Saturday, February 3, 2018

యోగసార ఉపనిషత్తు 6,7,8,9, 10

మంత్రము 8

బుద్ధి ప్రయుక్తం మనో బాహ్యేంద్రియం ద్వారీకృత్య విషయం ప్రతిపద్యతే 

బుద్ధి చే ప్రేరేపించబడిన మనసు బాహ్యేంద్రియముల (జ్ఞానేంద్రియముల) ద్వారా విషయాన్ని ప్రతిపాదిస్తూ గ్రహింపచేస్తుంది. 

ఇక్కడ బుద్ధి అంటే అంతఃకరణములకు ముడి సరకు లేదా శక్తి అయిన ప్రకృతి అని  గాని, చిదాభాస (మాయ) అని కానీ, ప్రణవం అని కానీ, స్ఫోట (వ్యాకరణ వేత్తలు - శబ్దబ్రహ్మ సిద్ధాంతము) అని కానీ అర్థము చేసుకోవాలి. 

చిదాభాస, ప్రకృతి పరిణమించి అంతఃకరములై జ్ఞాన కర్మేంద్రియముల ద్వారా గ్రహణ, ప్రతిక్రియ చేస్తాయి. ఇదే, ఇవే మానసిక కార్యకలాపములు. మనసు బాహ్య, అంటారా ప్రపంచములలోని విషయం గ్రహణము చేస్తుంది. చిత్తము విషయములు గ్రహింపబడుతోన్నప్పుడు అదే సమయములో కలిగించే అనుభవములను (వీటిని విషయానుభవములు లేక వాసనలు అంటారు0 గ్రహించి, స్మృతి లో జ్ఞాపకములుగా భద్రపరచి, మరల వాటిని ప్రేరేపించి అనుభవములను దృష్టి లో కి తెచ్చి తదనుగునా భావములను కలిగించి కర్మేంద్రియముల ద్వారా చేష్టించేలా చేస్తుంది. 


ఇలా సకల జ్ఞానములు, భాషలు, కళలు, నేర్పరితనములు - చిదాభాసా, మాయా, ప్రణవ, స్ఫోట సదృశ వివిధ నామధేయ యుతమైన – ఆత్మ శక్తి వలన మనకు,  ఆ శక్తి చేతనే ప్రేరేపింపబడు తత్సమయ అంత:కరణ,  జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అనుసంధానము వలన కలుగుతున్నాయి. 


మంత్రము 9
విషయసుఖం దుఃఖవత్ పరిత్యాజ్యమ్
విషయము అంటే దృశ్యము, శబ్దము, రుచి, వాసన, స్పర్శ లలో ఒకటి. విషయసుఖము ఆంటే ఈ విషయములు కలిగించే తృప్తులు, సుఖములు. వీటిలో మమకార, ఇష్ట వస్తువు అంది కలిగించే సుఖము, ఉన్నాయి.
మనందరమూ విషయం సుఖములు కావాలని వెంపర్లాడతాము. ఇందులో తప్పేమీ లేదు. మోతాదు మించకూడదు. ధర్మబద్ధముగా విషయసుఖములు అనుభవించాలని పెద్దలంటారు. మనము ఈ సుఖాల హడావుడిలో ఒకవిషయము మర్చిపోతాము.
అది ఏ విషయాలైతే మనకు సుఖాలు కలిగిస్తాయో ఏవ్ మనకు దుఃఖాలూ కలిగించవచ్చు. కలిగిస్తాయి కూడా. అంచేత మనము దుఃఖాలు కలగకూడదని కోరుకుంటాము. కానీ విషయం వాంఛ (పైన ఉటంకించిన ఏ విషయ సుఖమైనా) పోగొట్టుకోవాలనుకోము. విషయ దుఃఖము వలె విషయసుఖాన్ని మనము వదిలెయ్యగలగాలి, వదిలెయ్యాలి అని యోగసారా ఉపనిషత్ చెబుతోంది.
విషయవాంఛ తీరినప్ప్పుడు సుఖము, తారనప్పుడు దుఃఖము కలుగుతాయి.
విషయవాంచే లేకుంటే సుఖదుఃఖములుండవు. దుఃఖము లేని జీవితము కావాలి కానీ, సుఖము లేని జీవితమును కోరుకోవడం ఎలా? సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా అనుభవించడానికి సిద్ధపడితే విషయం వాంఛలు ఉండవచ్చు.

అవ్వా కావాలి బువ్వా కావలి అంటే కుదరదు అంటుంది యోగసార ఉపనిషత్. .

