Thursday, July 26, 2018

మా ఓంకారేశ్వర్ యాత్ర

మా ఓంకారేశ్వర్ యాత్ర 1
ఓంకారేశ్వరం నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక జ్యోతిర్లింగం. చూడడానికి బయల్దేరాం భార్యాభర్తలమిద్దరమూను.
నాకు మనందరికి మల్లేనే క్షేత్ర దర్శనం, నదులు నదములంటేనూ చాలా ఇష్టం.మా ఓంకారేశ్వర్ యాత్ర 2
16-7-2018
మేము 15 వ తారీఖు ప్రొద్దున 6 గంటలకు విజయవాడలో తిరువనంతపురం-ఇండోర్ రైలు ఎక్కాము. 16 వ తేదీ ఉదయం 6 గంటలకు ఇండోర్ చేరాము. 
అక్కడ నుంచి ఓంకారేశ్వర్ 70 కి.మీ. దూరం. టాక్సీ మీద 2 గంటల ప్రయాణం చేసి ఓంకారేశ్వర్ చేరాము. ఊరు పెద్ద పల్లెటూరు.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ రాధేకృష్ణ లో చెక్ ఇన్ అయ్యాము. సంసార పక్షంగా బాగానే ఉంది. అక్కడకి అవతల ఒడ్డున ఓంకారేశ్వరరుని ఆలయం ఉంది. ముందుగా మేము
నర్మదా నదములో స్నానం చెయ్యాలి అని అనుకున్నాం.
మా హోటల్ కి దగ్గరగానే నర్మదా నదము ఉంది. పదినిమిషాల నడక. వెడల్పు ఎక్కువగా లేదు. రెండు మూడు చిన్ని కొండల మధ్య కింద ప్రవహిస్తూ ఉంటుంది. ఓంకారేశ్వర్ కి అరకిలోమీటరు దూరంలో నదమునకు ఎగువన ఒక డామ్ కట్టారు. అక్కడ నుంచి నీటిని పైపుల ద్వారా ఉజ్జయిని క్షిప్రా నదిలోకి పంపుతారు.
మధ్యప్రదేశ్, గుజరాత్ లకు నర్మదా నదము నీటి వసతి కలిగిస్తుంది. వారి పాలిటి భాగీరథి.
ఓంకారేశ్వర్, నర్మదా అనగానే మరొక విషయం గుర్తుకు వచ్చింది. ప్రఖ్యాత నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు "నర్మదా పరిక్రమ" అనే ఒక పుస్తకం రాశారు. నేను ఆ పుస్తకం చదివాను. ఆ పరిక్రమ చేసిన విధానం, ఎలా చేశారు ఆయన ఎంతో బాగా వర్ణించారు. నర్మదానదము ఒడ్డున ఒక ఊరిలో బయలుదేరి, నర్మదా పరిక్రమ చేసి మళ్ళీ బయలుదేరిన ఊరికి చేరడం. ఆయన నర్మదా నదము దక్షిణ ఒడ్డున ఒక ఊరినుంచి బయలుదేరి, అరేబియా సముద్రంలో నర్మద కలిసే చోట్లో ఉత్తర ఒడ్డుకు వచ్చి, ఆ ఒడ్డున నదము ఎగువకు పయనించి, జబల్పూర్ పైన నర్మదా నదము జన్మస్థానం చేరి, మళ్ళీ అక్కడ నర్మద దాటి దక్షిణ ఒడ్డమ్మట వారు బయలు దేరిన ఊరు చేరడం. ఈ పుస్తకం ఆసక్తి ఉన్నవారు చదవొచ్చు.మా ఓంకారేశ్వర్ యాత్ర 3
16-7-2018
హోటల్ కి ఉదయం 8-30 కి చేరాము. చెక్ ఇన్ అయ్యి, స్థిమితపడి నర్మదా నద జలాల లో స్నానానికి బయలు దేరాము. పదినిమిషాల నడక. నర్మదా నదముపై ఉన్న కాలి వంతెన అవతలి ఒడ్డుకు (ఉత్తరం ఒడ్డు) చేరుస్తుంది. అటువైపే ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. మేము ఖాళీగా ఉన్న ప్రదేశం చూసుకొని స్నానానికి 100 మెట్లు దిగాము. అది పడవల రేవు. అక్కడ నర్మదా నదము ఎంతో లోతుగా ఉంది. నీరు బాగానే ఉంది. నల్లగా అంటే నీలముగా ఉన్నాయి నీళ్లు. నేను వేగేశ్వరపురంలో గోదావరి లో చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఈదాలనుకున్నాను కానీ మా ఆవిడ వద్దంది.
పడవల వాళ్ళు మాకు ఒక బకెట్ ఇచ్చి మేము స్నానం చెయ్యడానికి సహకరించారు. ఇద్దరం ఆ బకెట్ సాయంతో ‌గట్టు మీదే స్నానం చేశాం. ఆవిడ నదీ పూజ, నేను సంధ్యావందనం అక్కడే కానిచ్చి హోటల్ కి తిరిగి చేరుకున్నాం.
మా ఓంకారేశ్వర్ యాత్ర 4
16-7-2018
స్నానం ముగించుకొని హోటల్ చేరిన మేము తయారై ఓంకారేశ్వరుని దర్శనానికి బయలుదేరాం. ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నర్మదా నదము యొక్క ఉత్తర తీరంలో ఉంది. దానికి ఎదురుగా దక్షిణ తీరాన మమలేశ్వరుని ఆలయం ఉంది. ఈ రెండింటినీ కూడా జ్యోతిర్లింగాలే అంటారు పెద్దలు.
మేమున్న హోటల్ కి దగ్గరగానే అవతల ఒడ్డున ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. పదినిమిషాల నడక. నడక వంతెన దాటి వెళ్ళాలి. గమ్మునే వెళ్ళి పోయాము. పెద్ద రష్ లేదు. పదిహేను నిమిషాలలో దర్శనం అయిపోయింది. లింగం చిన్నది.
గుజరాత్లో సోమనాథ్, నాగేశ్వర్ లలో ఉన్నట్లు అమ్మవారు అయ్యగారికి వెనుక కొలువై ఉన్నారు. అయ్యవారు ఓంకారేశ్వరుడు. అమ్మగారు పార్వతీదేవి. అమ్మవారి విగ్రహం ఆకట్టుకొనేలా ఉంది. ఎందరో ఇక్కడ నర్మదా జలాలతో ఓంకారేశ్వరుని అభిషేకిస్తున్నారు.
ఈ రోజు సోమవారం. కిందికి (100 మెట్లపైన) నర్మదా తోయముల తెచ్చి ఈశ్వరుని అభిషేకించాలి అనిపించింది. ఇంతలో అక్కడ ఒక బ్రాహ్మణుని చేతిలో నర్మదా జలాలు ఉన్నాయి. నాకు పెద్ద పెద్ద క్షేత్రాలలో, మామూలుగా కూడా పూజలు, అభిషేకములు చేయించడంపై అంతా ఆసక్తి లేదు. కాని ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో పరమేశ్వరుని అభిషేకించాలి అనిపించింది.
ఆయన మమ్మల్ని మళ్ళీ ఓంకారేశ్వరుని దర్శనానికి తీసికెళ్ళారు. తనివితీరా ఆయన అందించిన నర్మదా తోయములతో ముక్కంటిని అభిషేకించాను. లింగానికి ముందు ఎత్తుగా, అక్కడ నీళ్ళు పోస్తే ఓంకారేశ్వరునిపై జలము పైపు ద్వారా పడి అభిషేకించేలా ఏర్పాటు చేశారు.
ఆ ఏర్పాటు ద్వారా నీటిని పోస్తే ఈశానునికి అభిషేకం జరుగుతుంది. అలా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ, మేమూ గొంతు కలిపి మూడునిమిషాలు అభిషేకం చేయగలిగాం. ఎంతో సంతోషం కలిగింది. ఇలా అందరూ చేయవచ్చు.
మనసు కోతికదా, వారు పెట్టిన ఎత్తు పై నుంచి ఎవరో నీరు పోస్తే, నేనూ అలా చేశాను, శివునిపై నీరు మనమే తిన్నగా అభిషేకింనట్టుందని. కాని అలా పోస్తే నీరు లింగంపై పడదు. ఆ పని చేసినందుకు అక్కడి పూజారులచే అక్షింతలు వేయించుకొని, మరొక మారు ఆదిదంపతులను తనివితీరా దర్శించి, ఆలయం బయటకు వచ్చి, నందిని కూడా అభిషేకించి, కింద ఒక హాలులో ప్రవేశించాము బ్రాహ్మణునితో సహా.
ఆయన అక్కడ కూర్చోబెట్టి, అక్కడ ముక్కాలి పీట ఆకారంలో పాములు కాళ్ళలా ఉండి శివలింగాన్ని వహించి ఉన్న ఇత్థడి అమరికపై 
శివునికి మరల తదనుగుణ మంత్రములు చదువుతూ మరల అభిషేకం చేయించి, అమ్మవారికి అయ్యవారికి దీపదర్శనం చేయించి, పూజ చేయించి కార్యక్రమం ముగించారు. మా ఇద్దరికీ ఎంతో సంతృప్తి కలిగింది. ఆ బ్రాహ్మణుణ్ణి సంతుష్టి పరచి కాసేపు అక్కడి దృశ్యాలు వీక్షించి, ఆనందాంతరంగులమై హోటల్ కి చేరి పుల్కాలతో భోజనం అయిందనిపించి, విశ్రమించాము.
మా ఓంకారేశ్వర్ యాత్ర 5
16-7-2018
ఉదయం ఓంకారేశ్వరుని, పార్వతీ దేవిని తనివితీరా దర్శించి, అర్చించి సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు బయలుదేరి మమలేశ్వరుని దర్శించడానికి బయలుదేరాము. మమలేశ్వరుని ఆలయం నర్మద దక్షిణ ఒడ్డున ఉంది.
ఓంకారేశ్వరాలయం, మమలేశ్వరాలయం నర్మదకు ఉత్తర, దక్షిణ తీరాలలో ఉన్నాయి. మా హోటల్ నుంచి పదినిమిషాల నడక. మెట్లు దిగి ఎక్కాలి.
మమలేశ్వరాలయం ఆరు ఆలయాల సముదాయం. అన్నీ శివాలయాలే. మమలేశ్వరాలయం పెద్దది. మిగిలినవన్నీ బాగా చిన్నవి. ఒక్క మమలేశ్వరాలయంలోనే అభిషేక, పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. ఇదంతా పురాతన ఆలయాల సముదాయం.
మమలేశ్వరాలయంలో శివుని, ఆయన వెనుక ప్రతిష్ఠిత అయిన పార్వతీ దేవిని దర్శించుకున్నాము. ఈ ఆలయాన్ని ఎక్కువ మంది ఒక మామూలు దేవాలయంగా చూస్తారు, దర్శనం చేసుకునే విషయంలో, అభిషేకాదులు చేసే విషయంలో.
ఒక విధంగా ఈ ఆలయ సముదాయం పాడుపడినట్లు ఉన్నాయి. ఆలయ నిర్మాణం బాగుంది. వందల సంవత్సరాల క్రితం ఆలయాలు.
ఎందుకు ఇవి ఇలా పాడుపడినవో తెలియదు. మా హోటల్ దగ్గర ఉన్న ఒక విష్ణు మందిరాన్ని చూసాము. దానినీ ఎవరూ దర్శించడం లేదు.
తరువాత మళ్ళీ ఉత్తరం వైపుకు వెళ్లి కిందికి దిగి నర్మదానద తోయములతో సంప్రోక్షణ చేసికొని, మరల పార్వతీ దేవి, ఓంకారేశ్వరుల దర్శనం చేసి కున్నాము.

