Monday, August 20, 2018

నా సంస్కృత భాషాధ్యయనం, "సారస్వత సృష్టి"

నా సంస్కృత భాషాధ్యయనం, "సారస్వత సృష్టి" 

సంస్కృత భాష నేర్చుకోవాలని నాకు కోరిక. 9 వ తరగతికి వచ్చే వరకు నేను చదివిన స్కూల్లో - మలకపల్లి, కొవ్వూరు దగ్గర, పశ్చిమగోదావరి జిల్లా - సంస్కృతం లేకపోవడం వల్ల ఆ దృష్టే రాలేదు.
9 వ తరగతిలో (1965-66) మా నాన్నగారికి వేగేశ్వరపురం అనే ఊరు బదిలీ అయింది. ఈ ఊరు మలకపల్లికి 5 కిమీ పోలవరం వైపు ఉంది. గోదావరి ఒడ్డు. మా నాన్నగారు అప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్. అంతకు ముందు మా నాన్నగారు బి. ఎడ్. అసిస్టెంట్ గా ఉన్నప్పుడు వేగేశ్వరపురంలోనే (1953) పుట్టాను. మళ్ళీ 9 వ తరగతికి ఆ ఊరే వచ్చాం.
నా భాషాధ్యయనం -1 లో ( నా బ్లాగ్ లో ఉంది) నా ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి మా నాన్నగారి ప్రభావం ఎంతుందో వివరించాను. మా నాన్నగారు ఇంగ్లీష్ మరియు సోషల్ టీచర్. హెడ్ మాస్టర్ అయ్యాక కూడా SSLC (11 th standard) వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవారు.
వేగేశ్వరపురం స్కూల్ లో సంస్కృతం ఉంది. ఆ మాస్టారు చేరమనీ అన్నారు. కాని అప్పుడు సంస్కృతం తీసుకుంటే మార్కులు తక్కువ వస్తాయేమో, క్లాస్ ఫస్ట్ రానేమోనని తీసుకోలేదు. అలాగే స్కూల్ పోతుందేమో అని ప్రెసిడెంట్ స్కౌట్
గా ఎన్నికైనా ఢిల్లీ వెళ్ళలేదు. అలా సంస్కృతం నేర్చుకోవడం మొదలు కాలేదు. కాని కోరిక పోలేదు.
ఇంతలో M.Sc. అయిపోయింది (1974). ఒక 6 నెలలు ఖాళీ వచ్చింది. మా భీమవరంలో ఉన్న సంస్కృతం కాలేజీలోని లెక్చరర్ గారి దగ్గర సంస్కృత భాష ఓనమాలు మొదలు పెట్టాను. కొన్నాళ్ళు నేర్చుకునే సరికి రిసెర్చ్ లో సీటు వచ్చి హైదరాబాద్ ఆర్. ఆర్. లాబ్స్ (ఇప్పుడు IICT) లో JRF గా చేరాను. అలా తర్వాత University of Hyderabad లో రిసెర్చ్ కి మారాను. పి హెచ్. డి. కూడా పూర్తయింది. ఈ మధ్యలో CIEFL ( ఇప్పుడు English and Foreign Languages University - EFL University) లో జర్మన్ మూడు ఈవెనింగ్ కోర్సులు చేశాను. Advanced Diploma in German పూర్తయింది కూడాను.
పి హెచ్. డి. పూర్తయ్యాక (1983-84) వచ్చిన ఖాళీ సమయంలో హైదరాబాద్ దోమల్ గూడా లో ఉన్న రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈవెనింగ్ కోర్సులో సంస్కృతం నేర్పుతున్నారని తెలిసి అందులో చేరాను. అక్కడ గురువుగారు మంచి ఉపాధ్యాయులు. సంస్కృతాన్ని సరళంగా, ఆసక్తికరంగా బోధించే వారు. కాని రెండు నెలలవకుండా బెంగళూరు I. I. Sc. లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది. బెంగళూరు వెళ్ళి పోయాను సంస్కృత భాషాధ్యయనాన్ని ఆపేసి. భాష మీద పట్టేమీ రాలేదు అప్పటికి.
కాని అదే సమయంలో చందమామ ప్రచురణల వారు సంస్కృత చందమామ ప్రచురించడం ప్రారంభించారు. దానికి చందా కట్టి తెప్పించుకోవడం మొదలు పెట్టాను. పూర్తిగా అర్థం కాక పోయినా ఏదో చదువుతూండే వాడిని. శ్రమగా ఉండేది. ఎక్కువ గా చదవలేక పోయేవాడిని. బలవంతంగా కొన్నాళ్ళు చదివి ఆపేశాను. భాషలో ఏవిధమైన ప్రవేశమూ రాలేదు.
తరువాత కొన్నాళ్ళు మా ఊరు భీమవరంలో ఉద్యోగం చేశాను. అప్పుడుకూడా అడపాదడపా సంస్కృతాన్ని చూస్తూ టచ్ లో ఉంచుకున్నాను.
ఇంతలో పాండిచ్చేరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి యానాంలో చేరాను. అప్పుటికి కొద్ది స్థిమితం కలిగింది, సమయమూ దొరికింది. అప్పుడు సంస్కృతం మీదికి దృష్టి మళ్ళింది.
అప్పుడు బెంగళూరు లో విశ్వ హిందూ ప్రతిష్ఠాపన వారు సంస్కృతం పోస్టల్ కోచింగ్ మొదలెట్టారు. అందులో చేరాను. కౌముది పాస్ అయ్యాను. వారి కోచింగ్ పాఠాలు సరళంగా, ఆసక్తిని రేకిస్తూ ఉండేవి.
అప్పటికే నేను తెలుగు, ఆంగ్ల వ్యాకరణములతో సరి పోల్చుకుంటూ జర్మన్ నేర్చుకొని సఫలీకృతుడిని అయ్యాను. జర్మన్ నేర్చుకుంటున్నప్పుడే విభక్తుల ప్రాముఖ్యం, ఉపయోగం తెలిసాయి. అలాగే జర్మన్ భాషలో ప్రతి పదము పుంలింగ, స్త్రీ లింగ, నపుంసక లింగ శబ్దాలలో ఏదో ఒకటి అవుతుంది. లింగ, వచనాలని బట్టి, వాటిని బట్టి విభక్తులలో పదం చివరలు మారతాయి. జర్మన్ భాషలో రెండే వచనాలు. జర్మన్ వారికి నామవాచకము అంటే ఇష్టం. అది వాక్యం లో ఎక్కడ వచ్చినా సరే పెద్దక్షరం రాస్తారు. మనమూ రాయాలి. మన తెలుగు భాషలా ఒక్కో వర్గానికి ఒక్కో లిపి, భాష ఉండవు. అందరికీ కావ్య భాష ఒకటే.
సంస్కృతం, తెలుగులలో సంబోధన ప్రథమా విభక్తితో ఎనిమిది విభక్తులు. జర్మన్ లో నాలుగు విభక్తులే. Prepositions విభక్తులకి ప్రత్యేకంగా ఉంటాయి. ఆంగ్ల భాషలో విభక్తుల పని proposition లు చేస్తాయి. అంచేత విభక్తులు ఆంగ్లభాషలో ప్రత్యేకంగా చెప్పరు. ఆంగ్ల భాషలో పదాలు లింగ పరంగా ఉండవు. అది ఒక సౌలభ్యం ఆంగ్ల భాష నేర్చుకోవడానికి. పదాల చివర్లూ మారవు.
ఫ్రెంచ్ భాషలో పదాలు పుంలింగ, స్త్రీ లింగ పదాలుగా ప్రత్యేకంగా ఉంటాయి. లింగ, వచన పరంగా పదాల చివర్లు మారుతాయి. ఫ్రెంచ్ వారికి విశేషణములు అంటే చాలా ఇష్టం. వారు కలల మనుషులు. వారికి క్రియాన్వయంలో, tenses లో కన్న కలలు చెప్పడానికి ఒక tense ఏర్పరచు కున్నారు. అంతటి భావప్రియులు ఫ్రెంచ్ వారు.
అన్ని జాతుల వారు ఒకే ఫ్రెంచ్ భాష రాస్తారు.
ఇంతలా పక్కకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, భాషల స్వరూప స్వభావాలు క్రమాలు విజ్ఞులు తెలుసుకోవడం అవసరం. భాష ఎలా చెబితే అలా నేర్చుకోవాల్సిందే. బేరాలు, తర్కాలు ఉండవు. న్యాయాన్యాలు ఉండవు. అందరికీ ఒకటే న్యాయం. సామాజిక న్యాయం అంటూ ఉండదు.
ఆంగ్ల భాషలో put పుట్, but బట్ అవుతుందంతే. అడగడానికి, తర్కించడానికి వీలులేదు.

సంస్కృత భాష సంస్కరించ బడిన ఏ భాషా?
సంస్కృతం పరిణమించక మునుపు పాలి, పైశాచీ, బ్రాహ్మీ మొదలైన ప్రాకృత భాషలు చెలామణీలో ఉండేవి.
సంస్కృత భాష ప్రత్యేకంగా రూపొందించబడిన భాష.
సంస్కృత భాషలో మన ప్రాచీన గ్రంథాలు అన్ని రంగాలవి ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతం ఎన్నో దేశాల వారిని ఆకర్షిస్తున్న భాష. దురదృష్టవశాత్తు భారతదేశంలోనే సంస్కృత భాషను ఒక మతం యొక్క, కులం యొక్క భాషగా భ్రమించి ద్వేషించే నాస్తికులు, హేతువాదులు ఎక్కువ. వారికి ఈ అకారణ ద్వేషం ఎందుకో తెలియదు. కేరళలో ముస్లిములు, క్రైస్తవవులు ఎంతో ప్రీతితో సంస్కృత భాష నేర్చుకుంటారు.
నాకు సంస్కృత భాష అంటే ఇష్టం. నేను నేర్చుకున్నాను. సంస్కృత భాష నేర్చుకోవడాన్ని వేగవంతం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. 1990 లలో నేను ఆత్మదర్శనం అనే ఒక తెలుగు పుస్తకం మా కొలీగ్ ఇస్తే చదివాను. దానిని కొండూరి వీరరాఘవాచార్యులు రచించారు. ఆ పుస్తకం చదువుతూంటే "జ్ఞ" అనే పదం నన్ను ఆకర్షించింది.
"జ్ఞ" అంటే to know. వెంటనే నాకు ఒక స్ఫురణ వచ్చింది. ఆత్మ మనలో ఉండడం వల్ల మనం తెలుసుకో గలుగుతున్నాం అనీ మనకు అన్ని రకముల జ్ఞానములు కలుగుతున్నాయని. ఆ స్ఫురణనే పెంచుకొని ఆత్మజ్ఞానాన్ని నాదైన దృష్టితో చూడడం మొదలుపెట్టాను. నిజానికి నాదైన దృష్టి మన ఉపనిషత్ స్రష్టల దృష్టి అని తరవాత్తరవాత తెలిసింది. వ్యాఖ్యానాల వల్ల రూపు మారిపోయింది అనీ అర్థం అయింది.