మంత్రం 10
ప్రకృతిః త్రిగుణావలంబనీ
ప్రకృతి మూడు గుణములను అవలంబించి, ఆశ్రయించి మానసిక కార్యకలాపములను నిర్వర్తిస్తుంది.
యోగ, సాంఖ్యములు ప్రకృతిని మానసిక శక్తి అంటాయి. ఆ ప్రకృతి మానసిక కార్యకలాపములు గుణముల రూపములో నిర్వర్తిస్తుంది.
ఈ గుణ విభాగాన్ని అన్ని ఆస్తిక దర్శనములు చేశాయి. వైశేషికము మానసిక శక్తిని పదార్థము అంది. వాటిని ద్రవ్యగుణకర్మవిశేషణసామాన్యసమవాయా: అని చెప్పి తరువాత అభావమును కూడా పదార్ధములలో కలిపింది. అభావము అంటే దేనినీ గ్రహించకుండా ఉన్న స్థితి.
వేదాంతము, ఈ గుణ విభాగాన్ని వాడింది. భారతీయ తత్త్వ శాస్త్రములు ఒకదానిని ఒకటి ఖండించి, కొన్నిటిని తమ స్వతం చేసికొని కలిసి ఎదిగాయి. మనము ఇప్పుడు వీటన్నిటిలో మనకు పనికివచ్చేవి తీసికొని ఒక స్వతంత్ర దర్శనము తయారుచేసి కోవచ్చు. దానిని జ్ఞానబోధ మీమాంస అంటాము. మంకు జ్ఞానము ఎలా కలుగుతుంది, మనము ఎలా చేష్టిస్తాము, ఎలా మానసిక చర్యలు, ప్రతిచర్యలు చేస్తాము; వీటన్నిటి గురించి ఒక నమూనా తయారుచేయవచ్చు. అది భారతీయ తత్త్వ శాస్త్రానికి సారము, సారాంశము అవుతుంది. ఈ గుణములను ఎలా అర్థము చేసుకోవచ్చు, మనము ముముక్షువులుగా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాము.
సత్త్వరజస్తమో గుణములను ఇప్పటివరకు అందిన వాఖ్యానములకు భిన్నముగా, వీలుగా అర్థముచేసికుందాము. అందరూ అనుకునేలా సత్త్వరజస్తమో గుణముల ప్రేరణతో మనుషుల ను విడతీయడము ఒక దృష్టి. కానీ మనందరమూ ఈ అన్నిగుణములను వివిధ సమయములలో చూపిస్తాము. గుణము అంటే ముడి. దేనితో ఏది ముడి పడుతుంది? చూద్దాము.
గుణ త్రయ విభాగము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి
భారతదేశంలో తత్త్వ శాస్త్రానికి రకరకాల వ్యాఖ్యానములు అందుబాటులోనున్నాయి. ఉపనిషత్తులు భారతదేశ తత్త్వశాస్త్రానికి మూలములు.
ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానము / ఆత్మజ్ఞానము ప్రతిపాదింపబడి వివరించబడ్డాయి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శాక్తాద్వైత, వంటి దృష్టులతో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు - ప్రస్థాన త్రయము - వ్యాఖ్యానింపబడ్డాయి.
ఇందులో ఆచార్యులు తమ మేధాశక్తి, స్ఫురణ, భాషా పటిమ, శాస్త్ర, తత్వ పరిజ్ఞానములు, దృక్పథములు, బుద్ధి నైశిత్యములతో తమ తమ దృష్టులతో పకడ్బందీగా వివరణలు ఇచ్చారు. అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే, వారి వారి అనుయాయులిప్పటికీ తమ తమ మతములను ఎంతో నమ్మకముతో అవి మాత్రమే శ్రేష్ఠమైనవి అని వాదులాడుకుంటూంటారు. ఒకరినొకరు ఎంతో తీవ్రపదజాలంతో ఖండించుకుంటారు. ఉపనిషత్తుల ఈ అనుయాయులు ఎవ్వరూ సమ్యక్ దృష్టితో పఠించరు. తమ స్ఫురణ, స్ఫూర్తిలను అసలు ఉపయోగించకుండా ఆచార్యుల మాటలే తమ మాటలుగా ఆచార్య సిద్ధాంతములను ప్రచారము చేయడానికి ఉపయోగించు కుంటారు. ఒక్కొక్కసారి కవిగారి కవిత్వం కొంత మన పైత్యంగా ఈ ప్రచారములు జరుగుతాయి.
ఉపనిషత్తులు మనసు యొక్క పుట్టు పూర్వోత్తరములు, మానసిక దశలు, మానసిక కార్యకలాపములు జరుగు వైనము, మనకు లౌకిక, పారలౌకిక జ్ఞానములు కలిగే విధములు విశదముగా చెప్పాయి. ఆత్మను, బ్రహ్మమును, తత్సంబంధ పారిభాషిక పదములను; భగవంతుని ఉనికిని ప్రస్తావించకుండా, భగవత్ సంబంధము లేకుండా ఉపనిషత్తులను, తదనంతర తత్త్వ సాహిత్యాన్ని వ్యాఖ్యానించ వచ్చు. దీనిని జ్ఞానబోధ మీమాంసా దృష్టితో అన్వయించవచ్చు.
పతంజలి, భర్తృహరి, ఆదిశంకరులు మొదలైన వారు అద్వైత-ద్వైత దృష్టుల మేలు కలయికతో ఎంతో తత్త్వాన్ని బోధించారు. ప్రబోధించారు.
పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతమును ప్రతిపాదించి బ్రహ్మజ్ఞానాన్నించి భాషాశాస్త్ర సర్వస్వమును పితికి మనకి అందించారు. భర్తృహరి తదనంతర స్ఫోట వాదులు భాషాశాస్త్ర దృష్టితో మనము భాషలు నేర్చుకునే, మాట్లాడే విధానాన్ని వివరించారు. భాషల అవస్థా భేదములను చెప్పారు.
వేదాంతుల మాయ, తత్త్వజ్ఞుల చిదాభాస, మునుల ప్రణవము, శబ్ద బ్రహ్మ సిద్ధాంతీకుల స్ఫోటము అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామములు.
ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల, షడ్దర్శనములు ఈ ఉపనిషత్ ప్రతిపాదనలను స్వీకరించి, నిరాకరించి, సవరించి, తమ స్ఫూర్తితో విషయాలను జోడిస్తూ ‌భారతీయ తత్త్వశాస్త్రాన్ని వటవృక్ష ప్రాయము చేశారు.
ఆత్మ, బ్రహ్మము, మాయ, జగత్, ప్రపంచము, మానసిక దశలు, స్థితులు, గుణములు, నిర్గుణము, సగుణము ఇలా ఎంతో తత్త్వశాస్త్ర పరిభాష ఉంది. ఇందులో గుణ‌ శబ్దానికి అర్థ, తాత్పర్యములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో చర్చించాను. గుణత్రయవిభాగము భగవద్గీతలో పరమాత్మ సద్రవ్యచాడు. ఆయన చెప్పిన సారాంశం కలిగి ఉండి మరొక దృష్టితో నేను ప్రస్తుతిస్తాను.
గుణము అంటే మనకు సత్త్వ-రజస్-తమో గుణములు దృష్టిలోనికి వస్తాయి. గుణ శబ్ద ప్రతిపాదనను వైశేషికము చేసింది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావములను సప్త పదార్థములుగా ప్రతిపాదించింది. పదార్థమును వేదాంతం నామ-రూప-భావ-వాసనా రహిత వస్తుః పదార్థః అంటుంది. వ్యాకరణము నాలుగు పదార్థములు అంటుంది. సాంఖ్యయోగములు ప్రకృతిని పదార్థము అంటారు.
వీటన్నటిలోి పదార్థాన్ని మనసు, ఇతర అంతఃకరణముల, జగత్, ప్రపంచముల ముడి పదార్థము/శక్తి అనే అర్థములో
వాడారు. ఈ మీమాంస మరొక సారి చేద్దాము.
సత్త్వరజస్తమోగుణములు:
మాయా/చిదాభాస/ప్రణవము/స్ఫోట ల పరిణామములైన అంతఃకరణములు సమస్త మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి. ఇక్కడ మానసిక శక్తీ పరిణామము వక్తలో పురోధాన (ముందుకు) / శ్రోతలో తిరోధాన (వెనుకకు) జరుగుతుంది.
విషయయుత బహిర్ ప్రపంచముతో అనుసంధానము మనసు జ్ఞానేంద్రియముల ద్వారా కలిగిస్తుంది. ఇది మెళకువ (జాగ్రత్) మానసిక దశలో జరుగుతుంది. ఇప్పుడు మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.
(కంటికి దృశ్యములు, రూపములు; చెవికి ధ్వనులు, మాటలు; ముక్కుకు వాసనలు; నాలుకకు రుచులు, చర్మమునకు స్పర్శలు, వేడి, చల్లదనాలు విషయములు. వీటన్నిటినీ కలిపి జ్ఞానేంద్రియములు అంటారు.
వాక్-పాణి-పాద-పాయువు-ఉపస్థలు కర్మేంద్రియములు అంటారు.
ఇవి మాట, చేతి కదలికలు, కాలు కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు.
ఇవన్నీ యాంత్రికశక్తీ చలితములు. మాయ దివ్యమై జ్ఞాన శక్తిగా మనసు ద్వారా జ్ఞానేంద్రియములను ప్రచలితము చేసి గ్రహణలు చేస్తుంది. ఇతర అంతఃకరణముల ద్వారా తత్సంబంధ జ్ఞాన సముపార్జన, జ్ఞాన నిధానము, జ్ఞాన ప్రేరణ చేస్తుంది. స్వర శక్తియై కర్మేంద్రియములద్వారా జ్ఞాన వ్యక్తీకరణలు, ప్రతిక్రియలు చేస్తుంది.
మనసు జ్ఞానకర్మేంద్రియముల ద్వారా అన్ని పనులు చేస్తుంది. ఇతర అంతఃకరణములు తోడ్పడతాయి.)
మిగతా అంతఃకరణములైన బుద్ది, అహంకారము, చిత్తము మనసు గ్రహించిన విషయాన్ని తర్క, వ్యక్తి సంబంధ, విషయములుగా విడదీసి అంతర ప్రపంచంగా మస్తిష్కములో భద్రపరుస్తాయు; మనసు మరల ఈ అంతర ప్రపంచం నుంచి విషయగ్రహణము చేస్తే అది భావము లేక తలపు అవుతుంది; చిత్తము ద్వారా వాసనలు (విషయ సంబంధ అనుభవనులు, అర్థములు, స్ఫురణలు,) ఏర్పడడం, ప్రేరేపింపబడడం జరుగుతాయి. ఇప్పుడు దీనిని కల (స్వప్న) మానసిక దశ అంటారు. ఇప్పటి దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.
ఇందులో ఏ విషయము కాని విషయానుభవము గాని గ్రహింపబడక మనసు నిర్మలంగా ఉంటే దాన్ని సత్త్వ గుణము అంటారు. ఇది శుద్ధ గమనిక స్థితి. భగవత్ సంబంధమైన విషయ, విషయానుభవ గ్రహణము సత్త్వ గుణము అని ఆస్తికులు అంటారు.
గమనికలో అంతఃకరణములుంటే అది రజోగుణము. అంతఃకరణములు విషయయుతమైతే అది తమో గుణము. గమనికలో ఏ విషయము, విషయానుభవము ఉండక పోవడం నిర్గుణము.
గుణము అంటే సంస్కృత భాషలో ముడి అనీ అర్థము ఉంది. ఈ అర్థములోనే గుణ శబ్దము వాడబడింది.
నిర్గుణము:
ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.
అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.
దీనినే అద్వైత (రెండు కాని-రెండు లేని-రెండుగా లేని) స్థితి అంటారు. ఇప్పుడు దృష్టిలో విషయ, విషయానుభవములు ఏమీ ఉండవు. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. అహం-అహం అనే శుద్ధ గమనికా స్ఫురణ నిరంతరంగా సాగుతూంటుంది. దృష్టిలో అహం-ఇదమ్ అనే విభాగము ఉండదు.
ఇదమ్ - మానసిక కార్యకలాపములు జరగడానికి, గ్రహణలకు, విరమింప బడడానికి చిహ్నము. దృష్టి అహం ఇదమ్ లుగా విడి అంతఃకరణములకు కనబడితే అది ద్వైత (రెండు ఉన్న- రెండు - అహం-ఇదమ్-గా కనబడుతున్న) స్థితి. ద్వైత స్థితిలో దృష్టిలో త్రిపుటి విభాగము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞాన-జ్ఞేయములుగా విడడం-మూడూ విడిగా తెలియడం త్రిపుటి ఏర్పడడానికి చిహ్నము.
ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్, సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా ల లోని ఇదమ్ ఇదే.
ఈ విభాగమే వైయాకరుణుల కర్త-క్రియ-కర్మ విభాగము.
ధ్యానపరుల ధ్యాత-ధ్యానము-ధ్యేయము విభాగము.
ఈ విభాగము గుణత్రయ విభాగము. సత్త్వ- రజ: - తమో - గుణములు గా మనసు పని చేసే సమయము.
త్రిపుటి ఏర్పడక, మనసు, ఇతర అంతఃకరణములు పనిచేయక నిర్వాపారముగా ఆత్మలో లీనమై ఉండడం
నిర్గుణ స్థితి. శాంతము, మౌనము, ఆనందము, మోక్షము, తురీయము, భగవత్ స్థితి, పరమాత్మ స్థితి అని దీనికే పేర్లు.
గుణ త్రయ విభాగము జరిగితే మానసిక కార్య కలాపములు జరుగుతున్నట్టు. అనుగుణ వ్యక్తిత్వ స్పృహ జాగరితమై మనము జీవ స్థితినొంది తత్సంబంధ విషయ, విషయానుభవము లకు లోనై వర్తిస్తాము.
గుణత్రయవిభాగము జరగకపోతే వ్యక్తిత్వ స్పృహ కలుగదు. మన సహజ స్థితియైన పరమాత్మ స్థితి చెదరదు. మనము జీవ స్పృహ కోల్పోయి పరమాత్మాను సంధానమును పొంది నిర్గుణులమై నిరాకులంగా ఉంటాము. జీవిస్తాము.
సత్త్వరజస్తమోగుణములు కలిగి బహిర్ అంతర జగత్తులతో అనుసంధానం ఏర్పడడం, విషయ, విషయానుభవములతో మవసు, ఇతర అంతఃతరణములు ముడివడడం జీవ స్థితి.
సత్త్వరజస్తమోగుణములు కలుగక నిర్గుణముగా - విషయ, విషయానుభవములతో అంతఃకరణముల ద్వారా ముడివడక - ముడి వీడి - ఉండడం పరమాత్మ స్థితి.
ఇవి త్రిగుణములు, నిర్గుణము.
ప్రకృతి ఈ మూడు గుణములను అవలంబించి, ఆశ్రయించి మానసిక కార్యకలాపములను నిర్వర్తిస్తుంది.
ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.
అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.

