Thursday, April 6, 2017

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మొదటి రెండు భాగములు

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర

కాకినాడ-భావనగర్ వారానికోసారి వెళ్లే రైలు వేసినప్పటి నుంచీ నాకు ఆ రైలు మీద భావనగర్ వెళ్లి రావాలనే కోరిక ఉదయించింది. ఎందుకో తెలియదు. అది అంతే. నాకు ఇలాంటి కోరికలే కలుగుతాయి. ఇతరులకు నవ్వు పుట్టించ
వచ్చు. చిన్నప్పటి నుంచి నాకు రైలు ప్రయాణం, రైళ్ళను గురించి తెలుసుకోవడం ఇష్టం.

మా నాన్నగారు మలకపల్లి, వేగేశ్వరపురం లలో పనిచేస్తున్నప్పుడు బస్ మీద నిడదవోలు వచ్చి మా ఊరు భీమవరం వెళ్ళడానికి రైలు ఎక్కేవాళ్ళం. అప్పుడు అన్నీ పాసింజర్ రైళ్ళు. క్వార్టర్లీ, హాఫియర్లీ, వేసంకాలం శలవలకు భీమవరం వచ్చి శలవలు గడిపి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అలా ప్రతి శలవలకు భీమవరం వచ్చి రోజూ ఓ సినిమా చూసినట్టు చూసే వాళ్ళం. ఎనిమిది టాకీసులుండేవి.

ఆ ప్రయాణాల్లో రైళ్ళ మీద ఆసక్తి కలిగింది. మా నాన్నగారు రైలు టైం టేబిల్ కొనేవారు. దాన్ని నేను బట్టీ పెట్టేవాడిని అంటే అతిశయోక్తి కాదు. ఏ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుంది, ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది, ఆ స్టేషన్ల గురించి చదివేవాడిని. అప్పుడు ప్రతి స్టేషన్ పేరు పక్కన కొన్ని గుర్తులు పెట్టేవారు. ఆ స్టేషన్లో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి ఆ గుర్తులు తెలిపేవి. త్రిభుజం ఉంటే కూలింగ్ వాటర్ దొరుకుతుందని, చతురస్రం ఉంటే రిటైరింగ్ రూమ్లు
ఉన్నాయని (సరిగ్గా జ్ఞాపకం లేదు), bk అని ఉంటే బుక్ స్టాల్ ఉందని, శాఖాహార, మాంసాహార భోజనశాలలకు
మరియొక గుర్తు, జం. అంటే జంక్షన్ ఇలా ప్రతి స్టేషన్ వివరం ఉండేది. అవన్నీ చదివి గుర్తు పెట్టుకునే వాణ్ణి.
అలా నా రైల్వే పరిజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించింది​.

ఇంతకీ మేము భావనగర్ ఆ రైలులో వెళ్లలేదు. బొంబాయి నుంచి బాంద్రా టెర్మినస్-భావనగర్ టెర్మినస్ రైలులో వెళ్ళాము. మా అబ్బాయి బొంబాయిలో ఉంటాడు. వాడే మంచి హోటల్లో రెండు రోజులకి రూమ్ బుక్ చేశాడు. మేము సోమనాథ్ వెళ్లినప్పుడు లాగే నేను ఆన్ లైన్ లో రానూ పోనూ టిక్కెట్లు నాకు, మా ఆవిడకి​ బుక్ చేసికున్నాను. ఈమధ్య నేను నేర్చుకున్న విద్య ఇది.

మా భీమవరానికి రెండు కిలోమీటర్లలో పెదమిరం అనే ఊరు ఉంది. అక్కడ మొదటి జైన తీర్థంకరులైన ఆదినాథుని ఆలయం ఉంది. అక్కడికి​అప్పుడప్పుడు వెళుతూ ఉంటాము. ఆ వెళ్ళడాలలో భావనగర్ కి 60 కిలోమీటర్ల దూరంలో పాలీతానా అనే ప్రదేశంలో ఆదినాథుని జైన మందిరం ఉందని తెలిసింది. దానిని చూడాలనిపించింది. మొన్న సోమనాథ్ వెళుతున్నప్పుడు తోటి ప్రయాణీకుల మాటల్లో భావనగర్ పక్కనే అరేబియా సముద్ర తీరంలో ఒక శివాలయం ఉందని అది సముద్రం ఆటుపోట్లకు కనిపించి, మళ్ళీ సముద్రంలో మునిగిపోతుందని విన్నాము. ఇవి చూడటానికి బొంబాయి నుంచి భావనగర్ బయలుదేరాము.


