Thursday, October 27, 2016

భారతదేశంలో కులాల నియంతృత్వం: కవులు: రమ్య చిత్రముల గని

భారతదేశంలో కులాల నియంతృత్వం

భారత దేశంలో మేధావులమనకున్న ప్రతి వారు బ్రాహ్మణులనీ, బ్రాహ్మణ మతాన్ని నిరంతరంగా ఆడిపోసుకుంటూంటారు. ఈ ఆడిపోసుకోవడానికి అడ్డు, , ఆపూ, అంతూ లేవు. ఇప్పుడు మనం అనుభవించే అన్ని ఛిద్రాలకూ వీరు బ్రాహ్మణులనే బాధ్యులని చేస్తూంటారు. వారి అనుయాయులు ఇది వాస్తవమే కదా అనుకుంటారు. అంటారు కూడా. బ్రాహ్మణులు తప్ప మిగతా ఎవరూ సంఘానికి ఏమీ చెడు చెయ్యడం లేదంటారు.

ఈ సందర్భంలో ప్రస్తుతపు కొన్ని వాస్తవాలను, న్యాయరహిత ప్రవర్తనలను గమనిద్దాం.

ప్రభుత్వ భూములను, స్థలాలను అక్రమంగా ఆక్రమించి చిన్న చిన్న వ్యాపారాలనుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారముల దాకా చేస్తున్న ఆసాములు ఎవరు? బ్రాహ్మణులా?

కాల్ మనీ సంటర్లు నడుపుతూ జనాలని పీల్చి పిప్పి చేస్తున్నదెవరు? దందాలు చేస్తూ కాఫ్ పంచాయత్ లు నిర్వహిస్తున్నదెవరు? కులాల పేరుతో సృఘాలేర్పరచుకొని మనోళ్ళులంటూ అన్ని అక్రమాలకూ లోపాయికారీ సాయాలు చేసుకుంటున్నదెవరు?

సంఘంలో రౌడీలు, గూండాలు, అసాంఘిక శక్తులు ఎవరు?

విద్యాలయములను, వైద్యశాలలను ఫక్తు వ్యాపార కేంద్రాలుగా మార్చి నాగరికతకు, సంస్కృతికి, మారుపేరయిన విద్యాదానాన్ని, వైద్యసహాయాన్ని కార్పొరేట్ స్థాయిలో వాణిజ్యముగా మార్చి అందరు ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తూ ప్రజలను డబ్బుకాసే చెట్లుగా చేసి వారిని ఉసూరుమనిపిస్తున్నదెవరు?

ఏ కులాన్ని అయితే బ్రాహ్మణులొక్కరే సృష్టించారని‌ తిడుతూంటారో ఆ కులాన్నే ఆధారం చేసికొని అర్హతతో నిమిత్తం లేకుండా ఒక్క ఆ కులం ఆసరాతోనే చదువులు, స్కాలర్షిప్పులు, ఉగ్యోగములు సంపాదిస్తున్నదెవరు?
రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్యమును ఇంత దారుణంగా అవినీతిమయంగా చేసి, సంఘవిద్రోహ శక్తులతో అంటకాగి సంఘాన్ని అనేక అగచాట్లకు గురి చేస్తున్నది ఎవరు? వంశపారంపర్యముగా పార్టీని శాసిస్తూ అధికారాన్ని అనుభవిస్తూ పాలన ఏమీ తెలియక, పాలించడం చేతకాక కబుర్లతో కాలక్షేపం చేస్తున్నదెవరు? అక్రమంగా ఆర్జిస్తున్నది ఎవరు? నల్లధనమును విపరీతముగా పోగేస్తున్నదెవరు? భూస్వామ్య, పెత్తందారీ మనస్తత్త్వాలను చూపుతున్నదెవరు? ఆ పెత్తందారు తత్త్వంతో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని ఆనువంశిక పాలనలలోనికి నెట్టుతున్నదెవరు? ఎన్నో వ్యాపార, వ్యవహారాలతో సఘంలోని అన్ని వృత్తులపై, ఉద్యోగాలపై అజమాయిషీ చలాయిస్తున్నదెవరు?