మా ఓంకారేశ్వర్ యాత్ర 6
17-7-2018
ఈ రోజు మాతో నా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు దంపతులు ఓంకారేశ్వర్ లో కలిశారు. మేం ముందు అనుకున్న ప్రకారం వాళ్ళూ మేమున్న
హోటల్ లోనే రూం తీసికున్నారు.
శంకరాచార్యుల గుహ
కలిసి మళ్ళీ ఓంకారేశ్వర దర్శనం చేసి కున్నాము. 50 మెట్లు క్రిందే ఉన్న శంకరాచార్యుల గుహను చూశాము. ఈ గుహలోనే శంకరులు తమ గురువులు గోవింద భగవత్పాదుల వద్ద సన్యాసం స్వీకరించారు.
ఆ గుహ పాతకాలం నాటిది అని తెలుస్తూ ఉంటుంది. అక్కడ శంకరాచార్యుల విగ్రహం, దానిపైన వారి గురువుల విగ్రహం ఉన్నాయి. లోపల ప్రశాంతంగా ఉంది. బాగా మెయిన్టైన్ చేస్తున్నారు. లోపల కూర్చునే సావకాశం లేదు.
భారతదేశ తత్త్వ శాస్త్రానికి అద్వైత వేదాంతపు సొబగులు అద్దిన ఆదిశంకరుల స్మరణ అక్కడ నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. అద్వైతము బౌద్ధమునకు దగ్గరగా ఉన్నదని శంకరాచార్యులను ఆస్తిక ఆచార్యులు "ప్రచ్ఛన్న బౌద్ధులు" అన్నారు.
భారతీయ తత్త్వశాస్త్రము ఉపనిషత్తులతో మొదలై
బౌద్ధ, జైన, చార్వాకములను కలుపుకొని షడ్ దర్శనముల కలయికతో ఎంతో ఎదిగింది.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఉపనిషత్తులు, బౌద్ధ, జైన తత్త్వాలు, షడ్ దర్శనములు ఒకదానిని ఖండించుకుంటూ, మిగతా వాటిలోని ముఖ్య, ప్రాధాన్య, ప్రత్యేక విషయాలను తమలో కలుపుకుంటూ (complementing and supplementing) భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశాయి. వీటిలో దేన్నీ తీసిపారేయకూడదు. అలా తీసి పారేసి ఒక సిద్ధాంతాన్నే పట్టుకు వేలాడుతూ మిగతా సిద్ధాంతాలను తీసిపారేయడం జ్ఞానుల లక్షణం కాదు. ఉత్తి అమాయకుల, పసివారల, అజ్ఞానుల లక్షణం. అంతనూ, అన్నింటినీ కలుపుకొని పోవడం తెలియని పరిమిత జ్ఞానంతో గ్రహింపు లేక చేసే దుర్వ్వాఖ్యలు మాత్రమే. తెలిసీ తెలియని మాటలే.
భారతీయ తత్త్వశాస్త్రము ఆస్తికమే కాదు, పూర్తి అయిన జ్ఞానము, విజ్ఞానము, మానసిక కార్యకలాపాలపై గొప్ప అవగాహన కలిగి, అవగాహన
ఇచ్చే జ్ఞాన బోధ మీమాంస.
నిర్పక్షపాత ధోరణితో భారతీయ తత్త్వశాస్త్రమును అభ్యసిస్తే ఈ జ్ఞానమును పొందవచ్చు. ఒక విజ్ఞాన శాస్త్రం గానూ మలచవచ్చు. మనుషులు భాషనేర్చే విధము, జ్ఞానము కలిగే విధము, మనసు, ఇతర అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియములు మానసిక కార్యకలాపాలు చేసే విధానం, విధం క్షుణ్ణంగా చెప్పే జ్ఞాన సర్వస్వము.
ఇదంతా భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఒక శుద్ధజ్ఞాన భాండాగారంగా చేసింది. తత్త్వజ్ఞులకు విందు భోజనం. మూర్ఖ శిఖామణులకు దెబ్బలాటకు పనికి వచ్చే అంశం. ఘనము, సర్వజ్ఞము అయిన భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని అవగాహన ఏర్పరచుకోవడానికి చిన్ని బుఱ్ఱలకు సాధ్యం కాదు. వాళ్ళు వాళ్ళ పరిమిత జ్ఞానంతో పేచీ పెడతారు అంతే.
ఇంతటి జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానములను అందించే అద్వైత సిద్ధాంతాన్ని గౌడపాదుల ప్రశిష్యులైన శంకరులు మనకు అందించారు. ఆ కృతజ్ఞతతో శంకరులను ధన్యవాదాలు అర్పిస్తూ పదే పదే
అభిమాన, గౌరవపురస్సరంగా తలుచుకున్నాను.
నర్మద పాయలకింద విడుట
ఓంకారేశ్వరానికి అరకిలోమీటరు ముందు నర్మదపై ఒక డామ్ కట్టారు. ఈ డామ్ తర్వాత నర్మద ఒక పర్వతం ముందు రెండు పాయలుగా విడుతుంది. మళ్ళీ పర్వతం చివర రెండు పాయలు ఒకటిగా కలిసి పోతాయి. దానిని త్రివేణీ సంగమం అంటారు. కావేరి-నర్మదల సంగమం అని అంటారు. కావేరి పదం ఎందుకు వచ్చిందో తెలియదు.
డామ్ చూడడానికి వెళ్లాం. డామ్ హై సెక్యూరిటీ లో ఉంది. మమ్మల్ని చూడడానికి అనుమతించలేదు. అక్కడ నుంచి నర్మద రెండు పాయలుగా విడడం కనిపిస్తుంది. నర్మదలో నీళ్లు సరిపడా లేకపోవడం వల్ల సంగమ స్థానానికి వెళ్ళలేకపోయాము. వర్షాకాలంలో నీళ్ళు సరిపడా ఉన్నప్పుడు నౌకా విహారం చేయవచ్చు. ఎన్నో పడవలు, మర బోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ఓంకారేశ్వర్ నర్మదపాయల మధ్య ఉన్న కొండపై నర్మద ఒడ్డుననే తక్కువ ఎత్తులో ఉంటుంది. నదములో స్నానం చేయాలంటే 100 మెట్లు దిగాలి.
ఓంకారేశ్వర క్షేత్ర దర్శనం మాకు ఎంతో వికాసాన్ని, హాయిని, ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చింది. ఓంకారేశ్వర్ ఉన్న ప్రదేశం ప్రకృతి ఒడిలో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ కనువిందు చేస్తూ పరవశింప చేసింది.