భారత దేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. మరెన్నో మతాలకు మెట్టినిల్లు. ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ, జైన, చార్వాక, వైష్ణవ, శైవ, వీర వైష్ణవ, వీర శైవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, సుబ్రహ్మణ్య మతములుగ పరిణమించి, పరిఢవిల్లిన తత్త్వమయ సమన్వయ, సామరస్య భూమి భారత దేశం. జొరాష్ట్రియన్ -పార్శీ, ఇస్లాం, క్రైస్తవ, యూదు మతములకు మెట్టినిల్లు.

మతం మత్తుమందని ఉద్ఘాటించి, తానే ఒక మతంగా మారిపోయిన కమ్యూనిజము, నక్సలిజం, రేషనలిజము, దళిత, స్త్రీవాద, వెనుకబడిన కులాల,జాతుల,వర్గవాద, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్, ఇలా సాంఘిక విప్లవకారులకు, మరెన్నో కుల, జాతి, వర్గ, ప్రాంతీయ వాదముల భూయిష్ఠమైన నాస్తికత్వము, కొండొకచో అస్తిత్వములకు, ఇలాగే ఎన్నెన్నో మతాలకు, ఇజాలకు, వర్గ వాదాలకూ నిలయం భారతదేశం.

భారతీయ తత్త్వ జ్ఞానము, సంస్కృతి ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ జైన చార్వాక వైష్ణవ శైవ వీర వైష్ణవ వీర శైవ శాక్తేయ సౌర గాణాపత్య సుబ్రహ్మణ్య మతములుగ, పైన నుడివిన ఆస్తిక, నాస్తిక వాదములుగ పరిణమించి, సాంఘిక సంక్షేమ కాంక్షులైన విప్లవకారులకు, కవులకు, రచయితలకు, వివిధ లలితకళా నిపుణులకు ఆలవాలమైంది.
 
క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుంచి ఇప్పటి దాకా ఈ అన్ని వైరుధ్యభూయిష్ఠమైన తత్త్వాలు, మతాలు, వాదాలు, విప్లవాలు పరస్పరం సహకరించుకుంటూ, కలహించు కుంటూ భారతదేశంలో సహజీవనం చేస్తున్నాయి, వివాహం బంధంలో ఇరుక్కుపోయిన భార్యాభర్తల్లా, ఇష్టం లేకపోయినా, కష్టమైనా.

ఉపనిషత్తుల కాలం నుంచి నేటిదాకా పయనించిన భారతీయుల నాగరికత సంస్కృతి, భారతీయుల జీవితం, జీవన విధానం ఎన్నో ఒడిదుడుకులకి, మార్పులకు లోనయ్యాయి. ఏ ప్రభువుకు ఏ మతం, తత్త్వం, సంస్కృతి ఇష్టమైతే వాటికి ఆలంబన లభించింది. ఇతర మతాలు, తత్త్వాలు, సంస్కృతులు ప్రజాబలంతో నిలిచే ఉన్నాయి. దానికి తోడు ప్రభువులు తామే మతాన్ని, తత్త్వాన్ని అభిమానించి, ఆదరించినా, వీలైనంత వరకు సర్వమత సమానత్వాన్నిఆదరించారు. రాజకీయంగా, ఇతర కారణాల వల్ల ఇలా జరిగింది.

తూర్పుచాళుక్యులను చోళులు ఓడించినా, అప్పటి రాజనీతి ప్రకారం సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. అలా రాజరాజచోళుడు తూర్పు చాళుక్య వేంగీ రాజైన విమలాదిత్యునికి తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకే రాజరాజనరేంద్రుడు జన్మించాడు. చోళులు హిందూ మతావలంబులు. కానీ అప్పటికీ, అప్పటికే భారత దేశం అంతటా బౌద్ధ జైనాలు వ్యాపించి ఉన్నాయి. వాటి ఆరామాలూ ఎన్నో చోట్ల ఉన్నాయి. ప్రజల్లోనూ ఆ మతావలంబకులున్నారు. అవీ సజీవంగానే ఉన్నాయి.

