల పాలు చేస్తాయి అంతే.
మనకి కావలసినది ధర్మం. మతం కాదు. ధర్మాన్ని వదిలి, మతాన్ని కౌగలించుకుంటే హిందూ శబ్దానికి మరింత హాని కలుగుతుంది.
భారతీయ తత్వశాస్త్రం కొరగాకుండా అయిపోతుంది.
*******
అంతర్జాలం, సామాజిక సాలెగూళ్ళు లేకపోతే, సారస్వత సృష్టి చేసే ఎందరో అనామకులుగా ఉండిపోయే వారు. అచ్చు పత్రికలు అతి కొద్ది మందికే అవకాశం కలిగించ గలిగేవి. ఇప్పుడు వాసి గల, ఏ వాదానికీ చెందని వారు కూడా హాయిగా తమ
రచనలకు, కవనములకు వెలుగు చూపించే సావకాశం కలిగింది. రస హృదయం కల పాఠకుల ప్రోత్సాహం బోనస్.
*******
బొమ్మలు చూసి, ముద్దు గుమ్మలనుకొని స్నేహం చేయబోతే
వారివి కాదు బొమ్మలు, కారు వారు ముద్దు గుమ్మలని తేలితే
ముఖపుస్తకంలో ఏది నిజం?
ఏది అబద్దం తెలియని గందరగోళంలో
ఏదో ఆశతో స్నేహాలు చేసే పాఠకులు
మిథ్యా ప్రపంచాగ్నిలో పడిన మిణుగురు పురుగులు
 ********
మనిషి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తన గురించి, చుట్టూ ఉన్న ప్రకృతి, ప్రపంచాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. కాని ఏ విషయం ఇంకా ఏమీ తేల్చుకోలేక పోతున్నాడు. ఎన్నాళ్ళో ఈ అన్వేషణ కమ్ నిరీక్షణ.
ఈ లోపు మిడి మిడి జ్ఞానం వాళ్ళు పశువులు చేలో పడి పంట నాశనం చేసినట్లు తాము అనుకున్నది జ్ఞానం, విజ్ఞానం, సంస్కృతి, నాగరికతా అంటూ , ఇంగితం లేకుండా ప్రకటించి సంఘాన్ని అతలా కుతలం చేస్తున్నారు. మతాలు, సంస్కృతులు, సిద్ధాంతాలు రాద్ధాంతాలుగా మారుతున్నాయి తప్ప
మనుషుల మధ్య సామరస్యాన్ని, సౌమనస్యాన్ని హరించి వేస్తున్నాయి.
సంఘం అశాంతి, అసౌకర్యం, అసౌఖ్యాలతో గోలగా తయారైంది. విజ్ఞత, కరుణ కరువయ్యాయి. అందరూ సంఘోద్ధారకులే. సంఘం మాత్రం దురాచారములతో, దౌర్జన్యాలతో, దుడుకుతనంతో అలమటిస్తోంది.
రక్షకులు లేని పురంలా భయ భ్రాంతులతో సతమతమౌతూ ఈసురోమంటూ ఉంది.
*********
The nations of the world are suffering from the consequences of inefficient and vulgar leaders.
********
నిరక్షర కుక్షులుగా అసహాయులుగా మిగులుస్తున్న ఎంతో ఖరీదైన బడి బాట కన్నా; కడుపు నింపే బతుకు బాట పట్టడం తెలివైన శ్రేయస్కరమైన పని
*********
ఒళ్ళు చూపించకుండా ఏ మోడల్ కూడా మోడలింగ్ లో పాల్గోవటం లేదు. సినీతార సినిమాల్లో ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత బోల్డ్ అంటున్నారు. ఇదంతా వారి స్వాతంత్ర్యం అనుకుంటా.
*********
తత్త్వం గురించి మాట్లాడడానికి చూపించే ఉత్సాహంలో కోటో వంతు కూడా తత్త్వాన్ని అనుసరించడంలో చూపం. అంతా వేలం వెర్రిగా తయారైంది.
