Friday, January 19, 2018

మన పరిమితులు - భేద బుద్ధి; అందము; ఉపయోగము; Gender Sensitivities; Mind

మన పరిమితులు - భేద బుద్ధి

మనము పుట్టేసరికే మన తల్లితండ్రులుద్వారా మన కులము, మాట్లాడే భాష, నివసించే ప్రాంతము, మతము, నిర్ణయించబడి ఉంటాయి. మనము వాటిని పరిగణనలోకి తీసికొని మన జీవితాన్ని గడుపుకోవాలి. ఇలా నిర్ణయింపబడిన కులము, భాష, ప్రాంతము, మతము ల వల్ల మనము ప్రభావితులము కాకపోయినా ఇతరులు మాత్రము మనలని ఆ దృష్టితోనే చూస్తారు. ఇది మనము తప్పించుకోలేని వాస్తవము. ఇలా మనందరికీ జరుగుతుంది.
ఈ భేదాలని, తెగలని, అచ్చులని, మచ్చలని మనము నిర్లక్ష్యము చేసినా, మనలని ఇవి వీడిపోవు. సహజముగా మనకు మన తల్లిదండ్రులమీద, వారు వారసత్వముగా ఇచ్చిన బుద్ధులు, సంస్కృతీ, నాగరికత, సంస్కారములమీద మనకు ఇష్టము. అభిమానము ఉంటాయి. అవి మన వ్యక్తిత్వములో భాగముగా ఉంటాయి
కానీ ఆ గుర్తుల వల్ల మనలని కించ పరచే వారు, అనవసరముగా చనువు తీసికునే వారు; ఎందరో బయటి వారు రకరకాల వేషాలు వేస్తూంటారు. అసలే మన భారత దేశము కులగజ్జి, సామాజిక న్యాయము పేరుతొ గూండాగిరి మాటలు, చేతలలో ఎంతో అట్టహాసముగా, ఆర్భాటంగా, సంకుచితముగా కొండొకచో అవమానకరంగా పేలే మేధావులనబడే వారితో నిండిపోయి ఉంది.
ఏ విధమైన సహృదయము, సరసత్వము, సౌహార్దముఁ, సౌమనస్యము, సౌమ్యత లేని కుల గజ్జిగాళ్ళు ఏవో పేర్లతో ఇతరులను సంస్కార రహితముగా విమర్శించడమే ఒక పెద్ద పనిగా పెట్టుకున్నారు. వీరికి యూనివర్సటీ డిగ్రీలుంటాయి. మంచి ఉద్యోగాలలో ఉంటారు. కానీ ఎప్పుడూ ఎవరిమీదో పడి ఏడుస్తూంటారు. ఆదో మానసిక వైకల్యము.
వీరివంటి వారు ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా అంతర్జాలాన్ని కమ్మేసారు. సామాజిక న్యాయము అంటూ తమ తోటి కులస్థులను ఏమీ ఉద్దరించక తమ డిగ్రీలను, సాంఘిక స్థితిగతులను దుర్వినియోగము చేస్తూ ఏదో మేధావులుగా బతికేస్తున్నారు. వీరందరూ సంఘాలుగా ఏర్పడి తమ మాటలతో, రాతలతో, చేతలతో సమాజాన్ని అతలాకుతలం చేస్తూన్నారు. సాంఘిక అశాంతికి, కులాల మధ్య ఘర్షణలకి కారణము అవుతున్నారు.
రాజకీయ నాయకులు వీరి జోలికి పోలేరు. వాళ్లకి ఓట్ల భయము. కాస్త గుండె ధైర్యము ఉన్న రాజకీయా నాయకుడే లేడు. అందరూ ఒక మూసలోని వారే. ఎంతసేపు కులాలు, ప్రాంతాలు, మతాల వారీగా కుమ్ములాటలు ప్రోత్సహించి పదవులు పట్టి అక్రమముగా ఆస్తులు ఏర్పరచుకుంటూ ఏదో బతికేస్తుంన్నారు. మనలని, దేశ భవిష్యత్తుని చంపేస్తున్నారు.
అందరూ కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాలవారీగా ఆకర్షించాలని తాపత్రయపడేవారే, పాలకులైనా, నాయకులైనా. అన్ని రాజకీయ పక్షాలు ఈ విద్యను క్షుణ్ణంగా అభ్యసించినవారే.
కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలనుకునే ఓటర్లు ఈ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగి చేతకాని వాళ్ళను ఎన్నుకుంటున్నారు. ఎవరికీ సుఖ శాంతులు, కనీస సౌకర్యాలు లేకుండా పోతున్నాయి. మన భేదబుద్ధే నాయకులకు శ్రీరామరక్ష.
మనకు పెద్ద శిక్ష.
************

అందమున చందురుడు మరందమున పూవులు
డెందముతో బంధము వేయుటందు ముదితలు
విందులు చేయుటందు ప్రణయిని చందనము 
చల్లదనమునకు వందనము పెద్దలకు ఎన్నికైనవి
************
చేయని ప్రయాణము చదువని పుస్తకము
రాయని కావ్యము చేయని సాయము
కాయని పందెము రాయని మందులు
మాయని వెతలు కూయని కోయిలలు;
పుట్టని బిడ్డ కట్టని గుడ్డ పెట్టని కూడు
కట్టని గూడు వల్ల ఉపయోగము లేదు
మనుషులకు
***********
Composition of verses is a kind of dreaming.
*******
Gender Sensitivities

When we have so many gender sensitive activists, NGOs, and liberation lovers, it is not at all safe to quote old proverbs. Every one from sections mentioned above lost sense of humor and will quarrel anything, even trivial sayings about women as offending and fight like cocks. Why one should lose peace of mind by quoting observations of yesteryear even though they are full of common sense and reality? Every one of those sections forgets that all women are not angels and all men not demons. What to do?
*********
Mind-Software and Hardware

The spiritual texts starting from the Upanishads give us the software of consciousness, mind and their functions. The modern science gives us the biophysics and biochemistry of mental functions, the hard ware of mind, in terms of combined function of brain, spinal cord, nervous system and neurons. The reconciliation between these two seems to be not easy. But many sincere attempts are being made by scientists and philosophers.

Tuesday, January 16, 2018

సంస్కృతీ మార్పులు; Writing and Publishing; Drunk and Drive Cases;పరిణితి చెందిన రసహృదయము