తూర్పు పశ్చిమ కోస్తాలలో అప్పటికే నిర్మించబడిన ఆరామాలలో ఆ మతాలు తమ తమ మతానుసరణం, వ్యాప్తిలలో అగ్రగణ్యంగానే ఉన్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాలలో బౌద్ధ జైనాలు పరిఢవల్లాయి. ఎన్నో ఆలయాలు, ఆరామాలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రముఖమైనది పాలీతానా దగ్గరి ఆదినాథుని జైనాలయం.

ఆదినాథునికి ఆలయములు అరుదు.
 
కర్ణాటక లోని శ్రావణ బెళగొళ లోని బాహుబలి దిగంబర విగ్రహం ఎంతో ఎత్తైనదీ, శిల్పకళా చమత్కృతిలో ఎన్నికైనది. శ్రావణ బెళగొళ దర్శనీయ స్థలాల్లో ​ఒకటి. శ్రావణ బెళగొళ (జైనాలయం), హళేబీడు (శివాలయం), బేలూరు (వైష్ణవాలయం) కర్ణాటకలో హసన్ దగ్గర పక్క పక్కనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో నేను వీటిని దర్శించాను. ఎంతో ఆనందించాను కూడా.
 
తమిళ నాట చోళుల ప్రాబల్యం, ప్రాభవం ఉన్న సమయంలోనే కడలూరు - పాండిచ్చేరి పక్కనే- లో శ్రమణ మఠములుండేవి. జైనులను శ్రమణులనీ అంటారు.

భగవంతుని కొలుచు విధము; The Science of Mind and self

భగవంతుని కొలుచు విధము

భక్తుని భగవంతుని అనుబంధము అనిర్వచనీయము. భగవంతుని కొలిచే వారు మాత్రము పలు విధములు.
కృష్ణభగవానుడే భగవద్గీతలో భక్తులని ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, మోక్షకాములుగా తారతమ్యం చెప్పాడు.
ఆర్తి, కష్టాల నుంచి తప్పించమని కొందరు, ధనము, సంపత్తి, ఆస్తుల కోసం కొందరు, జ్ఞాన సముపార్జన కోసం కొందరు, మోక్షం కోసం కొందరు భగవంతుని ప్రార్ధిస్తారు.

వారి వారి అర్హతలను గమనించి ఆయన అలా అలా కరుణిస్తాడు.

భగవంతుని దగ్గరకు వెళ్ళేసరికి మనం అహంకార, అహంభావములను, వ్యక్తిత్వాన్ని మరచి నిర్మల మనస్కులమై, వినమ్రతతో ఉండాలి. మన లౌకిక జీవన అంతస్తులను, ఇతర దర్పములను, బడాయిని, భేషజాన్ని, స్వాతిశయాన్ని పక్కకు పెట్టాలి.

భగవత్ సన్నిధిలో మన ప్రార్ధనలుండవచ్చు. వ్యక్తిగా మనం అదృశ్యమైపోవాలి. అప్పుడే ఆ జగన్నాథునితో
అనుసంధానం ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితిలో మనం పరమేశ్వరుని ప్రార్థించాలి. అర్ధించాలి. భగవదనుసంధానం భగవదనుగ్రహం వల్ల సాధ్యపడుతుంది.

మన ప్రార్థనంతా భగవదనుసంధానం కోసమే. అనుగ్రహించడం ఆయన చిత్తం.

భగవంతుణ్ణి, ఆయన అనుగ్రహాన్ని, మనం ఆడంబరం తోటి, దర్పసహిత పూజాపునస్కారములతోటి కొనలేము.
మన నిర్మలాంతఃకరణము నచ్చినట్టు ఆయనకి మన మరే అర్చనా విధానము, పూజలు​, అభిషేకాలు, చేయడం, ఇటువంటివి చేయించడం, తీర్థములలో ములగడం నచ్చవు. సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సకలాధినేత అయిన పరమేశ్వరుని దగ్గర మన యుక్తులు పనికిరావు.

ఆయన్ని ఏమార్చడం, మోసం చేయడం, "లంచమిచ్చి" ఆకట్టుకునే ప్రయత్నం చేయడం పసితనము, అమాయకత్వము, అజ్ఞానం, అతి తెలివితేటలు.