********
కులరహిత సమాజానికి, ప్రత్యేకతలు అనుభవిస్తున్న వారు ఒప్పుకోరు; వారే కుల సహిత సమాజానికీ ఒప్పుకోరు; ఇదంతా ఓ గందరగోళంగా, తమాషాగా తయారయ్యింది; అంతా రోకలి తలకు చుట్టమనే వారే
*********
రాతి కట్టడములలో నారాయణుడున్నాడో లేదో తెలియదు కాని
కరుణాంతరంగుల రసజ్ఞుల మనసులలో వెలుగుచున్నాడు మాధవుడు
లక్ష్మీదేవిని వక్షస్థలమునందు వహించెనో లేదో తెలియదు కాని
సుఖశాంతులను కాసులు కురిపించు విద్యను నేర్పగలడు
తపస్సులకు ప్రత్యక్షమగునో లేదో తెలియదు కాని భవబంధ విముక్తి
కలిగించి మోక్షమును కరతలామలకము చేయగలడు తన ప్రసాదముతో
భక్తి, రక్తులు సమముగా పంచు రసికావతంసుడు రమణీ లోలుడు
ప్రపంచము రిక్త ప్రదేశమై, శూన్యము. మిగిలినపుడు, ఆనందానుభవమై
వెలిసి వెలుగును శాంతానుభవముగ శాంతాకారుడు పద్మనాభుడు
నిరంతర మౌని, బ్రహ్మర్షులకు పరమ దైవము బ్రహ్మవేత్త పరబ్రహ్మము
నారాయణుడు నారద సంగీత లోలుడు నగధరుడు సూరి శార్ఙ్గధరుడు
విష్ణువు విమలుడు సరాగ విరాగములందు శ్రేష్థి విజయ సారథి శ్రీకృష్ణుడు
********
India must undergo turmoil for all issues related to caste.
*******
ప్రస్తుతం ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసికోరు. ప్రభుత్వమో, మరేదో, మరొకరో, వారిని అనుక్షణమూ అనుసరిస్తూ ప్రమాదంలో పడితే రక్షించాలి. వారు మాత్రం విచ్చలవిడిగా సంచరిస్తారు. మాట్లాడతారు. ఎవరూ వారికి ఏమీ చెప్పరాదు. ఈ దుష్ట సమాజంలో ఎలా మసలుకోవాలో అస్సలు చెప్పకూడదు.
వారికి ప్రమాదం వచ్చినపుడు, నష్టం కలిగినపుడు సంఘం అంతా వాళ్ళ వెనుక నిలిచి వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళని అభిశంసించాలి. శిక్షించాలి.
ఇటువంటి బాధ్యతారహిత ప్రవర్తనను ఎవరూ ఖండించ కూడదు. వాళ్ళ ప్రతిభ, వారి ప్రతి పనిని, మాటను గ్రహించు కొని వారిని సమర్థించాలి. ప్రభుత్వాలు, మేధావులు ఈ బాధ్యతారాహిత్యాన్ని ఒక అలంకారంగా మార్చేశారు.
సంఘంలో మరింత అశాంతి ఏర్పడుతుంది. మరిన్ని అరాచకాలు జరుగుతాయి. బాధ్యతా రహితుడైన వ్యక్తి తనకు, సమాజానికి ప్రమాదకారి. అటువంటి వారెవరూ ప్రమోదకరులు కారు.
*******
Still waters run deep.
It is difficult to gauge the extent and meaning of Silence.

********
బయటి ప్రపంచంలో ఏదైనా ఒక ఘోరం జరగడం భయం, ఫేస్బుక్ నిండా అభిశంసనలే. ఎంత మంది న్యాయమూర్తులో, ఎంత మంది సానుభూతి పరులో,
ఎంత మంది సామాజిక స్పృహ కలవారో! జరిగిన సంఘటన కన్న తమ అభిశంసన మిన్న అనుకుంటూ తమ అనుకంపనను ఉదారంగా వెలిబుచ్చే ఇందరిలో ఎందరు genuine? ఎందరిది fashion?
Why so much hurry and urgency?
But the reactions are intense and instantaneous.
Even journalists are behind in reporting or expressing reaction and concern.
*******
ఓటు బేంక్ రాజకీయాలతో ఓటైన భారతదేశం జవసత్త్వములు ఎప్పటికి పుంజుకొనును?