మా ఇండోర్ పర్యటన

మా ఇండోర్ పర్యటన 1
18-7-2018
ఓంకారేశ్వర్ లో రెండు రోజులు ప్రశాంతంగా గడిపి మా తరువాతి మజిలీ ఇండోర్ కి బయలుదేరాము. ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ 70 కిమీ. కారులో 2 గంటల ప్రయాణం.
అందుకనే ఓంకారేశ్వర్ లో బస చేయకుండా చూసి, వెళ్లి పోదామనుకుంటే ఇండోర్ లో బస చేసి, వచ్చి ఓంకారేశ్వర్ చూసి వెళ్లి పోవచ్చు.
ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ వెళ్ళే దారిలో 60% ఘాట్ రోడ్. అరణ్యప్రాంతం. రోడ్ ఇరువైపులా టేకు మొదలైన చెట్లు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం.
ఇండోర్ ఒకప్పుడు హోల్కర్ రాజ్య ముఖ్యపట్టణం. అహల్యాబాయి గురించి చరిత్ర చదువుకున్నప్పుడు చాలా మంది చదువుకుని ఉంటారు. అహల్యాబాయి ప్రసిద్ధి చెందిన హిస్టారికల్ పెర్సనాలిటీ.
ఇండోర్ కి వరుసగా ఈ ఏడాది భారతదేశంలో పరిశుభ్రమైన నగరం పురస్కారం రెండవసారి వచ్చింది. నగరం చాలా క్లీన్ గా ఉంది. భోపాల్ మధ్యప్రదేశ్ కి రాజధాని అయినా, ఇండోర్ అన్ని విషయాల్లోనూ భోపాల్ ని మించి ఉంటుంది. ఇక్కడ గుజరాతీ, రాజస్థానీ సంస్కృతుల ప్రభావం ఎక్కువ.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ అప్నా ఎవెన్యూ లో దిగాము హోటల్ ఏమిబియన్స్ బాగుంది. రెస్టారెంట్ లో భోజనం బాగుంది. భోజనం చేసి సాయంకాలం 4 గంటల దాకా విశ్రమించాము.
మాతో వచ్చిన మా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు కి స్నేహితుడు ఒకాయన నరసింహారావు గారు ఇండోర్ లో 9 ఏళ్ళనుంచి ఉంటున్నారు. ఆయన 4 గంటలకు వచ్చి మమ్మల్ని కలుసుకొని ఆయన కారులో ఇండోర్ లో ప్రసిద్ధమైన, పురాతన ఖజ్రానా గణేష్ మందిర్ కి తీసికళ్ళారు.
వినాయకుడు దర్శనం ఇచ్చి మమ్మల్ని అలా ఆశీర్వదించాడు. భగవంతుని కరుణ అపారము, ఆయన సంకల్పాలు మనకు తెలియవు. ఇండోర్ లో ఇటువంటి బొంబాయి సిద్ధి వినాయక ఆలయం వంటి ప్రభావం, ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఉందనే తెలియదు. కాని గణపతి దయవల్ల ఈ దర్శనం సంకల్పించి మాకు ఇచ్చాడు. గుడి బాగుంది. సిద్ధివినాయకుని ఆలయం కన్న పురాతనమైనది.
చాలా మంది దర్శించుకుంటున్నారు. పెద్ద రష్ లేదు. ఆ ఆవరణలోనే వెంకటేశ్వరాలయం, శనీశ్వరుని ఆలయం, నర్మదా దేవి, మహాలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి. ఆవరణ, పరిసరాలు బాగున్నాయి.
తరువాత నరసింహారావు గారు మమ్మల్ని వాళ్ళింటికి తీసికెళ్ళి అల్పాహారం ఏర్పాటు చేశారు. దంపతులిద్దరూ భోజనానికి ఉండడండని అభిమానంగా ఆహ్వానించారు. కాని మేము మధ్యాహ్నం కొద్దిగా ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల ఆ అభిమానాన్ని అందుకోలేక పోయాము.
ఇండోర్ కి 25 కిలోమీటర్ల దూరంలో దేవాస్ అనే ఊరు ఉంది. ఇదివరకు ఇది ఒక రాజసంస్థానం. సూరి నాగమ్మగారు రాసిన రమణాశ్రమ లేఖలు పుస్తకం లో దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఒక యువతి గురించి ప్రస్తావించిన విషయం గుర్తుకు వచ్చింది.
దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఆ యువతి పెళ్ళి ఏమీ చేసుకోనంటూ మారాము చేస్తూ రమణ మహర్షి సాన్నిధ్యంలో ఉంటూ, మీరా దేవిలా భక్తురాలిని అవుతాను అంటూ ఆశ్రమం లో పసిదానిలా విహరిస్తోండేది. దరిమిలా ఆమెకు వివాహం అవుతుంది, భర్తతో వచ్చి రమణుల దర్శనం చేసికొని కణ్వాశ్రమం వదిలి వెళ్ళలేని శకుంతలలా వెళ్ళలేక వెళుతుంది. దేవాస్ అనగానే ఇదంతా గుర్తుకి వచ్చింది.
దేవాస్ లో ఒక దేవ్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దాన్ని చూడడానికి తీసికెళ్ళారు. 500 పైన మెట్లెక్కి వెళ్ళాము. పైన ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. తుల్జా భవానీ, చాముండా దేవి లు. తుల్జా భవానీ ఆలయం క్రింద చాముండా దేవి ఆలయం ఉంది.
రెండూ పవిత్రమైన దర్శనం ఇచ్చాయి. పక్కనే ఉన్న శత్రుంజయ అవతార్ జైన మందిరం చూశాము. శత్రుంజయ అవతార్ జైన మందిరం. శాంతి నాథుడు, వర్ధమాన మహావీరుడు, ఆదినాథుడు, పార్శ్వనాథుడు ఉన్న శ్వేతాంబర్ జైన మందిరం అది.
రాత్రి తిరిగి హోటల్ కి వచ్చేసరికి పది అయింది. మరునాడు మహేశ్వర్ తీసుకుని వెళ్తానని చెప్పి నరసింహారావు గారు శలవు తీసుకున్నారు. మేము అదాలత్ (రిపీట్) చూసి శయనించాము.
మా ఇండోర్ పర్యటన 2
19-7-2018
మహేశ్వర్
18వ తారీఖున ఖజ్రానా వినాయకుని, దేవాస్ లో అమ్మవార్లను దర్శించాము. ఇవాళ నరసింహారావు గారు మమ్మల్ని మహేశ్వర్ తీసికెళ్ళారు.
మహేశ్వర్ చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇండోర్ నుంచి 90 కి.మీ. దూరంలో నర్మదానదము ఒడ్డున ఉంది. నరసింహారావు గారి కారులో బయలుదేరాము. సన్నగా వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మహేశ్వర్ చేరేదారిలో నర్మద రెండు పాయలు దాటుకుని వెళ్తాము.
మహేశ్వర్ హోల్కార్ రాజుల రాజధాని. నర్మద ఒడ్డున ఉంది. నర్మదను ఆనుకొని పెద్ద కోట కట్టారు.
అహల్యా బాయి 1761 నుంచి 1794 వరకు పరిపాలించింది. చారిత్రకంగా గొప్ప పేరు కల రాణి.
ప్రజలను ఎంతో ఆదరంగా పాలించిన ఏలిక.
భారతదేశంలో ఔరంగజేబు, ఇతర తురుష్కులు ధ్వంసం చేసిన ఆలయములను ఎన్నింటినో పునర్నిర్మించింది. కాశీ ఆలయాన్ని పునర్నిర్మించినది
ఈవిడే. ఎంతో ప్రజారంజకంగా పరిపాలించింది. ఆ సమయంలో మిగతా భారతదేశమంతా రాజకీయంగా ఎంతో అల్లకల్లోలంగా ఉంది.
మహేశ్వర్ కోట ఎంతో బాగా కట్టారు. జలదుర్గము.
దక్షిణం వైపు నర్మద సహజ అడ్డుగా ఉండి కోటకు రక్షణగా ఉంది. లోపల అహల్యా బాయి మందిరం, ఇతర కట్టడాలు ఉన్నాయి. కోటంతా ఎంతో బాగా డిజైన్ చేశారు. అక్కడ నర్మద ఎంతో నిండుగా ఉంది. ఓంకారేశ్వర్ కి 70 కి.మీ. సముద్రం వైపు ఉంది. ప్రకృతి సౌందర్యం అలరించింది. నర్మదలో నౌకా విహారం చేశాము. ఇండోర్ వారికి, ఇతరులకు ఇది వీకెండ్ రిక్రియేషన్. రిసార్ట్ లు అవి ఉన్నాయి.
మళ్ళీ 4 గంటలకు ఇండోర్ చేరాము. ఇండోర్ లో ఛప్పన్, సరాఫా అని రెండు ఫుడ్ పాయింట్స్, జాయింట్స్ ఉన్నాయి. ఛప్పన్లో అన్ని రకాల, అన్ని ప్రాంతాల తిళ్ళు లభిస్తాయి. రోడ్ ఫుడ్ వంటిది. దుకాణాల ముందు తింటూ ఉంటారు. ఒక వీధి అటూ, ఇటూ అవే.
సరాఫా అనేది రాత్రి 11 గంటలకు మొదలై తెల్లారకట్ట 3 వరకు ఉంటుంది. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. నెయ్యితో చేసిన స్వీట్లు, హాట్లు ఇక్కడ ప్రత్యేకం. బంగారం దుకాణాలు కొట్టేసాడు వాటిలో పనిచేసేవారు మొదలు పెట్టుకున్న ఈ సాంప్రదాయం ఇండోర్ వారందరి ఫేవరెట్ ఫుడ్ పాయింట్ గా, జాయింట్ గా మారింది.
ఇండోర్ లో రోడ్డు మధ్యలో సిటీ బస్ లకు ప్రత్యేక లేన్ ఉంది. ఇది ఇంచుమించు నగరంలో ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది. సిటీబస్ లకు ఇలా ప్రత్యేక మార్గం ఉండడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకు ఎంతో వేగవంతమైన ట్రాన్స్పోర్ట్ అందుతోంది. భోపాల్ లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉందిట.
10 గంటలకు రూమ్కి చేరి విశ్రమించాము. మహేశ్వర్ సందర్శనం ఎంతో చారిత్రక అనుభూతిని మిగిల్చింది.
రేపు ఉజ్జయిని ప్రయాణం. నరసింహారావు గారి కారులో ప్రొద్దున 9 కి బయలుదేరుతాము.

హిందూత్వ కాదు విద్వన్మణిహారం; తప్పనిసరి; కవి-కవిత్వము,పనికి రానివి ; దివ్యులం;భారతదేశంలో మేధావుల వీరంగం; "సావిత్రి"