ప్రతి అడుగులో, ప్రతి విషయంలో, ప్రతిక్షణమూ కులగజ్జి చూపుతూ ఈ కుల, జాతి, ప్రాంతీయ పెడధోరణులను ప్రజలలో పెంచి పోషిస్తున్నదెవరు? అలాచేస్తూ విభేదాలను మాసిపోకుండా చేస్తున్నదెవరు?
కులాలవారీగా, ప్రాంతాలవారీగా పౌరులను విడదీసి పబ్బం గడుపుకుంటున్నదెవరు?

ఈ విషయాలపై గణాంక వివరాలు సేకరించి నిజం తెలుసుకొని, ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యమున్న నాయకులు, మేధావులు, తర్కవాదులు, సామాజిక న్యాయవాదులు ఎందరు? దేశానికీ, సంఘానికి చెడు, కీడు చేస్తున్నదెవరు? ఉష్ట్రపక్షి చందముగా వ్యవహరిస్తున్నది ఎవరు?

ఏదో చెవిని పడినది నిజమని బుకాయిస్తూ వాస్తవంలో జరుగుతున్న అన్యాయములకు కారణమెవరో తెలిసీ కిమ్మనక, ప్రతి ఇబ్బందికి బ్రాహ్మణులను బాధ్యులని చేసే దుష్టసంప్రదాయం సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించదు.సామాజిక న్యాయాన్ని ఏర్పరచ లేదు కూడా.

నిజాన్ని చూడక అకారణంగా ద్వేష, విద్వేషములను అపోహలతో కలిగించుకొని, ఊపిరిగా చేసికొని వ్యాసములు వ్రాసినా, ప్రసంగములను చేసినా వృథా కాలయాపనము, ప్రయాస తప్ప ఎవరికీ ప్రయోజనమును కలిగించదు.
ఇన్ని విధ్వంసాలను, అనాగరికతను, అరాచకాన్ని, కుసంస్కారాన్ని సంఘానికి అలవాటు చేసింది ఎవరు? ఈ పై ఇక్కట్లకు, దౌర్భాగ్యానికి కారణమైనవారెవరు?

తమ తమ మిథ్యా లోకములలో విహరిస్తూ ఈ మేధావులు, రేషనలిష్ట్లు, సామాజిక న్యాయవాదులు వాస్తవాన్ని‌ గమనించక బ్రాహ్మణులను ఆడిపోసుకోవడం వల్ల సామాజిక న్యాయమూ ఏర్పడదు, ప్రజల ఇబ్బందులూ తొలగవు; పౌరులలో విభజనలు, విభేదాలు మాత్రము తామర తంపరగా పెరిగి సంఘాన్ని అతలాకుతలం చేస్తాయి. చేస్తున్నాయి. ఇది తప్ప మరే ప్రయోజనము సిద్ధించదు.

కుల మత ప్రాంతీయ తేడాలు లేక అందరు పౌరులూ అలమటిస్తూనే ఉంటారు. బ్రాహ్మణులను ఎంత నిందించినా ఈ కష్టనష్టాలు తీరవు. రోగము ఒకటైతే మందు ఇంకోటి వేస్తే రోగము నయము కాదు కదా! ఆరోగ్యము కలగదు కదా!

 **********

 కవులు

ఎందఱో కవితలల్లుతారు కొందఱే
కవులుగా గుర్తింపబడతారు; కారణం?

