Monday, May 8, 2017

సినిమా తెరపై దృశ్యములు : Mind



సినిమా తెరపై దృశ్యములు

సినిమా తెరపై కదలాడు బొమ్మల వంటివి
మన మస్తిష్కమున కదలాడు భావ పరంపర
సినిమా తెరపై దృశ్యములు నిజములు కాదు
ప్రొజెక్టర్ సాయమున కనిపించు నీలి కాంతుల "నీడలు"

భావములును మనసను ప్రొజెక్టర్ చూపించు దృశ్యములు
ధ్వనులు, పరళములు, రుచులు, స్పర్శలు; మనసు అణగిన
అణగు మిథ్యా జగత్ లు; మిథ్య అయిన, నిజము కాని
సినిమా తెరపై ఆడు మనుషులు, నిజమైన మనుషులు వేరు

వారి మిథ్యా కదలికలు మనల అలరించును;
ఆవేదననిచ్చును; పొంగెదము; కృంగెదము
అంతయు అబద్ధమే అయినను మన స్పందన, ప్రతి
స్పందనలు మాత్రము సత్యము; అవగాహనా లోపం

కలిగించును అన్ని సంతోషములను, అంతరంగ
మథనములను: మిథ్యను నిజమని భ్రమసి భ్రాంతికి
లోనగుదుము; అన్వయ లోపము అలోకనలో హడావుడి
కలిగించును సుఖదుఃఖాలు; ఇది తెలిసిన శాంతి

**********

తల్లిగర్భమునుండి ధనము తేఁడెవ్వఁడు, వెళ్ళిపొయ్యెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమెకాని, మెఱుఁగుబంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనచేసి విఱ్ఱవీఁగుటె కాని, కూడఁబెట్టినసొమ్ము తోడరాదు
పొందుగా మఱుఁగైన భూమిలోపఁబెట్టి, దానధర్మములేక దాఁచి దాఁచి

తుదకు దొంగల కిత్తురో దొరల కవునో
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
శేషప్పకవి "నరసింహ శతకము" నుండి

**********
Mind

Mind is an aspect of the body. Functioning of mind is physiology. The hardware and software combination of mental functioning can be had by integrating the ideas from the Upanishads on consciousness and mind and modern science in the form of neurology, physiological, psychology, artificial intelligence, mind-machine modeling, natural language comprehension. Upanishads focus on and care about human consciousness, mind and its function in the four conscious states or phases of mind through four inner mental tools (antahkaranas), sense organs - eye, ear, nose, tongue, skin-, action organs - movements of hands, movements of legs, movements of vocal chords, movements of reproductive organ and movements of bowels.

Sunday, May 7, 2017

సినిమా; సన్యాసము-సంసారము; Engineering education and Pure Sciences ; Woman, man God



సినిమా

సినిమాలు మాత్రమే మనలను అలరించగలవు. అలరించ గలుగుతున్నాయి. ఇరవయ్యవ శతాబ్దపు వినోద సాధనాలలో సినిమా అగ్రగణ్యంగా నిలిచింది. మన జీవితాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. చేస్తోంది.
మన మనసులను ఆకట్టుకొని మన జీవన విధానాన్ని ఎన్నో మార్పులకు గురిచేసింది. ముఖ్యంగా మన భారత దేశంలో సినిమా మన అణువణువునా ప్రాకింది. మన ఊపిరి అయిపోయింది అన్నా అతిశయోక్తి కాదు. ఇప్పుడు బాహుబలి సినిమా హడావుడి ఈ మాటకి ప్రబల సాక్ష్యం.

సినిమా నటీనటులను దేవుళ్ళు, దేవతల కన్న మిన్నగా ఆరాధించే మనం నిజ జీవితంలో భగవంతుని స్మరించడమే మానేశాము. సినిమా వాళ్ళు ప్రకటనల్లో కొనమనే వస్తువుల్ని కొంటాము. వారి అస్తవ్యస్త వ్యక్తిగత జీవితాలను పట్టించుకోము. సంఘంపై వారి విచ్చలవిడి ప్రవర్తన ప్రభావాన్ని గణించము. పైపెచ్చు అనుకరించడానికి ఉత్సుకత చూపుతాము.
 