హిందూత్వ కాదు విద్వన్మణిహారం

తల్లిదండ్రులను గౌరవించడం, వారిని ఆదుకోవడం హిందూత్వ కాదు; చదువు చెప్పిన, కౌశలముల
నేర్పిన పెద్దల, గురువుల పట్ల కృతజ్ఞత హిందూత్వ
కాదు; ఇంటికొచ్చిన వారికి ఇంత అన్నం పెట్టడం
హిందూత్వ కాదు; అన్నదమ్ములు, అప్పచెళ్ళెళ్ళు
పరస్పరం కలిసి మెలిసి ఆత్మీయతలు పంచుకోవడం
హిందూత్వ కాదు; స్నేహితుల, బంధువుల ఆదరించుట హిందూత్వ కాదు; "సర్వే జనాః
సుఖినోభవంతు", "వసుధైక కుటుంబకమ్" అనడం
హిందూత్వ కాదు; ఇదంతా మానవత్వం సాంఘికం
అసతోమాసద్గమయ, తమసోమాజ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతం గమయ అనడం ఇంగితం,
జ్ఞానం; అందరు మానవులకు దోసిలిలో అమృతం
స్త్రీ పురుష కుల ప్రాంత సిద్ధాంత వాద దేశ భాషా
వివక్ష లేక అందు ఊతం; రమణీయార్థ ప్రతిపాదిక
శబ్దః కావ్యః, వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్, విశ్వ శ్రేయః కావ్య పరమార్థం - ఇవేవీ హిందూత్వ కావు
సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం పంచే
ఆణిముత్యాలు; బంగరు నగలు; రసహృదయ
ఆనందములు, అనుభూతులు సంస్కృతీ చిహ్నాలు
నాగరికతా నాడులు; సంస్కార భూయిష్టములు
ఇందులో ఉన్నది హిందూత్వ కాదు విశ్వమానవ
సౌభ్రాతృత్వం, ఉపనిషత్, ఇతిహాస, శ్రుతి, స్మృతి
పురాణముల సారం; మానవులకు విద్వన్మణిహారం
***********
తప్పనిసరి
విదేశములకు వెళ్ళుట గొప్ప మోజు మనకు
సంఘంలో గౌరవం, మర్యాద, పెద్దపీట మనకు
ఇది వరకు దేశం కాని దేశానికి వెళ్ళడం
అవయోగం క్రింద లెక్క; కష్టాలని ఉవాచ
కాల ప్రవాహంలో ఎన్నో అవయోగాలు
యోగాలౌతాయి; అవరోధాలు పూలదండ లౌతాయి
ప్రపంచంలో అంతా పరిణామ శీలమే
పొట్టకై, సుఖ సంతోషాలకై వెంపర్లాటే
మనిషికి కావలసింది సంతృప్తి
శాంతిమయ జీవితం, కుటుంబ సౌఖ్యం
ఏభై ఏళ్ళ క్రితం వరకు కూడుకి, గుడ్డకి, పైకప్పుకి
లోటు లేకపోతే శ్రీమంతం క్రింద లెక్క; ఇప్పుడు
కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆరాటం, రంధి, అసంతృప్తి; ఎంత ఆస్తి సంపాదించినా తినేది
ఆవకాయ అన్నమే; బంగారం తినం; అయినా
ధనసంపాదనకై ఉరుకులు, పరుగులు; కాకి తీరు
పనీ పాటా లేని మెట్ట వేదాంతి వట్టి మాటలు కావివి
ప్రశాంత, ఆరోగ్య జీవనమునకై పెద్దలు చెప్పిన సుద్దులు
ప్రేమ, ఆత్మీయత, అనురాగము, అనుబంధాలూ
మనుషులకు అవసరం; కాని జీవనభృతి స్వదేశంలో
దొరకక విమానముల ఎగిరి సాగరాలు దాటి
పరాయి భూముల కమతం నేడు తప్పనిసరైనది
***********
ఏ దేశంలోనైనా నాయకులు లేరు. అందరూ వి నాయకులే. కు నాయకులే.
ప్రజలు తమ తమ ధోరణులతో ప్రజా సంక్షేమం చూసే నాయకులను ఎన్నుకోవటం లేదు. తమకి వ్యక్తిగతంగా ఏదేదో చేసేస్తాం అని చెప్పిన వారి మాటలు విశ్వసించి అందరి సంక్షేమానికీ ఉపయోగించే పనులను చేయనీయకుండా నాయకులు ఐదేళ్ళూ రికామీగా గడిపేసే అవకాశం ఇస్తున్నారు.
*******
Knowledge however right and ultimate can not by itself liberate one; it must be accompanied by right action and behavior. Both right knowledge and applied action are necessary to attain salvation - ability to transcend ego - ; only one of these nourishes ego and is incapable and insufficient to liberate one.
********
చాలా మంది శాస్త్రవేత్తలు, మేధావులు, ఫేస్బుక్, వాట్సాప్ లను సమయం వృథా చేసే వాటిగా
చాలా చిన్న చూపు చూస్తారు. తమ స్థాయికి సరిపడని విషయాలుగా అనుకుంటారు.
తాము గొప్ప విషయాలపై దృష్టి పెడుతున్నామని అనుకుంటూ ఇటువంటి సామాజిక సాలెగూళ్ళను తక్కువ రకం కాలక్షేపంగా నిరసనగా చూస్తారు.
ఫేస్బుక్ లాంటి చోట అన్ని రకాల మనుషులకు చోటు ఉంది. ఎవరి సోది వాళ్ళది. అయినా సత్కాలక్షేపం.
**********
We should, of course, rejoice in our memories. If we desire to do so frequently, it is a hint that we are not comfortable with our present.
*********
కుల, మతాలు వద్దని చెప్పేవాడే తప్ప వాటిని స్వార్థానికి ఉపయోగించుకోని సంస్కర్తయే లేడు.
*********
కవి లేని దేశము దేవుడు లేని గుడి,
నీరు లేని కాసారము, కలువలు లేని సరోవరము;
ఆటపాటలు లేని ఆటస్థలము
ప్రవాహము లేని నీటి గుంట
కాపు కాయని చెట్ల గుంపు
వంపు సొంపులు లేని కన్యామణి
బాజా బజంత్రీలు లేని కల్యాణము
నట్టువాంగం లేని నాట్య ప్రదర్శనము
సంగీతము వినుపింపని నీరవ నిశీధి
యువతీయువకుల రసోద్వేగము లేని విహారము
ఆవపెట్టని పులిహోర
పెరుగులో నానని "ఆవడ"
ఇల్లాలు లేని ఇల్లు
జవసత్త్వాలుడిగిన ముదుసలి
కేరింతలు కొట్టని పాపాయి
విలువ కోల్పోయిన రూపాయి
పంట పండని బీడు
వెంటబడని యువకుడు
ఎత్తులు పల్లములు లేని నారి
ఉప్పు లేని పప్పు
కప్పు లేని నివాసము
మెప్పు లేని కాపురము
********
ఉత్తరాదిని చపాతీలు
దక్షీణాదిని ఇడ్లీ సాంబార్
తిండి అలవాట్లు
గోధుమలు, వరి ధాన్యములు;
పప్పులు ఇరువురికి సమముగా
ఆహార దినుసులు
********
కవి-కవిత్వము
దివ్య భావజాలము లేని వాడు కవి కాదు
నవ్య భావ సముచ్చయముతో వెలగని వాడు
రవి కాంచనిచో కాంచువాడు కాదు
మంచిని నమ్మి మంచిని ప్రచారము చేయువాడు కవి
చదివించి తన్మయపరచి ఆనందాబ్ధిని ముంచి తేల్చునది కవిత్వము
*********
పనికి రానివి
ఎవరి మట్టుకు వారు
తమ మతం గొప్పదని,
తమ ప్రాంతం గొప్పదని
తమ కులం గొప్పదని
తమ భాష గొప్పదని, తమ యాస
గొప్పదని, తమ సిద్ధాంతం గొప్పదని
తమ వాదం గొప్పదని
తమ నినాదం గొప్పదని,
తమ విధానం గొప్పదని
తమ సంస్కృతి గొప్పదని
ఊదరగొట్టేస్తూంటారు.
కాని ఎవరూ
తమ కులం, మతం, ప్రాంతం, వాదం, సంస్కృతి,
భాష, యాస, సిద్ధాంతం, నినాదం, విధానం
ఉపయోగించి మానవాళికి సుఖసంతోషాలు
కలిగించలేకపోతున్నారు
ఇంకెందుకీ గొప్పలు పోవడాలు?
ఒకళ్ళతో ఒకళ్ళు ముష్టీ ముష్టీ
బాహీ బాహీలతోనే సరిపోతోంది
అందరు తమ తమ సంకుచిత్వాలతో
తమ తమ గొప్ప వ్యవస్థలను
పనికిరాని వాటిగా చేసేస్తున్నారు
***********
కథల కౌగిలిలో కవితల గమ్మత్తులో
ఓలలాడు నేను మైమరచిన సాహితీ పిపాసిని
********
దివ్యులం
భాషలో అనుకుంటాం మానసిక ఘోషలో జీవిస్తాం
మనసు వాక్యముల వరుస అర్థముల స్థితి
స్ఫూర్తితో తక్కువ, ఆలోచనలతో ఎక్కువ జీవించే మనం, అర్థస్పృహ అధిగమించి తత్పర తాత్పర్య
స్థితిలో బ్రతుకలేము; శాంతి, భక్తి, మౌన, మోక్ష స్వరూపమైన ఆనంద మగ్నత పొంది తరించలేము
భాషను మించిన మౌన భాషణం నేర్చుకున్న
తస్య వాచకః ప్రణవః - రీతిలో మనం దివ్యులమౌతాం
********
Wise decision
Vijay Mallya willing to come back to India and face the law: Report
A wise decision. In India one can get bail and live a life of luxury, style and happiness at home as usual as we see many stalwarts from politicians, corporate bigwigs, government officials, other type of criminals, who are adept in doing so and enjoying their life till law is tired of taking its course and punishment may never arrive at all. Like 2G trial you may be freed also.
***********
తిట్టు కవి
కలమే ఒక అస్త్రం ఆలోచనలే శస్త్రం, కులమే కవచం
కవి యోధుడా? మహాభారతపు సుయోధనుడా?
ఆభిజాత్యం, అభిమానం ఎక్కువ పాళ్లలో కలిగి
ఇతరమును, ఇతరులను దుయ్యబట్టే వాడు
కవియా! తిట్టు కవితల అల్లు తింగరి వాడా?
తను సంఘర్షిస్తూ అందరను అస్తమానూ సంఘర్షించమనే నిత్య శ్రామికుడా? బీడు భూముల
కవితా వ్యవసాయము చేయు కర్షకుడా?
సౌమ్య వాదము వంటబట్టని ఉత్తి సామ్యవాదియా?
పుర్రచేతి భావముల పుంఖానుపుంఖాలుగా వదలు,
వదరు, నిష్కారణంగా సనాతనమును రేయి పవలు
ఆడిపోసుకొను అతి వాదియా? వాదం మాత్రం ఎఱిగి
మరేమీ తెలియని వట్టి పేచీకోరా? పెడధోరణివాడా?
నిర్మల మానసము లేని ద్వేష విద్వేషాలు మాత్రం కల
సంకుచిత మనస్కుడా? సామ్యవాది ఎవడు వాడు?
***********
భారతదేశంలో మేధావుల వీరంగం
రకరకాలుగా ఆలోచించి తమ ఆలోచనలను సంఘం మీదికి వదులుతూ ఉంటారు మేధావులు.
వీరి ఆలోచనలు స్వంతం కావచ్చు లేదా తాము చదివిన, అవగాహన చేసుకొన్న ఇతరుల ఆలోచనా స్రవంతి కావచ్చు. ఒక దిశానిర్దేశం లేని సంఘంలో ఈ మేధావులు కప్పల తక్కెడ వ్యవహారంగా ఉంటారు.
వారు చెప్పినది వీరు ఖండిస్తారు, వీరు చెప్పినది వారు ఖండిస్తారు. వారి జీవితమంతా ఖండన ముండనలతో అయిపోతుంది.
సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేసే మేధావులు తక్కువై పోతున్నారు. తమ సిద్ధాంతానికి
సరిపోలేదని అనూచానంగా వస్తున్న ఆలోచనా స్రవంతిని ఆపుజేస్తారు. దానికి సమానమైన ప్రత్యామ్నాయం చెప్పరు. చెప్పలేరు. వారి సమయము, ఇతరుల సమయము వాద ప్రతివాదములతో వృథా చేసుకుంటారు. వృథా చేస్తారు.
తాము మాట్లాడే మాటల వల్ల కలిగే కష్టనష్టాలు, సాధకబాధకాలు వారికి పట్టవు. తాము మాట్లాడాలి అంతే. బాధ్యతా రహితమైన పెద్దరికం వహిస్తారు.
ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ నాయకులతో సమానంగా మేధావులూ అశాంతి, అనర్ధం కలిగిస్తున్నారు. సామాన్యులైన ప్రజాప్రతినిధులు, పాలకులు గురించి చెప్పనక్కర్లేదు. నాయకుని చుట్టూ తిరుగుతూ చెంచా గిరీ చేస్తూ అందినంత బొక్కుతూ, వెనకేసుకుంటూ తరతరాలుగా తమవాళ్ళు "సంపన్నుల" వలె బతకడానికి సరిపడా, ఇంకా నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
అనర్హులు అన్ని రంగాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి అన్ని వ్యవస్థలని, వ్యవహారాలని తమ చేతకాని తనంతో భ్రష్టు పట్టించింది చాలక వారసత్వ రాజకీయాలకు నాంది పలికి ప్రజాస్వామ్యాన్ని
కబ్జా చేశారు.
దేశ, సంఘ, ప్రజా పురోభివృద్ధి, పురోగతి పట్టించుకోక తమ అవినీతి సంపాదనలే పరమావధిగా బ్రతుకుతున్నారు.
మేధావులు, రాజకీయ నాయకులు, ఆమ్యామ్యా ఉద్యోగులు కలిసి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మాట్లాడదాం అంటే మన కులం, మతం, ప్రాంతం పేరుచెప్పి ఎక్కడెక్కడో వెళ్లి అరిచేసి, అల్లరి చేసి నోరునొక్కేస్తున్నారు. పౌరుల్లో ఉన్న అశాంతి, అసంతృప్తి ఒకనాడు తప్పక వెల్లువ కాక మానదు.
అందరికీ మండాలి. ఇప్పుడు కొందరికే మండుతోంది.
**********
సనాతన ధర్మం, హిందూ మతం చాలా గొప్పవే; ఎటొచ్చీ వాటిని పాటించే, ఆసక్తి, శ్రద్ధ, సమర్థత, అనురాగము మాత్రం ఎవరికీ లేవు. ఎందుకీ శుష్క వచనములు? శూన్య రచనలు.
గమనించండి:
గృహస్తులు, గృహిణులు, గృహస్థాశ్రమం లేకపోతే మనం ఎవ్వరం పుట్టి ఉండేవాళ్ళం కాము. సనాతన ధర్మం గృహస్థాశ్రమం, గృహిణుల ద్వారానే శోభిస్తుంది. సనాతన ధర్మం లో సన్యాసులకు, సన్యాసానికి పెద్ద పీట లేదు. అప్పుడు సన్యాసులే లేరు. సన్యాసం బౌద్ధ, జైన సంప్రదాయాల ప్రభావం, అనుకరణ.
**********
అరవిందుల "సావిత్రి" గ్రంథాన్ని అర్థం చేసికున్నవారి కంటే ఉటంకించే వారే ఎక్కువ. అలాగే చాలా ఆధ్యాత్మిక, తత్త్వ గ్రంథాలను ఏమీ అర్థం చేసికోకుండా ఉటంకించడం ఒక కళ అయింది.
జ్ఞాన సముపార్జనము, జ్ఞానాధ్యయన, అధ్యాపనలు
ఒక ఉపాసనగా చేయాలి తప్ప ఉపాధిగా చేయకూడదు.
జ్ఞాని జ్ఞానాన్ని అర్థంచేసికున్నవాడు. సాధారణ ఉపన్యాసకుడు కబుర్లు చెప్పుకుంటూ పోయేవాడు. తన వాగాడంబరంతో ఆకర్షిస్తూ పొట్ట పోషించు కుంటాడు.
********
Indian nation has become weak and inefficient because of allowing and providing pampering to ineligible individuals in all fields of human endeavour.
******
Now a days we may come across many people who talk intelligently, emotionally, foolishly, intellectually, philosophically, spiritually but need not be interestingly, pleasantly, respectfully, lovingly and dearly.
********
It is highly mysterious and surprising why do many Indian "intellectuals" dislike Mr. Modi so much and write very bad of him.
Still surprising is they are doing so and are also critising Hindu religion which has no relation to Modi and still they don't care about it and continue their tirade against Hinduism.
Their secular spirit and credentials are so "strong" almost appearing fanatic that they do not know that they completely changed the meaning and essence of secularism.
***********
మనందరం భగవంతుని మీద ఎక్కువగా ఆధారపడుతున్నాము. పురుష/స్త్రీ ప్రయత్నం చేయడం బాగా తగ్గించేశాము.
గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీ భారం అనడంగా అధికంగా జీవితాలు వెళ్తున్నాయి. పసికూనలు, ముసలివగ్గులు దైవాధీనం బస్ సర్వీస్ లా జీవితాలను గడపాల్సి వస్తోంది. వారికి దేముడు తప్ప మరో దిక్కు లేకుండా పోయింది.
*********
ఒక వైద్యశాస్త్ర, మందుల నాడి తెలిసిన జ్ఞాని ఉవాచ:
మొండి వ్యాధులకు హొమియోపతీ మంచిది.
ఇన్ఫెక్షన్ లకి అల్లోపతీ మంచిది.
ఆయుర్వేదం మందులు తయారు చేసిన మొక్క ఏ వాతావరణ పరిస్థితుల్లో పెరిగిందో దానిని బట్టి ఆ మందు రోగనివారణ శక్తి ఉంటుంది.
*********
మనం చదివే విషయాల్లో నైర్మల్యం
ఉంటే మన మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం చూసే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం వినే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం రుచి చూసే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మన అభిరుచులలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం మనసు నిర్మలంగా ఉంచుకోవాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం పరిగ్రహించే విషయాలు నిర్మలమైనవి అయి ఉండాలి.
*********
Doing anything with concentrated mind is meditation - physical or psychological.
*******
మనలో లేని ప్రతిభ మరొకరిలో ఉంటే ముచ్చట పడతాము. వారిని అభిమానిస్తూ గౌరవిస్తాము.
మరికొందరుంటారు: వీరు ప్రతిభ ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్య పడతారు. లోపల, లోపల ఏడుస్తూ ఉంటారు.

