Thursday, March 12, 2015

ప్రౌఢ స్త్రీ పలుకులు Wise Woman says

 
 
ప్రౌఢ స్త్రీ పలుకులు
సుఖముగా ఉండడమనేది ఒక ప్రయాణం
అంతే తప్ప ఒక గమ్యం కాదు
అందంగా ఊహించ గలిగితేనే గాని
దానిని అవగాహన చేసికొన లేవు
ప్రేమ శాస్త్రానికి చట్టానికి అతీతమైనది
ప్రణయిని ప్రేమ కన్న అధికురాలు
నేను ప్రణయ గీతాన్ని
మూర్తీభవించిన ప్రేమను
నన్ను అల్లుకొని
ఆ ఆనందాన్ని జుర్రుకో
ఆ సృష్టిలోని రంజుని
అనుభవించి

ప్రేమించడాన్ని
ప్రేమించబడడాన్ని
ప్రణయాన్ని చవిచూసి
ఆ పై జరిగే మన తనువుల కలయికను
రస భరితంగా ఆస్వాదించు

Wise Woman Says

Happiness is a journey
And not the destination

Unless you visuaize
you can not realize

Love is above law
And beloved is above love

I am love versified
And personified

Compose me
And
Experience the bliss, creation and enjoyment

And the taste of loving and being loved
Followed by exhilaration of our Union

 

రాధ అందములు



 
 
రాధ అందములు!
 
పరికిణీ ఎత్తిన పైట సర్దిన చీర సవరించిన కంట చూసిన
పట్టలేను మనసు; అందముల విందు చేయు అమ్మడూ!


నీరూపు చూసి నీ మేని హోయలుకు మురిసి
నీ వయసు నీ సొగసు నా కన్నుల్లొ నిండి
హృది సందడులు సేయ నీ గుండె తలుపులు తడితే


తెరచి తలుపులు ఎద పొంగ రమ్మందువోగడప దాటనీకుండ ఎద కుంగ పొమ్మందువో

ఎదపైన ఎద వాల్చి ఎడద సవ్వడులు పెంతువో
హృదిలోన హృది కలిపి ఎద సంగతులు వినిపింతువో

నీ వయసు నీ సొగసు నీ కమ్మని మనసు
నా సొంతమై మురిసెదమొ జీవితాంతము

కరమున కరము కలిపి పదములేడు కలిసి నడచెదమో
హృదయాల ఉయ్యాల సరసాల జంపాల
సామజవరగమనాల తనువులు తనివి చెంది
ఉరమున ఉరము చేర్చి ఊరువుల అల్లుకుని
మదనుని కదనము చేసెదమో

కమ్మని నీ మనసు రమ్మని మరి మరి
ఇమ్ముగ పిలువ చేరికకు సిద్ధమగుదమో
విననీయి నీ పలుకులు వేడుక మీర
కననీయి నీ సొగసులు కామితము దీర
పెనవేయి బాహులతలు బిగికౌగిలి తీర
కలవేయి సుందరముగ తనువులు తమి దీర

నీరూపు చూసి నీ మేని హోయలుకు మురిసి
నీ వయసు నీ సొగసు నా కన్నుల్లొ నిండి
హృది సందడులు సేయ నీ గుండె తలుపులు తడితే

తెరచి తలుపులు ఎద పొంగ రమ్మందువో
గడప దాటనీకుండ ఎద కుంగ పొమ్మందువో

పరికిణీ ఎత్తిన పైట సర్దిన బట్ట సవరించిన కంట చూసిన
పట్టలేను మనసు; అందముల విందు చేయు అమ్మడూ!రాధా!

Wednesday, March 11, 2015

ఆత్మబాంధవీ! రాధా!

 
 
ఆత్మబాంధవీ! రాధా!
సఖీ! దేవీ! మీనముల వంటి కన్నుల దానా!
పండంటి కుచములు మనసు కలదానా!
ఒకరి తపః ఫలము మరొకరిమొ మనము
శతకోటి జన్మముల జవ్వనియో మన ప్రణయము!
ఎన్నడో పడినది బ్రహ్మముడి
అది అయినది గట్టి ముడి
విడదీయలేము! విడిపోదు!
ఏ జిగురులు హత్తలేవు ప్రియా!
ఇలా హృదయమ్ముల ఒకటిగ
మనసుల హితముగ సన్నిహితముగ
ఒక్క మన పరస్పరానురాగము తక్క
వెన్నెల తునక మీగడ తారక మరువపు మొలక
మరులు గొన్న నీ మనసు పంచిన మధురిమలు
పంచదార తేనె ద్రాక్ష రసముల తీయదనములను
ఇక్షురస తీపిని నీ ఆధర మాధుర్యమును మించెను
భవదర్పిత హృదయారవింద మరందాస్వాదనా రుచులు
సతతము హాయిల మత్తులో తేలుచున్నాను
ఆనందమున మైమరచి మన సంగతికై వేచి
ఇంతటి మధురానుభవమును నాకు స్వంతము చేసిన
నిన్ను ఎటుల సత్కరించగలను? ఏమీయగలను నీకు?
పద ప్రసూనములతో అల్లితి పూ మాలలను
మాటలతో చేసితి చందనమును
సడుల వరుసతో కూర్చితిని నూపురములను
సు వర్ణములతో సమర్పించితిని మొలనూలు
పద దారముల జరీలు పట్టుల కలబోత కంచిచీర
నీకై నేసితి; ధరించి యా అంబరమును; పదాభరణముల
సుకవితాలంకారవై అంబరమును చుంబించు రతుల తేల్చుటకు
అభిసారికవై అరుదెంచి అలరించవె ఆత్మ బాంధవీ! రాధా!