వారు శాసనసభలకు, పార్లమెంటుకు హాజరు కాక పోయినా ఉదాసీనత వహిస్తున్నాము. చట్టసభల్లో చట్టాలు చేయడంపై వారికి కనీస అవగాహన లేకున్నా మనకు పట్టదు. వెనకాలనిర్మాత, దర్శకుడు, కథా, చిత్రానువాదము, మాటల, పాటల రచయితలు, కెమేరా మెన్, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు, మిగతా సినీ వర్కర్లు, ఇందరి కృషితో, సాయంతో సినిమా తయారవుతుందని తెలిసినా,
నటీ నటులకు మాత్రమే, ముఖ్యంగా, హీరో, హీరోయిన్ లకు మాత్రమే పెద్ద పీట వేసి మనం మనసులు వారికై పారేసుకుంటాము.
 
సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్ప కళ మొదలైన లలిత కళలు మన కనులకు ఆనవు. ఆనటం లేదు. మన మనసులను రంజింపచేయలేక పోతున్నాయి కూడా. ఇంతలా మన జీవితాలలో, జీవితాలతో మమేకమై మనల నిలువనీయ కుండా చేస్తున్న సినిమా అందిస్తున్న వినోదానికి లక్ష రెట్లు మనలను నిర్వీర్యులను చేస్తోంది. మరే కాలక్షేపం మనం చేయడం లేదు. బహుశా ఇది మన ఆస్వాదనా కళ, శక్తి పరిమితం అవడం వల్ల కూడా మన మనోరంజనము సినిమా చూసి మాత్రమే వినోదాన్ని పొందగల స్థాయిలో ఉండిపోయింది.

ఇన్నేళ్ల సినిమా యొక్క ఈ ఆగడం ఆపవలసిన సమయం ఆసన్నమైంది. ఎంతో తేలికగా మనం ఏమాత్రం అలవనవసరం లేకుండా సినిమా వినోదాన్ని అందిస్తుంది. అదే సమయంలో మన ధన, మాన, ప్రాణాలను శాసిస్తోంది కూడా. ఈ అస్తవ్యస్త అవ్యవస్త నుంచి మనలను మనం రక్షించుకునే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టాలి.
 
సినిమా వినోదాన్ని మాత్రం పంచాలి. మనలను దానికి బానిసలగా చేయకూడదు.
 
***********

సన్యాసము-సంసారము

సన్యాసము సనాతన ధర్మ సాంప్రదాయం కాదు. బౌద్ధుల, జైనుల ప్రభావము వలన సనాతన ధర్మంలో ప్రవేశించింది. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం - సనాతన ధర్మంలో ఈ మూడే ఆశ్రమాలు.
మృత్యువు విడదీసే దాకా భార్యాభర్తలు కలిసి జీవించడమే సనాతన ధర్మం. ఉపనిషత్ సాంప్రదాయం. ఉపనిషత్ స్రష్టలందరూ గృహస్థులే. కొందరు బహు భార్యాత్వం నెఱపిన వారు కూడాను. బ్రహ్మ జ్ఞాన సృష్టికి, బ్రహ్మ జ్ఞానులవడానికి వివాహము, భార్యతో సంసారము చేయడం అడ్డంకులు కావని ఆనాడే ఉపనిషత్ ఋషులు ఋజువు చేశారు.
 
నిజానికి సంసారం అంటే భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు, గొడ్డూ గోదా కాదు.
 
సుఖదుఃఖానుభవాన్నే సంసారం అన్నారు. ఈ అనుభవాలు వాసనల (జ్ఞాపకాల) రూపంలో ఉంటాయి. ఈ వాసనలు సన్యాసము తీసికున్నా వీడకపోవచ్చు. పైపెచ్చు కొత్త అవతారం ఎత్తడం (పేరు, కట్టుకునే బట్ట మార్చడం) వల్ల కలిగే అహంభావ, అహంకారాలు, శిష్య, భక్తకోటి వీరిలో కొత్త వాసనలను సృష్టిస్తాయి.
సన్యాసము అంటే "కూడా వసించడం". ఎవరి కూడా? దేని కూడా

బ్రహ్మము కూడా; బ్రహ్మమై వసించడం.
 
ఏ విధమైన అహంభావ, అహంకార, మమకారాలకు లోను కాకుండా నిర్మల మానసముతో జీవించడం సన్యాసము. పేరు, దుస్తులు, మార్చుకుని పటాటోపముతో, ఆడంబరంగా జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకోవడం మాత్రం, మాత్రమే సన్యాసము కాదు.
 