ఆస్తికులు సంస్కృత భాషను దేవభాష అంటారు. అంతటి దివ్యత్వం ఉంది సంస్కృత భాషలో.
నేను విశ్వహిందూ ప్రతిష్టాన బెంగళూరు వారి పోస్టల్ కోచింగ్లో సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన రోజుల్లోనే ఆత్మజ్ఞానం అవగాహన కలగడం ప్రారంభించింది అని ముందు భాగంలో చెప్పాను.
కొండూరి వీరరాఘవాచార్యుల ఆత్మ దర్శనం పుస్తకం చదువుతున్న రోజుల్లోనే గుంటూరి లక్ష్మీకాంతం గారు రచించిన "నాయన" అనే శీర్షిక కల పుస్తకం నా చేతికి అందింది. ఆ రచయిత అన్నగారి కుమారులు గుంటూరి రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన మంచి జ్ఞాన సంపన్నులు. అన్ని విధముల పుస్తకాలు చదివి మంచి అవగాహన సంపాదించిన వారు. ఆయనతో సంభాషణలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి.
మా మాటల్లో ఆయన నన్ను కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని తెలుసా అని అడిగారు. తెలియదని చెప్పారు. అప్పుడు ఆయన కావ్యకంఠ గణపతి ముని గురించి టూకీగా చెప్పారు. నేను గణపతి ముని వ్యక్తిత్వం పట్ల, జీవితం పట్ల, ఆయన ప్రజ్ఞా పాటవాల పట్ల ఆకర్షితుడనయ్యాను. "నాయన" ఆయన ఆత్మకథ.
"నాయన" పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నారు. నేను ఏక బిగిని చదివేసాను. ఎంతో ప్రభావితుడ నయ్యాను. ఆ చదవడంలో గణపతి ముని రమణ మహర్షిని గురువుగా భావించారని తెలిసి రమణ
మహర్షి మీద ఆసక్తి కలిగి, పెరిగింది.
అంతవరకు రమణమహర్షి గురించి నాకు తెలిసినది చాలా స్వల్పం. చలం తన చివరి రోజులు రమణాశ్రమంలో గడిపాడు అనే సందర్భంలో మాత్రమే రమణమహర్షి గురించి విన్నాను. ఆయన ప్రతిభ "నాయన" పుస్తకం చదివాక తెలిసింది. "నాయన" అనేది రమణమహర్షి గణపతి మునిని పిలిచే పిలుపు అనీ తెలిసింది.
నాయన 1905 ప్రాంతంలో బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్న స్వామిని ఒకటి రెండు సార్లు కలుసుకొని, మూడవ సారి ఎంతో ఆర్తితో మహర్షిని తపస్సు అంటే ఏమిటి అని అడిగి ఆయన సమాధానానికి అప్రతిభుడై, తక్షణం బ్రాహ్మణ స్వామిని గురువుగా స్వీకరించి, ఆయన అసలు పేరు వేంకట రామన్ అని తెలుసుకొని ఆయనకు రమణ
మహర్షి అని పేరు పెట్టారు. ఆ పేరే బ్రాహ్మణ స్వామికి
స్థిరపడింది. అదే సమయంలో శ్రీ గణపతి ముని ఇంద్రాణీ సప్తశతి తెలుగు అనువాదం చదివాను. ఆయన ప్రతిభా వ్యుత్పన్నల గురించి మరొక సారి ప్రస్తుతిస్తాను. రమణుల గురించి ప్రత్యేకంగా రాస్తాను.
నా సంస్కృత భాషాధ్యయనానికీ దీనికి సంబంధం ఉంది. ఉపనిషత్తులు, భారతీయ తత్త్వశాస్త్రం సంస్కృతంలో రచించబడ్డాయి. ఆత్మజ్ఞానం గురించి సంస్కృతభాషలో ప్రవేశం ఉండి తీరాలని చాదస్తుల, సాంప్రదాయీకుల నమ్మకం. మరోమాట చెబితే వినరు. మాట్లాడితే, శంకరుని, రామానుజులని, మధ్వాచార్యులని ఉటంకించే సాంప్రదాయ వాదులు,
ఆచార్యుల వ్యాఖ్యానాలను చిలుక పలుకుల్లా అప్పచెబుతారు. వారికి కల అవగాహన పరిమితం.
తమ తత్త్వంలో, సాంప్రదాయంలో, వేదాంతంలో నిష్ణాతులైన వీరు "వారి సాంప్రదాయం అనే నూతిలో కప్పలు". మరొక వివరణ అస్సలు వినరు.
ఇటువంటి వారు సంస్కృతం రాని నా వ్యాఖ్యను కొట్టిపారేస్తారు. అందుకని సంస్కృతం నేర్చుకొని తీరవలసిన అవసరం కలిగింది నాకు. నాకు తరువాత సంస్కృత భాషతో సంబంధం లేకుండా ఆత్మ/బ్రహ్మ జ్ఞానముల మీద అవగాహన కలిగినా
విమర్శకులను తట్టుకోవడానికి సంస్కృత భాషలో అభినివేశం ఉండి తీరాలని నిశ్చయించుకున్నాను.

భాష మీద పట్టు రావాలంటే ప్రతి భాషలోనూ వ్యాకరణం, శబ్ద సంపదా మన సొంతం చేసుకోవాలని నాకు అర్ధం అయ్యింది. సంస్కృత భాషకు సంబంధించినంతవరకు పదాలు ఇంచుమించులో తెలుగు వారమైన మనకు పరిచయమే. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల విభక్తుల ప్రాముఖ్యం, పదాల చివర్లు వచన, లింగ, విభక్తులని బట్టి మారతాయనీ తెలిసింది.
స్కూల్ లో తెలుగు విభక్తులు నేర్చుకున్నా మాతృభాష అవడం వల్ల పదాల చివర్లు మారడం అనే స్పృహ కలగలేదు. ఈ విషయం తెలియక 9 వ తరగతిలో మా హిందీ మాష్టారు మాకు హిందీ వ్యాకరణం చెబుతూంటే ఎందుకు సరిగా అర్థమవలేదో ఇప్పుడు తెలిసింది. హిందీలో కూడా శబ్దాల స్త్రీ, పుంలింగ విభాగాన్ని, వచనాన్ని బట్టి కా, కీ, కే లు వస్తాయని ఈ సందర్భంలో తెలిసింది. పదాన్ని బట్టి చివర్లు మారతాయి అని అప్పటికి అనుభవం కాలేదు. స్పృహా రాలేదు. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల ఈ స్పృహ కలిగింది.
ఆ స్పృహతో సంస్కృతం నేర్చుకోవడం తేలిక అయింది. వ్యాకరణాన్ని ఆంగ్ల వ్యాకరణంతో సరిపోల్చి నేర్చుకున్నా. దానితో వ్యాకరణం సులువుగా మచ్చికైంది. పదాలు తెలిసినవే. దానితో పాటు సంస్కృతం చందమామ చదవడం కూడా మొదలుపెట్టాను. పోస్టల్ కోచింగ్ ఎలాగా ఉంది.
ఒక విధమైన సులువుతో ఆడుతూ పాడుతూ సంస్కృత భాషాధ్యయనాన్ని ఆనందిస్తూ చేశాను.
ఆ హుషారులో సంస్కృతంలో "పరాన్నజీవినః" అని ఒక చిన్న కథ రాసి సంభాషణ సందేశః కి పంపించాను. అది ప్రచురించ బడింది. ఆ తర్వాత ఇంకో 3 కథలు, 3 వ్యాసాలు సంభాషణ సందేశః లో ప్రచురించ బడ్డాయి. అవి:
కథలు:
విస్మృతిః; బ్రిగీటా, అనాఘ్రాతమపి ఆఘ్రాతం పుష్పమ్
వ్యాసములు:
శూన్యాని; కాలః నామ; ఆత్మా-మనః-ధ్యానమ్
కొన్ని కవితలు రాసాను. అవి:
గిరిఝరిః, సౌందర్య లహరి; విష్ణు వైభవమ్
కనకదుర్గా స్తవమ్; శ్రీ రామచంద్రాష్టకమ్;
త్రిపురసుందరీ దశశ్లోకీ; శ్రీ కమలాంబికా ద్వాదశ మంజరీ స్తోత్రమ్; కోऽహమ్
అహంశబ్ద తాత్పర్య దర్శనమ్ - అనే వ్యాసం కూడా రాసాను.

నేను సంప్రాయబద్ధంగా సంస్కృతం నేర్చుకోలేదు. కావ్యాలు చదువుకోలేదు. ఆధునిక పద్ధతిలో నా అంతట నేను నేర్చుకున్నాను. నా భాషా పాటవం సంస్కృతంలో కథలు, వ్యాసములు, ఛందస్సులేని కవితలు రాయడానికి సుబ్బరంగా సరిపోతుంది. ఉపనిషత్ వాజ్ఞయం, ఇతర దర్శనములు, సూత్ర కావ్యములు చదివి అర్థం చేసుకొనేందుకు సరిపోతుంది. 
తరువాత Elements of Cognitive Science I Ancient Indian Spiritual Wisdom అనే పరిశోధనా కార్యక్రమంలో మునిగిపోయి సంస్కృత సారస్వత సృష్టి చేయలేకపోయాను. నేను సంస్కృతంలో చేసిన సాహిత్య సృష్టి అత్యల్పము. కాని నాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
మళ్ళీ త్వరలో సంస్కృత సారస్వత సృష్టి మొదలుపెట్టాలని సంకల్పం.

Monday, August 13, 2018

సత్య దర్శనం ; What and Who shaped our lives?; ఇంగిత లేమి; The Sand Particles; ద్వేషించే మేధావులు; Recognition; గృహస్థులు, గృహిణులు; మాధవ ఉవాచ