మంత్రము 11

యం కఞ్చిత్ విషయం బాహ్యాభ్యంతరం వా అనుసంధాత్యస్య చితైకాగ్రయం ధారణా 

బయటి భౌతిక జగత్తు నుంచి గాని, (అది తన్మాత్రలుగా జ్ఞానేంద్రియములద్వారా కానీ); దాని ఆంతర ముద్రలైన ప్రపంచం నుంచి కానీ, గ్రహింపబడి అది మాత్రమే దృష్టిలో ఉండడాన్ని  ధారణ అంటారు. ఇంగ్లిష్ లో దీనిని concentration అంటారు. 

యమ (సత్ ప్రవర్తన), నియమ, ఆసన (భంగిమ - posture), ప్రాణాయామము, ప్రత్యాహారము లతో మొదలై ధారణ కలిగి, ధ్యానముగా మారి సమాధినిస్తుంది. 

చిత్తైకాగ్రతయే ధారణ. 

మంత్రము 12

తైలదారావత్ అనుసంధాన నైరత్య్రం ధ్యానమ్ 

తైల ధార వలె అవిఛ్చిన్నంగా అనుసంధానము చేయడాన్ని ధ్యానము అంటారు. 

ధ్యానమునకు రెండు నిర్వచనములు ఉన్నాయి. 

ఏక వస్తు చింతనమ్  ఏవ ధ్యానమ్ 

ధ్యానమ్ అర్థ భావనమ్ 

అని రెండు నిర్వచనములు. 

మొదటి నిర్వచనము 

"ఏక వస్తు చింతనమ్ ఏవ ధ్యానమ్" 

అనేది 

"తైలధారావత్ అనుసంధాన నైరత్య్రం ధ్యానమ్"  

నిర్వచనము నకు అనుగుణముగా ఉంటుంది. 

ఇక్కడ వస్తు అనే పదము మంచి గాంభీర్యమైనది. 

ఆత్మను వస్తువు అంటారు. ఆత్మా, బ్రహ్మా పదములు నపుంసక లింగ శబ్దములు. "వస్తు" శబ్దం కూడా నపుంసకలింగ శబ్దము. 

అంచేత వస్తువు అంటే ఆత్మా, లేదా బ్రహ్మా లక్షణములతో ఒకదానిని స్మరించడము. 
అవి శాంతము, మౌనము, ఆనందము, శుద్ధ జ్ఞానము, ప్రజ్ఞానము, సత్య లోకము మున్నగునవి. 

దానితో బాటు అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములలో ఎదో ఒకదానిని మన మనస్తత్త్వమునకు అనుగుణముగా ఎన్నుకొని దాని సాయముతో నిరంతర ధ్యానము చెయ్యాలి.  

మనము ధ్యానము మొదలు పెట్టినప్పుడు ధ్యాత-ధ్యానము-ధ్యేయము అనే త్రిపుటిలో మొదలు పెడతాము. ధ్యానము గాఢము అయినకొద్దీ ధ్యాత, ధ్యేయము ధ్యానములో కలిసిపోయి ధ్యానము మాత్రము మిగులుతుంది. ధ్యాత,ధ్యేయముల స్పృహ, దృష్టి పోతుంది. రెండూ ధ్యానములో లీనము అయిపోతాయి. అప్పుడు ధ్యానము పండినట్టు. 

ఇలా  ఎన్నుకొన్న ధ్యేయమును (ధ్యాన వస్తువును), 

వస్తు లక్షణమును లేదా 

విషయమును లేదా విషయానుభవమును

తైలధారవలె, అవిఛ్చిన్నముగా నిరంతరమూ దృష్టి యందు ఉంచుకొనడమే ధ్యానము.
యోగసార ఉపనిషత్తు - 10
13. సమాధిః ద్వివిధః సంప్రజ్ఞాతోసంప్రజ్ఞాతో ఇతి.
సమాధి రెండు విధములు.
సంప్రజ్ఞాతము. అసంప్రజ్ఞాతము.
సంప్రజ్ఞాతము అంటే సవికల్ప సమాధి. ప్రజ్ఞ ఉంటుంది. ఆంతర, బహిర్ ప్రపంచాలు తెలుస్తూ ఉంటాయి. అవసరమైతే సంకల్పిస్తే అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలు పనిచేస్తూ లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. గమనిక ఉంటుంది. అంతా తెలుస్తూంటుంది.
జ్ఞాన, కర్మేంద్రియాలు రథానికి పూన్చిన అశ్వముల వలె ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి.
అంతరము భావ, వాసనా రహితంగా ఉండి నిర్మలంగా ఉంటుంది. యోగుల, జ్ఞానుల ఆంతర స్థితి ఇది. సంకల్పిస్తే చర్యలకు ప్రతి చర్యలు జరుగుతాయి. తెలివి, స్పృహ ఉంటాయి.
అసంప్రజ్ఞాతము అంటే నిర్వికల్ప సమాధి. ప్రజ్ఞ ఉండదు. గమనికలో ఆంతర, బాహ్య జగత్తులు ఉండవు. అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలు పనిచేయవు. ఏమీ తెలియదు. తెలివి ఉండదు. స్పృహ తప్పిపోతుంది. ఊపిరి తీయడం, ఇతర ముఖ్య శారీరక కార్యకలాపాలు తప్ప మరే మానసిక, తదనుగుణంగా శారీరక కార్యకలాపాలు జరగవు. సంకల్పించడం ఉండదు. శరీర, జగత్ స్పృహ ఉండదు. భావములు కలుగవు. ఏ అనుభవములు
ఉండవు. అంతర, బాహ్యములు తెలియవు.
ఈ మానసిక స్థితిలో ఏమీ తెలియదు. ఇది కొందరికి సహజముగా వస్తుంది. కొందరకు సాధనలో భాగంగా వస్తుంది.
14 నిస్త్రైగుణ్యో యోగీ కైవల్యమశ్నుతే
సమాధిని చేరిన యోగి త్రిగుణములకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటాడు. సమాధి లక్షణాన్ని బట్టి
మానసిక, శారీరక కార్యకలాపాలు జరుగుతాయి.
నిర్గుణుడైన యోగి కైవల్యం పొందుతాడు.
శాంతానందమౌన స్థితిని కైవల్యము అంటారు. వైకుంఠమన్నా, కైలాసమన్నా, మోక్షమన్నా, ముక్తి అన్నా, నిర్వాణమన్నా ఇదే.


భాషా, కుల, మత దురభిమానాలుకవుల అగచాట్లు ; పొగ; Love, science and religion'

భాషా, కుల, మత దురభిమానాలు

తెలుగు భాష మీద మనలో చాలా మందికి ప్రేమాభిమానాలు కాదు కాని మన ప్రాణం మీదికి వస్తోంది. అలాగే హిందూ మతం మీదాను.
వాళ్ళ ప్రేమాభిమానాలు చూపించడానికి మన మీద పడతారు. అంతర్జాలము, సామాజిక సాలెగూళ్ళు వచ్చేక ఈ రొద ఎక్కువై పోయింది. వాళ్ళకి తెలుగు భాష మీద అంత అభిమానం ఉంటే వాళ్ళ మనుమలని, మనుమరాళ్ళని దర్జాగా తెలుగు మాధ్యమంలో చదివించుకోవచ్చు. తమ తెలుగు భాషాభిమానంతో వారిని తడిపి, పిండి, ఆరేసెయ్య 
వచ్చు. మధ్యలో ఆంగ్ల భాషను ఆడిపోసుకోవడం ఎందుకు? మనందరికీ ఉపదేశాలు ఇవ్వడం ఎందుకు?
మనందరినీ ఏదో తప్పు చేస్తున్న వారిలా డబాయించడం ఎందుకు? మారిన సాంఘిక పరిస్థితులలో ఎవరికి తోచినట్లు వారు చేసుకుంటారు. ఈ పిలవని పేరంటాలకు రావడం ఎందుకు? మన మీద నోరు పారేసుకోవడం ఎందుకు?
వీళ్ళ వీరాభిమానాలు కాదు కాని మన మనశ్శాంతిని హరించేస్తున్నారు. వీరిలాగే హిందూ మత పరిరక్షకులూను. వారికి అర్థమైన విధంలో హిందూ మతాన్ని మనందరినీ అనుసరించమంటారు. భారతదేశంలో హిందూమతం ప్రాంతం ప్రాంతానికి వేరుగా అనుసరించబడుతోంది అనే వాస్తవాన్ని గమనించే ఇంగితం వారికి లేదు. ఆ ఇంగితం ఉన్నవారిని డబాయిస్తారు. ప్రతి కుటుంబానికి వారి వారి సాంప్రదాయాలు ఉంటాయని వీళ్ళకు ఎలా చెప్పాలి?
సాంస్కృతిక సంస్థలు ఒక లాగ, సన్యాసులు, అమ్మలు, బాబాలు ఒకలాగ, కులనాయకులు ఒకలాగ, హిందూ మతాన్ని చిరిగిన విస్తరిని చేసి చిందర వందర చేస్తూ చిందులు వేస్తున్న నేడు ఎక్కడ హిందూమతం? ఏది హిందూ మతం?
కుటుంబానికి కేంద్రమైన ఇల్లాళ్ళు ఇన్నాళ్లు వాళ్ళ భుజస్కంధాలపై మోసి నిలబెట్టిన హిందూ సంస్కృతి
ఇల్లాలి మరణంతో బలహీన పడిపోయింది. ఆచార వ్యవహారాలు, పండుగల ఆచరణ, సంస్కృతి, మతము, తత్త్వము ఇలా బహుముఖములు కల హిందూ మతము ఒక ధర్మజనితము. అది ధర్మము.
ఈ అవగాహన లేని పైన పేర్కొన్న వారందరూ హిందూ మతాన్ని కబ్జా చేశారు. ఎవరికి తోచినట్లు వారు మతాన్ని ఉద్ధరించాలని, మనందరినీ అలా లాక్కెళ్లాలని బద్ధ కంకణులై ఉన్నారు.
ఇలా భాషా, మత దురభిమానులు, కులనాయకులు హిందూ మతం తీరే మార్చేశారు. ఎక్కడి హిందూ మతం, ఎక్కడి ఉద్ధరణ?
***********
కవులు వర్గములుగా, కులములు వారీగా, వాదప్రతివాద రాద్ధాంతములకు ప్రతినిధులుగా మారి ద్వేష విద్వేషములను వెళ్లగక్కుతున్న నేడు సత్కవులు అనే మాటకు అర్థము లేదు. ఎవరు సత్కవులు అనే మాట మీద ఏకాభిప్రాయము కూడా ఉండదు. సర్వులకూ సత్కవులైన వారు ఇక రారండి. రాలేరండి. అందరి బాగుకోరి రాసేవారు వచ్చినా గుర్తింపబడరండీ.