సంస్కృతీ మార్పులు
చీరలు కట్టుట చిరాకు నవ యువతులకు
పంజాబీ డ్రెస్ పరమానందం పడుచులకు
కావచ్చు తేలిక మరియి సులువు పంజాబీ డ్రెస్; 
అలాగ జుట్టు విరబోసుకొనుట సులువు జడ వేసికొనుటకన్న
కుమారిలైన కూతుళ్ళకు పెళ్ళైన మనింటి కోడళ్ళకు
దుస్తుల ధారణలో మనం సలహాలివ్వరాదు;
జడ వేసికొనుట, బొట్టు, పువ్వులు పెట్టుకొనుట
వారి వీలు మన ముచ్చట కాదు; ఇక్కడ తెలుగు తనము
జిలుగుతనము జాన్తానై: అసలు సంస్కృతియే మారిపోయిన
నేడు ముసలాళ్ళ ముచ్చటలు ముదితలకు కారాదు బంధములు
మగవారు ధరించుచున్నారా పంచెలు, పెట్టుకొనుచున్నారా బొట్లు
పిలకలు, ఇతర పాత భూషణములు? అని ఎందరో ముదితలు ముందు
కాళ్లకు వేయుచున్నారు బంధము; మగ ఆడ కజ్జాల మనసులతో
ఆప్యాయతలు ఆత్మీయతలు దృష్టిలో లేక కయ్యాల రోజులు
గడుపుచున్నారు; కుటుంబము ఎవరికీ పట్టటం లేదు; కుటుంబము లేని
సంఘము లేదు; వ్యక్తి లేని కుటుంబమూ లేదు; వ్యక్తి, కుటుంబము,
సంఘముల మేలు కలయిక సమాజము; కానీ నేడు స్త్రీలు, పురుషులు
విడి విడిగా కుటుంబరహిత సంఘముగా బ్రతుకుటకు ముచ్చట పడుచున్నారు
ఇచ్చవచ్చిన రీతిలో బంధ రహితముగా బాధ్యతారహితముగ బతుకుటకు
ఉవ్విళ్ళూరుచున్నారు; పాత మాటలు పెద్దల సుద్దులు నేడు పనికిరావు;
ఇప్పటికి సరిపడ సంస్కృతులు నిర్మించుకొనవలెను; కానీ తరము తరమునకు సంస్కృతి
మారిపోవునను ఇంగిత జ్ఞానము కలిగి ఉండవలెను; విడి విడి బ్రతుకులకు
పెద్దపీట వేయవలెను; మారుచున్న అభిరుచులు అభిలాషలు నిత్య నూతనముగా
నిర్మించును సంస్కృతిని రోజు రోజూ; పాత క్రొత్తగుట నిమిషమాయె నేడు
ఏదైనా ఎవరైనా ఇష్టపడి చేసిన ముచ్చట గొల్పును
బలవంతమున ఇతరుల ఇష్టము మేర జరిగిన వికటించును
అసలు జరగనే జరగదు; గతకాలపు మధుర జ్ఞాపకాలు
శాసించరాదు నేటి వర్తనలను ప్రవర్తనలను; బ్రతుకుటయే
భారమైనది; ఉద్యోగమునకు వెళ్లి వచ్చుసరికే ఓపిక మిగలకున్నది;
ఇంటికి జేరుసరికే సమయము మిగులుట లేదుమరి దేనికీ
ఆధునికత సంస్కృతికి వ్యతిరేకం కాదు
ఆడో సంస్కృతి; పాత చాదస్తములకు ఆనకట్ట
ఏది అందము ఏది చందము అనునవి మారును
తరము తరమునకు: మనందరమూ అది గ్రహించి
ఏది ఏవిధముగా జరిగినను స్థిమితము పోగొట్టుకొనక
ఎవరి తీరులో వారు బ్రతకవలెను ఇతరులను బ్రతకనివ్వ వలెను
*************

Writing and Publishing

Writing is a vice. Many have this vice. Writing is not only a vice but also compels us to publish what is written. There are hundreds of writers and poets who are writing, composing and publishing. But very few are read by readers.
Internet has been helping many budding and senior writers and poets to have audience. The sales of the published books of many writers - budding or senior - are not encouraging. Still many of us write and publish.
That is why writing and publishing are compared to vice. Like any other vice it possesses the individual. The desire for recognition is one of the chief reasons.
Most of the writers and poets do not expect money from their publications. It is enough for them if they get some recognition as a litterateur. Readers and critics are critical and essential for the success of a writer, poet.
Despite lukewarm responses from readers and critics, the spirit of the individual creator is not affected and one continues to create. Writing though is an art, is currently not remunerative. Literary work's eminence and quality are also not gauged well and properly. Let the tribe of litterateurs is encouraged based on the utility and quality of their works.
**********
Drunk and drive cases
It is foolish to conduct counseling to drunk and drive individuals. They are quite aware of what they are doing and are doing that way carelessly. Government must straight away punish them. Showing lenience will not change their attitude. And we must note all the drunk and drive cases are connected with celebrities, rich and "elite" and posh citizens who have degree certificates and had been to prestigious educational institutions.
Police and government must not show their naivety by condoling their wishful and willful crime of drunk and driving. Police it seems are also considering the drunk and drive cases as elite culture and are going slow in punishing them Wasting time for counseling to these willful drunk and drive cultured individuals is showing sympathy to wrong and arrogant people who have no respect for lives of fellow humans and law.
***********


పరిణితి చెందిన రసహృదయము

రచయిత పేరు చూసి రచనల చదువు అలవాటు నేడు;
పుంఖానుపుంఖములుగా పుట్టగొడుగులులా పుస్తకములు
ప్రచురించబడుచున్న నేడు మనము ఇంతకు మించి
ఏమీ చేయలేము; ఎవరు గొప్ప రచయితో ఏది గొప్ప రచనో
ఎవరు నిర్ణయింతురు? కొందరు విమర్శకులు, కొందరు
పాఠకులు; రచన గొప్పదనము పాఠకుని ఆస్వాదనా గరిమను
అభిరుచిని తెలియజేయును; అడవిని గాచిన వెన్నెల చందమున
ఎన్నో పుస్తకములు నిర్వ్యాపారముగ ఉన్నవి; సాహితీ రంగమున
మన రచనలను చదివించుకొనుట ఒక కళ;
ఆ కళ చేతకాకపోతే మిగులును ఒక చెదిరిన కల
వ్యసనమై పట్టిన రచనా వ్యాసంగము ఊర్కోనీయదు
బరుకుదుము ఏదో ఆత్మసంతృప్తికై అలవాటుగా;

అందుకే త్యాగరాజులు రామదాసులు అన్నమయ్యలు
పోతనలు పురాణ కవి పుంగవులు ఆత్మతృప్తికై రచించి
భగవదర్పణము చేసిరి తమ కావ్యములను రచనలను
విశ్వశ్రేయ: కావ్య పరమార్ధం; ఇది కవనమున ఉన్న
నేడో రేపో చదివెదరు రసికులైన పాఠకులు ఆసక్తి కలవారు
రచనా సామర్ధ్యము కలవారు పరిణితి చెందిన రస హృదయము కలవారు
*********
The Lure
The political scene of Indian nation is so poorly being managed by present politicians that they are proving themselves inefficient to solve the problems of the citizens as a whole and at all; are giving false hopes to celebrities from various entertainment industries with some popularity feel they are the saviors of the nation and its citizens.
*********
The Course of Life

Many of us feel that the course of our life most of the times is not going as we desire and chalked out but some way different and we are compelled to adjust to the reality. This dispirits us; but we have to move on channeling our strength.

Sunday, January 14, 2018

MAKARA SANKRANTI/ PONGAL; The Aspects of Human Living - Modern Thought Contours;pseudo-citizens