సత్య దర్శనం 

ఈ ప్రపంచంలో నిజం తెలుసుకోవడం కన్న ఒక విధమైన ఊహాలోకంలో ఉండడం చాలా మంది తెలియకుండా చేసే పని. సత్య దర్శనం కన్న సత్య మిథ్యా దర్శనాలే, వ్యాఖ్యానాలే అలరిస్తాయి. మిథ్యాసత్యం ఒక అబద్ధపు లోకంలో విహరింప జేస్తుంది.
కలల ప్రపంచం ఇచ్చే హాయి మరొకలా కలుగదు. ఒక పరిమితిలో కలల ప్రపంచంలో జీవించడం అవసరమే. ఉపయోగమే.
సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వల్ల, ఆశా భంగానికి కూడా లోను కావచ్చు. సత్యాన్ని మనం ఒకలా ఊహించుకొని ఆ అబద్ధపు లోకంలో ఉండడం ఎక్కువగా జరుగుతుంది.
ఉపనిషత్తులు, ఇతర వేదాంత గ్రంథాలు, షడ్ దర్శనాలు, ఆచార్యుల వేదాంతాలు ఏం చెప్పాయో‌
సరిగా తెలుసుకోకుండా ఊహించుకోవడం ఒక అవగాహనను ఇస్తుంది. ఈ అవగాహన లోనే ఉండిపోవడం ఒక విధమైన స్థిమితాన్ని ఇస్తుంది.
ఈ అసంపూర్ణ అవగాహన చాలామందికి చాలా వరకు సరిపోతుంది. సంపూర్ణ అవగాహన ఎప్పుడైనా కలిగితే అది నిజం కాదని అనిపిస్తుంది.
సంపూర్ణ అవగాహనతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని అనిపించి వారిని ఈసడిస్తారు. మిడి మిడి జ్ఞానం ఇచ్చే భరోసా అంతటిది.
అసమగ్ర వ్యాఖ్యానం సమగ్ర వ్యాఖ్యానాన్ని తప్పు అనుకుంటుంది. ఇదంతా ఎందుకంటే నిజం, సత్యం మన ఇష్టాయిష్టాలకు, నచ్చిన వ్యాఖ్యానాలకు, ప్రవచనాలకు, ప్రాచుర్యానికి, ప్రచారాలకు విరుద్ధంగా ఉంటే మనం సత్యాన్నే నిరసిస్తాము. నిలదీస్తాము.
ప్రపంచంలో సత్యాన్ని ఎవరికి కావలసినట్టు వారు
అన్వయించుకొని, అవగాహన చేసుకొని శాంతి సుఖములు అనుభవిస్తారు.
అసలు నిజం అంటూ ఉండదు. ఎవరి వేదాంతావగాహన పరంగా వారికి వారి నిజం ఉంటుంది.
ఇలా కలిగిన వివిధ అవగాహనల వల్ల సత్యం మరుగున పడి అసలు సత్యం ఏదో చెప్పడానికి వీలు లేకుండా తయారవుతుంది. ఎవరి సంప్రదాయం వారిది. అలా సమాంతరంగా ప్రశాంతంగా ఉంటే ఎంతో శాంతి సౌఖ్యాలు. కలహించుకుంటే అనవసర స్పర్ధలు.
*********
What and Who shaped our lives?
Definitely the Ramayana, the Mahabharata, the Mahabhagavata, the upaakhyaanas present in them, the Panchatantra, the Hitopadesa, the Jataka Tales, the spiritual literature from the Upanishads have shaped our lives who are born between 1950s and 1980s.
The movies had a tremendous effect on our psyche and we have unconsciously and unintentionally became the fans of cine stars. The cine lyrics have also refined our literary taste and sense in addition to the classical literature.
These pleasant and charming conditions moulded our interests and love for life and living.
Also our parents and elderly relatives and family friends became examples by their living.
Our parents especially have been our spiritual gurus, and even today we do not go to any swami, Baba, Amma, sanyasi or a spiritualist. Our parents' teaching by their practice and behaviour has been so profound and deep. We learnt through their words, deeds, actions and reactions how to face a problem in family or outside. Our teachers in primary, secondary, tertiary levels of learning and in the University have been adequately useful and influencing.
We as human beings have been shaped by aesthetic literature, fine-arts, parents, elders and creative people around. Learning has been earnest.
So many things and persons are necessary for the useful upbringing of kids.
Nowadays these aspects are either ignored and forgotten or considered unnecessary.
Thus we are all suffering the absence of such responsible upbringing. A nation or society need so much effort to train and shape their little citizens. Such responsibility is unfortunately missing now.
*******
ఇంగిత లేమి
భారతదేశంలో ఉన్న వైవిధ్యాలకు అనుగుణంగా ఏ మేధావి, సాహితీ కారుడు, మతం ప్రవక్తలు, నాస్తికులు, హేతువాదులు ఇతర కళాకారులు, జ్ఞానులు సమైక్యతను అందించడం లేదు.
వేల సంవత్సరాల చరిత్ర ఒకటే అంటుంది.
ఏ మతమూ ఇంకో మతాన్ని లేకుండా చేయలేదు.
ఏ సంస్కృతీ ఇంకో సంస్కృతి, నాగరికత సంప్రదాయాలు, సంస్కారం లేకుండా చేయలేదు.
సర్దుకు పోవడమే నాగరికత. సంస్కృతి. సంస్కారం, సాంప్రదాయం.
దీనికి విరుద్ధమైనవి సంఘంలో శాంతి సుఖములు లేకుండా చేస్తాయి తప్ప మరేమీ సాధించలేవు.
ఈ మాత్రం ఇంగితం ఇప్పటి వారిలో ఎందుకు లోపించిందో అర్థం కాదు. సంస్కర్తలు వచ్చారు, సంస్కరించారు, పోయారు. మళ్ళీ మామూలే.
ఓ మతాన్నో, ఓ కులాన్నో, ఓ ప్రాంతాన్నో, ఓ సంస్కృతినో, ఓ భాషనో, ఓ సాంప్రదాయాన్నో ఓ ఉప జాతీయతనో, ఓ సిద్ధాంతాన్నో పట్టుకువేలాడక మానవులందరి సుఖశాంతులు కోరుకోవాలి. లేకపోతే ఎవరికీ సుఖశాంతులు ఉండవు.
ఇతరులకు హాని కలిగించని ఎవరి సాంఘిక, మత, కుల, ప్రాంత, సంస్కృతీ, నాగరికతా, సాంప్రదాయ ఆచారాలను వారు అనుసరిస్తూ ఇతరులను వారి వారి సాంస్కృతిక, సాంఘిక ‌నియమాలను పాటించ నీయాలి.
ఇవి ఆదర్శవాదుల మాటలు కావు. మన ఉనికిని భద్రపరిచే చద్దికూటి మూటలు.
సామరస్యము, సౌమనస్యము, పంచని, పెంచని సాహితీ కారులు, మేధావులు, నాగరీకులు దేశానికి బరువులు. ప్రజల సుఖశాంతులకి పురోభివృద్ధికీ అడ్డులు. అడ్డంకులు.
*******
The Sand Particles
Writers, intellectuals and leaders
Are sand particles on the vast beach of
Humanity, civilization, culture and Knowledge;
But they are arrogant to besmirch
Civilisations, cultures, knowledge
And everything with their limited
Knowledge and exposure; they dictate
Ways of living to ordinary folks
And criticise great expositions
And want to replace tradition, civilization And cultures with their favourite isms
It is a routine in human societies
That such individuals destroy existing
Civilisations, culture and Knowledge
And try to replace them with their
Half-baked knowledge, "genius"
And affiliations; they disturb every
Existing thing without giving an alternative
Such internationals, writers and leaders
Are incapable of creating a new order
They only cause disorder and disturbance
********
మనకి ఏ పనీ లేకపోవడమే మనం అంతర్జాల సాలెగూళ్ళలో అస్తమానూ కనిపించడానికి కారణం. మన జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞాన ప్రదర్శన చేయాలనే ఉత్సుకత కూడా కొంత కారణం.
అంతర్జాల సాలెగూటి మాధ్యమాలు మనకి కాలక్షేపం బఠానీలు మరియు కళా ఆవిష్కరణ స్థలాలు. పోసుకోలు కబుర్లు చెప్పుకోవడానికి కాణాచులు.
నిజానికి మనం నేర్చుకునే దాని కంటే ప్రదర్శించేదే ఎక్కువ ఉంటుంది. మనకన్నీ తెలుసు. అందరికీ సలహాలిస్తాం. విమర్శిస్తాం. అన్ని దారుణాలను, దౌర్జన్యాలను మన ఇంట్లో కూర్చుని నిరసిస్తాం. తీర్పులు చెప్పి నేరస్థులను శిక్షిస్తాం. అన్ని గొడవలు మనకే. మనవే. సాంకేతికత అందించిన వరం ఇది మనకు.
*********
ద్వేషించే మేధావులు

మనకి ఆర్ధిక శాస్త్రం ఏమీ తెలియదు. కానీ ప్రభుత్వాన్ని ఆర్ధిక నిర్ణయాల్లో చీల్చి చెండాడేస్తాం.
మనకి విద్య గురించి ఏమీ తెలియదు. కానీ ప్రభుత్వం విద్యా విధానాన్ని చీల్చి చెండాడేస్తాం.
మనకి విదేశాంగ విధానం గురించి ఏమీ తెలియదు. కానీ విదేశాంగ విధానంలో ప్రభుత్వం నిర్ణయాలను చీల్చి చెండాడేస్తాం.
మనకి సంస్కృతి గురించి ఏమీ తెలియదు. కాని ప్రభుత్వ సాంస్కృతిక విధానాన్ని చీల్చి చెండాడేస్తాం.
ఇంతకీ మనం ఎవరం?
రచయితలం. మేధావులం. పత్రికల వారం. ప్రధాన మంత్రి ని ద్వేషించే వారం. మనకి అన్ని హక్కులూ ఉన్నాయి. బాధ్యతలు లేవు. దేశం బాగుపబడం కన్న
మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలే ముఖ్యం.
********
ప్రపంచంలో సత్పురుషులు రెండు పరిస్థితుల్లోనే సుఖంగా ఉండగలరు.
ఒకటి సర్వ సంగ పరిత్యాగ్యంలో.
లేదా
రెండవది అమిత ఐశ్వర్యంలో.
********
కొడుకులకు, కూతుళ్ళకు, బామ్మర్దిలకి, పెళ్ళాలకి, అయినోళ్ళకి రాసిచ్చే ఆస్తి భారత ప్రజాస్వామ్యమున
పార్టీ పెట్టుట, నడుపుట. ఓటర్లు ఇందుకై యథా శక్తి సాయం చేస్తారు. పార్టీల కుటుంబ పాలన భారత దేశమున అమలులో ఉన్న ప్రజాస్వామ్యం.
********
Recognition
Many "writers" are getting recognition because of their other backgrounds rather than literary background and merit in creation. The caste, region, religion, community, ideology, gender etc., are interfering in the "estimation" of a literary work. These backgrounds are used both by "writers" and critics. This is marginalising the literary standards.
********
గృహస్థులు, గృహిణులు నేడు మానసికంగా బేలలు అవడం వల్ల స్వాములు, సన్యాసులు, బాబాలు, అమ్మలు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు సంసారులను తేలికగా చూస్తున్నారు. ఋజు మార్గంలోనో, అడ్డంగానో సంసారులు సంపాదించే ధనము, ఆస్తిపాస్తులు, సంసారుల వ్యాపకాలు (CA, Doctor, మొదలైన ప్రొఫెషనల్స్ ల వృత్తులను వాడుకోవడం) ఉపయోగించుకుంటూ, సంసారులను అజ్ఞానులుగా, "పాపులు" గా, ఉద్ధరింపబడవలసిన వారిగా చూడడం ఈ "ఆధ్యాత్మిక" వేత్తలకే చెల్లింది.
సంసారంలో వడిదుడుకులు పడినవాడెవడూ సంసారులను తేలికగా చూడడు. ఏ బాదరబందీ లేకుండా రికామీగా బ్రతుకుతూ సంసారుల సాధక బాధకాలు తెలిసీ వారిని తేలికగా చూడడం ఆధ్యాత్మికత కాదు. పొట్ట కూటి కోసం చెప్పే మాటలు.
ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నంత మాత్రాన ఈ వేత్తలు సంసారుల కన్నా గొప్పవారు కాదు.
*********
మాధవ ఉవాచ:
సఖీ! రాధా!
చిదిమి నిన్ను పెట్టుకొనవచ్చును దీపము
అదుముకొని నిన్ను తీర్చుకొనవచ్చును తాపము
రత్నహారములచే నీ శంఖ సదృశ కంఠ సీమల నలంకరించనను
బంగారు గాజులు నీ పసిడి చేతులకు తొడిగినను
పట్టుచీర గట్టి వడ్డాణము పెట్టి నే మురిసిపోయినను
ఈ పై మెరుగులు నీ మేని సహజ సౌందర్యము ముందు
వెల వెల బోవునేమో నని సందియమగుచున్నది ప్రియా!
నీ పై ప్రేమ తప్ప మరే పెన్నిధి లేని పేదవాడను
మనసున మనసు కలిపి నీతో పొందునకై అలమటించుచున్న
చేలికాడను నీ వాడను నీవే నేను సఖీ!
శృంగారముల రస సింగారముల ముంచి తేల్చమని
రస ప్రణయ పాఠములు నేర్ప మని మురిపెముతో
నిను చేర లేదనుటలు కాదనుటలు ఈ జన్మ కింతే యనుటలు
నా హృదయము పై సమ్మెట పోటులు తల పై రోకటి పోటులు రాగమయీ!
శృంగారము నీవు తత్త్వము నేను నేరుపుచుండ
మన మేనులు పరస్పరము అల్లుకొని లీనమై
మమేకమగు క్షణములిప్పుడే రావలె
లేనిచో నేవు నేను ఆనందమునకు దూరమై దూరమగుదుము
సరసము పండవలె ప్రణయము జాలువారవలె మన రస ప్రయాణమున
సఖీ! ప్రియా! నీవును నేనును ఒకటే
రాస లీల మన సయ్యాట; మన జీవితముల జీవమదే
చెలీ! మన ప్రత్యేకానుబంధమున మనమిద్దరమూ
మన మేనుల కలయికలో పెంచుకొవలె ఫలింప చేసుకొవలె
గోపాలుడ నేను గోపికవు నీవు
పురుషుడను నేను ప్రకృతివి నీను
మన సంగతిలో పులకించును
ప్రణయము! రసాస్వాదనము!
ప్రకృతి; పుడమి అంతా!