***********

కవుల అగచాట్లు 

కవితలు వెలయించి అందరకు వెలుగులు
పంచబూను కవీశ్వరులు ఆ కవితల అచ్చువేసుకొని 
అమ్ముకొను హడావుడిలో తమ అసలు
వృత్తి ప్రవృత్తి కవితల వెలయించుట మరిచెదరు

చేతి చమురు భాగోతము చందమున 
అచ్చొత్తించుటకు స్వంత డబ్బు ఖర్చు
పెట్టుకొనుట స్వంత డబ్బా కొట్టుకొనుట
అనరాదు; ధన సంపర్కము కవులకచ్చిరాదు
***********
జర్మన్ మూలం: బ్రెటోల్ట్ బ్రెఖ్త్

తెనుగు సేత: డా. వారణాసి రామబ్రహ్మం

పొగ

ఆ చెట్ల మధ్యలో
కొలను గట్టున ఉన్న
పర్ణకుటీరంలో నుంచి
పొగ వస్తోంది
ఆ పొగ రావడం ఆగిపోతే
ఆ పర్ణకుటీరం
ఆ తరువులు
కొలను
బోసిపోతాయి కదా!
*********
Love is weakness; passion; joy; focused feeling; a way for meditation.
**********
Always ready to improvement and having an open mind to welcome new and revolutionary propositions and agreeing to innovative ideas even contradictory to existing ideas is science.
So is spirituality.
To have a closed mind is religion.

Monday, January 29, 2018

రామ నామము చదువు-రసజ్ఞత; కథలు, గాథలు; మూర్తులు-ప్రవర్తనలు;

Our addiction to social networking sites is a sign that we are not having a professionally fulfilling life.

**********
రామ నామము శ్రావ్యమైనది. రామ నామము లలితమైనది. రామ నామము సుందరమైనది. రామ నామము శుభకరమైనది. రామ నామము మంగళకరమైనది. రామ నామము మధురమైనది. రామ నామము ఆనందదాయకమైనది. రామ నామము రమ్యమైనది. రామ నామము మోక్షప్రదమైనది..

**********


చదువు-రసజ్ఞత

గురువులను పక్కకు పెట్టి
లెర్నింగ్ ఏప్స్ వచ్చెను;
చాక్ పీస్ నల్లబల్లలు పోయి
డిజిటల్ క్లాస్ రూమ్ లొచ్చెను;
చదువు యంత్రముల మయమాయెను
విద్యాభ్యాసము వేరొక దారి పట్టెను;
బుద్ధిని వెలిగించి ఉత్సుకత రగిలించి
అవగాహనను ఆకళింపును కలిగించి లోతైన
విషయ పరామర్శను చేయించుట పక్కకు పోయి
అంతర్జాల సాంఘిక సమూహాల మాదిరి
చదువులు తమ దర్జా ప్రాభవముల
కోల్పోయి ఏదో కాలక్షేపపు బఠానీలైనవి
చదువు మతిని సరిచేయవలెను
జ్ఞానమును కలిగించవలెను; ముక్కున
పట్టి కాగితపు ముక్కకై ప్రాకులాట
చదువు కాదు; సంస్కారం సభ్యత
నేర్పునది చదువు; జీవించుటకు
సిద్ధపరుచునది చదువు; ఎత్తు పల్లముల
ఎక్కి దిగునప్పడు సాయపడునది చదువు
మనిషిగా బ్రతికి మనీషగుటకు చదువు
ఏవో కొన్ని డిగ్రీల జీవికకై సంపాదించుట
చదువు కాదు; చదువున మమేకమై చదువుగ
మారుట చదువు; చదువది ఎంత కలిగినను
రసజ్ఞత ఇంచుక కలిగించలేని చదువు చదువు కాదు
**********
Thoughts are incessant chatter of conscious mind. Peace is quietude of mind in blissful serenity.
********
పెళ్లి ఒక మానసిక బంధం.. సాంస్కృతిక అనుబంధం. నాగరికతా లక్షణం. ఇవి దృష్టిలో లేకపోతె పెళ్లి పెటాకులు కావడం ఖాయం.
**********
A human being is not a "meat computer". A human being is an aesthetic pleasure. An intellectual joy. A blissful, serene, silent being. A lovable and loving Divine Consciousness.
************
చక్కని వాక్యములు 
చిక్కని భావములు 
చిక్కని పదగుంభనములు 
చక్కని అలంకారములు 
వెరసి అందమైన కవిత 
రసికుల పాలిట రుచిభరిత 
ఫలము సంస్కృతీ నాగరికతా 
పక్వ ఆస్వాదనా రసనము
************

మూర్తులు-ప్రవర్తనలు
మన మూర్తుల కన్న మన రచనలు పలుకులు ప్రవర్తనలు
ఆకర్షించును ఇతరుల అంతర్జాలమున ఐనా మరెక్కడైనా;
అందము శరీర దార్ధ్యము యవ్వనమునకు సంబంధించినవి; 
వయసులు పెరిగిన కొద్దీ ఆసక్తి తగ్గును వదలిన శరీరములపై;
ఆశించెదము ప్రేమాభిమానముల ఆప్యాయతల అనురాగముల
అనుబంధముల; అందిన అవి, జీవితము ధన్యము; లేకున్న ఆయాసము
*********

If humans and human race know how to discriminate between what to forget and what to remember, a lot of energy, money and time are saved. The humans and society will live in peace. But many remember disrupting events and cause disturbance now. 

Serenity is selective remembrance. Silence is avoiding peace disturbing thoughts, words and deeds. Bliss is to implement these.

*********
కథలు, గాథలు మానవాళికి అవసరము. కొంత ఊహ, రమ్యత, మనుషులను ఆహ్లాదపరుస్తాయి. అస్తమానూ సత్యము, వాస్తవము అంటూ పొడి పొడి మాటలు ఆర్ద్రతను ఎండగొట్టేస్తాయి. ఆర్ద్రత హృదయానికి సహజ లక్షణము. దానిని నిర్లక్ష్యము చేయడము తెలివైన పని కాదు.
ఊహలు లేక మనిషి లేడు. రమణీయత కల్పనలో ఉంటుంది. పంచతంత్రము, హితోపదేశము, జాతక కథలు, రామాయణము, మహాభారతము, మహాభాగవతము మనుషుల మనసులకు హాయినిస్తాయి. రోజూవారీ సంసార నిర్వహణనుంచి కాస్త శ్రాంతతను తొలగించి, విశ్రాంతిని ఇచ్చి, మరల సంసార బాధ్యతలను ఓపికగా నిర్వర్తించే వెసులుబాటుని కలిగిస్తాయి.
మనోహరమైన కల్పనలు మనస్సుకు సేద. మనసు ఊహల ఉయ్యాల. దానికి మధురోహలు, మంచి ఊహలు, ఉపశమనము