MAKARA SANKRANTI/ PONGAL

Makara Samkramanam or Sankranti or Pongal, a harvest festival celebrated all over India has astronomical, cultural and social significance.
Makara Sankranti (in Andhra Pradesh and Telangana) and Pongal (in Tamilnadu) is celebrated on the same day but with minor variations. The cultural and social activities with which this festival is associated are either no longer practiced or some are controversial to the modern-minded. In most of the states the festival is known as Makara Samkramanam or Sankranti.
And in other parts of India the festival is celebrated as – Magh Bihu in Assam, Sakraat or Sankranti in some states, Magha Saaji in Himachal, Suggi in Karnataka, Kicheri in Uttar Pradesh, Poush Sankranti in West Bengal. It is also celebrated in other countries like Nepal, Bangladesh and Sindh region of Pakistan.
In India we have three chief ways of compiling almanacs. One way is following the transit of moon. It is called – Chaandramaana. This calculation is followed in Telugu, Kannada and Marathi speaking people.
The second is following the transit of the Sun. Tamil and Malayalam speaking people follow this calculation. This is called Souramaana.
The third is following the transit of Jupiter. This is called Baarhaspatyamaana. This is widely followed in North India.
Tithi, nakshtram, vaaram, yogam and karanam make up the panchaangam – five wings of astrological calculations – the almanac. Tithi and nakshtram are related to placing and association of moon as “virtual assignments” to movement of moon during its transition.
Tithi, nakshtram, vaaram are same to all the three ways of calculations – i.e. compilation of almanacs.
In Souramaana calculation the Sun will transit in such a way that he enters each of the 12 rasis at an interval of 30 days. The Sun entering a rasi is called Samkramanam. Thus when the Sun enters Cancer – karkaatakaraasi – it is Kartaataka Samkramanam. On this date – normally 16th July – Dakshinaayana starts. When the sun enters the Capricorn – Makararaasi – Makara Samkramanam takes place. This mostly happens on January 14th – Uttarayana starts. And Sankranti is rarely celebrated on January 15th (dependent on when Sun enters Makararaasi when Uttarrayana starts).
Sankranti is a grand cultural and social festival in the areas I mentioned in addition to its astronomical significance. In olden days, all celebrations and happenings I am going to narrate were celebrated with lot of enthusiasm. But that enthusiasm has been waning and is missing presently for various reasons.
I will now narrate how the festival is celebrated in Andhra Pradesh especially in west and east Godavari districts – in January in earlier days the crops were mature and the paddy was cut and brought home in the villages. And the Dhanurmaasam – the month when the Sun is in Saggittarius – Dhanuraasi – is observed by Vaishnavaites very piously. Thus artistes singing Hari’s tales visit every house and they are given alms. Sankranti succeeds this sacred month and both will be coinciding and commonly celebrated for fifteen days. The artistes singing Hari’s glory thus are called Haridasas.
And artistes with decorated ox, called Gangireddu walk from door to door, begging for alms in a cultural way. And the unmarried girls prepare pastes with cow-dung – called gobbillu – adorn them with flowers especially Banti (marigold) flowers and place them on colorful muggulu (rangolis) drawn with rice flour and play around them for getting a good life-partner. Sons-in-law are invited to girl’s house, if this festival falls within one year of consummation of marriage. Infants – up to – four years of age are specially treated on Bhogi – a day before Sankranti –with celebrations by pouring Regi (Indian plum) over their heads in the presence of relatives and women from the neighborhood. All villages used to glow together with the blooming hearts and glow of minds of the people.
Sankranti is especially a village festival for all the reasons and activities mentioned above. Cock-fights are part and parcel of Sankranti in rural areas. Now a days a ban is being imposed and orders issued by both judiciary and executive not to celebrate but the implementation is very poor for obvious reasons.
This is similar to the ban on jallikattu (a play similar to bull fight in Spain) of Tamilnadu; in the sense banned by judiciary and executive but takes place because of patronage of the people. Whether animal lovers and activists approve it or not, these two plays – cock-fights in AP and Telangana and jallikattu in Tamilnadu will take place. This is where “culture” and modernity clash. Many “modern” people do not have any cultural roots and they always insist on rights, wrongs as envisaged by them. What is right and wrong from cultural and modernity point of view will always differ. All Indian festival cultural activities do not appeal to the modern-minded.
Pongal is essentially a Tamil language word. It refers to a food variety. When I was residing at Pondicherry, I was observing the way of celebration of Pongal festival by Tamilians. Just before one day to Pongal the market was inundated with sugar cane stalks and related articles like pots and the like.
The dish Pongal is of two kinds. One is kattupongal (spiced Pongal) and the other is sweet pongal. Both pongals are made with rice and moong (green gram) dal. The Pongal is offered to the goddess and then partaken as prasadam. Thus Sankranti a harvest festival is celebrated all over the Indian subcontinent with fervor and zeal.

*******

The Aspects of Human Living - Modern Thought Contours

Empowering men and women separately is modern concept. Empowering the family as a whole is ancient concept.
And also one must be sure about what empowerment is. Many modern intellectuals think and propagate that girls getting educated (getting certificates), jobs and standing on their own legs financially is empowerment. They never refer to family and girls' duties as a house-holder and home-maker.
Thus separating men and women from families and estimating their empowerment misses emotional requirements of men and women. But many are either oblivious of this fact or do not care at all for the emotional aspect of our lives.
The concepot that merely earning money alone is empowerment will grossly underscore the emotional and societal and social aspects of human beings. Completely neglecting family aspect and not at all mentioning it in the talk of empowerment of men and women devoid of family responsibilities is the "wisdom" or lack of it today.
We must also give importance to aesthetic and intellectual aspects of human life i.e., the lives of men and women. Sans these two aspects we are more robots tuned to money earning and it will have its own adverse effects on the psychological health of men and women.
It is irresponsibility and ignorance of modern intellectuals about human life and requirements for a harmonious and complete living together of men and women as a family. The non-mentioning of family and responsibilities of men and women towards respective families and confining man and women merely to money earning and so called rights sans any responsibilities is great disservice to society by modern intellectuals and a dangerous trend which make humans more mechanical and beastly rather than human.
*********
Delivery of justice depends on justness and law not based on democratic process.
********
pseudo-citizens
India is becoming a land of pseudo-citizens. Many do not like the idea of India tuned to wisdom of the past generations;.and many "intellectuals", "rationalists" and caste and community leaders are practicing a hatred-centered policy towards all ancient Indian without any commonsense or sense. Their reverse discrimination is obstructing the idea of India and its progress and development. Their idea of India does not exist in a positive way. Their opposition to Ancient Indian thought and culture itself working as their ideology. Very narrow-minded and foolish practice.


Friday, January 12, 2018

ముఖపుస్తకము-అంతర్జాలము టపాలు కథా కమామీషు; దృష్టి; Consciousness and Mind;శుష్క వచనములు - శూన్యహస్తములు; Idea of India being spoiled

ముఖపుస్తకము-అంతర్జాలము టపాలు కథా కమామీషు

మనలో చాలా మందికి, మన కుటుంబ విషయాలు మనకున్నంత ఇష్టముగా, ఆసక్తికరంగా అంతర్జాలంలోని ఇతరులకు, మన స్నేహితులైనా (ముఖ పుస్తకపు లేదా అటువంటి) అంత హుషారుగా, ఆసక్తికరముగా ఆకర్షణీయముగా ఉండవని తెలుసో లేదో తెలియదు. ఒక్కోసారి మన చాదస్తం వారికీ ఇబ్బందీ కలిగించవచ్చు.
అంతర్జాలములో కలిగే స్నేహము నీటిపై రాతల వంటిది. ఈ క్షణం ఉంటుంది. మరుక్షణము ఉండకపోవచ్చు. ఉండదు కూడాను. మనము అందరమూ ఒకరికి ఒకరము ఏమీ మానసిక బందీలము కాము. ఎవరి గోల వారిది. ఎవరి గోడ వారిది. కుటుంబ, స్వంత జీవితపు అన్ని విషయాలు మనలోనే, మన అంతర్జాలపు బయటి స్నేహితులకు పరిమితమైతేనే మంచిది.
ఇక్కడ అంతర్జాలములో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. ఎదో కాలక్షేపం బఠాణీలు .
సారస్వత, రాజకీయ, ఇతర సిద్ధాంత రాద్దాంతాలలో తల దూర్చడం అస్సలు అనవసరం. తల దూర్చకపోవడం మానసిక ఆరోగ్యకరం. ఇంకొందరు వారికి ఇష్టమైన సిద్ధాంతమో, భాషో (మాతృభాష కూడా కావచ్చు) మనమీద రుద్దడానికి ఉత్సుకులై ఉంటారు. మనమీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మనలని నియంతలలా నిలదీస్తారు. ఉపన్యాసాలు ఇస్తారు. మనకి ఎంతో చిరాకు కలిగిస్తారు.
ముఖ్యముగా ఆంగ్ల, సంస్కృత భాషలకు వ్యతిరేకముగా, తెలుగు భాషకు అనుకూలముగా ఎంతో చెబుతారు. మనలని మొహమాటపెట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. మనకి అభిరుచులు ఇష్టాయిష్టములు ఉంటాయని పట్టించుకోరు.
అలాగే హిందూ మతము, సనాతన ధర్మముల గురించి ఎన్నో టపాలు చూస్తూంటాము. వాటిని పెట్టేవారికి ఆ పెట్టిన విషయములో ఏమీ పరిజ్ఞానము గాని అవగాహన కానీ లేవని మనకు తెలుస్తూంటుంది. వారికి తెలియదు. చిలక పలుకులలా తమ టపాలను పలికిస్తారు. అలా చేయడము మతానికి, ధర్మానికి ఎంతో సేవ అని దర్పము పొందుతూ పుంఖానుపుంఖాలుగా టపాలు పెట్టేస్తూంటారు.
కానీ తాము పెట్టే తపాలా సారాన్ని వంటబట్టించుకుని బాగుపడుతున్నట్టు కనిపించరు. అంతా సమాజం కొరకే అన్నట్టుంటారు. ముఖపుస్తకములో, అంతర్జాలములో కావలిసినంత కాలక్షేపము, వినోదమూను. పెద్దల వయసులో ఉన్న పిల్ల, పిన్న మనస్కులు ఎక్కువైనారు. అందరమూ శత కోటి లింగాలలో ఒక బోడి లింగంలము.
********
Being unaware of self-consciousness is bliss; peace; silence.
*********
దృష్టి