Friday, August 10, 2018

Depression; The mystery remains; వెదజల్లినజల్లిన కేకలు; నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?; జ్ఞానం ; సున్నా లేని సంఖ్యాశాస్త్రం

Depression
Most of modern men and women suffer from depression because they either do not know to love and shower affection on near and dear or do not love and shower affection and be loved.
Humans must love and be loved. Even though modern Life and life styles ignore fellow human beings - though are near and dear - the psychological requirements need it. Amnesia for this is partially responsible for the onset of depression among modern
men and women.
Affection and love are balm to psychological afflictions. We can't survive without them.
**********
The mystery remains
I continue wondering how a literary creation gets name and fame and becomes classical. I find various genres of literary creation becoming popular and also well-read.
In any language, any type of literature , poetry, fiction, novel etc., - having different ideologies, cultures, civilizations, social, religious and spiritual - interests only a few become "great".
Narration, sticking to literary values, trends,
having wedded to a religious, social philosophy, spiritual practice, a particular genre of creation - poetry, drama, fiction and the like - might be some elements that are fanciful and dear to readers.
Critics play an important role in making or marring a literary piece. Aesthetics and live for literature of readers also make a literary piece immortal.
Still my wonder continues and the yardstick of standardization still misses to me. Popular works are not always great works just as great works are not always popular. The mystery remains.
***********
వెదజల్లినజల్లిన కేకలు
కరుణనైన నరసింహుడినైన
మరణం సమముగా వరించును
మరణించిన వారికి అన్ని బంధములు తెగిపోతాయి
హడావుడి అంతా మిగిలిన ఇంటివారిదే అభిమానులదే
వారి వారికి అనుచరులకు అనుయాయులకు
జ్ఞాపకములలో మెదలుచుందురు కొంతకాలము
ఆపై కలిసిపోదురు కాలగర్భంలో శాశ్వతంగా
ఎవరు మిగలరిక్కడ నాస్తికులైనా కవులైనా
సమాజాన్ని అతలాకుతలం చేసే వారైనా
సమాజం శాంతి సుఖములు చూసేవారైనా
సమముగా కీర్తింపబడుదురు సంఘమున
జడమగునది పార్థివదేహం; కాదు వెదజల్లిన కేకలు
*********
నీతిని పాటించే రోజులు కావివి.
నీతిని గురించి మాట్లాడే, ఉపన్యాసాలు ఇచ్చే, ప్రవచనాలు చెప్పే రోజులు మాత్రమే.
అందరం తెలివిమీరి పోయాం. ఇతరులను నీతి విషయంలో తప్పు పట్టినంత గాఢంగా మనం నీతిని పాటించం.
*******
నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?
రస సంగరమున రసేశ్వరుడు మాధవునికి సమ ఉజ్జియై చెలరేగి
కామోద్దీపనమున స్పందించిన ఆణువణువూ ఝంఝామారుతమై
తనూసాగరమునూప చెలరేగిన రత్యేచ్ఛా కెరటములతో 
పోటీ పడుచు ఎగసి పడుచున్న వక్షద్వయమును
అధ్యక్షించిన స్వామి రాధాదేవి అభీష్టమును తీర్చిన పిదప
రమణి శాంత చిత్తయై సుఖానుభూతిని ఆస్వాదించుచున్న వేళ
మాతృత్వ చిహ్నములు, మంగళ సూత్రముల వహించి
నెమ్మదిగా ఎగసిపడుచున్న ప్రేయసి పాలిండ్లను చూచి
క్షణము క్రిందట వాటి ఊపులు ఊయలలు గుర్తుకు వచ్చి
కృష్ణుడు తన నెమ్మోమున చిందించెను సుందర దరహాసము
అర్ధ నిమీలిత నేత్రయయ్యు గమనించి రాధ
వీణా స్వనమున ప్రియుడ నడిగె మత్తుగా
నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?
*********
అసెంబ్లీ కి హాజరు కాకుండా, ఏదో రిజిస్టర్ లో సంతకం పెట్టి ఎమ్.ఎల్.ఏ. వేతనాలు తీసికున్న,
తీసి కుంటున్న ప్రజాప్రతినిధులు భారతదేశంలో ఎందరో! వారిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, తమ ఇష్టారాజ్యంగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. ద్రావిడ సింహాలు కూడా అందులో ఉన్నాయి. ఉపజాతీయతతో పౌరులను విడదీసి పబ్బం గడుపుకునే, గడుపుకున్న నాయకులు మరణించినంత మాత్రాన గొప్నవారవుతారా? భారతదేశంలో అయిన దానికీ కాని దానికీ ఓపిక ప్రదర్శించడం ఒక రివాజు, దుర్గుణం అయింది.
*********
భారతదేశంలో హిందూమతం అణగద్రొక్కబడాలని కోరుకునే వారిలో ఏ మతానికి చెందం అని గర్వంగా చెప్పుకునే - వారి కుటుంబాలు అనూచానంగా సనాతన ధర్మాన్ని ఆచరించినవే - నాస్తికులు, హేతువాదులు ఎక్కువ.
ఇదేమి గోరోజనమో?
వారి పరిధిలోకి మరే మతాల మంచి చెడ్డలు రావు.
ఇదేం మూర్ఖత్వమో? లోపాలు లేని మతం పృథివిలో ఉందా?
ఈ హ్రస్వ దృష్టులకు మాత్రం ఏదీ, ఏమీ ఆనదు. సమాజ దౌర్భాగ్యం.
హిందూ మతం మీద ఈ అకారణ ద్వేషం ఎందుకో అర్థం కాదు.
*******
జ్ఞానం అంటే ఏమిటి?
ఏది కలిగితే మనశ్శాంతి ఏర్పడుతుందో అది జ్ఞానం అని ఒక నిర్వచనము.
మన జీవికకు వృత్తులలో ఉపయోగించే కౌశలములు, నైపుణ్యాలు జ్ఞానం పరిధిలోనికి రావు. అవి లౌకికమైనవి. వాటినీ మనం జ్ఞానం అంటాము.
విజ్ఞానము ప్రకృతి, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినది.
పరిజ్ఞానం మనందరం అంతర్జాల మాధ్యమాల్లో చూపించేది.
కళలు లలితకళా జ్ఞానాలకు సంబంధించినవి.
జ్ఞానం తప్ప మిగతావేవీ అజ్ఞానాన్ని పోగొట్టలేవు.
జ్ఞానము కానిది అజ్ఞానము.
********
మోడీని, హిందూ మతాన్ని తిడుతూ, హిందూ మతాన్ని మోడీ నుంచి వేరుచేయక అందరి హిందువులను, భక్తులను, జ్ఞానులను కించపరుస్తూ పబ్బం గడుపుకునే కుహనా మేధావులకు, సెక్యులరిస్టులకు ఇంగితం లేదు. హిందువుల మనసులను పదే పదే గాయపరుస్తున్నారు. మోడీ వేరు, హిందూ మతం వేరు అని ఈ అజ్ఞానులకు ఎప్పటికి తెలుస్తుంది? తెలవదు.
********
సినిమా లేని మన బ్రతుకులు
సున్నా లేని సంఖ్యాశాస్త్రం
స్మార్ట్ ఫోన్ లేని మన జీవితం
శూన్యము లేని బూలియన్ ఆల్జీబ్రా
మాల్స్ కి, మల్టిప్లెక్స్ లకి వెళ్ళని మన నాగరికత
ఆన్, ఆఫ్ గేట్ సర్క్యూట్లు లేని డిజిటల్ ఎలక్ట్రానిక్స్
పబ్లకు వెళ్లి మద్యం, మాదక ద్రవ్యాలు సేవించని
మన సంస్కృతి శూన్యము వహించని పదార్ధము
తోటి మనుషుల కుటుంబ సభ్యుల మంచి చెడ్డలు
పట్టించుకోని మన జీవనశైలి శూన్యసహిత ప్రపంచం
*******
చదవడం మనిషిని ఉత్సాహపరుస్తుంది.
అనవసరంగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది.
పగటి కలలు కనడం మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.
విచక్షణ వ్యథల నుంచి, వేదనల నుంచి రక్షిస్తుంది.
వివేకము చింతలను బాపుతుంది.
రక్తి, భక్తి జీవితాన్ని రస భరితం చేస్తాయి.
స్నేహం ఇవ్వన్నీ ఇస్తుంది. మనలని చక్కబెడుతుంది. చక్కబరుస్తుంది.
*********
ఊపిరి
వ్రాయుట కొందరికి ప్రవృత్తి
సూక్తులు చెప్పి సమాజాన్ని
మార్చెయ్యాలనే అమాయకత్వం
లేదు; నిజానికి రచనలన్నీ ఉపదేశాల
కొరకు కావు; జలపాతం దూకినట్టు
నది ప్రవహించినట్టు, మొగ్గ విరిసినట్టు
చెట్లు పూసినట్టు, చక్కని కన్నియ
సొగసులద్దుకున్నట్టు, చిక్కని దేవి
కులికినట్టు, అంతా ప్రకృతి దరహాసం;
సత్పురుషుల ఉపకార మనస్తత్వం
ప్రతిబింబించే ప్రకృతి సోయగాలు
రామణీయకము రచనకు ఊపిరి
*********

Tuesday, August 7, 2018

Citizenship and Patriotism; శంకరుడు; నారాయణుడు ; మానవుల జీవిత పరమార్థం ; మహా కవిత్వ దీక్షా విధి; సారస్వతము; అలంకారం; జనాలు; స్నేహాలు - ప్రేమలు; Burden on Society and Nation

Citizenship and Patriotism

War is part of human "civilization" and "culture". Innocent people die is only a kind-hearted and fancy statement.
Nations cannot survive without patriotism from its citizens. Humanism and human rights are a fancy and high sounding words which cannot stand the scrutiny and rigours of citizenship, and other benefits a citizen enjoys associated with such status. These are essential for human existence and living.
Nations indulging in wars is part of the game of life. These realities can't be wished away with grand statements about international citizen and like.
A citizen belongs to a country. He must love that country. Hating for what the country stands in terms tradition and culture but enjoying the civil rights provided by it is height of "awakwardness". Patriotism is essential and a must for a citizen.
*******
శంకరుడు
శంకరుడు మనకు గురుడు పార్వతీ విభుడు
శంకలు లేని నమ్మకము నిచ్చు భవుడు శివుడు
వంకర బుద్ధుల హరించు హరుడు శక్తీ మనోహరుడు
చంకనెక్కించుకొనును భక్తుల భోళా దేవుడు శర్వుడు
భావజవైరి భవానీవల్లభుడు జ్ఞానప్రదాత భాసురుడు
రవిశశాంకతేజన్నేత్రుడు రామనామ ధ్యానగతుడు
అన్నపూర్ణా విశాలాక్షీ ప్రియుడు విశ్వేశ్వరుడు వారాణసీ గంగానదీతటస్థుడు ప్రమథగణ నాయకుడు
వినాయక షణ్ముఖ గురుడు హిమాలయవాసి శంభుడు; నారాయణాద్వైతుడు నటరాజు
సత్ సాంగత్యము కలిగించి సద్వర్తనము ప్రసాదించు
హృత్ నివాసి వీణావేణుమృదంగఢమరుకవాద్య శబ్దనిలయుడు; పంచముఖుడు పశుపతి మనల
బ్రోచికాచుగాక! పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరుడు
**********
ఆర్తత్రాణ పరాయణుడు నారాయణుడు 