పేరు, దుస్తులు మార్చుకోనవసరం లేకుండానే, గృహస్థులుగా ఉంటూనే నిర్మల మానసము ఏర్పరచు
కొని, సంసారంలో, సంసారంతో (భార్య, పిల్లా పీచు, గొడ్డూ గోదా, ఆస్తి పాస్తులతో) సుబ్బరంగా జీవించవచ్చు. ఇప్పటి స్వాముల వలె సన్యాసము తీసుకోనవసరం లేదు. సన్యాసం మానసికము. భౌతిక పటాటోపము కాదు. మానసిక నైర్మల్యం పొందడానికి వేషం మార్చి, వేషం వేయనవసరం లేదు.
 
సన్యాసము వ్యక్తిగతము. సాంఘికము కాదు. డబ్బులు కూడబెట్టడానికి ఎన్నుకోవాల్సిన మార్గమూ కాదు. వంద ఏళ్ళ క్రితం భారతదేశంలో ఇంత సన్యాసుల తామర తంపర లేదు. మంత్రాల కన్న తుంపరలు ఎక్కువైనట్టు, సన్యాసులలో ఆధ్యాత్మిక చింతన కన్న ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ అయ్యాయి. సన్యాసం ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కాక మెట్ట వేదాంతం చెప్పి నాలుగు రాళ్లు సంపాదించడానికి తీసుకోబడుతోంది. సంఘంలో "పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందడానికి సులువైన మార్గంగా తయారైంది.

గహస్థుగా సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే సంన్యాసము - బ్రహ్మమై బ్రహ్మముతో సహవాసము - చేయవచ్చు.
పొట్టకూటికై వేషాలు వేయడం సంన్యాసము, సన్యాసము కాదు. ఇది అందరికీ తెలియవలసిన విషయం.
శుభం భూయాత్!
**********
పోతన గారి శ్రీమహాలక్ష్మి !
.
హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్
********** 
Engineering education and Pure Sciences


Engineering is technology and is application part of science. Pure science is known and famous for the concepts it provides. Both are parallel in use and existence. Being famous or otherwise in any of them is a point. But present engineering colleges are not respecting pure sciences and are not giving them their due and are trying to do away with them even in curriculum. Knowledge as a whole is disrespected in India. Present generation is familiar more with Bill Gates and Steve Jobs; neither with scientists nor engineers and technologists. Only technocrats are popular with student community.

**********
Woman, man God


Woman attracts by her beauty and man tries to attract by his "talents". God attracts through His compassion.

Wednesday, May 3, 2017

మన్నన; Chief Reason; Life; ప్రకృతి; మనసు ; చదువు; విష్ణుమాయ


మన్నన

మనం చదివితేనే సాహిత్యానికి మనుగడ
మనం వింటేనే సంగీతానికి ఆదరణ
మనం ఆచరిస్తేనే మంచిమాటలకు విలువ
మనం పిల్లలకు చెబితేనే సాంప్రదాయానికి జీవం


మనం ఉపేక్ష చేసే ఉదాసీనత చూపే ఏదీ
ఉపయోగంలోకి రాదు; వట్టి మాటలు కట్టిపెట్టి
గట్టిమేల్ చేపడితేనే విజ్ఞులైన పెద్దల కష్టానికి
ప్రతిఫలం; లేకుంటే మనకు అయోమయం
బ్రతుకులలో విషాదం; ఆచరణలో మాత్రమే
సంస్కృతీ సంప్రదాయములకు మన్నన
**********
Chief Reason

Even though it is known to us that it is not the incident or person but our reaction that is responsible for our happiness or unhappiness, we tend to take credit or blame others for our happiness or misery. Though it is not easy to realize and implement, the reality is, only our attachment or detachment that causes various experiences or otherwise to us; incident or person is just instrumental and secondary.

************
 Life

Happiness lies in traveling not in reaching the destination. Life is an aimless travel in a rudderless boat in the mighty ocean of space and time.

Life drifts more than is a guided and goal-oriented journey. Life's joy is in living as it unfolds than in a directed, aim-filled, achievement-targeted stress and strain. Life is for experiencing as it evolves and not necessarily just for indulging in actions selfish, individualistic, personalized or society-oriented. Life is also for living in blissful solitude by being one's Self.