కీర్తిప్రతిష్టలకు కవిత్వంలో పసతో పాటు
సంబంధ బాంధవ్యముల నెఱపడం, అదృష్టం
అవసరం; పేరు వచ్చినా రాకపోయినా నది
ప్రవహించడం ఆపదు; మేఘసముదాయం
వర్షించుట ఆపదు; తరువు ఫలములందించుట
ఆపదు; కవి తనకు సహజమైన కవన సృష్టి ఆపడు,

*********

రమ్య చిత్రముల గని
బాపు (శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ)
– డా. వారణాసి రామబ్రహ్మం

రమ్య చిత్రముల గని; రమణీయ చలన చిత్రముల ఖని;
చిత్రముగ చిత్రించు; బొమ్మల, తెరపై ఆడు బొమ్మల;
తెలుగువారి హృదయముల తన రేఖా చిత్రముల
వేసి వేసి అలసి సొలసిన చిత్ర కారుడు, దర్శకుడు;

హొయలొలికించు బొమ్మల, ముద్దు గుమ్మలకు ప్రాణములు
పోసిన చిత్ర బ్రహ్మ, కదలిపోయెను తిరిగి రాని లోకములకు;
ప్రాణమిత్రుడు రమణను కలియుటకై; చిరంజీవులు వారు
వారి జత సృష్టించిన గీతలందు, జీవన రేఖలందు, చలన చిత్రములందు;

ధన్య జీవులు వారు; నిలచియుందురు తెలుగువారి
మనసులందు దివ్యులై, మధురిమలొలికించుచు అమరులై
 

Thursday, October 20, 2016

అంతుబట్టని స్త్రీ వాదుల ఆంతర్యం; తోక లేని పశువులు; The limitations of Logic



అంతుబట్టని స్త్రీ వాదుల ఆంతర్యం

తల్లిదండ్రులని సాకనివ్వని భార్యకు విడాకులివ్వచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు బాధపడుతూ, ఇది పితృస్వామ్య యుగపు బాదరబందీని స్త్రీ పై రుద్దడం అనే వ్యాఖ్యలు‌ చదివి స్త్రీ పురుష విద్వేషాలు ఏ స్థాయికి చేరాయో అర్థమైంది.
అలా తోటి మనుషులకు అందే సాయంలో (ఆ సాయం పొందే‌ వారిలో ఒక స్త్రీ - తల్లి ఉన్నా) ఇది పితృస్వామ్య, పురుషస్వామ్య అహంకారం అనే స్త్రీ పురుషులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి.
మళ్ళీ ఈ వాదులే మదర్ థెరీసాను కీర్తిస్తారు. ఆమె చేసిన సేవలను డప్పుకొడతారు. ఒక స్త్రీ గాని, పురుషుడు గాని తమ ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తే దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వీలు కాదంటారు.
ఈ స్త్రీ వాదులను ఎలా అర్థం చేసుకోవాలో ?
************



ఎవరి పైన అయినను జాలి చూపుచూ మాటాడుట
అత్యంత సులభము; వారికి సాయము చేయు మనసు
ఉండుట అరుదు; జాలి చూపించిన మాత్రమున
జీవితములు బాగుపడవు; మన బడాయి బయటపడును
**********
బంగరు ఆభరణముల ధరించి ప్రకటనలలో అలరించు
అందమైన యువతులు ఆ ఆభరణముల యజమానురాళ్ళు
కారు; అవి వారి సొత్తు కాదు; నగల వ్యాపారి వాటి సొంత
దారుడు; అటులనే ఈ ప్రపంచమున మనము
అనుభవించు, మన జీవితములకు శోభనిచ్చు
ఐశ్వర్యములకు సొంతదారులము మనము కాము
భగవంతుని ప్రసాదమది; ఆయన ఆస్తి యది; ఆయనయే
సమస్త ఐశ్వర్యములకు యజమాని; మనకు ప్రదాత
**********
స్త్రీలు పురుషులు కలవక విడి విడిగా భావించుకొనుచు
ఒకరన్న ఒకరికి గిట్టక సహజీవనమును బంధములను
గాలికి వదలి ఒకరికొకరు ఏమి కాక, ఉద్యోగాలు చేయుట
మాత్రమే బతుకనుకొనుచు ఆత్మీయతల ఆప్యాయతల
త్రోసిరాజని స్వోత్కర్షతో, స్వ దురభిమానముతో అహం
భావములతో జీవనయానము చేయుట మానసిక రుగ్మత
 