ఆర్తిని పోగొట్టు ఆది నారాయణుడా!
సిరిదొరా! మన్మథ జనకా! శ్రీధరా! పురుషోత్తమా!
మనసునిండి మనసే నీవై
శాంతి సుఖములనిచ్చు శ్రీహరీ!
ఆనంద లహరివై మౌనము నిచ్చు
మధుసూదనా! మధుకైటభ మర్దనా!
శివాద్వైతా! నిగమ నిగమాంత వినుతా!
మాధవా! భక్తత్రాణ పరాయణా! నారాయణా!
మోక్ష ప్రదా! ముక్తి ప్రదాతా! లక్ష్మీ మానసా! గోవిందా!
ఇందిరా వదనారవింద సూర్యా! శ్రీపతీ! శ్రీనివాసా!
భక్తి ముక్తి ప్రదాయకా! భవానీ సోదరా!
భవ బంధ విమోచనా! భావజాల నేపథ్యా!
అనుభవ గమ్యా! రమా పతీ! అచ్యుతా!
అరవింద లోచనా! హృదయారవింద వాసా!
మురళీలోలా! అన్నమయ్య రామదాసు త్యాగరాజుల
హృదయ నిధీ! మా పెన్నిధీ! సత్యజ్ఞానానంద రూపా!
తండ్రీ! నారాయణా! వాత్సల్యమున నను చేర దీయుము
సతతము నీ నామ స్మరణము చేయు భాగ్యమ్ము నిమ్ము! నరహరీ!
********
ఫేస్బుక్, వాట్సాప్ ల్లో ఏదో చెప్పేద్దామనే యావే కాని, ఆ చెబుదామనుకున్న దాన్ని శ్రద్ధగా, వర్ణక్రమ, వ్యాకరణ దోషాలు లేకుండా చెబుదామనే దృష్టే లేదు ఎందరికో. ఏ భాషలోనైనా వర్ణక్రమ, వ్యాకరణ దోషాలు పంటికింద రాయిలా అవస్థ పెడతాయని చాలా మంది ఫేస్బుక్, వాట్సాప్ రచయితలకు/రచయిత్రులకు తెలియదు. నిర్లక్ష్యమో, చేతకానితనమో తెలియదు.
********
మానవుల జీవిత పరమార్థం
ముసలితనాల్లో ఉన్నవాళ్ళందరూ
అంతర్జాల మాధ్యమాల్లో వీర విహారం
పడుచుదనాల్లో ఉన్నవాళ్ళందరూ
చదువుకు వెళ్ళి రావడంలోనూ;
చెట్టాపట్టాలేసుకుని స్నేహితులతో
స్వైర విహారంలోనూ; పబ్బుల్లో మాదక
ద్రవ్యాల, మద్యాల సేవనంలో, ఒళ్ళు ఊపుళ్ళ
మైమరపుల్లోనూ; పిల్లలు వీడియోల ముందూ;
అలా అందరూ తలో వ్యాపకం లోనూ తలమునకలై
ఉన్నారు; వినోదాలకే జీవితాలు అంకితం చేస్తూ
పుట్టి కనుమరుగై పోతున్నారు; ఏం చేసినా ఇక్కడ
మనం ఉట్టి పట్టుకొని వేలాడమనుకోండి; కానీ
సాహితీ వ్యాసంగాలు, సంగీత కార్యక్రమాలు
పుస్తక పఠనం, జ్ఞాన సముపార్జన, సద్వర్తనము
విద్యా విజ్ఞాన కళా రంగాల్లో ఆరితేరడం అరుదై;
మానవుల జీవిత పరమార్థం ఏమిటో తెలియటం లేదు
********
India will be run on the basis of caste-politicsonly; which ever political party comes to power. None of the political parties has an ideology-based program, manifesto or campaign. It has been and easy to political parties to exploit caste-divisions, caste-affiliations and caste-aspirations sans eligibility or competence.
No political party can lead India beyond and above disgusting and anti-prosperity caste-politics.
*******
మహా కవిత్వదీక్షావిధి
ఈ పదం ఉభయ కవి మిత్రులు‌తిక్కన గారి ప్రయోగం. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి ద్వారా ప్రస్తుత పరచినది.
దీనిని మహాకవిత్వ దీక్షా విధిగా నూ, మహా కవిత్వ దీక్షా విధిగానూ అనుకోవచ్చు.
మహా అనేది కవిత్వ దీక్షా విధికే విశేషణము అని నా అభిప్రాయం కూడా. కవులు ఎవరైనా, ఏ కాలం వారైనా, ఏ దేశం వారైనా, ఏ సాంప్రదాయం వారైనా కవిత్వ సృష్టిని ఉపాసనగా భావించి కవనములు, కావ్యములు అల్లారు. అల్లుతున్నారు. కవిత్వం పట్ల వారి భక్తి శ్రద్ధలు అనుపమానములు.
********
సారస్వతము 

కథలేమిటి?
మన వ్యథల సమాహారం మాత్రమేనా?
కవనమన్ననేమి?
బడుగుల బాధల 
ప్రతిఫలనమేనా?
నవలలు నవలల
చేతి కుట్టులా?
ఎంబ్రాయిడరీ యా?
సాహితీ వ్యాసములు
వాద భూయిష్టమైన
రచనల అలంకృతులా?
సాహిత్యభినివేశము
కల్పితమా?
సహజమా?
రమ్య వనితా
రమణీయ సౌందర్య
వర్ణనం, హృదయావిష్కరణం
కవితా వస్తువులు కారాదా?
ప్రణయము
శృంగారము
కవితార్చనకు
పనికి రావా?
ఏమిటో అంతా, అన్నీ
రసహీనుల చేతిలో
వేసవి సెలయేరులయ్యాయి!
కథ ఏది?
కవిత్వమెయ్యది?
నవలెటులుండును?
సాహితీ చర్చ
వాదముల పస నిర్ణయమా?
వాదముల నిగ్గు తేల్చి
బహుమతులు ప్రకటింపవలెనా?
రాద్ధాంతములు చేయవలెనా?
సారస్వతము, సాహితీ విమర్శ
చేతకాని వారి చేతులలో వాడిపోవుచున్నవి
రసఫల సృష్టి చేయలేకున్నవి
చచ్చు పుచ్చులు సారస్వతమై
"విరాజిల్లుచున్నవి"!!!
**********
ఈ వేళ ప్రచారాన్ని పొందవలసింది ఈ మతమూ ఆ మతమూ కాదు. అన్ని మతాలూ తీవ్రవాదుల కోరల్లో చిక్కుకున్నాయి.
మతాల వల్ల శాంతి సౌఖ్యాలు కలగటం లేదు సరికదా, అవి కాకుండా, ద్వేష విద్వేషాలు రగులుతున్నాయి. మతం ఎంత గొప్పదైనా ఎన్నో మతాలు, జాతులు ఉన్న సంఘంలో ద్వేషవిద్వేషాలు రగిలిస్తే అటువంటి మతాలు వర్జనీయాలు. నాస్తికులు హేతువాదులు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే వారూ వర్జనీయులే.
సమత, సౌమ్యత, సౌందర్య దృష్టి లేని మేధావులు, మతాచార్యులు సంఘానికి బరువు, విఘాతకులు.
మనకు కావలసినది మతమా, నాస్తికత్వమా, హేతువాదమా కాదు. సుఖసంతోషాలు చెడగొట్టని
ఆలోచనా స్రవంతి. భావలహరి. అనుభవ మాల. అనుభూతి చక్రం. స్ఫూర్తుల తోరణం. స్ఫురణల
ప్రవాహం. శాంతి, ఆనందము నిండిన మౌనం.
*********
నియతి తప్పిన నీళ్లు వరద.
నియతిగా దూకే నీళ్ళు జలపాతం.
నియతిగా ప్రవహించే నీరు నది.
నిర్మలముగా ఉన్న నీరు సరస్సు.
నియతిగా నిలువ ఉన్న నీళ్ళు నదీ రిజర్వాయర్ల నీరు.
లోతుగా నిర్మలముగా ఉన్న నీరు నూతి నీరు.
అలాగే మనుషులూ.
*********
అతివలు అన్ని రంగములందు ఆరితేరియున్నారు;
కవయిత్రులు, రచయిత్రులు వారు; అన్ని ఉద్యోగములకు, పరిశోధనలకు ముందు వరుసలో నున్నారు; ఇంకేల వెనుకబడిన వారిమని ప్రత్యేకతలు అడుగు చున్నారు?
********
అలంకారం
పెద్దల పుస్తకాలు చదువుతున్నప్పుడు మన మానస సరోవరంలో తలపుల అలలు లేస్తాయి. ఇందు వల్ల మన మనసు వికసిస్తుంది. మనసుకు సృజన అలవడుతుంది. రచయితలకు, కవులకు, సాహితీ స్రష్టలకు ఒక్కోసారి writer's block ఏర్పడుతుంది.
ఆ సమయంలో వారు ఏమీ రాయలేరు.
అప్పుడు మనకు నచ్చిన పెద్దల రచనలు చదవడం మనకు ఎంతో ఉపకరిస్తుంది. మనసు మళ్ళీ భావమయం అవుతుంది. సృజన చేస్తుంది. చదవడం మనిషిని నిర్మిస్తుంది. వికసింపచేస్తుంది. నిష్ణాతుని చేస్తుంది. చదవడం వల్లే మన భావములు పరిపుష్టం అవుతాయి. మన సృజనాత్మకత వర్ధిల్లుతుంది.
చదవడం ఒక ఉపాసన. తపస్సు. రసజ్ఞత పెరుగుతుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము పూరుషాళికిన్. యశఃకరి. విదేశ బంధుడున్.
చదువులలోని మర్మమూ తెలుస్తుంది. విజ్ఞత, ఇంగితం పెరుగుతాయి. సంస్కారం అలవడుతుంది. రమ్యమైన, రసమయమైన అభిరుచులు కలిగి ఎదుగుతాయి. అభిలాష పెరుగుతుంది.
సంస్కృతి సంస్కారం నాగరికత కల మనిషి సంఘానికి అలంకారం. మార్గనిర్దేశకుడు కూడా.
*******
We are not anybody or any body. We are transcendent to all body awareness-es.
******
సభ్యత తెలియని, ఇంగితం లేని జనాలు
మనం దుస్తులు వేసుకునేది మనకోసం మాత్రమే అని నేటి యువత అభిప్రాయం. ఇతరుల కోసం కాదు, వాళ్ళకి అనవసరం అనీ అంటారు. మనం ఏ దుస్తులు వేసుకున్నామో, అందువల్ల శరీరంలోని ఏ అవయవ భాగాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో అనేది మనం పట్టించుకోనక్కరలేని, ఇతరులకు సంబంధించని విషయం అని వారి గాఢ నమ్మకం.
రోడ్ల మీద, బయట మన వేసుకున్న దుస్తులు చూపే అవయవాలు, ఆచ్ఛాదన లేని శరీరం, ఆ దర్శనం ఇతరులకు కలిగించే అలజడిలతో తమకేమీ సంబంధం లేదని ఈ యువత వాదన.
సంఘ జీవనంలో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వర్తిస్తే, నర్తిస్తే, ప్రవర్తిస్తే కలిగే పర్యవసానాలు తట్టుకోవడం
సంఘంలోని వారికి చేతకాని విషయం. దుస్తులు ధరించడం దగ్గర నుంచి, ఇతరుల మనో భావాలు దెబ్బతీసేలా మాట్లాడడం వరకు నిర్లక్ష్య ధోరణి సంఘంలో ప్రబలి పోయింది. డీసెన్సీ జనాలు మర్చిపోయారు.
చదువు మనలోని మృగతత్త్వాలను సంయమించి, మనలను నాగరీకులైన పౌరులుగా తీర్చి దిద్దాలి. కాని నేటి చదువులు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. మనుషుల ప్రవర్తన, సంస్కృతి, సంస్కారం, నాగరికత ఈ నాటి చదువులకు పట్టటం లేదు. అనాగరిక జంతు తత్త్వం బాగా చిలవలు పలవలుగా విస్తరించి పోయింది.
మనందరి అస్తవ్యస్త సాంఘిక జీవనానికి సరియైన చదువుల లేమియే కారణం. చదువు మనిషిని విజ్ఞానవంతుణ్ణి చేయడంతో పాటు బాధ్యత గల పౌరునిగా తీర్చి దిద్దాలి. ఈ విషయంలో ఇప్పటి విద్యావిధానం పూర్తిగా విఫలం అయ్యింది.
ప్రవర్తనలో సున్నితత్వం, మర్యాద, గౌరవం, అభిమానం, కరుణ చూపని జాతి మృగ సదృశంగా జీవిస్తుంది. ఘోరాలు, దారుణాలకి ఒడగడుతుంది. అటువంటి సంఘంలో అశాంతి నిండి సుఖశాంతులు కరువౌతాయి. ఈ ఇంగితం ఇప్పుడు ఎందరికో లేదు.
********
స్నేహాలు - ప్రేమలు
అంతర్జాల మాధ్యమాల్లో మనకు స్నేహితులు ఎక్కువగా లేకపోయినా నిజ జీవితంలో ఉంటే ఏ లోటూ ఉండదు. అంతర్జాల మాధ్యమాల్లో మాత్రమే ఉంటే సరిపోదు. అంతర్జాల మాధ్యమాల్లో స్నేహాలు చాలా వరకు ఎప్పుడు విడాకులు అందుతాయో తెలియని అస్పష్ట, అయోమయ విషయం.
నిజానికి స్నేహం, ప్రేమ ఒకటే. ప్రేమలో స్నేహం ఉంది. స్నేహంలో ప్రేమ ఉంది. అవి ఎందుకు కలుగుతాయో తెలియని ఇది ఉంది.
*********
Intelligent Machine
Yes, humans must not be overrun by machines, though design and development of intelligent machines are reflection of human intellect. It is dangerous to cut the branch of the tree on which we are, even though it is done very creatively and craftily. Humans must use commonsense.
*******
Burden on Society and Nation
Sense is inbuilt in human beings; so also in animals.
That sense could be converted into language abilities in humans; it can't be so for animals.
But this rare ability of human beings is taken for granted and negligently practiced. We all know that proficiency in language is a must to learn and understand and communicate and teach or preach various disciplines, skills and fine-arts.
But presently in India human beings are not learning languages with the dedication, interest and respect it needs. So it would be almost impossible to have another JC Bose, CV Raman, Chandrasekhar, Y Subbarao, Rabindranath Tagore, J Krishnamurty, M Balamuralikridhna, Sobhanaidu, Kodavatiganti Kutumbarao ( an Andhra intellectual), PV Narasimharao and such great human beings.
Civilization must enhance knowledge, fine-arts, skills but not make individuals sans love for knowledge, skills, fine-arts, philosophy, spirituality. Spiritual people, philosophers, poets, scientists, skills-trained, compassion-filled adorh the society and make their nation famous and proud among comity of nations.
But in India pampering of its citizens in various ways is happening making them dependent on government forgetting their abilities. Thus the nation is filled with ineligible and incapable citizens, which has become a burden to the nation and detrimental to the progress of the country and society.