 **********

వేదాంతం భజనపరులకు కాదు
సంగీతం శ్రావ్యకంఠం లేనివారికి కాదు
విజ్ఞాన శాస్త్రం సునిశిత బుద్ధి కలవారికి మాత్రమే
చదువులు శ్రద్ధ కలవారికి మాత్రమే
************

 ప్రకృతి

ప్రకృతికి ఆవేశం మాత్రమే ఉంటుంది; విచక్షణ ఉండదు.

ఇక్కడ ప్రకృతి అంటే - వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి ఉపద్రవాలు, రాజశేఖర్ గారు! అలాగే మనిషికి కలిగే రకరకాల వికారాలూను.  

ప్రకృతికి కలిగే ఆవేశం వెనుక... విచక్షణారహిత చర్యలు ఎన్నెన్నో!?

ఓపిక నశించిన ప్రకృతి ఎవరికీ పట్ట సాధ్యం కాదు.

మనసునైనా, రూపాన్నైనా ఎందరు సరిగ్గా చూడగలరు? రూపం విషయంలో లాగే మనసు విషయం లోనూ మనసు పొరబడుతుంది. ఎప్పుడు ఏది మనసుకు నచ్చుతుందో మనసుకే సరిగా తెలియదు.

మనసు మనకు ఎక్కువ సార్లు సఖి. తక్కువ సార్లు దుఃఖదాయిని.

***********


చదువు

పరిజ్ఞానయుత మాత్రమైన చదువు జీవికకు ఉపయోగిస్తే మంచిది. లేకపోతే ఆ విషయసంగ్రహం మనశ్శాంతికి అడ్డు. పరిజ్ఞాన సంచయము ఎక్కువగా మానసిక దర్పానికి కారణభూతమౌతుంది. చదువు మనసుని వికసింపచేయాలి. అహంకారానికి, అహంభావానికి చోటు లేకుండా చేయాలి.

ఏదో ఒక శాస్త్రము చదివి అందు నిష్ణాతులైనంత మాత్రమున సరిపోదు. శాస్త్రపరిచయము, శాస్త్రావగాహన పండితులను చేయవచ్చు. శాస్త్రవేత్తలుగా మలచవచ్చు.

బుద్ధిని నిశితము చేయవచ్చు. గొప్ప పండితుడు, వేత్త అని పేరు తేవచ్చు. కాని అది జీవితావగాహనకు, సుఖ సంతోషాలతో జీవించడానికి సాయము చేయలేకపోవచ్చు.


తోటి మానవుల, జీవుల శాంతి సౌఖ్యాలకు అడ్డుకాకుండా, అడ్డు పడకుండా మనని సిద్ధం చేయలేకపోవచ్చు. అంతటి కరుణాంతరంగులను చేయలేక పోవచ్చు. మన తోటి వారి సుఖసంతోషాలలోనే మన సుఖసంతోషాలు ఇమిడి ఉన్నాయి అనే ఇంగితం కలిగించలేక పోవచ్చు.


ఆలోకన, అవగాహన మాత్రమే జీవితంలో సాయ పడతాయి. ధనంసంపాదనకు పరిజ్ఞానము సరిపోవచ్చు.
నలుగురిలో గొప్పవాడనిపించుకోవడానికి సహాయకారి కావచ్చు. కాని ఇంత "చదువూ" చదువుకొని జీవితాన్ని సుఖ సంతోషాలతో జీవించలేకపోతే, ఈ చదువు సరిపోయినది‌ కాదు కదా. పూర్తిగా ఉపయోగపడడం లేదు అనే భావన కలిగిస్తుంది కాదా.

చదువు అవగాహనను, నిరాకులంగా జీవించగల నేర్పును, నైపుణ్యాన్ని, కుశలతను ప్రసాదించాలి. సత్ప్రవర్తనను సూచించాలి. ప్రవర్తనను సవరించాలి. కరుణ, మానత్వమూ నేర్పాలి. విజ్ఞతను, ఇంగితాన్ని, కలిగించాలి, పెంచాలి, పంచాలి. తోటి మానవుల, జీవుల సంక్షేమము నకై తపించి, వారి, వాటి అవసరాలు తీర్చగల విశాల హృదయము, శక్తి యుక్తులు అలవడేలా శిక్షణ ఇవ్వ గలగాలి. ప్రకృతిని గౌరవించి విధ్వంసం చేయనీయకుండా ఆపాలి.