తేట మనసుతొ తత్త్వజ్ఞుని శరణు వేడడం, ప్రపత్తితో శరణాగతినొందడం తెలివైన పని. పెద్ద మనిషి తరహా.
సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ లయ బద్దంగా తన కరుణాదృష్టి మనపై ప్రసరిస్తాడు. ఆయన జ్ఞాని. ప్రజ్ఞానఘనుడు. సకలవేదాంత సంసిద్ధ సుతత్త్వుడు.

ఆయన మన తల్లి. మన తండ్రి, గురువు, స్నేహితుడు, స్వామి, బంధువు, మన దైవము.

ఆయన నామాన్ని సతతం స్మరిస్తూ విద్యుక్త ధర్మములను నిర్వర్తించడమే మన బాధ్యత. ఫలములనొసగడం ఆయన విద్యుక్త ధర్మము.

మోక్షః విష్ణు ప్రసాదేన వినా న లభ్యతే.

భక్తి ముక్తి కారకుడైన, వాటి ఫలదాయకుడైన పరంధాముని వినయపూర్వకంగా కొలిస్తే మనం అడగకుండానే ఆ శ్రియఃపతి, శ్రీగౌరీ సతి పతికి అద్వైతుడైన శ్రీమన్నారాయణుడు మన కోరికలు తీరుస్తాడు. మన యోగ, క్షేమములను వహిస్తాడు.

ఎటొచ్చీ మనం హృదయపూర్వకంగా నమ్మాలి.
దేవదేవునికి హృదయం అర్పించి మనసులో ఆయన సన్నిధిని అనుభవించాలి.
అప్పుడు మన కోరికలన్నీ తీరుతాయి. మన మనుగడ సుఖశాంతిప్రదమౌతుంది. పండుతుంది.

సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
ఏతత్ సర్వమ్ శ్రీపరమేశ్వరార్పణమస్తు!

************

The Science of Mind and Self

Mind is particle in a box- restricted and hindered in operation. Self is continuous issue of infrasonic waves of frequency between 3 Hz~10Hz reflected as brain waves.

Mind is modulated Self and is not free and is hindered by cognition and communication of object-energy modulated psychic energy.

Self is demodulated Mind and is free flow of object-energy free psychic energy pulse series..

Tuesday, April 4, 2017

కీ-బోర్డు, (Key-board); Marriages, మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః ,

కీ-బోర్డు

ఎవరు చెప్పారు?
కత్తికన్నా కలము పదునైనదని;
కీ-బోర్డు అన్నిటికన్నా పదునైనది

Marriages

Marriages fail because there is no ideal spouse. Every one is real with associated merits and demerits. Those who intend to enter into wedlock must know that marriage gives a little to you and takes a lot of you.

One must be ready to adjust,compromise, respect, show affection for near and dear who became nearer because of marriage, sacrifice for the sake of husband and offspring and in-laws, absorb ego in love for family members, be a good host for near and dear, be a sink for the disturbances of spouse and offspring, become bearers and custodians of and impart culture and traditions by practice and mouldig offspring.

Marriage is responsibility and duty as spouse, in-laws, parents, relations. Marriage is less pleasure and frolic, and more service to family and society.

If one is not ready for these, one experiences disappointment and do things leading to divorce. Especially, marriages of celebrities are short-lived because, marriage is less glamorous and more care.

Marriage is not I; marriage is we.

Better one enters wedlock with these things mind.

***********

మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః

కష్టము, సుఖము మనసునకు సంబంధించినవి.

భౌతికంగా ఏమి, ఉన్నా, లేకున్నా పట్టక, పట్టించుకోకుండా, మనసు తన ధోరణిలో తను సుఖపడుతుంది. దుఃఖపడుతుంది. పొంగుతుంది; కుంగుతుంది. ఉన్నదాన్ని బట్టి కాకుండా, అనుకున్నదాన్ని
బట్టి, అనిపించినదాన్ని బట్టీ ఎగురుతుంది. కుదేలు అవుతుంది.

ఇష్టమైన చోట ఎంత బరువునైనా మోస్తుంది. ఇష్టం లేనిచోట పూచిక పుల్లని కూడా బరువంటుంది.
మనసు షోకులు ఒక్కో సారి జోకులనిపిస్తాయి. మనసు లోతులు, సౌకుమార్యం, దృఢత్వం, ప్రౌఢత్వం, రాగం, అనురాగం, విరాగం, విరామం, వేదన, వ్యథ, ఆసక్తి, అనాసక్తి, కారుణ్యం, క్రూరత్వం, నాణేనికి రెండు వైపులలా
ఉంటాయి.