Tuesday, July 31, 2018

మా ఉజ్జయిని యాత్ర

మా ఉజ్జయిని యాత్ర 1
20, 21, 22 July, 2018
ఇండోర్ నుంచి నరసింహారావు గారి కారులో ప్రొద్దున 10 గంటలకి బయలుదేరాము. ఇండోర్ నుంచి ఉజ్జయిని 55 కి.మీ. 12 గంటలకు ఉజ్జయిని చేరాం. నరసింహారావు గారు తిన్నగా మహాకాలేశ్వరుని ఆలయానికి తీసికెళ్ళారు. మేము మరునాటి భస్మ హారతి చూడడానికి టికెట్ కోసం అడిగితే మరునాటికి టిక్కెట్ కేటాయింపులు అయిపోయాయి అని, రేపు పెందరాళే ఏడు గంటలకు క్యూ లో నిలబడితే ఆ మరునాటికి టికెట్ దొరుకుతుంది అని చెప్పారు.
వెంటనే మహాకాలేశ్వరుని దర్శనానికి వెళ్లాం. జనం పెద్దగా లేరు. 40 నిమిషాలలో దర్శనం అయి పోయింది. మహాకాలేశ్వర దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించింది. దేవుని దగ్గరకు వెళ్ళే ముందు రెండు బాల్కనీలు మీదుగా వెళ్తాము. ఆ రెండు బాల్కనీల నుంచి ఎదురుగా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. ఆ డిజైన్ ఎంతో బాగా చేశారు.
తరువాత దగ్గర లోనే ఉన్న మహాకాళి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారు ఒకే విగ్రహంలో మూడు ముఖాలతో ఉన్నారు. పై భాగం అన్నపూర్ణా దేవి, మధ్యలో హరసిద్ధా, కింద మహాకాళి. ఆలయం పురాతనమైనది.
సాయంకాలం ప్రమిదలు వెలిగిస్తారని, ఎంతో బాగుంటుంది తప్పక చూడమని చెప్పి నరసింహారావు గారు ఇండోర్ వెళ్ళి పోయారు. ఆయన స్నేహభావన, ఉపకార మనస్తత్వం మరపురానివి. ఎన్నదగినవి.
ఆయన వెళ్లి పోయాక భోజనం చేసి మా పెద్దబ్బాయి బుక్ చేసిన హోటల్ లో సాయంకాలం దాకా విశ్రమించాము.
ఉజ్జయిని అనగానే మనకు మహాకాళి, జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాకాలుడు, కాళిదాసు, భోజుడు, విక్రమాదిత్యుడు, భట్టి, భేతాళుడు, గుర్తుకు వస్తారు.
ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో ఉంది. క్షిప్ర నిజానికి నర్మదా వలె నదము. ప్రవహించి చంబల్ నదిలో కలుస్తుంది. మహాకాలేశ్వరాలయం రుద్ర సాగర్ అనే పేరు కల సరస్సు ఒడ్డున ఉంది.
సాయంకాలం సరదాగా షికారుకి బయలుదేరాము.
గుడి దగ్గరే ఆర్. ఎస్. ఎస్. వాళ్ళు నిర్మించి, మెయింటైన్ చేస్తున్న భారతమాత ఆలయం చూసాము. ఆర్. ఎస్. ఎస్. వారి దేశభక్తి నిరుపమానమైనది. అక్కడ సరస్సుపై నుంచి వచ్చే చల్లని గాలి ఎంతో ఆహ్లాదపరచింది.
అప్పుడు చీకటి పడడంతో దీప ప్రజ్వలన చూడడానికి మహాకాళి ఆలయానికి వెళ్ళాం. రెండు దీప స్తంభాలకున్న ప్రమిదల్లో ఈ దీపాలన్నీ వెలిగిస్తారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.
ఆపై పక్కనే ఉన్న విక్రమాదిత్యుని స్మారక చిహ్నం చూసాము. చక్రవర్తి సింహాసనం పై కూర్చున్న భంగిమలో ఆయన విగ్రహం మలిచారు. కింద పక్కన ఆయన ఆస్థానం లోని నవరత్నముల బొమ్మలు చెక్కారు. ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది ఆ విగ్రహం ఎదురుగా.
ఇవన్నీ చూసి భోజనం చేసి హోటల్ లో విశ్రమించాము.