చేతకాని వారందరూ చేరి దేశ అభివృద్ధిని, సుఖ శాంతులను కాలరాయు ఈ నాడు ఏది మనకు రక్ష?
*********
వేరే బొమ్మలేల కవితలకు
సరిపోవా పద చిత్రములు?
**********
Now in India, the way education system is functioning, there is no possibility of producing deep thinkers, philosophers, scientists, scholars and individuals dedicated to learning. It is a melonchic
reality.
And also self-confidence, self-reliance and self-esteem are missing together with language abilities.
**********
భారతదేశంలో నాస్తికులు, హేతువాదులు హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తూ, "కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడానికే" పుట్టినట్లు అనిపిస్తుంది. వారు ఏ ఇతర మతాలలోని ఏ లోపాల గురించి మాట్లాడరు. ఎందుకో మనకు తెలుసు.
*********
ప్రపంచాన్ని అర్థం చేసికొని జీవించే వాళ్ళ కన్న అపార్థం చేసుకుని గొడవ, గోల చేస్తూ అశాంతి రేకెత్తించే వారు సంఘంలో చాలా చాలా ఎక్కువగా తయారయ్యారు.
*********
We try to take help from all but ourselves. Life is more bearable if we choose proper people as dear ones, if near ones are not, some solace will be there. Others will always are partial in helping. Better is self-reliance. Life is a series of experiences, pleasant and unpleasant. We may not get help when required from others physically and psychologically.
Life is mind management.
*********
ప్రపంచంలో ఏదీ మనం అనుకున్నట్లు, మనకు కావలసినట్టు జరగదు. మనం సర్దుకు బ్రతకాల్సిందే.
******
అనుభవము మానసిక స్థితి. తలపు మానసిక గతి.
*********
కవిత్వముచే ఆకర్షింప బడుటకు వ్యక్తికి సరస హృదయం ఉండాలి. ఆస్వాదన తెలియాలి. స్పందన కల మనసుండాలి. సారస్వత పరిచయం, ఆసక్తి ఉండాలి. భాషపై పట్టు ఉండాలి. వస్తువుని బట్టి మెచ్చుకోగల కుశలత ఉండాలి. ఇవి కొందరిలోనే ఉంటాయి. అందుకనే చాలా తక్కువ మంది కవిత్వం వైపు ఆకర్షింప బడతారు.
**********
ఉపాసకులు, స్వాములు, సన్యాసులు, మత గురువులు, ఆశ్రమ నిర్వాహకులు మనల్ని ఉద్ధరించడం కన్న తమని తాము మనం ఇచ్చిన డబ్బు, ఇతరములతో ఉద్ధరించుకుంటారు. చివరికి జోగీ, జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు మిగులుతాం మనం, ఉద్ధరింపు మర్చిపోయి.
******
అంతర్జాల మాధ్యమాల్లో మగవారి దౌర్జన్యాలను, దౌష్ట్యాన్ని, క్రూరత్వాన్ని చీల్చి చెండాడే అతివల ఇంట్లోని మగవారెవరూ ఈ దుర్లక్షణాలు లేని వారై ఉంటారు. ఎంతో వినమ్రులు, మంచి వారై ఉంటారు. అటువంటప్పుడు ఆ స్త్రీలు జీవితాన్ని హాయిగా గడపక ఎందుకు మిగతా మగవాళ్ళని పట్టించుకుంటారు?
లోకంలో చీకటి, వెలుగులు; రాత్రింబవళ్ళు; మంచి చెడ్డలు ఉంటూనే ఉంటాయి.
***********
30 ఏళ్ళ క్రితం మనం పండుగలు చేసుకోవడం టి.వి. లోకి మారింది.
ఇప్పుడు పండుగలు చేసికోవడం ఫేస్బుక్ లోకి మారింది.
********

ఈ ప్రపంచంలో గురువులకు, ఉపదేశాలకు, ప్రవచనాలకు లోటు లేదు. చెప్పినట్టు చేసేవారే లేరు. తాము చెప్పింది చేసే గురువులూ లేరు.