ద్వైతము వారికి పడదు అద్వైతము
విశిష్టాద్వైతమునకు పడవు ద్వైతాద్వైతములు
భారత దేశమున బ్రహ్మసూత్రములకు
భగవద్గీతకు ఉపనిషత్తులకు ఎన్నో
పరస్పర విరుద్ధ వ్యాఖ్యానములు; గందరగోళము

సృష్టించు బహు ఆచార్యులు; వారి అనుయాయులు
వ్యాఖ్యానమునకో మతము, దృష్టికో సతమతము
అవగాహనలు పలువిధములు ఆ ప్రస్థాన త్రయమునకే;
అదెటుల సాధ్యము? పుస్తకములకన్నా దృష్టి ;ప్రధానమైనది కనుక
**********
Success is the result of continuing effort!
*******
Certain things must remain a mystery and should be mysterious. I am for we need not know every thing that fancies us. This mystery keeps us active mentally and inquisitive
********
To find a common language with a person, one should learn to be silent.
********
Consciousness and Mind
*Consciousness is mechanical form of energy, the result of breathing process.
**Mind in biochemical and biophysical form of energy undergoes transformations reversibly under the guidance and gauze of consciousness enabling humans/ vertebrates in cognition and communication.
***Mind as sense/ experience/ intuition/ insight/ understanding/ volition/ pain/ happiness/ ache is biochemical in nature. 
****Mind as thoughts/ feelings is electrochemical in nature.
*****Utterance/ speech/ gesture is transduction of thoughts/ feelings in electrochemical form into sound/ mechanical form of energy.
******Concept, awareness and feeling of passage of time are thought/ feeling forms, and are transformations of psychic energy in elctrochemical form; forward as speech and gestures into mechanical and and backward into sense, idea, understanding, experience as biochemical forms respectively. Awareness of time is the result of transformation of energy. When energy does not transform as experiences, thoughts, feelings;, the state of mind is called time-transcendent.
*******All our consciousness, mind and their functions in association with sense and action organs are biological in nature, the result of presence and transformation of energies in various forms as cited above.

********

శుష్క వచనములు - శూన్యహస్తములు

అందరూ కవులే కవిత్వం చదివేవారే అరుదు
అందరూ నాయకులే ప్రజాసేవ చేసేవారే అరుదు
అందరూ మేధావులే వారిలో మేధ మాత్రం అరుదు
అందరూ గురువులే పరమాత్మను దర్శించిన వారే అరుదు
అందరూ స్కూళ్ళు నడిపేవారే చదువు రావడమే అరుదు
అందరూ సంఘసేవకులే ఇళ్ళల్లో మాత్రం సేవ అరుదు
అందరూ సమాజాన్ని నడపాలనుకునేవారే నడపగలిగిన వారు మాత్రం అరుదు
అందరూ జీవకారుణ్య ఉపన్యాసకులే కోడి, మేక, పంది
మాంసములను తినని వారే అరుదు
కబుర్లు ఘనం ఆచరణకు గ్రహణం
నేటి మన భారత పర్వం ఒక నిరంతర
ఆషాఢభూతుల మయం రెండు నాలికల
ధోరణులు ప్రబలం అంతా శూన్యహస్తం
****
Idea of India being spoiled

India is becoming a land of pseudo-citizens. Many do not like the idea of India tuned to wisdom of the past generations;.and many "intellectuals", "rationalists" and caste and community leaders are practicing a hatred-centered policy towards all ancient Indian without any commonsense or sense. Their reverse discrimination is obstructing the idea of India and its progress and development. Their idea of India does not exit in a positive way. Their opposition to Ancient Indian thought and culture itself working as their ideology. Very narrow-minded and foolish practice.
****