మనసే బంధం ఏర్పరుస్తుంది. మనసే బంధాన్ని తెంచుతుంది. మనసే బంధాన్ని అధిగమిస్తుంది. మనసే చంచలంగా ఉంటుంది. మనసే ధ్యాన గత అవుతుంది.

మనసు తనంత తానే విరామం, రామం, అనుభవిస్తుంది.

మనసు నిర్మలంగా ఉండడమే శాంతి; ఆనందం; మౌనం; మోక్షం; నిర్వాణం. మనిషి మానసిక ప్రశాంతత ప్రయత్నించి పొందగలిగితే అది చాలా ఎన్నికైన, మన్నికైన సాఫల్యం. తామరాకు మీద నీటి బొట్టు వలె నిమిత్త
మాత్రంగా విధ్యుక్త ధర్మములను నిర్వర్తించ గలిగితే ఆ మనిషికి అతని మనసు ఎంతో స్నేహంగా సహకారం
అందించిందని అర్థం. ఆ వ్యక్తి ధన్యజీవి.

మనసు మనకు సేవకుడు, యజమాని కూడా. మలచుకోవలసిన బాధ్యత మనది.
 

Who is an author?; జామ్ నగర్ లో జామకాయలుండవు;

Who is an author?

In these days of plenty, it becomes not easy to define or point out who an author is.
Normally an author is the one who writes creatively. He naturally must be proficient in the language in which he desires to write. He must also have been well-read. He must be both an intellectual and scholar. In addition if he wants to be a poet, one must be rich in imagination.

He is also expected to be an aesthetic person and a person of warmth. He must be compassionate and be objective if he wants to be in addition an essayist. And​ must be able to grasp between the lines if he wants to be a journalist.

He should be spiritual and need not be a theist believing in religion and rituals. It would be great if he can respect fellow human beings and observe and deal with them transcending
his and their religious, ideological, regional, sub-cultural affiliations.

But the above definition and description of an author seems to be ideal. In India many presently are wedded to an ism and are lacking objectivity and are becoming more and more parrots in the cage of their chosen ism. And are becoming bitter critics of any written thing other than their​ favorite ism. They are also unnecessarily vehemently downgrading ancient Indian thought civilization and culture.

And even though many are writing, they are not having proper avenues to present their work. The obsession with printed work is playing a major role in calling one an author or poet. But improvement in technology has provided avenues on the internet to post one's creation. But all award presentations are confined only to printed works.

And one is not an author unless he published printed work. Authors are made or unmade by their acquaintances with professional critics - who are biased towards the ism of their affiliation.
It has become very difficult to be called an author or is recognized as one. Domination of isms and critics' obsession with them and prominence given to printed works only are limiting the nomenclature of author to a select few. Mere ability to create literary works is not making one an author. And conversely affiliation to isms and friendships with committed critics and printing one's work are determining who is to be conferred the "title" of author.

And the old definition of "naanrushihi kurute kaavyam - only seers and sages can compose quality literature - dictum is completely given a go by both by current "recognized" authors and critics.
Thus it has become privilege of limited writers to be recognized and called an author. And most writers are creating sans being called an author.

***********
 జామ్ నగర్ - జామకాయలు

జామ్ నగర్ లో జామకాయలుండవు
రాజ్ కోట్ లోని రాజులుండరు
అమరావతిలో దేవతలుండరు
ఆంధ్ర దేశమున తెలుగుండదు

భారతదేశమున భజనపరులుందురు
రాజకీయులు అందినకాడికి నొక్కుకుందురు
మేధావులు వాదముల మేయుచుందురు
అల్పులు ఆడంబరముగ పలుకుచుందురు

మమతలు సమతలు లేని మానవులుందురు
కవితలు కావ్యములు చదవలేని పాఠకులుందురు
కతలు ఏవో రాతలు చదువు లోకులుందురు
వెతలు వేదనలుండి రాతలు బాగులేని జనులుందురు


అచటనచట ఇలా వాపోవు జనులుందురు.
వారికి ఉపశమనము కలిగించు ఆప్తులుందురు

కండువాలు; శ్రేష్టము - శుభము; Drunk Driving and State Governments; Human life - river ; Immigration