గృహము లేక గృహిణి లేక లేవు సుఖ
సంతోషములు స్త్రీలకైన, పురుషులకైన
సంతానము లేక లేదు భావి తరము
సంఘమునకు లేరు భావి పౌరులు
సత్సంతానము కాని ఎడల దేశమునకు
బరువు ఆ ఆడ మగ; చదువు ఇంగితము
లేని మనుషులు తోక లేని పశువులు
***********
The Limitations of Logic


Logic is very sharp and most of the times need not necessarily lead us to the truth. Logic is indication of possessing incisive intellect. See the following example:

Gauss is a great mathematician. Once his teacher asked a question in their class. The question is "How many stars are there in the Universe?". And also added, if the answer is correct, he will ask the next question.

Gauss told some number.

The teacher asked, "how do you know?"

Gauss then said this is the second question sir!

Logically the answer is true because the teacher said if the answer is correct he will ask the nest question. And he asked the next question, "how do you know?". What ever might be the meaning of that question, because that is the second question, the answer gave by Gauss is to be correct logically.
And most of the times logic takes us somewhere and not necessarily leads towards the Truth.
We must not depend on mere logic to know the Truth. We must be able to discriminate. Then at least we know what is not Truth.

Tuesday, October 18, 2016

తాగుబోతులు, తిరుగుబోతులు; Celebrity adorationచ సంస్కరణ వాదులు; చదువు

తాగుబోతులు, తిరుగుబోతులు

తాగుబోతులకు, తిరుగుబోతులకు, గంజాయి సేవకులకు, అవినీతిపరులకు, వారి వారసులకు లభించే దానిలో రవంతైనా‌ సానుభూతి‌ పొరబాటు వల్లో గ్రహపాటు‌ వల్లో తప్పు చేసిన మంచి వానికి సమాజం చూపించదు.
మంచి వాడిని పదే పదే విమర్శించి మానసికంగా‌ చంపుతుంది.తప్పు చేసే వాడి ఎన్ని తప్పులనైనా కాచే సమాజం మంచివాని ఒక తప్పును కూడా క్షమించదు.

సంఘం మనుషులు పదే పదే తప్పులు చేసే వ్యసనపరులకు, దుష్టులు, దుర్మార్గులకు ఇచ్చే వెసులుబాటు మంచి వారికి అస్సలు ఈయదు. అంత క్రూరత్వం చూపిస్తుంది‌ మంచి వారిపై సంఘం.

మంచివాడంటే ఒక్క తప్పూ చేయకూడదు. చెడ్డ వాడు, వ్యసనపరుడు ఎన్ని అఘాయిత్యాలైనా, ఎన్ని సార్లైనా చేయవచ్చు. సంఘం పెద్ద మనసు చేసికొని భరిస్తుంది. క్షమిస్తుంది. అంతా వింత, వేలం వెఱ్ఱి.
 *********
Celebrity adoration

The adoration we show to cine artistes, the heroes and heroines, the cricketers, and such other entertainers is a mere attraction. This liking must end after some time; because, we must become heroes and heroines of our lives. We must become a celebrity so that others emulate us.
Entertainment always scores over enlightenment. When we actually feel for enlightenment, we end up becoming disciple of this guru or that swami, this swami or that ananda losing all our in-built intuition and commonsense.

If we take a bit more care, we ourselves can help us and also help our near and dear in matters of secular responsibilities, worldly attractions and how we have to save ourselves from them, spirituality, and many other happenings through the course of our life.