జీవనభుక్తి కలిగించడం వేరు, జీవన్ముక్తిని కలిగించడం వేరు. వేదాంతము, లౌకిక వ్యవహారాల నిపుణత రెండు చూపులుగా మనసుకు ఏర్పరచాలి. ఊపిరిని సత్ప్రవర్తన గా మార్చగలగాలి. చదువు సకల కోణములలో మనకు జీవికకు ఉపయోగిస్తూ జీవితం గురించి అవగాహన కలిగించాలి.

చదువు ఏదో పట్టా సాధనకు మాత్రం పరిమితం కారాదు. ఉద్యోగం తెచ్చే పనిముట్టు మాత్రంగా మిగిలిపోరాదు. మనసుని వికసింపజేసి, బుద్ధి తీక్షణతను పెంచి మానవత్వాన్ని పెంచుకొని పంచగల సత్తాను కలిగించి పెంచాలి.
సంయమనాన్ని కలిగించాలి, పెంచాలి. జీవించే ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రవర్తనను సవరించ లేని చదువు మనిషికి, సంఘానికి బరువు.

చదువు జీవికను ఏర్పరచడంతో బాటు జీవితపరమార్ధాన్నితెలియజేసి దానిని అందుకునే నైపుణ్యాన్ని మన పరం చేయాలి.

మనసుని వికసింపజేయలేని, బుద్ధిని, హృదయాన్ని విశాలము చేయలేని చదువు నిరుపయోగం.
వ్యర్థం.

చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఉప్పు వేయని పప్పులా చప్పగా ఉంటుంది. జీవితం పండాలంటే చదువుకుంటూ చదువులలోని మర్మమును ఎఱగాలి. ఎఱుకలవాని ఎఱుక కలిగించుకోగలగాలి.

శుభం భూయాత్!
************

విష్ణుమాయ

రచయితలకు పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి?
తెలుసుకోవాలని తెగ కుతూహలం నాకు!
అవును నేనొక రచయితనని అనుమానం నాకు
కవిననీ భ్రమ; పేరు ప్రఖ్యాతులు కాదు కానీ

కనీసం కొందరు విమర్శకులైనా నన్ను సాహితీ కర్తగా
లెక్కేస్తారా అని అనుమానం నాకు; ఆశ కూడాను
పెద్దలెందరి సాహిత్యాలో చదివాను, ఆస్వాదించాను
ఆనందించాను; కొందరి కవిత్వపు నిగ్గులూ తీసాను;

ఏది రచయితలకు ప్రాచుర్యం తెస్తుందో తెలియలేదు;
కించిత్ ఈర్ష్య నన్ను ముప్పిరిగొని అలజడి కలిగిస్తోంది
నాకు ప్రాచుర్యం అక్కర్లేదు కాని ఈ నాటి సాహితీ
లబ్ధప్రతిష్టులకు పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయా

అని తెలుసుకోవాలని, తెగ హైరానా పడకుండా తెలిస్తే
బాగుండునని ఈప్సితము; నా రచనలతో కోటీశ్వరుడను
అవ్వనని ఖాయంగా తెలుసు; వేలు ఖర్చుపెట్టి నా కవితా
సంపుటం అచ్చు వేయించుకోవడానికి ముందే మర్మం

విశదమైతే విశాలమైన విశ్వంలోనికి నా సాహిత్యాన్ని
వదిలే ముందే తత్త్వం తెలిస్తే బాగుండును; వృథా ఖర్చు
పెట్టనవసరం ఉండదు; ఆ డబ్బులతో ఒక మంచి స్మార్ట్
ఫోన్ కొనుక్కోవచ్చు; లేదా ఆహ్లాదకరమైన ప్రదేశానికి

విహారయాత్రకు వెళ్లవచ్చు; బాహుబలివి వంద టికెట్లను
కొని స్నేహితులతో పార్టీ చేసుకోవచ్చు; ఏదో యాగానికో
అనాథాశ్రమానికో చందా ఇచ్చి పుణ్యం పురుషార్ధం
సంపాదించకోవచ్చు; ఎందుకో సాహితీకారుడిగా

నలుగురికీ తెలవాలనే ఆశ; అంతా విష్ణుమాయ;
తెలిసి తెలిసీ ఈ భగవన్మాయలో చిక్కుకోవడం
రచయితననిపించుకోవాలనే తపన తాపం విధి
విలాసము; మనస్తత్వ గారడీ మానసిక వైక్లవ్యము