Thursday, January 11, 2018

మా తురా (మేఘాలయ) పర్యటన

మా తురా (మేఘాలయ) పర్యటన 1
19, 20-11-2017
జీవితం అనే పెద్ద ప్రయాణం లో మనం ఎన్నో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటాము. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన ఈ రోజుల్లో దూరాభారాలు లెక్క చెయ్యకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటాము. 
బస్సులు, రైళ్ళు, టాక్సీలు, విమానాలు తేలికగా అందుబాటులో ఉన్న ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ పెట్టుకుంటున్నాము. మన పెద్దవాళ్ళు ఇన్ని ప్రయాణాలు చేసేవారు కాదు. రవాణా సౌకర్యాల లేమి, ధనం అంతగా లేకపోవడం, ఇళ్ళల్లో పనులు ఎక్కువగా ఉండడం కారణాలు.
అదీకాక దారిలో క్రూర మృగాల, దొంగల, దోపిడీ దారుల భయాలు ఎక్కువ. అందుకే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడు సమానం అనుకునేవారు. మనకు ఇటువంటి సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
రకరకాల కారణాలు పెట్టుకుని దగ్గర, దూరం ప్రయాణాలు చేస్తున్నాము. మేము డిసెంబర్ 14, 2016 నుంచి నెలకు రెండు ప్రయాణాలు దగ్గరివి,
దూరాలవి చేస్తున్నాము. మొన్నే మిజోరమ్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ కి వెళ్ళాము. అంత క్రితం ఆగష్టు లో ఖాట్మండు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మేఘాలయ వెళుతున్నాము. జాతకంలో గోచారంలో గ్రహాల సంచారములో మార్పు వచ్చినపుడు ఇలా వరుస ప్రయాణాలు తగులుతాయని జాతకులు అంటూంటారు. నాకు జాతకాలు, జ్యోతిషాలలో ప్రవేశం, వాటిపై అవగాహన లేవు.
తురా మేఘాలయలో ఒక ప్రాంతం. North Eastern Hill University (NEHU), షిల్లాంగ్ యొక్క ఒక శాఖ తురా లో ఉంది. ఇక్కడ కామర్స్ డిపార్ట్మెంట్ లో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో ప్రజెంట్ చేయడానికి నా పరిశోధనా పత్రం ఎన్నిక అయింది. దానిని సమర్పించడానికి తురా బయలు
దేరాము. సదస్సు నవంబర్ 23, 24 లలో జరుగుతుంది
భీమవరం నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి వచ్చి అక్కడ సికింద్రాబాద్- గౌహతి ఎక్స్ప్రెస్ కి మారి గౌహతి వెళుతున్నాం. రేపు ప్రొద్దున్నే 21- 11-2017, 6 గంటలకు చేరతాము. అక్కడినుంచి తురా బస్ మీద 4' 5 గంటల ప్రయాణం.
మా తురా (మేఘాలయ) పర్యటన 2
21-11-2017
శ్రీ కామాఖ్యాదేవి ఆలయ సందర్శనం
మేము సికింద్రాబాద్-గౌహతి ఎక్స్ప్రెస్ లో మూడుగంటల ఆలస్యంగా ఉదయం 9 గంటలకు గౌహతి చేరాం. గౌహతి ప్రవేశిస్తూ ఉండగా బ్రహ్మపుత్రా నది స్వాగతం పలికింది. మనకి బ్రహ్మపుత్ర అయిన ఈ నదికి దీని జన్మస్థలం అయిన టిబెట్ లో మరియొక పేరు. నామ, రూపములని బట్టి వస్తువులు మనలో ముద్రలు వేస్తాయి. ఒకే వస్తువు వేరు వేరు భాషల్లో, సంస్కృతులలో వివిధ భావాలు పుట్టిస్తాయి. మన ప్రేమాస్పదత, అభిమానాలు, ఇష్టాయిష్టాలు, ఆవేశ కావేషాలు ఈ మాటల మీద ఆధారపడి ఉంటాయి. భాష మన మొదటి సంస్కృతి. దానిమీదే అన్ని శాస్త్రాలు, వేదాంతాలు, తత్త్వాలు, కావ్యాలు ఆధారపడి నిర్మింపబడతాయి. సృష్టించబడతాయి. మన జీవనానికి, సంస్కృతీ సాంప్రదాయాలకి, నాగరికతకి భాష జీవనాడి.
బ్రహ్మపుత్ర నది దాటిన వెంటనే కామాఖ్యా రైలు స్టేషన్ వస్తుంది. ఆ తరువాత గౌహతి. మేము రైల్వే వెయిటింగ్ హాల్ లో రిఫ్రెష్ అయ్యి సామాన్లు క్లోక్ రూమ్లో పెట్టిన కామాఖ్యాదేవి ఆలయ సందర్శనానికి
బయలుదేరాము. గౌహతి స్టేషన్ నుంచి సిటీ బస్ లో ఒక సెంటర్ కి వెళ్ళి అక్కడ నుంచి దేవస్థానం బస్లో
కొండ పైకి వెళ్ళాము. కొండ కింద నుంచి ఇతర రకాల
వాహనాలు లభ్యమౌతాయి.
కొండ పైకి మెట్లు ఎక్కీ వెళ్ళవచ్చు. కొండ మరీ ఎత్తు లేదు. అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. సతీదేవి వివిధ అంగాలు వివిధ ప్రదేశాల్లో పడి అవన్నీ శక్తిపీఠాలు గా మారినట్లు మనకి ఐతిహ్యం. సతీదేవి యోని ఇక్కడ పడ్డట్టు పురాణం. తిరుపతిలో లాగా ధర్మదర్శనానికి కంపార్ట్మెంట్ లు ఉన్నాయి. జనం ఎక్కువగా ఉన్నారనిపించి దర్శనం కోసం 501/- రూపాయల టిక్కెట్లు తీసి కున్నాము. అమ్మవారి ఆలయ పరిసరాలు, ప్రాంగణం అందంగా, నిశ్శబ్దంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. అమ్మవారి ఆలయం రాతి కట్టడం. శిల్పాలు సకకృత్తుగా ఉన్నాయి.