We must remain hero/heroine of our life. There is no need to ape or misguided by the glamorous life of the entertainers.

We need to go through the thoughts of many an intellectual, seer, scientist, philosopher and the like to build ourselves and our personality and individuality.

Let us know the inherent potential in us regarding all matters of life.

Let us be the masters, teachers and friends to our near and dear, so that they need not go here or there for peace of mind or counseling in spirituality.

We are Divine by nature.

*************

సంస్కరణ వాదులు

ఎవరిని వారు సంస్కరించుకుంటూంటే ఇతరులను సంస్కరించాలనే కండూతికి దూరమౌతారు. సంఘమూ బాగుపడుతుంది. శాంతి, సౌఖ్యములతో అందరూ జీవించవచ్చు. జీవించనీయవచ్చు కూడాను. తాము మారక మిగతా వాళ్ళని మార్చెయ్యాలనే తాపత్రయం అనారోగ్య ధోరణి. ఒక విధమైన మానసిక ఋగ్మత.
************

 చదువు

పంచతంత్రము, రామాయణము, మహాభారతము, మహా భాగవతము, జాతక కథలు, హితోపదేశము, గాథాసప్తశతి చదవకుండా విద్యాభ్యాసము పూర్తి చేస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు జీవితముపై అవగాహన కాని, జీవితములో వచ్చే వడి దుడుకులను తట్టుకుని, ఎదుర్కొని సంయమనముతో జీవించే నేర్పు గాని అలవడవు.

జీవితాన్ని చదవడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి, జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించి జాగరూకతతో జీవించడానికి సాయపడని చదువు వ్యర్థము. ఎంతో డబ్బు పోసి, ఉద్యోగార్ధము మాత్రమే చదివే "చదువు" చదవకపోయినా ఒక జీవికని ఏర్పరచుకొని జీవించవచ్చు.

అంత డబ్బు ఖర్చుపెట్టి చదివిన చదువు ఉద్యోగాన్ని తేలేక పోవడం, ఒక మనిషిగా తయారుచేయలేకపోవడం విచారించవలసిన విషయం. గాలిలో దీపం పెట్టి దేవుడు మీద భారం వేసే ఈ ధోరణి‌ యువతీయువకులకు ప్రయోజనకరం కాదు.

మనకు మనమే ఆలోచించుకొని ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. అలా చేయకపోతే విధిని నిందించుకుంటూ జీవికకు సరిపోని అరకొర సంపాదనలతో బ్రతుకు ఈడ్వాల్సి వస్తుంది.

ప్రాథమికమైన పై సాహిత్యము చదవక, తెలియక, అవగాహన చేసికొనక జీవించబూనడం సైక్రియాటిస్టులను పెంచి, పోషిస్తుంది. దారిద్ర్యాన్నీ అంటగడుతుంది.

మనిషికి ఇంగితం పెంచే చదువూ అవసరం. పైన ఉటంకించిన సాహిత్యంలో ఇంగితం పెరగడానికి కావలసిన సామగ్రి ఉంది. ఆ సామగ్రిని ఉపయోగించుకోవడం మనకు మేలు చేస్తుంది.

BJP becoming Congress; అందము: గో సంరక్షణ: Pecular rationalists of India

BJP becoming Congress

The BJP is unscrupulously following the caste politics of other national, regional caste-based parties. It seems it became obligatory and must for all political parties to talk about caste-wise reliefs, caste-wise pampering and talk only in the language of castes and their up-liftment with all associated warmth to win the elections. Bihar debacle forced BJP to talk the caste language abandoning its development plank.

Reality makes all political parties and politicians to cater to vote-banks. The future of India is blank and bleak despite some economic development in view of increase in the number of citizens craving for the alms and "special" treatment promised by all political parties in conceited and anti-national programmes. 