లోకో భిన్న రుచిః.
********
The ridiculous statement by a suspected corrupt small fellow commenting about another small fellow, his mentor, as a "greater" administrator than Krishna is really misusing the freedom of expression. Why these vowed atheists talk about Hindu
religion and its Divine Personalities is different to fathom.
Who asked his opinions like this and why he takes that liberty to make short of Hindu Gods? It is very irritating.


Friday, July 13, 2018

పెళ్లి; తెలుగుదనం; Passion; హిందువులు; అసాంఘిక శక్తులు

పెళ్లి
పెళ్లి చేసుకోకపోతే మీరు ఎవరికీ ఏమీ కారు. ఎవరికీ ఏమీ చెయ్యక్కరలేదు.
మీకూ ఎవరూ ఉండరు. మీకూ ఎవరూ ఏమీ చెయ్యరు.
పెళ్లి చేసుకుంటేనే అన్ని బాదర బందీలూను.
***********
Love is intuitive intimacy.
*****
తెలుగుదనం
భాగవత పద్యములను పిల్లలకు నేర్పు ఒరవడి లేదు
కృష్ణ, సుమతీ, వేమన, భాస్కర శతకములలో ఒక్క పద్యమైన నోటికి రాదు; అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఉన్నట్టే తెలియదు; నన్నయ మొదలు
కరుణశ్రీ వరకు అలరించిన పద్య సౌరభాలు ఆస్వాదిస్తూ మనసును, బుద్ధిని వికసింప చేసికొనుట
తెలియదు; గురజాడ, కొడవటిగంటి, సత్యం శంకర మంచి కథలు, సాహిత్యములపై అవగాహన లేదు
కూచిపూడి నాట్యం, హంపీ శిల్ప సంపద, భగవద్గీత
బౌద్ధ జైన దర్శనములపై ఆసక్తి లేదు; వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నలలో
ఎన్నడు తానమాడలేదు; ఎవరో సినిమా వాళ్ళు
తప్ప, మరెవరూ చిత్రకారులు, సాహితీ స్రష్టలు, సాహితీ వేత్తలు, పెద్దలు తెలియరు; ఏమి ఈ
తెలుగుదనం; అంతా అయోమయం; సంస్కృతి అంతా నాయకుల, సినిమాల పాలు చేసిన తెలుగు వారికి
ఏది భాషా, సంస్కృతులపై పట్టు
అంతా ఇంటర్నెట్తో సరిపెట్టు,
స్మార్ట్ ఫోన్ వారి చేతి కంకణము
ఆధునిక నాగరికత వారి ఆభరణం
**********
Why we are inundated with biopics of celebrities, dead and alive?
Is it because of dearth of stories? Or fact is
stranger than fiction and is more salable?

*********

Passion and subtlety in feeling
Who is an established poet? Who is a popular writer? How they become that?
I am always puzzled about this and put many posts about this issue contemplating in many ways. But I am eluded of any answer. I find the works of many contemporary writers and poets substandard and as usual I wonder how they became famous.
Critics make or mar poets and writers, I feel. But readers genuinely find and recognise their favourite littératures.
Ideology adopted and spread, many times endears many a literary person to the critics.
But normal readers are enamored by the write-up and or poem by its quality.
Anyway, writing and composing verses is out of nature and goes on unhindered independent of recognition or otherwise.
Being a writer or poet is reflection of passion and subtlety in feeling within.
*******
అరవయ్యేళ్ళ తర్వాత, మనం అప్పటిదాకా ఎలా జీవించినా, ఎన్ని అందలాలు అందుకున్నా, ఎన్ని గతుకుల రోడ్లపై పయనించినా, ఎంతో జ్ఞానం, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నా, మనసు తత్త్వ చింతనా మయం కావాలి. అవుతుంది. తత్త్వం అంటే జీవితం గురించిన ఒక పరిశీలన, అనుభవం, అవగాహన.
********
వీణ వాయించు సుందరి వీణాపాణియొ
అందమున మనసుప్పొంగించు తరుణి రమణియొ
మగవానికి మధుర భావనయైన ముదిత
రతియొ రసహారముల సుదతియొ సుందరి ఎవరో?
*******
Nitish Kumar is vacillating under secular fever again. He is now not able to decide whether he wants to sail with corruption, dynasty rule which is "secular" or sail with communal BJP with development slogan. It seems he doesn't want to give upper hand to BJP and more seats to BJP in the ensuing parliamentary elections.
********
మనం రోజూ విమర్శిస్తూనే వినోదం పొందేది ఫేస్బుక్ నుంచే!
******
హిందువులు
హిందూయిజం ఒక మతం కాదు. ఒక జీవనశైలి, జీవించే విధానం (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్). జీవించాలి తప్ప శుష్కవచనములకు అక్కడ తావు లేదు.
కొన్ని పుస్తకాలు చదవడం మాత్రమే హిందూయిజం కాదు. ఆ చదువులను కూడా పక్కకు పెట్టి ఒక కుటుంబం జీవించే విధము హిందూయిజం. ఇందులో బాధ్యతలు, అనుబంధాలు, మమకారాలు, త్యాగాలు, ఒకరికొకరు కావడం ఇవన్నీ ఉంటాయి.
భగవద్గీత గురించి, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలపై ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే, సంసారులు కాని జీవులు, హిందూయిజం కి దూరంగా ఉండడం మంచిది. రికామీగా తిరిగే వారికి హిందూ మతం లో చోటు లేదు.
డేరా బాబాలు, ఆశాబాపూలు, ఇతర సాధు, సంత్ లు; వీరందరూ వీధికో కిళ్ళీకొట్టులా ఆశ్రమాలు నిర్మించి, డబ్బు, ఆస్తులు సంపాదించుకుంటూ, అన్ని నిషేధ ఆనందాలు అనుభవిస్తూ; శిష్యపరమాణువులను మానసిక బానిసలుగా తయారుచేసే కుఆధ్యాత్మిక స్వాములు, స్వామినులు. వీరెవరూ హిందూ మతానికి సంబంధించిన వారు కాదు.
కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఏ భాషా మాట్లాడుతున్నా, ఏ సిద్ధాంతం అంటే ఇష్టమున్నా, ఏ ఉపజాతీయత కలిగి ఉన్నా; తల్లిదండ్రులను, గురువులను, గౌరవించడం, అతిథులను ఆదరించడం, పిల్లాపాపలను వాత్సల్యంతో చూడడం, జ్ఞాన సముపార్జన, విద్యా, కళల్లో రాణించడం, ఇతర భాషల వారిని, ఇతర మతాల వారిని, దేశాల వారిని, సంస్కృతుల, నాగరికతల వారిని "వసుధైక కుటుంబకమ్" దృష్టితో చూడడం హిందూ మతం ప్రత్యేకత. ఇందుకు విరుద్ధంగా చేసేవారు హిందువులు కారు.
కుల, ప్రాంత, భాషా, ఉపజాతీయత, సిద్ధాంత, మత భేదములతో ప్రజలను రెచ్చగొట్టే వారు హిందువులు కారు.
హిందువులు తాము జీవిస్తారు, ఇతరులను జీవించనిస్తారు.
********
నోటికి ఏం వస్తే అది మాట్లాడే స్వాతంత్ర్యం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది.
**********
దేనినైనా ఆచరిస్తే ఫలం ఉంటుంది కాని దాన్ని గురించి వ్యాసాలు, పుస్తకాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు రాయడం వల్ల, కబుర్లు చెప్పడం వల్ల ఏ విధమైన ప్రయోజనం, ఫలము ఉండవు.
********
It is living when we live with all our passions. Our brain - reason and thinking, never allows us to be passionate. So if we follow only brain we may survive. But for living passionate heart is essential.
*******
అవ్యవస్థకు కారణం అసాంఘిక శక్తులు
పౌరులకు భయం ఉండాలి. భయం లేకపోవడం వల్లే ఇన్ని రకాల అకృత్యాలు చెయ్యడానికి వెనుదీయడం లేదు. ప్రభుత్వమన్నా, పోలీసులన్నా, న్యాయస్థానాలన్నా ఏ విధమైన భయం లేకపోవడం వల్లే ఇన్ని సంఘవిద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అవినీతి, లంచగొండితనం, రాజకీయ నాయకుల అవ్యవస్థ, నేరస్థుల దారుణాలు, బతిమాలడం వల్ల ఆగవు. సంఘం, దేశం లకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమైన వారికి మానవ హక్కులు ఉండవు.
మనం ఎంత దారుణం చేసినా మనం శిక్షించబడం అనే నమ్మకం ఉన్నప్పుడు ప్రభుత్వమన్నా, పోలీసులన్నా, న్యాయ వ్యవస్థన్నా నిర్లక్ష్యం ఏర్పడుతుంది. భయం ఉండదు.
మనిషికి వ్యవస్థ పట్ల భయమైనా ఉండాలి లేదా భక్తి, గౌరవాలైనా ఉండాలి. ఇవి లేని మనిషి ఒక ప్రమాద కరమైన క్రూర జంతువు. విధ్వంసం సృష్టించే అసాంఘిక శక్తి.
ఇలా ఏ విధమైన భయం లేకపోవడంమే మన దేశంలోని, సంఘంలోని దారుణాలకు, అవ్యవస్థకు కారణం. దండం దశ గుణం భవేత్!
*******
Meditation is going through our daily routine with concentration.
******

Sunday, July 8, 2018

Nation and Individual; The Travails of Learning; ఏం చదవాలి, ఏం చూడాలి;ముత్యపు చిప్పలు-నత్తగుల్లలు; దైవాధీనం-విధి-అదృష్టము? వారాల అబ్బాయి; మూర్ఖులు

Nation and Individual
In the case of nation and individual, nation is supreme. Individual must respect, love and protect nation. If one is not comfortable with nation, he is free to leave the nation. He can't be a citizen of the nation and blame it too for what it is and for what it stands.
In acquiring knowledge individual is supreme to himself.
**********
The travails for learning
The main problem lies in demanding or thinking that this learning must provide livelihood. Providing livelihood is not the business of learning. This aspect educationalists themselves do not want to project. Politicians have combined job seeking as primary goal of learning through primary, secondary and tertiary levels of providing education. Most parents also mistake and demand that this schooling etc., must provide livelihood. They don't care for learning.
Such realities make education and learning much more unwanted things. Under these circumstances schooling etc., can't provide and serve society genuine learning.
When genuine learning is neither aspired nor provided, as earlier intellectuals, scholars, scientists, philosophers cannot be will not be arriving on the scene. None is ready to exchange livelihood aspirations to genuine learning. Under such circumstances genuine learning neither flourishes nor will provide circumstances for flourishing.
Learning is loved by only a few. Rest of the people do not care for learning. And most of them do not know what is learning and the beauty and ecstasy and thrill of learning.
********
మనం ఏం చదవాలి, ఏం చూడాలి, దేనిని గురించి మాట్లాడాలి, ఇవన్నీ మన చేతిలోని విషయాలు.