మా ఉజ్జయిని యాత్ర 2
భస్మ హారతి దర్శనం
ఉజ్జయిని మహాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరూ తప్పక వీక్షించేది మహాకాలేశ్వరునకిచ్చే భస్మ హారతి. ఇది తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేసే శివ పూజ. ఆరాధన. అభిషేకం. దీనికి ఆన్లైన్ లో 100 టిక్కెట్ల కేటాయింపు ఉంది. మిగతా 600 లు ముందు రోజు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ గా ఒక రోజు ముందుగా ఇస్తారు. మేము 22 తెల్లవారుజాము భస్మ హారతి దర్శనం కోసం 21 ప్రొద్దున 7 గంటలనుంచీ క్యూ లో నుంచున్నాము. పదిన్నరకు కౌంటర్ తెరుస్తారు. ఒక ఫార్మ్ ఇస్తారు. అందులో 5 పేర్లు నింపవచ్చు. ఐదుగురు క్యూ లో నుంచోనవసరం లేదు. కాని ఐదుగురి ఆధార్ కార్డులు కాని ఇతర ఫొటో ఐడెంటిటీ కార్డు కాని ఇవ్వాలి.
వాళ్ళు వెరిఫై చేసి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నంబరు ప్రకారం పిలుస్తారు. ఇప్పుడు ఐదుగురూ ఉండాలి. ప్రతివాళ్ళ ఫోటో తీసికొని ప్రతివారికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. డబ్బులేం కట్టక్కరలేదు. భస్మ హారతి దర్శనం ఉచితం. ఈ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. మేము అంతా అయ్యి హోటల్ కి వచ్చే సరికి 12 అయ్యింది. మేము, మా ఫ్రెండ్ కపుల్ భోజనం చేసి విశ్రమించాము.
సాయంకాలం మంగల్ నాథ్, కాలభైరవ దర్శనాలకు ఆటో మాట్లాడుకుని బయలుదేరాం. ఉజ్జయిని ఊరికి ఈ రెండు 8 కిమీ దూరంగా ఉన్నాయి. ముందు మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. దారిలో కృష్ణ బలరాములు, కుచేలుడు చదువుకున్న సాందీపని ఆశ్రమం మీదుగా వెళ్ళాం. కాని లోపలికి వెళ్ళలేదు.
ముందుగా మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. ఈ ఆలయం క్షిప్రా నదము ఒడ్డున ఉంది. క్షిప్రా నదము పెద్దది కాదు. మంగల్ నాథ్ ఆలయం శివాలయం. మంగలుడు - కుజునికి ఇక్కడ ఎఱ్ఱటి వస్త్రాలు దానం చేస్తారు. మేము చేయలేదు. నేనూ, నా మిత్రుడు ఇటువంటి వాటిపై ఆసక్తి లేని వాళ్ళం.
భగవంతుని దర్శించడమే మా ధ్యేయం. పూజలు పునస్కారములు చేయం. క్షేత్రాలకు జన సమ్మర్దం ఉన్నప్పుడు వెళ్ళం.
దర్శనం చేసి కొని అక్కడే ఉన్న క్షిప్రా నదము ఒడ్డున ఫొటోలు దిగి కాలభైరవ ఆలయానికి బయలు దేరాము. క్షిప్రా దాటి ఒక కిలో మీటర్ తరువాత క్షిప్రా అవతలి ఒడ్డున కాలభైరవ ఆలయం ఉంది. పురాతన ఆలయం. శక్తి పీఠానికి అనుగుణంగా ఉండటం వల్ల వామాచారమూ ఉంది. ఇక్కడ కాలభైరవునికి దారు దానం ఇస్తారు. దారు అంటే మద్యం. మందు సీసాలతో ఎందరో కాలభైరవ దర్శనం చేసుకుని దానం ఇచ్చి (భగవంతునికి సమర్పించి) ప్రసాదంగా తీసుకుంటారు.
మేమూ దారు రహితంగా దర్శనం చేసుకున్నాం. కాలభైరవుని విగ్రహం చిత్రంగా ఉంది. ముఖం మనిషి ముఖమే కాని వింతగా ఉంది. ఆ ప్రాంగణంలోనే ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని ఉజ్జయిని తిరిగి వచ్చాం. భోజనం ముగించి కాసేపు శయనించాం.
రాత్రి 11-30 కి వెళ్లి భస్మ హారతి క్యూ లో చేరాం. ముందు ముందుగా వెళితే ముందు లింగానికి దగ్గరగా కూచోవచ్చని. పదవ వరసలోనే ఉన్నాం. ముందు గేట్ దగ్గర రోడ్ మీద కూర్చున్నాం. తరువాత వచ్చిన వాళ్ళు నుంచో వలసి వచ్చింది. మా అబ్బాయి మా హోటల్ ఆలయం పక్కనే బుక్ చేశాడు. 2 నిమిషాల నడక.
తెల్లవారుజామున 1-15 వరకు అలానే ఉన్నాం. మా అదృష్టం కొద్దీ వర్షం కురియలేదు. లేకపోతే తడిసి ముద్ద అయిపోయే వాళ్ళం. 1-15 తర్వాత చెకింగ్ పూర్తి అయ్యి లోపలకు ప్రవేశించాం. నేను పట్టుబట్ట కట్టుకొని వెళ్ళాను. అక్కడున్న సెక్యూరిటీ గార్డుకి నా దాక్షిణాత్య కట్టు సరిపోలేదు. అతనే నాకు మళ్ళీ బిగుతుగా ఔత్తరాహిక పద్ధతిలో కట్టాడు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భస్మ హారతి మొదలయ్యే ముందు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాలునికి అభిషేకం మొదలవుతుంది. ఇతర జ్యోతిర్లింగ క్షేత్రముల వలె మనం ఎవరమైనా గర్భగుడిలో ప్రవేశించి శివునికి అభిషేకం చేసుకోవచ్చు. కాని సాంప్రదాయ దుస్తులు ధరించాలి.
మగవారు పంచె, కండువా (బనీను కూడా ఉండకూడదు), ఆడువారికి రవికా, చీర కట్టు.
ముందు అభిషేకం చెయ్యడం కోసమని భస్మ హారతి టికెట్ వాళ్ళందరూ సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి వస్తారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు అద్దెకిస్తారు. అభిషేకం చెయ్యడం కోసం నీరు పట్టుకోవడం కోసం పాత్రా అద్దెకు ఇస్తారు.
1-15 కి లోనికి రానిచ్చి ఒక మండపంలో 3-45 వరకు కూర్చోబెట్టారు. అప్పుడు అభిషేకం లైన్ - భస్మ హారతి లైన్ ఏర్పడి కదిలింది. మిగతా చోట్ల లాగే విఐపిలు ముందు పంపబడ్డారు. మేము ముందుగా కూర్చోవడం వీలుపడదని అర్థం అయింది. లోపల హాలు, బాల్కనీలలో ప్రవేశించే ముందు అభిషేకానికి నీళ్లు పట్టుకునే సదుపాయం ఉంది. నీళ్ళు పట్టుకుని మా క్యూ నెమ్మదిగా గర్భగుడిలో ప్రవేశించే సరికి అభిషేకం చేసేసి బాల్కనీల్లో చాలా మంది కూర్చుని ఉన్నారు. మామూలుగానే విఐపిలు ముందు లింగానికి ఎదురుగా దగ్గరగా తిష్టవేసి ఉన్నారు.
గర్భగుడిలో ప్రవేశించి ఉదకం మహాకాలుని మీద అభిషేకించే లోపే లోపలి వారు చేయిపట్టుకుని లాగేస్తున్నారు. మన తిరుమలంత హడావుడి గానూ ఉంది' మహాకాలేశ్వరుని లింగాన్ని దర్శించి, అభిషేకించాము, నేను, నా అర్థభాగమూ. క్రితం రోజు నేను టికెట్ క్యూ లో నుంచున్నప్పుడు కామేశ్వరి దర్శనానికి వెళ్ళింది. అప్పుడు గర్భగుడిలో ప్రవేశించ నిచ్చారుట. అలా ముందుగానే తను గర్భగుడిలో శివుని దర్శించుకొంది.
అభిషేకం పూర్తిచేసికొని బాల్కనీలు చేరేసరికి అవి పూటుగా నిండిపోయి ఉన్నాయి. ఏదో కష్టపడి చివరగా ఓ చోట కూర్చున్నాము. నేను ముందే చెప్పినట్టు ఆ బాల్కనీలో ఎక్కడ కూర్చున్నా శివలింగం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగానే ఉన్నట్టు నిరూపిస్తుంది. 5-6 భస్మాభిషేకం, అనంతరం భస్మ హారతి జరిగాయి. ఒక సాంప్రదాయ సన్యాసి తెచ్చిన చితాభస్మంతో అభిషేకం జరిగింది. ఇదివరకు స్మశానం నుంచే చితాభస్మాన్ని తెచ్చే వారట. ఇప్పుడల్లా చేయడం లేదు. మామూలు విభూదినే వాడుతున్నారు.
చితాభస్మంతో అభిషేకం జరుగుతున్నప్పుడు ఆడువారిని ఆ అభిషేకం డైరెక్ట్ గా చూడొద్దని, కొంగు లోంచి చూడమని అన్నారు. ఇదంతా జరిగి, భస్మహారతిచ్చి, అలంకారం చేసి మళ్ళీ అలంకారించిన మహాదేవునికి మరల హారతులిచ్చి భస్మహారతి కార్యక్రమం ముగించారు. అలా రాత్రి 11-30 నుంచి తెల్లవారి 6 వరకు భస్మహారతి కార్యక్రమం వీక్షించాము. 5-6 భస్మాభిషేకం, భస్మహారతి వీక్షించడం ఒక దివ్యానుభవం. పరమేశ్వరునితో మమేకం అయ్యాము. శివసాయుజ్యం లభించింది. ఆసక్తి, భక్తి శ్రద్ధలు ఉన్నవారు తప్పక వీక్షించ వెలసిన కార్యక్రమం.
కాని మాలాగా రాత్రి 11-30 కే క్యూ లో చేరక్కరలేదు. తెల్లవారుజామున 1 గంటకు చేరచ్చు.
హోటల్ కి వచ్చి, పడుకొని పొద్దున్న 10 గంటల వరకు లేవలేకపోయాం. తరువాత నెమ్మదిగా రిఫ్రెష్ అయ్యి భోజనం ముగించాము. మా హోటల్ దగ్గరే ఒక అప్నా గ్రూప్ వారి రెస్టారెంట్ ఉంది. అక్కడ దాక్షిణాత్య, ఔత్తరాహిక భోజనాలు, టిఫిన్ లు లభిస్తాయి. బాగుంది కూడా. మేం ఉజ్జయిని లో ఉన్నన్నాళ్ళు ఆ రెస్టారెంట్ లోనే తిన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళడానికి సాయంకాలం 4 గంటలకు ఇండోర్ వెళ్ళి పోయారు.
మేం మహాకాలుని సాయం హారతి, పూజ చూసి, మహాకాళిని మళ్ళీ దర్శించుకున్నాము. సాయం హారతి ఎంతో సుందరంగా, భక్తి ప్రదంగా జరిగింది. ఒక గంట అక్కడ గడిపాము. అంతటి మహాకాలేశ్వరుని ఎదుట నా అజ్ఞానం కొద్దీ నా అర్థభాగముతో మాట తేడా తెచ్చుకున్నాను. అప్పటి నా ప్రవర్తన గర్హనీయం. పరమశివుని ఎదుటే అలా సహనం కోల్పోవడం నన్ను ఎంతో చింతా క్రాంతుణ్ణి చేసింది. ఇదరమూ తరువాత మహాకాలేశ్వరుని ఎదుటే సర్దుకున్నాము. టిఫిన్ చేసి,హోటల్ చేరి నిదురించాము.
మరునాడు ఉదయం 6-30 కు ఉజ్జయిని లో అనువ్రత్ ఎక్స్ప్రెస్ ఎక్కి మరునాడు ఉదయం 2-30 కు బెజవాడ చేరాము. భీమవరం ట్రెయిన్ పట్టుకొని 6 గంటలకు భీమవరం చేరాము.
మా ఓంకారేశ్వర్, ఇండోర్, ఉజ్జయిని యాత్ర, పర్యటనలు ఎంతో అందమైన అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.
సమస్త సన్మంగలాని భవంతు!

Sunday, July 29, 2018

గుర్తించడం; రోజుకొక విధంగా; ఆచరణ;భావ తరంగములు; రామకృష్ణులు;మేధావి మనసు; ఎప్పుడు వంటబడుతుందో?

గుర్తించడం
చాలా ఏళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా "లేదు". ఉన్నది అని "తెలియదు". వాళ్ళ దృష్టిలో ఉన్నదల్లా ఒకే చైనా, అది ఫార్మోజా చైనా. దీనినే తైవాన్ అనీ అంటారు. 1972 వరకు ఇలా సాగింది.
మన దృష్టిలో ఏదైనా ఉండాలి అంటే అది "మనకు" ఉండి ఉండాలి. దానిని మనం గుర్తించాలి. ఇలా కాకపోతే మన వరకూ అది లేనట్టే. సువిశాల చైనా దేశం అమెరికాకు లేకపోవడం, అసలు చైనా లేకపోవడం వల్ల కాదు. చైనా ఉనికితో నిమిత్తం లేకుండా, ఆ ఉనికిని గుర్తించకపోవడం వల్ల మాత్రమే అమెరికాకు చైనా లేదు.

ఏదైనా ఒక విషయం, వస్తువు, తత్త్వం, మనిషి, దైవము ఉందా, లేదా అనే ప్రసక్తి లేకుండా, ఆ ఉనికిని మనం గుర్తించామా లేదా అనే విషయం మీద మాత్రమే ఆ వస్తువుతో మనకు మానసికంగా సంబంధం ఏర్పడుతుంది. అలాగే అన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి.
ఉనికి ప్రసక్తి లేకుండా, మన మానసిక సంబంధ బాంధవ్యాలతో మాత్రమే మన అనుబంధాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభాలు, వ్యయాలు ముడిపడి ఉంటాయి.
మన ఊహాపోహల వల్లే వేటి ఉనికితో నిమిత్తం లేకుండా మనం సుఖదుఃఖాలను అనుభవిస్తాం. మనసు చూపించేదే మనకు ఉంటుంది. మనసులో లేకపోతే మన వరకు అది లేనట్టే. మన సంబంధ బాంధవ్యాలతో మనం ఏర్పరచుకున్న గందరగోళమే
ఎక్కువ.
వ్యక్తి మరణం మనకి దుఃఖం కలిగించదు. వ్యక్తితో మనకు కల మానసిక అనుబంధం, గుర్తింపు మాత్రమే మనకు సుఖదుఃఖాలు కలిగిస్తాయి. రోజూ ప్రపంచంలో లక్షల కొద్దీ జనాలు మరణిస్తున్నారు. మనకే దుఃఖం కలగదు. కాని మన అహంకార మమకారాలని బట్టి దుఃఖం కలుగుతుంది. మరణం ఎవరికి కలిగింది అనేది ముఖ్యం. మరణం కాదు.
మన రోజూవారీ జీవితాల్లో మనసు భూతద్దంలోంచి చూడడం వల్లే మన వ్యథలకు, వేదనలకు, బాధలకు, హాయిలకు, ఇతర భావములకు, అనుభవములకు కారణం. మనవారిని నిందించడం, వారిచే నిందింపబడడం, దెబ్బలాడుకోవడం, అనవసరమైన మాటలనుకోవడం. ఊహలు, అపోహలు ఊసులను, కేసులను, సంఘటనలను అపార్థం చేసుకోవడానికి
కారణం. అరుదుగా అర్థం చేసుకుంటాం.
అలాగే మన కష్టాల్లో, దుఃఖాల్లో 90 శాతం మన మానసిక అనుబంధం వల్ల కలుగుతాయి తప్ప, ఆ వస్తువు, సంఘటన ఉనికి, జరగడం, జరగకపోవడం వల్ల కాదు.
ఎక్కువ శాతం మానసికమే అయిన, మన సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు, మరణాలు, పుట్టుకలు మనసుని నియమించు కోవడం వల్ల, మనకు కలగకుండా చేసుకోవచ్చు.
మనసుకి ఏదీ అంటకుండా జీవించగలగడం యోగం. వరం. కొందరు సహజంగానే ఇలా నిరామయంగా బ్రతకగలరు. ఎంతో "ఆధ్యాత్మికత" కలిగినా కొందరు పరమాన్నంలో చెంచా లాగ ఏ రుచీ తెలియకుండా, ఏ విషయము అర్థం చేసుకోకుండా గడిపేస్తారు. ముముక్షుత్వంతో కొందరు ఈ స్థితిని సాధిస్తారు.
మన గుర్తింపుకి నోచుకోని సంఘటనలు, వస్తువులు, మనుషులు, వాటికి జరిగేవి మనలను ప్రభావితం చేయలేవు.
మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.
సుఖశాంతులు మనసుకి సంబంధించినవి. మనసు నియంత్రణలో ఉంటే కలుగుతాయి. లేకపోతే బయటి సంఘటనతో మన అనుబంధాన్ని బట్టి సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు
"కలుగుతాయి".
********
Happiness is fleeting. Grief is sticking to the mind and heart. Grief gives focus. But we also say grief is not welcome, but the spirituality that gives same or similar focus for mind is welcome.
*******
Can present governments pass a law for right for livelihood for Indians? Right for education is useless because even if you get a certificate you may not get a livelihood.
*********
రోజుకొక విధంగా