Thus BJP is reducing itself to be the mirror image of congress. India needs development of all citizens and the discriminations being perpetuated by social justice and vote-bank politics are against the spirit of democracy and evenness in providing opportunities to all Indian citizens.
The BJP sans Modi will be as ineffective and inefficient as other national and regional political parties.

Unless a social revolution takes place in the spirit of spirituality, all economic development of the rich becomes irrelevant and insufficient and will further widen the gaps between the rich and the poor. This will lead to discontent, dissatisfaction and suffering of middle class and lower middle class who are not able to "earn" money as the corrupt, unscrupulous corporate and business communities which have already viciously transformed the social and economic scene with their illegal and illegitimate amassing of money in all available deceitful ways and the inflation is burdening the lower income groups heavily.

Real estate is the chief culprit as most of the ill-gotten money is invested in that activity. The less said about costs of education and healthcare it is better.

All politicians irrespective of the political party to which they belong are vain in their promises and deeds. Most of them are spending the five years of power in false statements and deceitful utterances. Most of the politicians and rulers are not suitable for what they are elected.

They reduced governance to repeating unimplementable promises and just are managing five years of rule for promoting nepotism and corruption among themselves and their associates, kith and kin.
Political parties cannot revive Indian glory. Only intellectuals, scholars, philosophers, poets, writers and seers can do it. Wish it happens.

************

అందము

రూపమును చూచి భ్రమించువారలమే హెచ్చు; కబుర్లు
మాత్రము హృదయ సౌందర్యమును చూడవలెనను
బోధలు ఇతరులకు; అందమె ఆనందం ఆనందమె జీవిత
మకరందం; ఒకరి అందవిహీనతకు కాము మనం కారణం
**********
గో సంరక్షణ

గోవును పూజించిన మాత్రమున ఏమీ ఒరగదు
గోవును సంరక్షిస్తే సబబు అని వాక్రుచ్చితే, గోవును
 పూజించ వద్దన్నాడని వక్ర భాష్యము; సంరక్షణ వల్ల
కలిగే ప్రయోజనం వట్టి పూజ వల్ల కలగదు; ఇది‌ తెలియని
జ్ఞానరహితులైన తిట్టుబోతులు; వాచాలులు;
మూర్ఖత్వము నిండిన మూఢ అనుయాయులు;
**********
Peculiar rationalists of India

As someone pointed out; why the women activists, intellectuals, social workers, NGOs, news channels etc., rationalists are absolutely silent on triple talaq issue; when they zealously and vigorously pioneered the movement that women must be allowed into shrines at Sabarimala and Sanisingapur?

*********
 అందరు మనుషులూ సమానమే అనేది బడాయి మాట


వెయ్యి రూపాయల నోటూ కాగితమే, చిత్తుకాగితము కాగితమే, కాని వాటి విలువలు వేరు. రెండూ కాగితాలే‌ అయినా వాటి ఉపయోగములు సమానము కాదు.
 
అలాగే అందరూ మనుషులే అయినా అందరూ సమానము కాదు. దొంగ, ఖూనీకోరు, అవినీతిపరుడు, దుర్మార్గుడు, నియంత‌ అయిన పాలకుడు, వ్యసనపరుడు; మంచి శాస్త్రవేత్త, పండితుడు, పాలకుడు, మేధావి, మౌని, కరుణాంతరంగుడు సమానము కాదు.
 
అందరు మనుషులూ సమానమే అనేది బడాయి మాట. ఆధునికుల పసితనపు మాట. సంఘానికి ఉపయోగపడని మనుషులు కొందరు, సంఘానికి ఉపయోగపడే మనుషులు కొందరు; సంఘానికి ఉపయోగపడకుండా, సంఘాన్ని ఉపయోగించుకునేవారు, సంఘానికి అపకారం చేస్తూ బతికేవారు కొందరు. అందర్నీ ఒకే రాటకి కట్టడం ఆధునికుల అజ్ఞానము. ఆడంబరము. డాంబికము.