ఎవరో బలవంతం చేస్తే చదివినట్లు, టి.వి. ఛానెల్స్, సినిమాలు చూసినట్లు, ఎందుకు మనం మాట్లాడుతున్నాము?
చదివినది, చూసినది పదే పదే తలుచుకొని ఎందుకు బాధ పడుతున్నాము?
సాంకేతికత పెరగడం వల్ల, పెను మార్పులు రావడం వల్ల మన జీవితాల్లోకి ఎన్నో అనవసర విషయాలు చొరబడుతున్నాయి. ఆ చొరబాటును మనమే ఆపుకోవాలి.
తప్పనిసరి తద్దినంలా ఏమీ చెయ్యక్కర లేదు. ఏది చదవాలి, ఏది చూడాలి, దేనిని తెలుసుకోవాలి, దేనిని పట్టించుకోకూడదు ఇవన్నీ మన నిర్ణయాలే. ఆ నిర్ణయాలు జాగ్రత్తగా తీసి కుంటే చాలు.
మన మానసిక శాంతి పోవడానికి మనమే కారణం. మన ప్రవర్తనే కారణం. అది శ్రద్ధగా గమనిచుకోక ప్రపంచాన్ని నిందించడం, విమర్శించడాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
మన మనసులోకి ఏ సంగతులు వెళ్ళాలి, ఏవి వెళ్ళకూడదు అని అనుకొని, అక్కర్లేని వాటిని వడబొయ్యాలి. మనకి కావలసినది డికాక్షన్.
మనం కళ్ళు మూసుకుంటే పోయేదానికి, ప్రపంచం మారాలి అని తాపత్రయ పడడం, మన హడావుడిని మాత్రమే సూచిస్తుంది. ముఖ్యంగా మూర్ఖ ప్రేలాపనలను, అశాంతి కలిగించే వార్తలను, దృశ్యాలను వినకూడదు, పట్టించుకోకూడదు, చూడకూడదు.
మన ఆత్రం వల్ల ఏదీ మారదు. ఇతరుల మాటలకు, ప్రవర్తనకు మనం కారణం కాదు.
**********
Massacres happened in every "civilized" society, nation!
The massacres happened because of religions, regions, cultures, castes, ideologies. No "civilization" is an exception to this.
***********
ముత్యపు చిప్పలు-నత్తగుల్లలు 
చదువులదేముంది ఎవరైనా చదవొచ్చు;
కాని జ్ఞానం ఎందరికి కలుగుతుంది?
వంట ఎవరైనా చెయ్యొచ్చు
రుచికరంగా ఎందరు చేయగలరు?
సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు
శ్రావ్య సంగీతం ఎందరు వినిపించగలరు?
ఎన్నికలలో ఎవరైనా పోటీ చెయ్యొచ్చు; డబ్బు విచ్చల విడిగా ఖర్చు పెట్టవట్టవచ్చు
కాని గెలిచేదెందరు? ప్రతినిధులై మంచి చేసేదెందరు?
ఉద్యోగంలో ఎవరైనా చేరవచ్చు
శ్రద్ధగా విధి నిర్వహణలో మగ్నమయ్యేదెందరు?
ప్రేమలో ఎవరైనా పడొచ్చు
ప్రేమికులయ్యేదెందరు?
మనసున మనసు కలసిన స్నేహమెందరిది?
********
దైవాధీనం-విధి-అదృష్టము?
కులాన్ని బట్టి, లింగాన్ని బట్టి, సిద్ధాంత పిపాసను బట్టి కవులను/కవయిత్రులను, రచయితలను, రచయిత్రులను కొలిచే కాలమిది.
ఆ కొలతలో ఇమడని వారు, వారూ సాహితీ స్రష్టలు అయినా వారికి పేరు ప్రఖ్యాతులు రావు. నలుగురికీ తెలియరు.
నిజానికి రచన నాణ్యత విమర్శకుని దృష్టిపై ఆధారపడి ఉంటుంది.
దానంతట దానికి ఏ రచనకూ "అసలు నాణ్యత" అంటూ ఉండదేమో! ఎవరో ఒకరి దృక్పథాన్ని బట్టే దాని బాగోగులు నిర్ణయించ బడతాయి. చర్చించి బడతాయి.
రచనలు అసలు, రచయిత దృక్పథాన్ని బట్టే రాయబడతాయి. కాకి పిల్ల కాకికి ముద్దులా ఎవరి రచనలు వారికి బాగుంటాయి. పాఠకులు, విమర్శకులు రచన వైశిష్ట్యాన్ని బేరీజు వేసే విధం, దాని ఫలితం, రచయిత దృక్పథంతో కలవచ్చు, కలవక పోవచ్చు. ఒక్కోసారి రచయితను అపార్థం చేసుకునే సావకాశమూ ఉంది.
గైడ్ సినిమాను దేవానంద్ తీసిన విధము ఆర్. కె. నారాయణ్ ను ఎంతో నిరుత్సాహానికి, కోపానికి, వ్యథకు గురిచేసింది.
రచన బతికి బట్ట కట్టడానికి, మనిషి జీవితంలో ఎదగడానికి సారూప్యత ఉంది. రచన నాణ్యతని, వ్యక్తి పురోభివృద్ధిని నిర్ణయించేది ఏది అంటే సరైన సమాధానం చెప్పలేం.
గాలి వాటం అనలేము. అదృష్టము అనలేము. గొప్పతనం అనలేము. అంతా ఏదో జరుగుతుంది.
మనం ఏదో అనుకుంటాం. అంతా దైవాధీనం.
*******
వారాల అబ్బాయి

ఓ రోజు ఓ దేవునికి
బుధవారం ఎవరికి?
కాలాతీతుడైన పరమాత్మ
కాలనిర్ణయమునకు అతీతుడా? కాదా?
వారముల ప్రకారము దేవుళ్ళు, దేవతలు
పూజలందుకొందురా?
మనమెప్పుడూ మన ఇష్టాయిష్టాలను
భగవంతునికి ఆపాదించి;
సర్వాంతర్యామిని సకల కాల నిర్ణేతను
వారములలో బంధించు ప్రయత్నము
చేయుట మన ఆర్తియే అర్ధార్ధమే, చపలత్వమే
జిజ్ఞాస సకృత్ మనకు
మూఢ నమ్మకాలు అతి;
దానికి తోడు ఆ నమ్మకములను
పెంచి పోషించే ఛానెల్స్
వాటిలోని ప్రాసంగికులు
వారి పొట్ట పోషణ వారిది
భగవంతుని అంశలను,
రూపములను పంచాంగములైన
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములకు
అనుగుణంగా అర్చించుట సబబే
కాని వారములు భగవంతునకు
నిర్ణయించి దేవదేవుని "వారాల అబ్బాయిగా
మార్చడం అంత అవసరం కాదేమో!?
*********
Many times living the poetry will bring problems, in the moral sphere.
*******
మూర్ఖులు
రామాయణం కల్పితం
నిజంగా జరగలేదు అన్న
నాస్తికులు, హేతువాదులు
రాముని నిందిస్తారు
ఇంతకీ రామాయణం జరిగిందా? లేదా?
రాముడు వ్యక్తా? పాత్రా?
తెలియని మంద మతులు
కోకొల్లలుగా ఉన్న దేశం
మూర్ఖ శిఖామణులకు
పాత్రను నిందించడం
మూర్ఖత్వం అని తెలియదు
అంతా ద్వేషం, విద్వేషం,
ఎందుకో


Tuesday, July 3, 2018

Fine-arts as career; డబ్బు ఖర్చు చదువురకరకాల జీవనాలు; ప్రకృతి నజరానాలు; అనవసర శ్రమలు; కత్తి గొప్పదా, కలము గొప్పదా?