Sunday, January 28, 2018

యోగసార ఉపనిషత్తు 1-5

పది ఉపనిషత్తులు

యోగసార ఉపనిషత్తు - 1
యోగ దర్శనము
పతంజలి యోగసూత్రములు ప్రపంచానికి ప్రాచీన భారతదేశపు బహుమతి. ఈ యోగసూత్రములు ఇప్పుడు యోగా అనే పేరుతొ కొన్ని దశాబ్దాలుగా ప్రచారము చేయబడుతూ వేల బిలియన్ల వ్యాపారంగా మారిపోయి; సొంత దారిలో నడుస్తోంది. ఆ ప్రయాణములో తన ఉనికిని, స్వభావాన్ని, మార్చేసుకొని ఎన్నో బ్రాండ్ల అవతారములు ఎత్తి అర్ధాన్నీ మార్చేసుకొంది. ఈ పరిణామానికి తత్త్వజ్ఞులు, సరసులు, సహృదయులు కించ పడకుండా ఉండలేరు.
ప్రస్తుతము యోగముని యోగా పేరుతొ దాని మూలములనే మార్చేసి యోగము అనగానే శారీరిక వ్యాయామము గుర్తువచ్చేలా యోగ పదము రూపు మార్చేశారు.
యోగా ని శారీరిక వ్యాయామముగా మార్చేశారు.
యోగానికి సంబంధించి పతంజలి యోగ సూత్రములు ప్రసిద్ధమైనవి. ఎందరో స్వాములు, ఆధ్యాత్మిక గురువులు ఈ పతంజలి యోగసూత్రములను రకరకాల పేర్లతో రకరకాల యోగములుగా మార్చి బ్రాండ్ వేసికుని వారి చుట్టూ కొందరిని చేర్చుకొని పొట్టపోసుకుంటున్నారు. ఈ మార్పు సాంస్కృతిక విప్లవమా సాంస్కృతిక అపభ్రంశమా?
పతంజలి తన యోగసూత్రములను మానసిక, మనస్తత్వ, తాత్త్విక విషయములకు మార్గదర్శినిగా రూపొందించాడు. ఇప్పుడు యోగమును యోగా గా మార్చేసి శారీరిక వ్యాయామము కొన్ని భంగిమలతో చేయించడముగా దిగజార్చిన యోగా గురువులను చూసి ఆయనకి ఎంత వేదన కలుగుతుందో, ఎంత చికాకు, కోపం కలుగుతాయో చెప్పలేము. ఆయన స్వర్గములో ఎంతో ఇబ్బంది పడిపోతూంటారు.
పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న యోగా బ్రాండ్లు, యోగా గురువులు ఆయన్ని మరింత అసౌకర్యానికి గురిచేస్తుంటారు.
పాశ్చాత్య దేశములలో యోగ అంగీని శారీరిక వ్యాయామము అనే దృష్టి ఎక్కుచు. వారి యోగా కొన్ని భంగములని మించి పోదు. పతంజలి యోగమును ఓకే తత్త్వ దర్శనముగా స్వీయ దర్శనముగా అందించాడు. అయన 196 సూత్రములు తత్త్వమసి ఉపనిషద్వాక్య తాత్పర్యమును తెలిసికొని, మనిషి శరీర, మానసిక ఆరోగ్య సమ తుల్యతను నియమించుకుంటూ, ప్రకృతి తత్త్వాన్ని ఆనందించడం ఎలా పెంపొందించుకోవాలో తెలియజేస్తాయి.
ఆసనములు వేయడముతో ప్రారంభించి శరీర ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టి అప్పుడు ముఖ్యమైన మానసిక ఆరోగ్యం సంపాదించడానికి సులువులను ఈ సూత్రములు చెబుతాయి. ఈ కృషి వలన మనిషి శారీరిక స్పృహనుంచి తప్పుకొని అంతర ప్రపంచ, మానసిక చర్యల - సత్త్వ, రజో, తమో గుణ ప్రధానమైన మానసిక కార్యకలాపముల - గురించి ఒక అవగాహనకు వస్తాడు.
ఆలా ఈ యోగ సూత్రములను పద్ధతిగా, శ్రద్ధగా చదివి, ఆకళింపు చేసికొని ఆ సారాన్ని నిజ (తన) తత్త్వ దర్శనానికి ఉపయోగించుకుంటాడు. దీనినే psychotherapy లో Self -actualization అంటారు. ఇటువంటి అవగాహన కాల్గడము వల్ల అనుకోకుండా, తెలియకుండా మనస్తత్త్వ దర్శనాన్ని చేస్తాడు సాధకుడు.
భారతీయ తత్త్వ గ్రంథములు, సూత్ర సాహిత్యములు, తత్సంబంధ ప్రాచీన, అర్వాచీన, అత్యంత ఆధునిక వ్యాఖ్యానములు, మనస్తత్త్వ విచారణా, నిర్ణయాత్మకములైన తత్పర భరితములు. సారాంశములు. సారములు.
psychotherapy కి పతంజలి యోగ సూత్రములలో చెప్పిన మాటలు ఉపయోగిస్తున్నాయని విజ్ఞులు - ప్రాచ్య, పాశ్చాత్య మనస్తత్త్వ శాస్త్రజ్ఞులు - గుర్తించి చెబుతున్నారు.
ప్రస్తుత రూపము - ఆసనములే - యోగము - అనే కొందరు యోగా ఆచార్యుల అపార్థము - 1950 ల నుంచి మొదలై ప్రాచుర్యము పొందడము మొదలుపెట్టింది. అష్టాంగ యోగము, రాజయోగము అనే పేర్లతో ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. శారీరిక భాగము తక్కువ, మానసిక భాగము ఎక్కువ అనే ధోరణి వచ్చింది. యోగా యోగము అవడము జరిగింది. జరుగుతోంది. కానీ యోగానే - ఆసనములనే - యోగము అనుకోవడము మానక, మానలేక - ఎక్కువమంది శారీరిక వ్యాయామమునే అనుసరిస్తున్నారు.
పతంజలి - యోగము - గమనిక
యోగానికి సంబంధించి పతంజలి యోగ సూత్రములు ప్రసిద్ధమైనవి. ఎందరో స్వాములు, ఆధ్యాత్మిక గురువులు ఈ పతంజలి యోగసూత్రములను రకరకాల పేర్లతో రకరకాల యోగములుగా మార్చి బ్రాండ్ వేసికుని పొట్టపోసుకుంటున్నారు.
యోగము అనగానే శారీరిక వ్యాయామము గుర్తువచ్చేలా యోగ పదముని మార్చేశారు. అసలైన యోగ 10 శాతము శారీరిక వ్యాయామము 80 శాతము మానసిక వ్యాయామము.
మానసిక వ్యాయామము చేయాలంటే మనసు స్వరూప స్వభావములు తెలవాలి. ఆ పై పతంజలి యోగ సూత్రములు ఒక పద్ధతిలో అనుసరిస్తే అది మానసిక ఋగ్మతల నుంచి మనలని కాపాడుతుంది కూడా. మానసిక వ్యాయామము చేసి మనసుని నియత్రించుకోవాలి.
శారీరిక వ్యాయామము తోటే చాలామంది గురువులు యోగాని సరిపెట్టేస్తున్నారు. జనాలు యోగా అనగానే శారీరిక వ్యాయామము అని నిర్ధారించేసుకున్నారు.
ఈ పరిస్థితులలో అసలైన యోగా గురించి మాట్లాడడము అవసరము. ఎందుకంటే యోగా 80 శాతము మానసికము కాబట్టి. పతంజలి యోగ సూత్రములు అధ్యయనము చేసే ముందు ఈ బుల్లి ఉపనిషత్తు చదువుకుందాము. వ్యాఖ్యానించుకుందాము.

యోగసార ఉపనిషత్తు - 2

ఈ పది ఉపనిషత్తులు The Principal Upanishads కాదు. మరొక పది ఇవి. Divine Life Society, Hrishikesh కి చెందిన స్వామి శివానంద ఎన్నిక చేసినవి. సరళమైన భాషలో తత్త్వ గాంభీర్యం లేని ముచ్చటైన తత్త్వ గ్రంథములు. కర్తలు ఎవరో తెలియదు.
పతంజలి - యోగము
యోగానికి సంబంధించి పతంజలి యోగ సూత్రములు ప్రసిద్ధమైనవి. ఎందరో స్వాములు, ఆధ్యాత్మిక గురువులు ఈ పతంజలి యోగసూత్రములను రకరకాల పేర్లతో రకరకాల యోగములుగా మార్చి బ్రాండ్ వేసికుని పొట్టపోసుకుంటున్నారు.
యోగము అనగానే శారీరిక వ్యాయామము గుర్తువచ్చేలా యోగ పదముని మార్చేశారు. అసలైన యోగ 10 శాతము శారీరిక వ్యాయామము 80 శాతము మానసిక వ్యాయామము.
మానసిక వ్యాయామము చేయాలంటే మనసు స్వరూప స్వభావములు తెలవాలి. ఆ పై పతంజలి యోగ సూత్రములు ఒక పద్ధతిలో అనుసరిస్తే అది మానసిక ఋగ్మతల నుంచి మనలని కాపాడుతుంది కూడా. మానసిక వ్యాయామము చేసి మనసుని నియత్రించుకోవాలి.
శారీరిక వ్యాయామము తోటే చాలామంది గురువులు యోగాని సరిపెట్టేస్తున్నారు. జనాలు యోగా అనగానే శారీరిక వ్యాయామము అని నిర్ధారించేసుకున్నారు.
ఈ పరిస్థితులలో అసలైన యోగా గురించి మాట్లాడడము అవసరము. ఎందుకంటే యోగా 80 శాతము మానసికము కాబట్టి. పతంజలి యోగ సూత్రములు అధ్యయనము చేసే ముందు ఈ బుల్లి ఉపనిషత్తు చదువుకుందాము. వ్యాఖ్యానించుకుందాము.