మా తురా (మేఘాలయ) పర్యటన 3
కామాఖ్యాదేవి సందర్శనం 2
22-11-2017
కామాఖ్యా దేవి విగ్రహం రూపంలో లేదు. నిన్ననే గౌహతి లో కామాఖ్య అమ్మవారి ఆలయం దర్శించాము. ఆలయంలో అమ్మవారి దగ్గరకు వెళ్ళేముందు ఒక పీఠంపై మూడు మూర్తులు ఉంటాయి. మధ్యలో కామాఖ్య అమ్మవారి మూర్తి, కుడిపక్కన కామేశ్వరి దేవి, ఎడమ పక్క కామేశ్వరుడు ల ఉత్సవ విగ్రహాలవంటివి. వెనుకవైపు భూగృహంలో అమ్మవారు జలధార లా ప్రవహిస్తూంటారు. అదే అమ్మవారు. అమ్మవారికి వేరే విగ్రహం లేదు. ఈ విగ్రహం, ఈ 15 ఏళ్ళకొకసారి అనేది అబద్ధం. ఈ వాట్సాప్ లలో ఎన్నో అబద్ధాలు రౌండ్లు కొడుతున్నాయి. నేనూ దానికి బలి అయ్యి ఆ ఫొటో షేర్ చేశాను. ఇదీ కథ.
మేము కామాఖ్య అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ప్రవేశించాము. ఆలయ పరిసరాలు, ప్రాంగణంలో చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. గుడి పురాతనమైనది. వినాయకుని ఒక ప్రతిమ, కొన్ని శిల్పాలు ఆలయం గోడలపై ఉన్నాయి. ఆలయంలోకి 50 మంది చొప్పున పంపిస్తారు. క్యూ తిరిగి పీఠంపై ఉన్న ప్రతిమలను చూసినప్పుడు ఎంతో హాయి కలుగుతుంది. అక్కడ అరటిపండ్లు, కొబ్బరికాయలు ఉండవు.
పూలదండలు, తలకు చుట్టుకునే - जै श्री माता అని రాసి ఉన్న గుడ్డలు అమ్ముతారు. ఆడ, మగా కొనుక్కుని అమ్మవారి దర్శనానికి వస్తారు. పసుపు, కుంకుమ, చీర ఇచ్చే వారు ఇవ్వచ్చు. ఇవన్నీ మూల దేవి దగ్గర ఇవ్వాలి. మూర్తుల దర్శనం తర్వాత మూలదేవిని దర్శస్తాము. భూగృహంలో జలధారయే అమ్మవారు. నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని మనం చేతితో తీసుకుని తలపై జల్లుకుంటాము. అక్కడ ఉన్న పూజారి కుంకుమ బొట్టు పూస్తారు. లోపల భూగృహంలో ప్రమిదలలో నూనె/నెయ్యి దీపాలే ఉంటాయి. వాటి వెలుగే వెలుగు. అక్కడ ఎంతో చల్లగా పవిత్రంగా ఉంది. మనసు నెమ్మదిని పొందింది.
ఖాట్మండు లో కూడా అమ్మవారు గుహ్యేశ్వరీ విగ్రహం రూపం లో ఉండరు. నీటి ఊటే అమ్మవారు. 
కామాఖ్యా అమ్మవారి కరుణతో ఆవిడ దర్శనం చేసుకుని, అక్కడ కల్పించిన సదుపాయంతో భోజనం చేసి, బ్రహ్మపుత్రా నదిని దర్శించి తురా వెళ్ళడానికి సిద్ధం అయ్యాము. ఎంతోమా తురా (మేఘాలయ) పర్యటన 4
21, 22, 23-11-2017.
తురా ఆగమనం
కామాఖ్యా దేవి దయతో ఆవిడని దర్శించుకొని ఆలయం ప్రాంగణంలో కూర్చుని తల్లికి మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొని, నమస్కరించి బయలుదేరాము. బయట ఆలయం నిర్వాహకులు యాత్రీకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పెసరపప్పు తో ఉడికించిన అన్నం, ఒక కూర, పరమాన్నం, అప్పుడు ఆధరువులు. బాగానే ఉన్నాయి. అన్నీ మారు వేశారు కాని అప్పడం వేయలేదు. మనం మన ప్రాంతం విడిచాక మజ్జిగ అన్నం, పెరుగు అన్నం గురించి మర్చిపోవాలి.
ఈ ప్రాంతాల్లో మజ్జిగ అన్నం తినే అలవాటు లేదు.
బస్సులో స్టేషన్ కి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. గౌహతి నుంచి తురా కి ప్రొద్దున్న 6-30కి, మధ్యాహ్నం 1-30 కి, రాత్రి 9 గంటలక రవాణా సదుపాయం ఉంది. సుమోలు అలాంటి ఇతర వాహనాలు షేర్ చేసికొని వెళ్ళవచ్చు. టాక్సీలు ఉంటాయి. 4 వేలు అడిగాడు.
మధ్యాహ్నం 3 అయింది కాబట్టి ఇవేమీ లేవు. రాత్రి 9 గంటలకు బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. గౌహతి స్టేషన్ నుంచి ISBT - Inter State Bus Terminal - కి వెళ్ళాలి. ఇంటర్ స్టేట్ బస్ లన్నీ అక్కడ నుంచి బయలు దేరతాయి. తురా మేఘాలయ రాష్ట్రంలో ఉంది. గౌహతి స్టేషన్ నుంచి 2 గంటలు ముందే బయలుదేరాము. స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ ఉంది. అక్కడ నుంచి ఐ ఎస్ బి టి కి గంటన్నర పట్టింది. ఐ ఎస్ బి టి చాలా పెద్ద బస్ స్టాండ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం లకు బస్సులు అక్కడ నుంచి బయలు దేరతాయి.
మా బస్ 9 కి బయలుదేరింది. అది ప్రయాణీకుల బస్సుల్లో కంటె రవాణా బస్ అనవచ్చు. మాకు తెలియక అటువంటి బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. సీట్లున్నాయి. అందరూ మగవారే. కామేశ్వరి తప్ప ఆడవారు లేరు. కొద్దిగా అనిపించింది. కానీ అంత భయపడనవసరం లేదనీ అనిపించింది. అక్కడ రాత్రి బస్ ప్రయాణాలు చెయ్యరని తెలిసింది. అందరూ పగలే ప్రయాణం చేసేస్తారు. గౌహతి నుంచి తురా కు 5 గంటల ప్రయాణం. బస్ తెల్లవారుజామున 4 గంటలకు తురా చేరింది. మధ్యలో ఒక ధాబా దగ్గర గంట పైగా ఆపేశారు.
మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ కి ఆటో వచ్చింది. ఎక్కువగా ఏమీ తీసికోలేదు. మనుషులు మంచివారు. మా గెస్ట్ హౌస్ 8 కిలోమీటర్ల దూరం ఉంది. మమ్మల్ని జాగ్రత్తగా గెస్ట్ హౌస్ దగ్గర దించాడు. కేర్ టేకర్ వెంటనే రూం ఇచ్చాడు. అతను వెనకాల ఇంటో ఉంటాడు. అది హాస్టల్ కూడాను. అందులో ఉన్న అమ్మాయిలు కేర్ టేకర్ ని లేపడంలో
సాయం చేశారు. వారి మేలు ప్రశంసనీయం.
మేము బాగా‌ అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపోయాం. ఎనిమిది గంటలకు లేచాం. కాన్ఫరెన్స్ 23, 24 లలో. 22 పొద్దున్నకి తురా చేరాం. మేము ఉన్న గెస్ట్ హౌస్ పేరు
SMELC
Social Mobilization for Employment and Learning Center.
Dakkopgre
West Fargo Hills
Tura
మేఘాలయ గవర్నమెంట్ వారి డిఆర్డిఎ శాఖ నిర్వహణలో ఉన్న భవంతి. దానికి ఆనుకొని ఒక మెస్, క్లాస్ లు జరపడానికి మరొక భవంతి ఉన్నాయి. ఆవేళ్టికి పూర్తిగా రెస్ట్ తీసుకున్నాము. మెస్ లో భోజనం చేశాము. మేఘాలయలో వరి అన్నం తింటారు. మాకు బ్రేక్ ఫాస్ట్ పూరీ కూర, మధ్యాహ్న భోజనం అన్నం, మూడు కూరలు, పల్చగా ఉన్న పెసర పప్పు నలుచుకొందుకు పచ్చిమిర్చి ముక్కలు, కారట్, ఉల్లిపాయ, కుకుంబరు ముక్కలు ఇచ్చారు. పన్నీర్ తో చేసిన కూర వీళ్ళకి ఇష్టం. అది స్పెషల్ గా, ఇష్టంగా తింటారు.
ఇక్కడ మాంసాహారం, శాఖాహారం పక్క పక్కనే ఉంటాయి. అడిగి తెలుసుకోవాలి. అందరూ మాంసాహారులే. క్రిస్టియానిటి మతము. హిందీ, ఇంగ్లీష్ అందరికీ రాదు. మేనేజ్ చేసుకోవాలి.
మరునాడు యూనివర్సిటీ కి వెళ్ళడానికి బయిటకు వచ్చినప్పుడు ఊరు ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఎత్తులు, పల్లాలలో ఊరు ఉంది. తురా మేఘాలయ రాష్ట్రంలో రెండవ పెద్ద పట్టణం. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. ఈ వాతావరణం ఎంతో ఆనందిస్తాం.
మేము వెళ్ళవలసిన కాన్ఫరెన్స్ NEHU - North East Hill University, Shillong యొక్క ఆఫ్ సైట్ కేంపస్. ఇది వరకు పార్లమెంటు స్పీకర్ గా పనిచేసిన పి.ఎ. సంగ్మా ఊరు. ఆయన వల్లే ఈ శాఖ 10 ఏళ్ళ క్రితం పెట్టబడింది. ఇక్కడ హిస్టరీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, వంటివి పది డిపార్ట్మెంట్ లు ఉన్నాయి. పొద్దున్న 9 గంటలకు మాకు యూనివర్సిటీ బస్ వచ్చింది. మేమున్న చోటునుండి కె మమ్మల్ని కేంపస్ కి తీసికెళ్ళింది.
NEHU తురా కేంపస్ ప్రొ ఛాన్సలర్ ప్రొఫెసర్ సింగయ్య గారు తెలుగాయన. హిస్టరీలో ఇద్దరు, మేనేజ్మెంట్ లో ఒకరు మన తెలుగు వారు పనిచేస్తున్నారు. కాన్ఫరెన్స్ కెరోల్ సింగింగ్ తో మొదలైంది. ఇది మేఘాలయ సంప్రదాయం. విద్యార్థినీ విద్యార్థులు పాడారు. విజయవాడ తెలుగబ్బాయి ఒకతను ఎం బి ఎ చేస్తున్నాడు.
కన్వీనర్ బిస్వాల్ నా అభ్యర్థన మన్నించి నా ప్రెజెంటేషన్ 23 సాయంత్రం పెట్టారు. నా ప్రెజెంటేషన్ బాగా రిసీవ్ చేసుకున్నారు. Demonetization and digitization: A common man's perspective దాని శీర్షిక. ఆ సాయంత్రం గెస్ట్ హౌస్ కి చేరి మరునాడు షిల్లాంగ్ వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని నిద్రించాము. మిగతా తరువాతి భాగంలో.