Fine-arts as career
Livelihood problems are there to take fine-arts as career for the youngsters.
And our present life-styles are not congenial for the youngsters to get hooked.
They are not enthusiastic and are not ready to spend many years in learning and put up
rigid practice hours.
Still many youngsters are taking to fine-arts as career and are both giving joy to us by excellent performances and are continuing the tradition well.
********
డబ్బు ఖర్చు చదువు
"చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ"
అన్నాడు ప్రహ్లాదుడు విశ్వాసంతో, ఠీవిగా. ఇంతకూ అతను చదివిన చదువు విష్ణు పారమ్యము. తెలుసుకున్నది నారాయణుని సర్వ వ్యాపకత్వము. శ్రీహరి భక్తజనపరిరక్షణా కౌతుకము, దీక్ష.
దీనిని చదువు అంటే ఈనాడు ఎవరూ ఒప్పుకోరు. ఏదైతే ఉద్యోగాన్ని తెస్తుందో, అది మాత్రమే చదువు అని మనం సిద్ధాంతీకరించేసాము.
చదువు వివేకాన్ని పెంచాలి. వికాసాన్ని కలిగించాలి. మనల్ని మంచి మానవులుగా తయారుచేయాలి.
విజ్ఞత నేర్పాలి. ఇంగితం పెంచాలి. కరుణను హృదయాలంకారముగా చేయాలి. జీవకారుణ్యము
మనిషికి ఆభరణంగా అమర్చాలి.
భాషా, శాస్త్ర పరిచయం కలిగించి వాటిలో నిష్ణాతులను చెయ్యాలి. జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞానములను కలిగించాలి. కుల, మత, ప్రాంతీయ దురభిమానాలను పక్కకు పెట్టి, తోటి మానవులను ఈ భేదాలకు అతీతంగా, ఆదరించేలా చేయాలి.
అలా చేయని చదువుకై వెంపర్లాడటం డబ్బు ఖర్చు మాత్రమే.
********
రకరకాల జీవనాలు
కాలక్షేపం బఠానీల కోసం కొందరు
కిందా మీదా పడుతూంటే;
నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడానికి
ఎందరో కిందా మీదా పడుతున్నారు
ప్రపంచంలో ముఖ్యావసరాలు తీరక
ఎందరో కష్టపడుతూ సతమతమౌతుంటే
కడుపునిండిన బేరంగా కొందరు కష్టాలు
"కొని తెచ్చుకుని" సతమతమౌతున్నారు
ప్రజలకు సేవ చెయ్యాలని కొందరు తమ ధన మాన ప్రాణాలు కుదువపెడుతూంటే; 
ప్రజలను మోసగించి, తమ ధన మాన ప్రాణాలు పరిరక్షించుకుంటూ అధికారం పొంది 
అక్రమంగా దోస్తున్నారు ఎందరో;
ప్రపంచంలో రకరకాల జీవనాలు;
పరాన్న భుక్కులు కొందరు; పరోపకార
పరాయణులు కొందరు; వింతగా ప్రజలు
మాత్రం పరాన్నభుక్కులకే పెద్దపీట వేస్తారు
గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు ఇంకెవరినీ నమ్మదు; 
ఓటర్లు తమని ప్రలోభపెట్టే వారిని నమ్మినట్లు
మరెవరినీ నమ్మరు; అంతా మాయ, భ్రాంతి, భ్రమ
*********
కొన్న అన్నింటికీ మన పరిమిత జ్ఞానంతో రిపేర్ చెయ్యగలమా ఏమి? ఎన్నో ఆధునిక ఉపకరణాలు మన ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. అవి పని చేయనని మొరాయించినపుడు మన ధన, మాన, ప్రాణములు పోయినా సరే, తల తాకట్టు పెట్టైనా సరే వాటి గురించి తెలిసిన జ్ఞాని దగ్గరకు వెళ్ళాల్సిందే!
*****
జ్ఞానము కన్నా సంతృప్తి గొప్పది. ముందు ఈ మాట ఒప్పుకుంటే, దృష్టి మారి, సంతృప్తి, సంతోషం వాటంతట అవే కలుగుతాయి.
********
ప్రకృతి నజరానాలు
మా చిన్నప్పుడు గోదావరికి వరద వచ్చినపుడు (వేగేశ్వరపురం, పశ్చిమగోదావరి, కొవ్వూరు, పోలవరాల మధ్యలో తాళ్ళపూడికి ఇటు పక్క గ్రామం, అటు పక్క ప్రక్కిలంక), ఆ నిండు గోదావరిని, దాని ఉరకలు, ప్రవాహం, నీటి ఉధృతి చూడడానికి వేయికళ్లు చాలేవి కావు. చిన్నతనం (12, 13 ఏళ్ళు) కాబట్టి ఇంతకు మించిన వర్ణన తెలియదు. దూరాన తూర్పు కనుమలు ఎంతో సుందరమైన దృశ్యాన్ని మనో ఫలకంపై ముద్రలు వేసేవి. నిండు గోదారిలో స్నానం చేసేవాళ్ళం కాదు.
గజ ఈతగాళ్లు ఆ ప్రవాహ ఉద్ధృతి లోకి వెళ్ళి దుంగలను తేవడం చూస్తూంటే భయంగా, థ్రిల్లింగ్ గా ఉండేది. అలా నిండు గోదావరిని చూడడం వర్షాకాలంలో మాకు సందడిగా ఉండేది. ఎఱ్ఱని నీరు, దేనినీ లెక్క చేయని ప్రవాహం, ఒడ్లని ఒరుసుకొని ప్రవహిస్తోంటే నయనానందకరంగా ఉండేది. గండి పడుతుందేమోనని భయం. అయినా గోదారొడ్డుకు వెళ్ళి ఆ కమనీయ దృశ్యాన్ని వరద ఉన్నన్ని రోజులూ తప్పని సరిగా సాయంకాలాలు చూసేవాళ్ళం. అదే గోదావరి శీతాకాలంలో ఏటి గట్టుకి దూరంగా, ఎక్కడో దిగువన క్రింద శాంతంగా, నిర్మలోదకంతో ఉండేది. మా ఈతల పాఠాలు అప్పుడు సాగేవి. పెద్ద కుఱ్ఱాళ్ళు
మా లాంటి పిల్లలని లోతుకు తీసికెళ్ళి వదిలేసే వారు.
మేం కొట్టుకు కొట్టుకు ఒడ్డుకు చేరేవాళ్ళం. మధ్యలో మునిగిపోబోతోంటే పెద్ద కుఱ్ఱాళ్ళు వచ్చి ఒడ్డుకు లాగేవారు. అలా నేర్చుకున్నదే మా ఈత. ఇలా ఈత నేర్చుకోవడం చాలా బాగుండేది.
గోదావరి ఒడ్డున నివసించడం ఒక వరం. ప్రకృతి ఇచ్చే నజరానాలు ఎన్నో పుచ్చుకోవచ్చు.
*********
అనవసర శ్రమలు
భగవంతుడన్ని చోటుల కలడని ఎల్లప్పుడూ కలడని తెల్సియు దుర్గమ మార్గముల దూరాభారములు సహించి, ప్రాణములు పణముగా పెట్టి తీర్థయాత్రలు చేయనేల, ప్రాణత్యాగాలు చేయనేల, భక్తులార!
మన ఊరిలోని మన గుడిలోని రాముడో, కృష్ణుడో శివుడో, విష్ణుమూర్తియో, అమ్మవారో, కొలువైయుండ
వారిని భక్తిపూర్వకముగ కొలువక, ఎందుకీ యాతనలు; ఫలమో, పత్రమో, పుష్పమో, తోయమో
మనస్ఫూర్తిగా అర్పించిన సంతసించి కోరికల తీర్చి కాచు మన ఊరి దేవుడుండ ఎందుకీ ఆయాసములు
మనసును మించిన పూజాద్రవ్యము లేదు
ఇష్టదేవతా స్మరణమును మించిన అర్చన లేదు
భగవత్ భజనను మించిన ప్రపత్తి, శరణాగతి లేవు
ఇంత సులువైన భగవదారాధనను ఎక్కడో చేయనేల
హృదయమున గోవిందుని నింపి
మనసే లలితాదేవికి మందిరమును జేసి
భక్తి నిండిన చూపులనే ఉదకముతో భోళా శంకరుని
అభిషేకించి తరించు విధములుండ ఏల ఈ శ్రమలు?
********
మన ఫొటోలకి, రాతలకి, గీతలకి, ఫేస్బుక్ వచ్చాకే గిరాకీ వచ్చింది.
*******
కత్తి గొప్పదా, కలము గొప్పదా? 
ఈ రోజుల్లో ఈ మీమాంస ఎవరికీ అక్కర్లేదు. అశుద్ధమైన నోరు ఎవరికి ఉంటుందో వారే గొప్పవారు. కులగజ్జి ఇంకా గొప్పది.
కుల బలంతో అవాకులు చవాకులు వాగడం అన్నిటికన్నా గొప్ప విషయం. రాజకీయ నాయకులు, మేధావులు, చిన్నా చితకా మనుషులు, మూర్ఖ శిఖామణులు, దరిద్రమైన నోరు కలవారు ఈ కుల బలంతోనే బతుకుతున్నారు. అందరి సున్నితత్వాలకూ ఎసరు పెడుతున్నారు.

నోటికి, రాతకి, మృగానికి, మనిషికి, రాతికి తేడా తెలియడం లేదు.

Sunday, July 1, 2018

అనవసరం; అతి తెలివి; మాయ; చిత్రాతిచిత్రం; Echoes of sense; Indian intellectual scene; నేను లేని ఉనికి; చల్లగ చూచు దైవము;చిరునామా లేని విజ్ఞులు ; ఫేస్బుక్

అనవసరం
మనం ఎన్నో సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ పదాలని డు, ము, వు, లు చేర్చి తెలుగు పదాలుగా చేసుకున్నాం. వీటీని అన్యదేశ్యములు అంటారు. ఇలా ప్రతి భాషలోనూ జరుగుతుంది. పరభాషా పదాన్ని డు, ము, వు, లు చేర్చి తెలుగు పదాలుగా వాడుకోవడమే. కృతకంగా పదాలను సృష్టించే శ్రమ పడడం అనవసరం. ఈ మధ్య చాలా మంది ఎంతో శ్రమించి ఆంగ్ల పదాలకి తెలుగు పదాలు సృష్టిస్తున్నారు. ఆ పదాలు కూడా ఎంతో పొడవుగా కొల్లేటి చాంతాడంత తయారవు తున్నాయి. ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండటం లేదు.
ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకుని పదాలు తయారు చేసుకుంటున్నాము. అంత తతంగం, హడావుడి అనవసరం.
*********
హైందవ ధర్మం గురించి మాట్లాడేవారు కుప్పలుతిప్పలుగా తయారవుతున్నారు. అనుసరించే వారు కరువైపోతున్నారు.
*********
అతి తెలివి
సమాజంలో చాలా మంది ఒక భ్రాంతి లో ఉన్నారు. ఆ భ్రాంతి ఏమిటంటే, పెళ్లిచేసుకుంటే మంచి అంతా
మగవాడికే జరుగుతుందని, స్త్రీకి ఏమీ ఒరగదు అని. పెళ్లి మగవాడికే సౌకర్యం. స్త్రీ కి కాదు అని.
పెళ్ళయితే నా వాళ్ళనే వారు స్త్రీ కీ ఏర్పడతారు. కాని ఆ ఏర్పడడంలో ఆడదానికి ఏ విధమైన ప్రయోజనం లేదని చాలా మంది అపోహ. కాని ఈ నా వాళ్ళు చాకిరీ చేయించుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగ పడరు అని విశ్వ తీర్మానం చేసేసారు.
పెళ్లి వల్ల స్త్రీ కి కొత్తగా ఏర్పడే మనుషులు మొగుడు, ఆ తర్వాత తనే కన్న తన పిల్లలు. అత్తమామలు, ఆడపడుచులు, బావలు, మరుదులు ఎవరూ ఉండరు ‌ రాకపోకలు కూడా సకృత్తుగా జరుగుతాయి. తోడికోడళ్ళతో కలిసి జీవించడం ఉండదు. ఇంట్లో ముసలాళ్ళెవరూ ఉండరు.
పెళ్లి మగవానితో సమానంగా స్త్రీ కి అవసరమే. బాధ్యతలు స్త్రీ కి ఎక్కువ అంటే ఇదివరకటి స్త్రీల జీవితాలతో పోలిస్తే బాధ్యతలు చాలా తక్కువ.
సౌకర్యాలు ఎంతో ఎక్కువ.
మానసిక ఆలంబన స్త్రీ పురుషులు ఇరువురికీ అవసరం. అది పెళ్లి ద్వారా మాత్రమే లభిస్తుంది. బాయ్ ఫ్రెండ్, సహజీవనం జరిపేవాడు మొగుడి కన్న తక్కువగా ఏం కష్టపెట్టరు. పెళ్ళి కాదనుకొని వారి మీద- బాయ్/గర్ల్ ఫ్రెండ్ మీద, సహజీవన వాసి మీద ఆధారపడడం అంత తెలివైన పని కాదు.
ఆర్ధిక లావాదేవీలు, ఆస్తి పాస్తులు (ఏమైనా ఉంటే) ఇతర సాంస్కృతిక, నాగరీకపు అలవాట్లు, పెళ్లి అనే బంధం అయినా మరే బంధమైనా, ఒకే ఇబ్బంది/సౌకర్యం కలిగిస్తాయి.
ఏ బంధమూ ఏర్పరచుకోక, ఆడదైనా, మగాడైనా జీవించాలనుకోవడం తెలివైన పని కాదు. పెళ్లి బంధం పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు అవసరం. పెళ్లి వల్ల సుఖమంతా మగవానిది, బాధ్యతలు, చాకిరీ స్త్రీలదీ అనుకొని వివాహ బంధంలో ప్రవేశించక పోవడం అతి తెలివి.
********
మాయ
మాయా అంటే మానసిక శక్తి. మేధలో ప్రతిఫలించిన చిత్ శక్తి. చిత్ ఆభాసా! ఇది ఆత్మ జనితము. దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. ఉనికికై ఆత్మశక్తిపై ఆధారపడుతుంది. చిద్విభూతి.
యాా సా మాయా (ఏది లేదో అది మాయ) అనీ, యయా అసన్తమ్ పశ్యతి సా మాయా (దేని ద్వారా మనం అసత్ అయిన ఈ జగత్ ను చూస్తున్నామో, అది మాయ) అనీ మాయకు రెండు నిర్వచనములు.
మాయా మయమ్ ఇదమ్ జగత్ అంటే ఈ మాయచే (మానసిక శక్తిచే) నిర్మించబడిన జగత్ అని భావము. తలపుల వరుసయే జగత్. అంతఃకరణముల పరిణామాలే జగత్. మిథ్యా అంటే ఒక సారి ఉండి మరొక సారి లేనిది అని అర్థం.
లేదా అద్దంలో ప్రతిబింబం ఎలా మిథ్యయో (దానికి స్వతంత్రమైన ఉనికి లేదు, అది నిజమైనది కాదు), చిత్ శక్తి యొక్క మేధలో ప్రతిఫలనమే మాయా. మాయని మానసిక శక్తిగా తెలుసుకోవడం వల్ల మిథ్యా పదాన్ని ఏ అర్థం లోనైనా మనం తీసికోవచ్చు.
ఆచార్యుని బట్టి వ్యాఖ్యానాలు మారతాయి కాబట్టే "ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి" అనే నానుడి వచ్చింది. వస్తువు ఒకటే, వ్యాఖ్యాతని బట్టి పారిభాషిక పదాలు మారతాయి.
*******
చిత్రాతిచిత్రం
అమ్మమ్మలు ఇంటిని నిర్వహించినట్లు అమ్మలు నిర్వహించలేదు.
అమ్మలు నిర్వహించినట్లు భార్యలు నిర్వహించడం లేదు. కూతుళ్ళు, కోడళ్ళు ఇల్లు, ఉద్యోగాల మధ్య నలగడం. రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తున్నారు. ఇది ఎంతో శ్రమ, కష్టములతో కూడినది.
మనందరం ఇప్పుడొక నిర్ణయానికి వచ్చేశాము. ఉద్యోగానికి, ఇంటికి సమాన శ్రద్ధ చూపడం అసాధ్యం కనుక, ఉద్యోగంలో అశ్రద్ధ చూపిస్తే కుదరదు కాబట్టి ఇంటి విషయంలో ఆటూ, ఇటూ గా ఉంటున్నాము.
కొడుకులు, అల్లుళ్ళూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇల్లాలు, ఇల్లు పక్కకు తొలగి ఉద్యోగిని, ఆఫీస్ లకు చోటిచ్చాయి.
ఇప్పుడు గృహం, గృహిణి అనడం వెఱ్ఱితనం. ఎటొచ్చీ పసికందులకీ, ముసలి వగ్గులకి ఇంట్లో స్థానం లేదు. అందుకే పసికందులు క్రష్ లలో, ముసలి వగ్గులు వృద్ధాశ్రమాలలో కాలక్షేపం చేస్తున్నారు.
ఈ పురోభివృద్ధి సాధించి మనం ఏం సాధిద్దాము అనుకుంటున్నాం? మనకేమయినా తెలుసా?!
ఇంటిని, ఇల్లాలిని లేకుండా చేసికొని ఎంత పురోభివృద్ధి సాధించినా, సమానత్వం పొందినా మన జీవితాలు అస్తవ్యస్తంగా, అడ్డదిడ్డంగా తప్ప సజావుగా సాగవు.
రెండు తరాల మార్పులకే మన జీవితాలు అల్లకల్లోలంగా సాగడం ఆపుకోలేకపోవడం మన ప్రత్యేకత. ఈ మాట ఒప్పుకోవడానికి బదులు
ఇలా ఎత్తి చూపిన వారిని మాట్లాడనివ్వకుండా చేయడం నేటి సంస్కృతి.
నిజాన్ని ఒప్పుకోవడానికి అహాలు, సమానత్వం కేకలు, ఆర్ధిక స్వాతంత్ర్యం కబుర్లు ముందుకు వచ్చి
అడ్డొస్తాయి.
కుటుంబమే తానై సంఘాన్ని ఒక చక్కని కట్టడంలా
రూపొందించిన ఇల్లాలు ఇప్పుడు, ఇల్లాలు కాక పూర్వం నుంచే తన గురించి మాత్రమే తాను ఆలోచించుకోవాలని అందరు మేధావులు, స్త్రీ వాదులు నొక్కి వక్కాణిస్తున్నారు.త్యాగశీల, అనురాగ శీలి, ఇంటికి దీపాన్ని రకరకాల కారణాలతో ఆర్పేసి మనం సాధించేది పెద్దగా ఉండకపోవచ్చు.
కాని వింతల్లోకి వింత ఆ పాతకాలం ఇల్లాలిని మా అమ్మ మా అమ్మ అంటూ ఎంత పొగుడుతూ పోస్ట్లు పెడతారో నవ యువతులు. అంతా అయోమయం.
********
సావిత్రి అయ్యింది.
ఇప్పుడు సంజయ్ దత్.
కొంత కొంత విరామంతో, తెలిసీ జీవితంలో తమంత తాముగా మునిగిన నిర్లక్ష్యపు మనుషుల కోసం అంతర్జాల సాంఘిక మాధ్యమాల్లో హడావుడే హడావుడి. రామాయణ మహాభారతాలని కూడా ఇంత దీక్షగా ఎవరూ అనుసరించినట్లు లేదు.
గుడ్డిగా జీవించి అన్ని రకాలుగా జీవితాన్ని నాశనం చేసికున్న ఈ సినిమా వాళ్ళంటే జనాలకెందుకో ఇంత క్రేజ్!
********
Echoes of Sense