శాంతి మంత్రము
ఓం యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వమ్
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తం హ దేవమ్ ఆత్మ బుద్ధి ప్రకాశమ్
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే
తాత్పర్యము:
ఎవరైతే ముందు బ్రహ్మను ప్రకాశమయుని, జ్ఞానవంతుని చేసెనో, ఎవరినైతే వేదములు కొనియాడుతూ ఉటంకిస్తాయో, ఎవరయితే ఆత్మను, బుద్ధిని ప్రకాశింపచేస్తాడో, అతనిని, భగవంతుని, ముముక్షుడనై శరణము వేడెదను.
మంత్రము 1
అథాతో యోగం వ్యాఖ్యాసామః
ఇప్పుడు మనము యోగము గురించి వ్యాఆఖ్యానించుకుందాము.
మంత్రము 2
యోగః చిత్త వృత్తి నిరోధః
యోగము అంటే చిత్త వృత్తి నిరోధము
యోగము అంటే చిత్త వృత్తి ని కలుగకుండా చేసికోవడము. ఇది పతంజలి యోగ సూత్రములనుంచి గ్రహించబడి ఉండవచ్చు.
మంత్రము 3
తతశ్చ పరమాత్మనా సమవాయః
అప్పుడు మనము పరమాత్మతో నింపబడి, కూడి ఉంటాము
మంత్రము 4
గురోరంతికాద్యోమభ్యస్యేత్
యోగమును గురువునకు ఆప్తులమై నేర్చుకోవాలి.
గురువు నిర్వచనములు
1.
ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే
వ్యోమవత్ వ్యాప్య దేహాయ (దేశాయ) శ్రీ దక్షిణామూర్తయే నమః
మన ఇష్ట దైవము, మనలను ఆకర్షించిన మానుష గురువు (బ్రతికి ఉన్నా, లేకపోయినా), మన అంతరాత్మ. మనకు కలిగే స్ఫురణ, స్ఫూర్తి, ఈ రూపములలో మనలను సరియైన మార్గములో నడపడానికి గురువు ఉంటాడు
బ్రతికి ఉన్న మానుష గురువుల విషయములో మనము చాలా జాగరూకతతో ఉండాలి. వారిలో ఎక్కువమంది పొట్టకూటికోసము వేషము వేసిన వారే. మనము అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా ఎదో గురువును ఆశ్రయిస్తే మనకు యోగమార్గము తెలియదు సరి కదా, మనము ఆ గురువుకి బానిసలా తయారవుతాము.
2.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షున్మీలితంయేన తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞానపు చీకటులతో గ్రుడ్డి అయిన మనకు జ్ఞానాంజనము-జ్ఞానము అనే కాటుక యొక్క చిన్ని భాగముతో మన కనుల తెరిపించే ఆయనే మన గురువు.
3.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః
4.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే
ఇది వైష్ణవ సంప్రదాయము.
5.
గురవే సర్వ లోకానాం భిషజే సర్వరోగాణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
మనకు గమనించే తెలివి, చాకచక్యము ఉంటె, ప్రతి వస్తువునుంచి , ఘటన నుంచి, వ్యక్తినుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. అన్నీ, అందరూ మన గురువులే.

1. యోగసార ఉపనిషత్తు - 3

ఈ పది ఉపనిషత్తులు The Principal Upanishads కాదు. మరొక పది ఇవి. Divine Life Society, Hrishikesh కి చెందిన స్వామి శివానంద ఎన్నిక చేసినవి. సరళమైన భాషలో తత్త్వ గాంభీర్యం లేని ముచ్చటైన తత్త్వ గ్రంథములు. కర్తలు ఎవరో తెలియదు.
మంత్రము 5
సరస్యాహః ఆవర్తాదివ వృత్తిరంతఃకరణపరిణామహః
సరస్సులో కలిగే నీటి అలలవలె వృత్తి అంటే అంతఃకరణ పరిణామములు.
ఇక్కడ వృత్తి ని నిర్వచిస్తున్నారు. తుత్తి అంటే అంతఃకరణములు పరిణమించుట. మార్పునొందుట. ఈ మార్పుని వివర్తనము అంటారు.
వివర్తనము అంటే పురోధాన-తిరోధాన యుత వర్తనము. ఆంగ్ల భాషలో దీనిని reversible becoming అంటారు.
వృత్తి – నివృత్తి – యోగ దర్శనము
వృత్తి పదము యోగశాస్త్రమునకు సంబంధించిన పదము.
మనందరకు పరిచయమైనదే.
యోగః చిత్తవృత్తి నిరోధః - అని ప్రసిద్ధమైన పతంజలి యోగసూత్రము. ప్రస్తుతము "యోగా" అనే పదనిర్దేశనతో
యోగము ఖండ ఖండాంతరములకు ప్రాకింది. మన కేంద్ర ప్రభుత్వమైతే "యోగా" కి పెద్దపీట వేసి ఎంతో ప్రచారము నిర్వహిస్తోంది. ఎందరమో యోగా కి అతుక్కుపోయేము కూడా. "యోగా" హిందూమతానికి సంబంధించినదని ఎందరో దానిని దూరంగా ఉంచుతున్నారు. ఎవరి అవగాహన వారిది. "పుఱ్ఱెకో బుద్ది జిహ్వకో రుచి" కదా.
ఎందరో కొన్ని ఆసనములు వేసి వ్యాయామము చేసి యోగా అయిపోయిందనిపిస్తున్నారు. నిజానికి యోగము వేరు, ఇప్పుడు ప్రాచుర్యములో ఉన్న యోగా వేరు.
యోగమునకు రెండు అంగములు. భౌతికము, మానసికము. భౌతికంగా యోగా చేసేసి ఫలితముల కోసం
ఎదురు చూస్తున్నాము.
మానసిక అంగమును తెలుసుకొని, అవగాహనకు తెచ్చుకొని ఆచరిస్తే తప్ప యోగము పూర్తి ఫలితములు
మనకు అందవు.
పతంజలి యోగసూత్రములలో ఈ మానసిక క్రమము చాలా విశదముగా చర్చించబడినది. అది ముందర మనసుకు ఎక్కితేనేకాని యోగాచరణము వృథా కాలయాపనము.
మనకు పెద్దల ద్వారా జ్ఞాన, కర్మ, భక్తి యోగములు అందాయి. వాటి మీమాంసలో, తర్జన భర్జనలలో చాలామంది సమయము గడుపుతారు. మనసు పాడు చేసుకుంటారు. యోగగమ్యమైన నిర్మల మానసిక స్థితిని పొందలేరు. ఈ మూడూ ఒకటే. వాటి గమ్యము, ఫలితము ఒకటే. మన మానసిక ప్రవృత్తిని బట్టి మనకు ఒక యోగము నచ్చుతుందంతే. ఒక యోగము ఇంకో యోగము కంటే తక్కువ, ఎక్కువ అని ఏమీ లేదు.
మనకు షడ్దర్శనములున్నాయి. న్యాయవైశేషికములు ఒక జట్టు. ఇవి అణు సిద్దాంతాన్ని ప్రతిపాదించాయి. సాంఖ్యయోగములది మరియొక జట్టు. ఇవి ప్రకృతీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస (వేదాంతము) లది ఒక జట్టు. ఈ జంటలన్నిటికీ సూత్రములున్నాయి.
ఆ సూత్ర వ్యాఖ్యానముల ద్వారా ఆయా దర్శనములు ప్రచారము లోనికి తేబడినాయి. ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల ప్రభావము షడ్దర్శనముల పుట్టుక, పరిణామములపై ఉంది. షడ్దర్శనములు, ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వములు చెప్పిన వాటిని పరిశీలించి; అంగీకరించి, నిరాకరించి, పరిహరించి, ఉంచి పరిణమించాయి. పరస్పర అవగాహన ఈ పరిణామములకు ఊతం ఇచ్చింది.
ఉపనిషత్తుల నుంచి బౌద్ధజైనతత్త్వముల ద్వారా, షడ్దర్శనముల తోడ్పాటుతో ఎదిగిన భారతీయ తత్త్వ శాస్త్రము ఆత్మజ్ఞాన గంగా కూలంకష.
(All these schools of thought have contributed to Indian spirituality by being both supplementary and complementary. Thus all these schools of thought must be given equal respect. Fighting over them and their superiority or inferiority is childish. They all together define and make Indian intellect, intuition, aesthetics and scholarship.)
మన వృత్తి దగ్గరకు వద్దాము.
మానవుని మానసిక కార్యకలాపములను జ్ఞానేంద్రియములు, అంతఃకరణములు, కర్మేంద్రియములు కలిసి నిర్వహిస్తాయి. ఇది సాంఖ్య నిర్వచనము. ఇందులో 24 భాగములు ఉంటాయి.
ఈ మానసిక కార్యక్రమమును చిత్తవృత్తి అంటుంది యోగము.
వృత్తి అంటే అంతఃకరణ పరిణామములు.
మనోబుద్ధ్యహంకారచిత్తముల పరిణామములు. ఇవి ఒక దిశలో (పురోధాన) జరుగుతే మనం గ్రహిస్తాము. వ్యతిరేక దిశలో (తిరోధాన) జరుగుతే మనం అంతఃకరణములు, కర్మేంద్రియములద్వారా చేష్టిస్తాము. ప్రతిచర్యలు జరుపుతాము.
అన్నిరకముల జ్ఞాన సముపార్జనము జ్ఞానేంద్రియముల ద్వారా మొదలై, అంతఃకరణముల మాధ్యమమున భావగతి, అనుభవ, అర్థ స్థితి నొంది తాత్పర్యము గా, తత్పరత‌ గా నిలుస్తుంది, వికసిస్తుంది. ఇదే మరల మన ప్రతిచర్యలను జరిపిస్తుంది.
అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తముల ద్వారా వృత్తి ఈ రెండు దిశల మానసిక కార్యకలాపములలోను ఏర్పడుతుంది.
మానవుని మానసిక శక్తి - అణుజనితమని న్యాయవైశేషికములు, మాయాజనితము, రెండు దిశల పరిణామ సహితము అని అద్వైత వేదాంతము, ప్రకృతీజనితము, భరితము అని సాంఖ్యయోగములు చెబుతాయి. దేని వల్ల జనించినా మనిషికి మానసిక శక్తి కలదు.
ఈ మానసిక శక్తి పరిణమిస్తే (పురోధాన మైనా, తిరోధాన మైనా) చిత్తవృత్తి ఏర్పడుతుంది.
ఈ చిత్తవృత్తిని నిరోధించడమే యోగమని పతంజలి యోగసూత్రములలో నిబద్ధమై ఉంది.
చిత్తవృత్తి నిరోధము చాలారకాలుగా చేసుకోవచ్చు- భక్తి, జ్ఞాన, కర్మ యోగముల ద్వారా. యోగాచరణము మన ఇష్టము. మన తత్త్వాన్ని‌బట్టి ఈ యోగము వారు మనం ఆకర్షింపబడతాము. అంతే. ముందే చెప్పినట్టు యోగము లలో ఎక్కువ తక్కువలు లేవు.
వృత్తిని లేకుండా చేసికొనడమే నివృత్తి. దీనినే కొందరు నివృత్తి మార్గము అంటారు.
ఆదిశంకరులు శివానందలహరి లో భక్తి పరంగా ఇదే మాట చెబుతారు.
"చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే" - అన్నారు.
చిత్తవృత్తి అన్నా చేతోవృత్తి అన్నా ఒకటే. చిత్తవృత్తి నిరోధము అన్నా "చేతోవృత్తిరుపేత్య తిష్టతి" అన్నా ఒకటే.
అలాగే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధము జ్ఞాన మార్గమును అనుసరించే వారికి వారికి తెలిసీ, తెలియక చిత్తవృత్తి నిరోధము జరుగుతుంది.
నదీనాం సాగరో గతిః లా అన్ని మార్గములు, అన్ని యోగములు పరమాత్మానుసంధానము చేస్తాయి. ఇతరము పట్టించుకోక మన మార్గములో శ్రద్ధతో పయనించడమే ఆధ్యాత్మికత. ముముక్షత్వము.
ఇది తెలిసి నిశ్చింతగా మన అనుష్ఠానానములు మనం చేసికుంటే మనసు పరిణితి చెంది, పరిపక్వతనంది నిర్మల మానసము గా విరాజిల్లుతుంది.