రోజుకొక విధంగా అలంకరించి భగవంతుని మురిసిపోవుదురు భక్తులు
రోజుకొక విధంగా అలంకరించి తన పాపాయిని మురిసిపోవును తల్లి
రోజుకొక విధంగా మోసగించి ఓటర్లను, మురిసిపోవుదురు రాజకీయ నాయకులు
రోజుకొక విధంగా అరకొరగా బట్టకట్టి వెలిగి పోవుదురు నవయువతులు వీధులందు
రోజుకొక విధంగా మాటలాడి భార్య అనుమానముల
నుంచి బయటపడ యత్నించును మగడు
రోజుకొక విధంగా అల్లరిచేసి నేరుస్తున్న విద్యలు చూపి మురిపించును పసికూన తనవారిని
రోజుకొక విధంగా నెలరాజు వలె కళలు చూపి
సంకులిత మనస్కుని చేయును నెలత మగనిని
*********
ఆచరణ


పుస్తకములలో చెప్పినది ఆచరిస్తేనే ఆ పుస్తకాలకు మనం వారసులం
నలుగురికీ ఇచ్చే ఉపదేశాలు, ప్రవచనములలోని సారం మన ప్రవర్తనలో ప్రతిఫలిస్తేనే సంఘోపయోగం
సాంప్రదాయం, సంస్కృతి, సంస్కారం జీవితాలతో 
మమేకం చేసికొని వర్ధిల్లకపోతే అవి శుష్క వచనములు
ఘనతంతా మన ఆచరణలో ఉంది
మాటల్లో, రాతల్లో, ఉపన్యాసాల్లో కాదు
మనసు ప్రఫుల్లమై ఆహ్లాదం చెందితే
అది కావ్యం; ఆచరింప జేస్తే శ్రేయస్కరం
**********
ఒక మనిషిలో ముగ్గురు మనుష్యులు ఉంటారు. తను ఫలానా అని ఇతరులు అనుకునేది. తను ఫలానా అని తను అనుకునేది. తను ఫలానా అని ఆత్మీయులు అనుకునేది. కూతురు విషయం కూతురు కన్నా తల్లికే బాగా తెలుస్తుంది
*******
ఒక చక్కని పుస్తకం చదువుతున్నప్పుడు, చక్కని దృశ్యం, రూపం చూస్తున్నప్పుడు, ప్రియ, శ్రావ్య ధ్వనులు వింటున్నప్పుడు, సువాసనలు పీలుస్తున్నప్పుడు, హాయినిచ్చే స్పర్శను అనుభవిస్తున్నప్పుడు, మంచి రుచులు ఆస్వాదిస్తున్నప్పుడు, మన మానస సరోవరంలో భావ తరంగములు లేస్తాయి. వీస్తాయి. ఆ తరంగములను ఒడిసి పట్టుకుంటే అవి చిరస్మరణీయమైన కవితగానో, కథ గానో, వ్యాసము గానో, వ్యాఖ్యానము గానో రూపుదిద్దుకుంటాయి.
మన రచనలన్నీ భావ మయములే కదా!
అవగాహన నుంచి, స్ఫూర్తి నుంచి, ఆకళింపు నుంచి, అనుభవము నుంచి భావ పరంపర మొదలౌతుంది.
భావము అవగాహనాదులకు వాక్య రూపము. భాషా స్వరూపము. కర్త, కర్మ, క్రియలతో అలరారి, సారస్వతాన్ని సృష్టిస్తుంది.
భావమే సకలమునకు ఆకారము. ఆలోచన, భావము రూపంలో వేరయినా, స్వరూపంలో ఒకటి. ఆలోచన బుద్ధిది. భావము మనసుది.
అవగాహన, అనుభవము, ఆకళింపు, స్ఫూర్తి అర్థమై కలిగిన తత్పర, తాత్పర్య స్థితులు.
*******
రామకృష్ణులలో ఎందుకో మనకి కృష్ణుడంటే దగ్గరితనం. కృష్ణుడు చెలికాడిలా అనిపిస్తాడు.
రాముడు ఒక ఉపాధ్యాయునిలా అనిపిస్తాడు.
రామో విగ్రహవాన్ ధర్మః
కృష్ణః వసతి మమ హృదయే
అనిపిస్తుంది.
రామము అంటే ఆనందము.
కృష్ణుడూ ఆనంద నిలయుడే.
యోగ వాశిష్ఠంలో రాముడు శిష్యుడు.
కృష్ణుడు భగవద్గీతాచార్యుడు.
కృష్ణుని నుంచే "చాణక్య నీతి" మొదలైంది.
రాముడంతా straightforward.
కృష్ణునితో మమేకం అవడం తేలిక.
రామకృష్ణులు విష్ణ్వవతారములే అయినా వారి వారి అవతార జీవితముల తేడా ప్రస్ఫుటం.
పరశురాముడు వీరిద్దరికీ భిన్నం. నరసింహుడు వామనుడు కూడా వేరే.
విష్ణుమూర్తి ఏడు, ఎనిమిదవ అవతారములైన రామకృష్ణుల ప్రాచుర్యం మిగిలిన అవతారములకు లేదు.
భాగవత కర్త, రామాయణ కర్త వేరు వేరవడం రామకృష్ణుల "వ్యక్తిత్వ" భేదాలకు కారణమేమో!
మన మనస్తత్వం బట్టి మనం ఇష్టదైవం నిర్ణయించ బడుతుంది ఏమో!?
*********
మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి-అని ఒక రకం
పాతంతా చెత్త హృదయాలకు రంపపు కోత-ఆని ఇంకో రకం
మన సమాజాన్ని టగ్ ఆఫ్ వార్ ఆడేస్తున్నారు
అయోమయంలో వాళ్ళు నిరామయంలో మనం
సంకుచిత భావములు లేక అందరి బాగు కోరే విజ్ఞులు నేడు అంటరాని వారు
వాద ప్రతి వాదములలోకి చేరని వీరిని ఏ పక్షమూ
మననీయదు;నలుగురికీ మంచి చెప్పనీయదు
ఈ జుగుప్సాకరమైన, అశాంతి కలిగించే వాస్తవం
మారే సావకాశమే కానరాదు
మార్చే శక్తి యుక్తులు లేవు
దైవాధీనం అని వదిలేసే ప్రకృతీ కాదు
బుద్ధిని ఉపయోగించనీయని సంఘం
మేధావి మనసు రణరంగం
********
Love, war and politics function on similar principles.
******
భగవంతుని ఉనికిని తలుచుకోవడం అంటే మన అల్పత్వాన్ని గుర్తించడం అంతే. ఇంకేమీ కాదు.
********
Who allowed Swamis to represent Sanatana Dharma and "Hinduism". Grihasthas must do it. All asramas dissolve into and sustained by Grihasthaasrama!
*********
ఎవరి వ్రాతలు ఎవరి రాతలు మార్చునో ఎవరికెఱుక?
*******
ఎప్పుడు వంటబడుతుందో?
ఇదివరకు మన ఇళ్ళల్లో తల్లుల దృష్టి పూర్తిగా పిల్లల మీద కుటుంబం మీద ఉండేది. కాలక్షేపమూ అయ్యేది. ఇప్పుడు ఒకటి, లేక రెండూ సంతానంతో ఆపేసి వాళ్ళని పెంచి పెద్ద చేసేసి ఖాళీ వచ్చినపుడు ఫేస్బుక్ లాంటివి వచ్చి అందరికీ కాలక్షేపం కలిగిస్తున్నాయి.
పక్కనే, ఇంట్లో మనుషులు ఉండటం లేదు. ఒక డెస్క్ టాప్, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ప్రపంచమే ఎదురుగా ఉంటోంది. బుర్రలో భావాలు, ఆలోచనలు, ఉపదేశాలు, తర్కాలు, చదువులు, భేదాలు, విభేదాలు, వాదాలు విరివిగా ఉన్నాయి.

వాటిని ఫేస్బుక్ మీదికి వదిలేయడమే తరువాయి, రోజుల కొద్దీ బిజీగా ఉండచ్చు. మన సలహాలు, సంప్రదింపులు ఉచితంగా అందించవచ్చు. ప్రపంచంలో చెడుని దునుమాడవచ్చు. మన సంఘీభావం ప్రకటించ వచ్చు.
ఇలా ఇంటి విషయం కావలసినంత సేపు మర్చిపోవచ్చు, స్త్రీ, పురుషులు. కాని మనకు నిజంగా మనసు బాగోనప్పుడు ఈ కార్యక్రమాలేవీ మనకు శాంతి ఈయలేవు. అప్పుడు మనం ఏం చేస్తాం?
అమ్మ ఉంటే చెప్పుకుంటాం. లేకపోతే స్నేహితులు,- రాళ్ళు. మనవాళ్ళకి మనం ఏమీకాక, ఏ స్వామినో, సాధువునో, బాబానో నమ్మి వ్యవహరించడం. మన తల్లితండ్రులు లాగ మానసిక బలం ఉండటం లేదు మనకు. పిల్లలకేమి బోధించగలం. ఇటువంటి చదువులు చదవటం లేదు మనం.
సాంఘిక సమస్యలు, గొడవలు, నిమ్నోన్నతాలు గురించి ఎంత మాట్లాడినా, ఆ పరిజ్ఞానం మనకు సుఖశాంతులు కలిగించు కోవడానికి ఉపయోగించదు. అటువంటప్పుడు ఏం చేయాలో పాలు పోదు. బయటి విషయాలపై మనం అలవోకగా ప్రదర్శించిన ఆసక్తి, సమస్యల పట్ల మన అభిప్రాయాలు, వాటికి మనం సూచించిన, ప్రకటించిన పరిష్కారాలు ఇప్పుడు మనకు ఉపయోగించవు.
కుటుంబాన్ని వదిలేసి సంఘ సంస్కరణకు నడుం కట్టడం పునాది వేయకుండా భవంతి కట్టడం. కుటుంబాలు ఇటుకలు. సంఘం భవంతి. ఇటుకలు బలిష్టంగా లేకపోతే సంఘం బలిష్టంగా ఉండదు.
ఈ ఇంగితం మనకెప్పుడు వంటబడుతుందో?