Words are linked to sense
In fact words are echoes of sense
Words pregnant with sense
Are sensitive, sensible and soothing
Words picture the world
World gets ruffled by words
Words are culture and civilization of Humans; words used reflect invidual's
Sophistication, knowledge, etticasy and scholarship; words are medicine to heart
Loving words are music to beloved
And her heart dances with joy and pleasure
Words repair hearts
Calm the minds, silence
The ongoing rustle within
Words are representatives of Lord;
Rather words are Divine themselves
*********
Indian intellectual scene

Scholarship is no longer celebrated in India, nor knowledge;
In India only the lives of celebrities are
Celebrated;
In India only backwardness is celebrated
Together with mediocrity;
Governments do not have any schemes
For the bright minded, brilliant citizens
Every one is asked to do business
No other profession is sparkling
Medical education has become exorbitantly costlier, mediocre
Students are buying seats putting
The healthcare of Indians in jeopardy
Spirituality, education and healthcare
Have become thriving businesses
Bringing up kids as responsible
Citizens is given a go by; instead
Every one is handed over a certificate
Despite poor learning by the individual
Society is cheating itself
None is sincere or responsible;
Like the politicians, criminals,
People crave for easy money
Making cheating and deception
National sports and traits for success
Unless knowledge is celebrated above
Doing business and earnings illegal;
No progress or peace reigns India
Love for nation is cultivated above all
**********

నేడు ఉన్నాను నేను
రేపు ఉంటానో లేదో తెలియదు
నా జ్ఞాపకాలే నా గతం
బాధలూ, వేదనలే తోడు
నా భవిష్యత్తు నా ఆందోళన,
భయం, నా ఊహాపోహలే;
ఈ గతం, భవిష్యత్తుల మధ్య నలుగుచూ
నేటిలో జీవించలేని బడుగు జీవిని
నా ఉనికి నా ఊహ
నా మరణం నా నిద్ర
నేను లేని ఉనికి
ఎఱుకయే శుద్ధ జ్ఞానం
శాంత మౌన
ఆనందపు
గమనిక
********
చల్లగ చూచు దైవము

కొండల నడుమ నదీ ప్రవాహాలు, కొండల అంచుల దూకు జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు
సముద్రపు ఒడ్లు, అలల రాక పోకలు 
అదో రకపు ఆనంద మగ్నత, సంతసము
మొగ్గలు విచ్చుటలు, మొగ్గులో దింపుటలు
ప్రకృతి ఆటలు; ఆకర్షణకు ఊటబావులు
శ్రావ్య సంగీతం పిట్టల గానం పసివారి బోసి నవ్వులు
ప్రేయసీ ప్రియుల రాగం, ప్రణయ సరాగం స్త్రీ పురుషులకు జీవం శృంగార భరిత రసాస్వాదనం
మేఘ సముదాయం కురియు వర్షము, చెట్లు అందించు ఫలములు, మొక్కలు పూయు పూలు
మన హృదయాహ్లాదకం సరస జీవనపు చిహ్నాలు
పచ్చని బయలు నును వెచ్చని ఎండ
పున్నమి వెన్నెల అన్నీ మన కోసమే
ప్రకృతి ఉనికి మన ఆస్వాదనకే
ఉపయోగానికే; ప్రకృతి మనకు
చెలి, మనల చల్లగ చూచు దైవము
*******
చిరునామా లేని విజ్ఞులు
రాజకీయ నాయకులు గాని, సినిమా రంగానికి చెందినవారు గాని లేకుండా మనకు ఏ విధమైన సభలు జరగవు.
ఏ సభకైనా మనం వాళ్ళను పిలవకుండా ఉండలేము. వాళ్ళూ తయారవకుండా ఉండలేరు.
ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయాలలో చేరుతున్న నేపథ్యంలో వారే వీరు. వీరే వారు.
సంఘంలో మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, లలితకళాకారులు పొందలేని గౌరవాభిమానాలు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు పొందుతున్నారు. మనం వంశ పారంపర్యంగా వాళ్ళని ఆరాధిస్తూ అభిమానిస్తున్నాం.
మనయొక్క ఇంతటి ఆదరాభిమానాలు పొందడానికి వారి ప్రత్యేకత ఏమిటో!
ఆధ్యాత్మిక వేత్తలు, తత్త్వవేత్తలు పొందలేని ఆత్మీయతలు ఈ రెండు వర్గాల వారు పొందుతున్నారు.
ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. రాజకీయ నాయకుల అధికారం, సినిమా వాళ్ళ ఆకర్షణ అంత గొప్పవి, ప్రభావితం చేసేవి అన్నమాట. సంఘంలో మేధావితనానికి, జ్ఞానానికి, లలిత కళలకు లేని ఆకర్షణ రాజకీయ నాయకులకు, సినిమా వాళ్ళకు మాత్రమే ఉండడం సంఘ ప్రగతికి, సంఘంలో సంస్కృతికి, సంస్కారానికి పెద్ద అవరోధంగా ఉంది.
వీరి ఇంద్రజాలం, మాయ సంఘంపై అమితంగా ఉండి, సామాన్యులైన వీరు అందలాలెక్కి మన్ని శాసించే స్థితిలో, స్థాయిలో ఉండడం సంఘ, దేశ దురవస్థలలో ఒకటి. సంఘంలో ఆదర్శ పురుషులు
ఇతర రంగాలలో ఉన్నా, వారికి చిరునామాలు, అభిమానులు లేకపోవడం మన సంస్కృతిని తెలియ జేస్తుంది. మన అభిరుచులు మనవి.
**********
ఫేస్బుక్ 

సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవడం అంటే ఫేస్బుక్ లాంటి వాటిలో జేరడం. ఆపైన ప్రపంచం లో ఏమి జరిగినా నెత్తీ నోరు బాదుకోవడం. గొప్ప సంఘ సంస్కర్తల్లా అన్ని అభిప్రాయాలు చెప్పెయ్యడం. ఆ తర్వాత మనం ఎందుకు కళవళ పడుతున్నామో తెలపకుండా, అందర్నీ సస్పెన్స్లో పెట్టి మరీ, సున్నితమైన మన మనసును సాంత్వన కోసం బజారులో పెట్టడం. విషయం తెలియక కొందరు వివరం అడిగితే మన స్నేహితులు వారిని కసురుకోవడం. జరిగిందీ, జరుగుతున్నదీ తెలియక అందరూ తెల్ల మొహాలేసి కిందా మీదా పడుతూంటే మనం మరింత వగచడం.
ఫేస్బుక్ సంఘటనలూ, డ్రామాలు నిజంగా ఒక ఫేమిలీ గొడవ లాగ ప్రసారం, ప్రచారం అవడం. ఖాళీగా ఉన్నవాళ్లంతా అందులో పాల్గొనడం. అంతా చిత్ర, విచిత్ర మాయాబజార్ ఫేస్బుక్ రామాయణం.