కండువాలు
కండువాలు మార్చిన మాత్రమున ప్రజలకేమి ఒరుగును?
నొక్కుకొనుట తప్ప మరేమీ తెలియని, కక్కుర్తి
కఠినాత్ముల హృదయమే రీతిని కరుగును? ఏ
పథకమునైననూ నొల్లుకొనుటకు అవకాశమనుకొను

ప్రతినిధులకు శాసనములు చేయుటన్ళ ఏమి తెలియును?
పరిపాలనన్న మింగుట కాదన్న ఎఱుకేది? ఆ మనుషులే
ఓ కండువా వేయుదురు; గిట్టుబాటు జరుగువరకు
కండువాలు మార్చుచు జనుల ఏమార్చుచునే ఉందురు;

*************

శ్రేష్టము - శుభము

ప్రేమలేమిటో? పెళ్ళిళ్ళేమిటో?
నిజాయితీ లేక ఏదీ నిలవదు

పాశమేమిటో? గాఢమైన అనురక్తి ఏమిటో?
లోతుగా రీతిగా దృఢంగా లేక నిండుకొనును

రాగమేమిటో? సరాగమేమిటో?
సమముగ పెనవేసుకున్న గాని పండవు

స్నేహమేమిటో? పరమునిపై భక్తి ఏమిటో?
అహంకార మమకార వ్యక్తిత్వ శూన్యతన ఫలించును

పాండిత్యమేమో? తత్త్వశాస్త్ర విశారదతలేమో?
శ్రద్ధ అకుంఠిత దీక్ష పరిశీలన వినయము లేక అందగించవు

ప్రతి గుణమునకొక ప్రాతినిధ్యము
ప్రతి అవగాహనకొక లక్షణము
ప్రతి ప్రాతినిధ్యమునకొక బాధ్యత
మనీషులకివి ఆభరణములు

సామాన్యులకు అహంకార ప్రచోదనములు
గర్వాంధకారమున చూపు పోగొట్టు దుర్లక్షణములు
ఎవరికీ ఉపయోగించని ఉత్తుత్తి ఊపులు
అంతయు పరంధాముని కరుణనుకొన్న శ్రేష్టము శుభము

**************

Drunk Driving and State Governments

It is with heavy and disturbed heart that the news item of state governments are trying to sneak through Apex Court's ruling to curb liquor vending within 500 meters of highways is received. State governments do want liquor money over safety and well-being of citizens and drivers is something not tenable with the welfare of citizens.

Though state governments need liquor money for implementing the "welfare" measures and freebies promised during electioneering, their funds garnered by non-implementation of prohibition should be sufficient for their voter-centric "promises".

These inefficient leaders cannot administer and do not keep aside such that others can be at the helm of affairs. But they want to rule in a hereditary fashion perpetuating their family rule and make money by being in power. No other thing is of interest to them.

They do not know how to rule for the progress and advancement of citizens and nation. Their vision is narrow and limited. Their vain promises and vain talks or boastings about their rule and corruption of opposition leaders may not lead them and state far.

Let the citizens be aware of this reality; transcending their selfish attitude of being pampered by politicians and aspiring for special treatment from governments undermining the development, welfare and well-being of all citizens.
************

 Human life is like a river; in the beginning as a small spring, takes course joined by streams and rivulets, goes through hills, falls, passes between hills in valleys, in plains, when "obstructions (dams)" constructed becomes useful for irrigation and produces power and slowly meanders to merge in the sea at the end of the course. Life is a course of river.
*********
Immigration
 
White people from England are immigrants to the United States, Australia, New Zealand. Now they own respective countries. New people are now branded immigrants and white people think these new immigrants are threat to them, their jobs and living conditions.

Immigration is an age old practice. It happened in all societies and nations. The point is who owns a nation and who are the immigrants.

Especially in India political leaders are playing politics on immigration and immigrants. Siva Sena, DMK, TRS, and rest of leaders of other provinces feel as if they own their respective territories and amass money and power playing politics against "immigrants" from within the country. Livelihood problems exist everywhere. 

If you are allowed to own territories and fool people and just not do anything except continue fomenting hatred and voters side it, the voters are the losers. The politicians happily highjack the regional sentiment of the "natives" and perpetuate their family rule on the hapless citizens. The citizens bear it without even murmuring. The same is true in caste and community politics as well as faith politics.

Politics on human immigration and divisions cum affiliations in the same country shows the emotional disintegration among citizens. And it becomes a ridiculous and laughing matter to claim that we are all Indians.