యోగసార ఉపనిషత్తు - 4

మంత్రము 6

చితిర్మూర్తిమతీ. సా చ అప్రతిహతా శక్తి:

తలపులు, ఆలోచనలు, అనుభవములు ఇవన్నీ చిన్మయములు. భావములు, ఆలోచనలు, అనుభవములు ఈ ఎదురులేని, ఆగని, సతతము ప్రవహించే, శక్తి స్వరూపములు.  

ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, షడ్దర్శనములు, వీటన్నిటి అనేక వ్హాఖ్యానాలు, తదుపరి వచ్చిన వచ్చిన జ్ఞానులు, వారి చింతనా సారాంశము, అన్నీ, అందరూ; ఆత్మానాత్మ వివేకాన్ని కూలంకషం గా చర్చించారు. దాని సారాంశం ఏంటంటే,

నామరూప వినిర్ముక్తం యస్మిన్ సంతిష్ఠతే  జగత్ తమ్  
ఆహుహు ప్రకృతిమ్  కేచిన్ మాయామ్ అన్యే పరేత్వ చ అణూన్ ll 

తాత్పర్యం: నామ రూప రహితమైన దేని యందు "జగత్" ప్రతిష్టితమై ఉంటుందో ఆ వస్తువును కొందరు "ప్రకృతి " అమ్తారు. కొందరు "మాయ" అన్తారు. మరికొందరు "అణువులు" అంటారు. 

ఈ వస్తువే అన్ని మానసిక కార్యకలాపములకు మూలము, ముడి వస్తువు (ముడి శక్తి) కూడాా. 

ఆత్మజ్ఞానము ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినది. దానిని ఆధారం చేసికొని, అనుసరించి, సవరించి, విభేదించి, బౌద్ధ, జైన, తత్త్వజ్ఞానములు ప్రభవించాయి. పరిణమించాయి. పరిఢవిల్లాయి. ఆ పరంపరలో, పరిణామంలో, షడ్ దర్శనములు ఉద్భవించి తమదైన శైలిలో ఆత్మ విచారాన్ని సలిపాయి. ఈ సందర్భముగా షడ్ దర్శనములూ తమదైన తరహాని ప్రారంభించాయి. 

* న్యాయ వైశేషికములు అణు సిద్దాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి.

* సాంఖ్య యోగములు ప్రకృతి-పురుష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి.

* పూర్వ, ఉత్తర మీమాంసలు, ముఖ్యముగా వేదాంతమని పిలువబడే ఉత్తర మీమాంస‌ మాయా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి. 

ఈ షడ్దర్శనముల లోని మాటల గారడీ వల్ల పైకి ఇవన్నీ సామరస్యంగా లేక తేడాగా ఉన్నట్టు అనిపించినా, ఇవన్నీ ప్రతిపాదించేది, చర్చించేది, సారాంశాన్ని అందించేది ఆత్మతత్త్వం గురించే.

సత్-చిత్-ఆనందం, అస్తి-భాతి-ప్రియం, నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్తము అయిన ఆత్మ సత్య-జ్ఞాన-సుఖాకారాన్నీ పొందుతుంది.

ఆత్మ దృక్ (చూపు).అనుభవములుస్ఫురణలుఅర్థములుతలపులుఊహలుఆలోచనలుతర్కములుబాధలుహాయిలుసుఖదుఃఖములుఉక్తులురూపములుశబ్దములుధ్వనులుమాటలురుచులుపీల్చు వాసనలుస్పర్శలు - ఇవన్నీ దృశ్యములు.వీటినన్నిటినీ  ఆత్మ విభూతులైన - manifestations- అంతఃకరణములు - మనసుబుధ్ధిఅహంకారము - ego - , చిత్తముల ద్వారా మనము "మానసికంగాగమనిస్తాముగుర్తిస్తాము.ఆత్మ లేక అంతఃకరణములు లేవుమానసిక గమనికలు లేవుకబుర్లు లేవుఆటపాటలుజ్ఞానసముపార్జనలుజ్ఞానబోధలు లేవు.ఆత్మశక్తి నే చిత్ శక్తి అంటారుచిత్ శక్తి మేధలో ప్రతిఫలించి చిదాభాస అవుతుంది.చిదాభాసకే మాయప్రణవముస్ఫోట అని పేర్లుపేర్లు వేరు గాని శక్తి ఒకటే ప్రతిఫలన శక్తి అయిన మాయయే మన మానసిక శక్తి.మాయ యొక్క వివర్తనమే - తిరోధాన - పురోధానయుత వర్తనమే - reversible becoming - మన సకల మానసిక కార్యకలాపములూను.ఆత్మ - దృక్ - awareness (unoccupied by experiences, senses, meanings, intuitions, thoughts, feelings, urges, utterances - sans cognition and communication -).మానసిక కార్యకలాపములన్నీ దృశ్యములు. ఇవన్నీ "ప్రకృతి" శక్తిచే తయారుచేయబడినవి, నడపబడేవి.ఇదే దృక్ - దృశ్య - వివేకముఆత్మజ్ఞాన సారాంశముబ్రహ్మజ్ఞాన మకరందము.

అంతఃకరణములన్నీ యోగసాంఖ్యదర్శనముల దృష్టిలో ప్రకృతి విభూతులు. ప్రకృతిచే  తయారుచేయబడినవి.  అంటే ఆలోచనలు, భావములు, అనుభవములు ఇవన్నీ ఈ మానసిక శక్తి అయిన ప్రకృతిమయములు.