తురా  నుంచి షిల్లాంగ్ ప్రయాణం

23, 24-11-2017

ఈ ప్రయాణం భగవదనుగ్రహంతో హాయిగా జరిగింది. లేకపోతె చాలా ఇబ్బంది కలిగేది. కష్టపడేవాళ్ళము.
మేము 23 ప్రొద్దుటే లేచి ఆరున్నరకు తయారై ఆరు నలభై కి తురా బస్సు స్టాండ్ చేరాము. అక్కడ ఒక్క బస్సు కానీ, సుమో కానీ ఇతర ప్రయాణ వాహనాలు కానీ లేవు. తురా బస్సు స్టాండ్ ఒక జంక్షన్ మాత్రమే.
మేము ఆటో దిగి అక్కడి ఏ విధమైన వాహనములు లేకపోవడం చూసాము. అప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడు, ఇక్కడనుంచి గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్ళాలి. ఇక్కడనుంచి గౌహతి వెళ్లే అన్నిరకముల వాహనములు ప్రొద్దుట ఆరున్నరకు వెళ్లి పోతాయి. మళ్ళీ రాత్రి బస్సు లే శరణ్యం అన్నాడు.

పై ప్రాణం పైనే పోయింది. ఇంతలో అక్కడ ఉన్న ఒక టాక్సీ డ్రైవర్ మా ఇబ్బంది, కంగారు గమనించాడు. ఫోన్లో ఎదో మాట్లాడాడు. మాదగ్గరకొచ్చి ఆటో అతనిని అక్కడనుంచి 10 కిమీలలో తనకు తెలిసిన గౌహతి వెళ్లే టాక్సీ ఆపి ఉంచుతానని, ఆటో అతనిని మమ్మల్ని అక్కడకు తీరికెల్లమని అన్నాడు. ఆటో డ్రైవర్ ఉత్సాహము చూపించలేదు. అప్పుడు ఆ టాక్సీ డ్రైవరే తాను తీసికెళతానని రెండు వందలు ఇమ్మని అడిగాడు. మేము వెంటనే ఒప్పుకున్నాము. ఆటను మూడు టాక్సీని ఆపివుంచి మమ్మల్ని అక్కడకు చేర్చాడు. ఇది ఏంటో గొప్ప ఉపకారము. ఎందుకంటే రెండువందల కాదు ఎంత ఇచ్చినా మమ్మల్ని పాటించుకునేవారు లేరు. రాత్రిదాకా ఎక్కడ ఉండాలీ? అన్ని ఇబ్బందులే, బాధలే.

ఆవిధముగా అతను మానవధర్మం గా మాకు ఉపకారము చేసాడు. మేము రెండవ టాక్సీ ఎక్కి గౌహతి చేరాము. రెండవ టాక్సీ డ్రైవర్ ఫోన్ లో మాట్లాడి గౌహతి outskirts నుంచి మామ్మని షిల్లాంగ్ తీసికెళ్లే టాక్సీని ఆపి అందులో కి మార్చాడు. అల్లా ఎంతో ఇబ్బంది, కష్టం పడాల్సిన మేము ఎంతో హాయిగా షిల్లాంగ్ చేరాము. భగవంతుని అనుగ్రహము, దయ అంటాము కానీ భగవంతుడు మనుషుల ద్వారానే మనకు సాయము చేస్తాడు. భగవంతునితో పాటు ఆ మనుషులకు కూడా మనము కృతజ్ఞత చెప్పుకోవాలి

మేము మా స్నేహితుడు చెప్పిన హోటల్ కి  మధ్యాహ్నము 2 గంటలకు చేరి అందులో విశ్రమించాము. మరునాడు హోటల్ వాళ్ళ ద్వారా ఒక టాక్సీ కుదుర్చుకుని షిల్లాంగ్ చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాము. ముందుగా షిల్లాంగ్ పీక్ పాయింట్ కి వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఎత్తున ఉంది. విమాన బలాల ఆధ్వర్యం లో ఉంది. వారి అనుమతి తీసుకుని లోపలకి ప్రవేశించాలి.

ఈ పీక్ పాయింట్ నుంచి షిల్లాంగ్ ఊరు, నగరము దృశ్యము ఏంటో బాగుంది. అక్కడ కొంతసేపు గడిపి, చిన్న జలపాతము ఉన్న చోటికి వెళ్ళాము. అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. అదే దాని మీదుగా చిరపుంజి 50 కిమీ దూరంలో ఉంది. టాక్సీ డ్రైవర్ ఊరించాడు గాని, మాకు వరుస కార్/బస్ ప్రయాణాల వల్ల ఓపిక లేకపోవడం, అది వర్షాకాలం కాదు కాబట్టీ మేము ఉత్సాహము చూపించ లేదు. ఇంకా రెండు మూడు మ్యూజియం లు పెద్ద చర్చిలు చూసి ఒక సరస్సు చుట్టూ ఉన్న వనమునకు వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఆకట్టుకుంది. రెండు గంటలు అక్కడే కూర్చుని హాయిగా గడిపాము. చల్లని గాలి మనసుని పరవశింపచేసింది. తరువాత షిల్లాంగ్ రేస్ గ్రౌండ్ మీదుగా హోటల్ చేరాము.

షిల్లాంగ్ ఎంతో అందమైన నగరము. ఊటీలా ఉంది. లోపల నగరము పాతవాసనలతో, చుట్టూ, అన్ని ప్రక్కల ప్రకృతి సౌందర్యం తో అలరారుతూ ఉంది. చాలా చల్లగా ఉంది. పగలే 13-18 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. షిల్లాంగ్ నగరము గారో కొండల మధ్య ఉంది. ప్రస్తుతము అది మేఘాలయ ముఖ్యపట్టణము. 1980 వరకు మేఘాలయ అస్సామ్ తో కలిసి ఉంది. అప్పుడు షిల్లాంగ్ అస్సాం రాజధాని.
మొత్తము మేఘాలయ, కాశి (తురా ప్రాంతము), గారో (షిల్లాంగ్ ప్రాంతము), జయంతియా కొండల మధ్య ఉంది. అంతా పర్వతమయము. గౌహతి షిల్లాంగ్ రోడ్ మాత్రము ఎక్కువ ఎత్తు పల్లాలు లేక సమ ప్రదేశముగానే ఎక్కువ భాగము ఉంది.

గౌహతి నుంచి షిల్లాంగ్ వెళుతుంటే 10 కిమీ ముందునుంచి ఒక పెద్ద సరస్సు రోడ్ పక్కాగా తగులుతుంది. దాని పేరు Umiam lake. ఆ సరస్సు గొప్ప ప్రకృతి దృశ్యం. కొన్ని వేల చదరపు కిమీ వైశాల్యం కలది. కొండల మధ్య కులుకుతూ ఏంటో అందముగా ఉంది. మేము 24-112017 ఉదయం గౌహతి రావడానికి టాక్సీ బుక్ చేసికొని, దారిలో ఈ సరసు అందాలు తిలకించి గౌహతి చేరాము. టాక్సీలో షిల్లాంగ్, గౌహతి మధ్య ప్రయాణము 2 గంటలు అంతే. అదే తూటాక్సి అతనిని అడిగి బుక్ చేసికొని బ్రహ్మపుత్ర నదిని చూడడానికి వెళ్ళాము.

గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర ఎంతో విశాలముగా ఉంటుంది. మధ్యలో  ద్వీపములు ఉంటాయి. ఆ ద్వీపములలో దేవాలయములు ఉన్నాయి. మేము అక్కడకు వెళ్ళలేదు. మన గోదావరిలాగానే ఉంది బ్రహ్మపుత్ర నది. టిబెట్లో పుట్టి ఇంకో పేరు కలిగి మన దేశములో ప్రవేశించిన వెంటనే బ్రహ్మపుత్రగా పిలవబడే ఈ నది వస్సముకు వరదాయిని, దుఃఖదాయిని కూడా. బ్రహ్మపుత్ర నీళ్లు శిరసుపై చల్లుకొని, ఆ నదీమ తల్లికి నమస్కరించి ఒడ్డున ఉన్న కాళీ ఆలయం లో అమ్మవారిని దర్శించి గౌహతి స్టేషన్ చేరాము. 54 గంటలు పయనించి (దిబ్రుగఢ్ - కన్యాకుమారి ఎక్సప్రెస్ - భారతదేశములో పయనించే పొడవాటి రైలు ప్రయాణము దూరము కల రైలు) 12 గంటలు ఆలస్యముగా రాజమండ్రి చేరి, సర్కార్ ఎక్సప్రెస్ పట్టుకుని సాయంత్రం 6 గంటలకు భీమవరం చేరి ఇల్లు చేరి స్వస్థులమైనాము.

మా గౌహతి, తురా,షిల్లాంగ్ పర్యటనా ప్రయాణము ఆనందముగా ముగిసింది.



Sunday, January 7, 2018

Celebrities and Coverage by Media; Wisdom; Discretion and Discrimination; Role models of Indian Youth

Celebrities and Coverage by Media

The media is inundating their news columns with details of lives of celebrities, their marriage, divorce, kids, their lives, as if we are here to devour only that stuff and it is our only requirement. This is really underestimating our tastes, goals in life, intellectual and cultural preferences and civilized affiliations.
The media is covering this useless stuff to get more revenue. It is not known whether they are ruining our cultural sensitivities or we are inviting this stuff so that our tastes to be degraded. In any case it is an onslaught on our cultural outlook. Our civilization is guided by individuals if lesser taste and aesthetic preferences.

**********
Wisdom

Wisdom consists not merely of knowledge, intellect, rationalism, intelligence, reasoning abilities, logic but also of applied skills, aesthetic, artistic, skillful attitude towards life. Wisdom is another name for commonsense. It can be possessed by even illiterate persons because wisdom is not merely learning but is also combination of intuition and faith. Wisdom is application of knowledge in action.
************
Discretion and Discrimination
Let us cultivate discretion and discrimination
No happening in this world takes place according to the feelings of sensitive people. Reality is harsh and insensitive. We cannot frame it in an ideal or idea. Many insensitive people also dominate this world. Wise thing is, let us not be sensitive to all happenings in this world and mind our life limited by and to our near and dear. Though we can dream and imagine without limits, we cannot take the world with us according to our dreams, however virtuous and caring they are. Realistic living sets peace in our heart and mind; though this limitation appears "selfish and uncultured and uncivilized", it is always wise to ignore things which we cannot do anything about. Else our life will be full of mental disturbance and peaceless-ness.
************

Role Models for Indian Youth

Celebrities are not our role-models. Actually present youth is not having any role-models other than CEOs or successful software industrialists. It is interesting that even though India is having second most scientists' population, the scientists are not known outside their chosen temples of learning or places of work. Professors of universities or prestigious private educational institutions are absent in the list of role models for the youth.
Most of the youth is carried away by the modern gadgets and information contained in them and shared on them and are building an inner world far away from real world.
Youth is not having other than parents to emulate. But unfortunately most of the parents are as good or bad as their children in these matters.
So the space is mostly vacant which is being partially filled by past intellectuals, scholars, scientists and the like. Present is unable to produce any worth while individuals from noble professions to emulate their lives and utterances. This also mostly due to all these intellectuals or scholars are themselves most confused. And they are only spreading their confusion and ignorance. Most of the current intellectuals are confined to their social affiliations and are refusing to come out of their well.
Society bereft of role models is vulnerable to extremists and prone to get plunged into chaos and disturbances because all most all intellectuals or scholars holding public positions or are popular are subjective and are not objective at all on issues or disciplines and subjects of learning.
Youth having role models of objective attitude is essential for the welfare and well-being of youth themselves, nation, society and within of the individuals.
Even spiritual and religious people are not up to standards to be role models to the youth. Mere recitation of spiritual, religious texts and wearing certain clothes are failing to make them ideal.
Normally in India it is the house holders who have been guiding the youth and society. But now householders have become very weak in all aspects and swamis and babas and ammas are replacing them with disastrous consequences.
There are no statesmen or women to enthuse youth and guide them. All we have are only narrow-minded and disruptive politicians.
A householder in the form of parents, again reigning supreme is necessary for youth to have role models and necessary guidance for life and living. Let us see how things turn.

Wednesday, January 3, 2018

No Owners; Caste Politics

No Owners

No one owns a language, religion, region, caste, community, ideology or a cause; even the followers. They have right to follow that's all. Because they are following, it won't give them any special rights to cause public unrest and bedlam destroying properties, causing lot if inconvenience to fellow citizens.

In India governments want to appease rather than govern. And a government cannot simultaneously appease two warring groups which are at cross purposes. Government must keep law and order and should not allow rowdy elements in whatever garb they are to take law and order into their hands.

Governments must learn to be firm in dealing with all kinds disrupting elements whatever cause they claim to be representing. A few rowdy elements cannot take rest of the population to ransom whatever noble and mighty cause they represent and are agitating for.

It is governments' responsibility to separate rowdy elements, assert itself and punish them. Governments' must be capable to call spade a spade and expose the uncivilized elements taking the guise of social justice keepers. They can't allow their lawlessness and give them free hand for all happenings.

Any pretext is not grand to cause unrest in the society and take things into agitators' hands. Politicized police force is incapable of dealing serious situations.

Every rude group can not be allowed to play with lives and daily life of rest of the citizens whatever justice they want to fight for. Else anarchy prevails over nation and society.

The chauvinistic and fanatic among lovers of language, religion, region, caste, community, ideology, sub-nationality beyind and above the nation must be
controlled and curbed. Else they have the potential to divide India along language, religion, region, caste, community, ideology, sub-nationality lines and cause havoc and make India vulnerable as a nation to within and without evil forces.
*********
Caste Politics
Caste politics will devour India. The identity of Indian is consumed by other social affiliations. 70 years of pampering by all political parties has brought India to such a pass that no genuine intellectual can find a solution to this artificial claims of injustice.
Social justice has become a tool to disrupt more than getting justice. All political parties are afraid to speak the truth and are and will pamper certain social sections for fear of losing their votes. This kind of justice will also fully damage the idea of India as a nation.
India becomes a collection of groups antagonistic to one another and warring and fighting for respective justices. A nation led by divisive caste leaders suffers much more and societal peace and harmony will be the causalities. None of the present day politicians is capable of emotionally integrating India. They can neither solve the problem nor allow the problem to be solved.
********

మన వాక్పటిమ, భాషాపాటవము, హాస్యభరిత భాషణము ఇతరులను ముగ్ధులను చేస్తాయి.
మౌనం వహించ గలగటం మనలను ముగ్ధులను చేస్తుంది.
మౌనము భాషల మూలము, భాషల సారమూను.
*********
The vast expanse of awareness sans thoughts is the Self. The Atman. The Brahman.
******
I love two words; love and serenity. Love gives serenity. And serenity blossoms love.
********
జామ పూవు తెల్లన 
అమ్మ చూపు చల్లన 
నాన్న మనసు గుంభన
కన్నయ్య రూపు నల్లన
చల్లనయ్య గోవిందుడు మనకు రక్షణ