యోగసార ఉపనిషత్తు - 5

మంత్రము 7

ఈ పది ఉపనిషత్తులు The Principal Upanishads కాదు. మరొక పది ఇవి. Divine Life Society, Hrishikesh కి చెందిన స్వామి శివానంద ఎన్నిక చేసినవి. సరళమైన భాషలో తత్త్వ గాంభీర్యం లేని ముచ్చటైన తత్త్వ గ్రంథములు. కర్తలు ఎవరో తెలియదు.
శాంతి మంత్రము
ఓం యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వమ్
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తం హ దేవమ్ ఆత్మ బుద్ధి ప్రకాశమ్
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే
తాత్పర్యము:
ఎవరైతే ముందు బ్రహ్మను ప్రకాశమయుని, జ్ఞానవంతుని చేసెనో, ఎవరినైతే వేదములు కొనియాడుతూ ఉటంకిస్తాయో, ఎవరయితే ఆత్మను, బుద్ధిని ప్రకాశింపచేస్తాడో, అతనిని, భగవంతుని, ముముక్షుడనై శరణము వేడెదను.
మంత్రము 7
ఉద్రిక్తం మనశ్చిత్తం యత్ ప్రభవాః వృత్తయః
ఉద్రిక్తమైన మనస్సే చిత్తము. ఇలా ఉద్రిక్తమైన మనసు / చిత్తము నుంచే వృత్తులు పుడతాయి. వృత్తి అంటే అంతఃకరణ పరిణామము కదా.
అంతఃకరణములన్నీ యోగసాంఖ్యదర్శనముల దృష్టిలో ప్రకృతి విభూతులు. ప్రకృతిచే తయారుచేయబడినవి. అంటే ఆలోచనలు, భావములు, అనుభవములు ఇవన్నీ ఈ మానసిక శక్తి అయిన ప్రకృతిమయములు. ఈ భావములు, తలపులు, అనుభవములనే వృత్తులు అంటారు.
అరిషడ్వర్గములు ఉద్రిక్తమైన మనసు అలలు. ప్రకృతి అంతఃకరణములై మానసిక కార్య కలాపములను నిర్వర్తిస్తుంది.
మనము అన్ని అంతఃకరణముల (మనోబుద్ధ్యహంకారచిత్తములు) చేసే పనులని మనసు అని కానీ చిత్తము అని కానీ అంటాము. కానీ సాంఖ్య, వేదాంత దర్శనములు ప్రకారము ప్రతి అంతఃకరణమునకు ఒక పని నిర్దేశించబడినది.
మనసు విషయ గ్రహణ చేస్తుంది. ఈ విషయములు బయటి ప్రచంచపు భౌతిక వస్తువులు. దృశ్యములు, ధ్వనులు, రుచులు, గంధములు (వాసనలు), స్పర్శలు రూపములో ఉంటాయి. ఇవి కాంతి, శబ్ద, రసాయన, యాంత్రిక శక్తుల రూపములో జ్ఞానేంద్రియముల ద్వారా అంటే వరుసగా కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మము ల ద్వారా మనసు మాధ్యమములో గ్రహింపబడతాయి. వీటిని తన్మాత్రలు అంటారు. నామ రూపములు కలిగి లోపల ఒక ప్రపంచముగా ఏర్పడతాయి. దీనిని ఆంతర ప్రపంచము అంటారు. ఈ దృశ్యములు (అన్ని తన్మాత్రలు) అన్నీ అదే సమయములో కలిగించే అనుభవములను వాసనలు - జ్ఞాపకములు అంటారు. స్మృతి ఇదే.
ఈ స్మృతి నుంచే వాసనలు చిత్తముచే ప్రకోపింప బడి తదనుగుణ విషయ గ్రహణము మళ్ళీ మనసు ద్వారానే జరిగి జగత్ అవుతుంది. ఈ జగత్ మన వ్యక్తి సంబంధ భావముల / తలపుల / ఆలోచనల / బుద్ధి చేసే నిశ్చయాత్మకముల వరుస. జీవాత్మ అన్నా ఇదే. ఇవన్నీ ఉద్రిక్తమైన మనసు. వృత్తులు.


Wednesday, January 24, 2018

జీవన సాఫల్యము ; Remaining poor; Equality around; The improper behaviors;

జీవన సాఫల్యము 

పరిశీలన నా జీవన సిరి
పరిశోధన నా ఊపిరి
జ్ఞాన సముపార్జనము నాకు ప్రీతి
ఇదియే నాకు ఇష్టమైన జీవన రీతి
పూబాలల, పువ్వుల పరామర్శించుట
పసికూనల నవ్వుల మురియుట
చెట్లు చిగిర్చి పూచి ఫలములందించుట
చూచి నయన హృదయానందములనందుట
నా జీవనమునకు వెవ్నెల రుచులు
కవితాస్వాదన మనసుకు రుచులు
భగవమతుని అర్చించుట ప్రియమార
స్మరించుట తనుగా మారుట జీవన సాఫల్యము
*********

Many Indians taking birth as poor and remaining as poor for life is political leaders' mistake and irresponsibility.
They take so many absurd discriminating decisions which make many people poor and remain poor despite their meritorious capabilities.
Governments batting for nor-meritorious, incapable, intellectually and aesthetically deficient individuals happens in countries like India.
So taking birth as poor and dying poor in countries like India is not completely the mistake of the individuals themselves; but because of the imposition of governments and political leaders poverty on these otherwise deserving by their lopsided policies and pampering undeserving, too.
**********
Equality All Around
Going bold and bearing it all is being done by many girls and boys in modeling and for photograph series and movies not mentioning porn.
And many girls and boys are attending pubs, rave parties, and are drinking till short hours and are drunk-driving; men and women are equally enjoying life and are equally becoming criminals in murdering spouses for paramours.
Where are the lib-mov-supporters? There is equality all around.
********
Reasoning succeeds only with civilized and cultured people
*******
The improper behaviors


Can looking improperly, talking improperly, touching improperly, texting improperly, sending audio and video clips improperly, suggesting and asking for sex, raping, cruelly raping, murdering after rape like deeds by men in relation to women be curbed?
These deeds of men in relation to women cannot be curbed. Just as we cannot curb thefts, robbing, murders, cheating, illegal amassing of money and properties by politicians, saying lies by politicians through election manifestos, fanatics exploiting religions by hijacking them, caste and religious leaders dividing and causing animosities among citizens for others, governments and political leaders pampering certain castes an communities for votes, corporate dominating government and society by their "riches" the misbehavior of men towards women cannot be curbed.
Criminal minded individuals cannot be reasoned to behave properly.
************
తల్లిదండ్రులకు కావలసినది పిల్లల మార్కులు,
వారి రేంకులు, ఉద్యోగములు; విద్యాసంసంస్థల
నిర్వాహకులకు కావలసినది ఫీజుల, తదితరముల డబ్బు. 
చదువు ఎవరికీ అక్కరలేదు.

Friday, January 19, 2018

Mr. Haasan's Politics; Religion an Language; Selfie-Irresponsibility; Cricket;

Mr. Haasan's Politics

Mr. Haasan wants to wear the mantel of Dravidian ideology (anti-brahminism) the brand of Tamil regional parties. It need not be surprising given the ability of understanding and imagination of Mr. Haasan. Already we are divided every where in India on various pretexts. Mr. Haasan might be feeling his fledging party could get some votes on Dravidian plank only.
Dislike for persons and traditions of the land cannot be a safe ground and basis to root a political party. The ideology should cover all Indians and the idea of India as a nation. Emotional integration is the need of the hour. We are all already suffering the ill-effects of divisive politics.
It is not easy for Mr. Haasan to wear the mantel of Dravidianism because he is already having competitors for that divisive ideology in the form of his state's fellow regional parties.
Wish this kind of tribe of divisive politicians will not succeed in further dividing Indians.
***********
Religion and language
Religion is necessary like the language. We have many languages and so many religions. Language felicitates communication and literary creation. Religion felicitates faith and psychological rejuvenation.
We may wish the elimination of religion. But for all the ills we are facing it is not the religion that is responsible; but the individuals who misinterpret and hijack the religions and their sacred texts and tenets.
Just as we do not think of eliminating language and associated regional cultures even if languages and associated regional cultures cause conflicts and fanaticism as is happening, we must devise counters to deal with the hijacking of religions by fanatics; but not think of eliminating religions which is impossible as eliminating languages and regional cultures.
All intellectuals who blame religion and the negative aspects have to get themselves educated about the benefits of religions, their purpose in the society and the spirituality they developed.
Very few can be spiritual without following any religion. Bur many need the anchor of religion and faith for a psychologically comforting course of life.
Let us all strive to rid the religions of the evil influence of fanatics, superstitious followers, half-baked religious teachers and terrorists. It is the duty of the world; not just of this religion or that religion or rituals.
Religion and language are essential ingredients of human civilization and culture.
************
Selfie-Irresponsibility
I very amusingly read the "confessions" of celebrity-heroines about their directors or co-stars, how the directors or co-stars have exploited them sexually.for many years, many years after the incidents allegedly took place. Why so?
Why they did not express themselves immediately after the events or during when the exploitation is going on? Did the heroines fear discontinuance of their career if they complain or go to media?
Why they are, now, coming to the media with all their stories and waling? l see red in such allegations. When it has been alright or convenient to them they "obliged" but now are complaining so vehemently? Every one knows the ways in entertainment industry. Acting naive will not make the exploiters demons.
Also many women and girls say they were raped under the promise of marrying. Is it a valid pretext? In the first place why they made themselves available in isolation to their lover-turned-exploiter - cheater? No one asks them this question. If answer to this question is known, which they know but pretend are naive to the consequences is only trying fooling themselves.
Another humorous thing is, when a man and woman are in relationship and are in live-in partnership and living together in a dwelling, the women in such relationship are complaining that they are raped certain times. The men involved and the judiciary are perplexed; which session is consensus one and which session is a rape in their series of sex enjoyments.
This kind of crying is not going to help any one, neither the victim nor the society. One must be careful before submitting to their lover. That they will not do. But blame man that he cheated them on marriage promise.
Which writing counsels them to engage in pre-marital sex if their lover promises to marry them? Governments and NGOs are supporting such irresponsibility. Sex is enjoyed in an consensus way; later complainants are made for various disappointments. Carelessness and eagerness for joy cannot save them when they are cheated by their lovers.
Most of the female victims are well-educated, know the world well, and some are employed also. How then they can claim about innocence of ways of men and cry cheating? Blaming men for everything will not absolve them of their irresponsibility about themselves.
********
Equality All Around
Going bold and bearing it all is being done by many girls and boys in modeling and for photograph series and movies not mentioning porn.
And many girls and boys are attending pubs and are drinking till short hours and are drunk-driving; men and women are equally enjoying life and are equally becoming criminals in murdering spouses for paramours.
Where are the lib-mov-supporters? There is equality all around. You must celebrate.
*********
The phase of cessation of mental activities is called the phase of rested mind or resting mind. This phase of mind, also known phase of Self is called, pure consciousness, unoccupied awareness, content-free contentment, peace, bliss, silence, time and ego-transcending phase.
Time never travels backward. Only processes reverse or retrace their path. Then time is assumed to travel backwards. Existence of parallel universe is not a physical reality, just a mathematical conjecture.
********
Cricket; 
India was defeated in two tests and lost series with South Africa not because South Africa played very well but because our cricketers played below their par.
South African batsmen could not master or dominate Indian bowlers. They played our bowlers in an above average way. But our batsmen for inexplicable and unknown reasons to us, played very disappointingly.
********