Empowering women



 

 Empowering women is not removing them from homes and make them job seekers. Empowering women is to allow them to take their own decisions under the loving, able and wise guidance of parents, near and dear and teachers. Empowering women is not making them blindly follow the dictates of "modern" intellectuals in the form of anti-traditionalists, atheists, family-less wayward NGOs and the like self-appointed and self-promoted "social reformers".

Even men, who have been enjoying freedom all these centuries, need counseling in these days of anarchy, and rule of criminal-dominated, competitive, money- minded ruthless materialists and businessmen. Empowerment is individualistic. Individuals know their selves. 

If they want they follow tradition they will follow. Others have no business to object for this. If they are attracted to the apparent freedom provided by modernity they will follow that path. Let us allow them to choose their way. Not prevent them. 

Finally it is they who have to live their choice and face the consequences. Let not intellectuals decide for girls or boys what path they should take. Parents, well-wishers and other concerned people must have a say on the life and its course of their children.

నడిరేయి నను చూచి నవ్వుతావెందుకు?

 
 
 
నడిరేయి నను చూచి నవ్వుతావెందుకు?
రస సంగరమున రసేశ్వరుడు మాధవునికి సమ ఉజ్జియై చెలరేగి
కామోద్దీపనమున స్పందించిన ఆణువణువూ ఝంఝామారుతమై
తనూసాగరమునూప చెలరేగిన రత్యేచ్ఛా కెరటములతో
పోటీ పడుచు ఎగసి పడుచున్న వక్షద్వయమును
అధ్యక్షించిన స్వామి రాధాదేవి అభీష్టమును తీర్చిన పిదప
రమణి శాంత చిత్తయై సుఖానుభూతిని ఆస్వాదించుచున్న వేళ
మాతృత్వ చిహ్నములు, మంగళ సూత్రముల వహించి
నెమ్మదిగా ఎగసిపడుచున్న ప్రేయసి పాలిండ్లను చూచి
క్షణము క్రిందట వాటి ఊపులు ఊయలలు గుర్తుకు వచ్చి
కృష్ణుడు తన నెమ్మోమున చిందించెను సుందర దరహాసము
అర్ధ నిమీలిత నేత్రయయ్యు గమనించి రాధ
వీణా స్వనమున ప్రియుడ నడిగె  మత్తుగా
నడిరేయి నను చూచి నవ్వుతావెందుకని

Sunday, March 8, 2015

పిసినారి ప్రేయసి




పిసినారి ప్రేయసి

పిసినారి నా ప్రేయసి అందమున ఊర్వసి
మిసమిసలాడుచున్నను తన మనసు
తొలకరి కాదు మనవయసనుచున్నది
తన ఒళ్ళు మాత్రము పిటపిటలాడుచున్నది

తుళ్ళి తుళ్ళి పడు నా కోరికను
ఎన్నడు తీర్చునో  నే కోరుకున్నది
వయసైపోవుచున్నది; ముదిమి వాకిటనున్నది
నా చిన్నది మాత్రము ముదమందించుటలేదు

ఎండమావియొ; అందని ద్రాక్షపండో
వేదాంతము, వైరాగ్యము ఇక మాకు గతియన్న
రామ, కృష్ణ అనుకొనుట మిగిలినదన్న
అదేల? అటులేల? ప్రియమార రాధా యనరాదా? అనును

అనుకొనుటలో నున్నది
అందుటలలోనున్నది అందము ఆనందముగా
అనెడి మర్మము అంత తెలియనిదా?
అంతయు తెలిసి
తీయుచున్నది నా ప్రాణము
తీపి ముద్రలు లేవు; ఊపుల ఊయలలు లేవు
తీపుల నాటులు మాత్రము మనసును సలుపుచున్నవి

పిసినారి నా ప్రేయసి అందమున ఊర్వసి
మిసమిసలాడు మనసుతో పిటపిటలాడు ఒంటితో
అందక ఊరించుచు తీయుచున్నది నా ప్రాణము
ఇది ప్రణయమొ, ప్రళయమొ తెలియకున్నది

Thursday, March 5, 2015

అసలు నేను - The Real identity of I



 

నేను    
   
నేను అంటే గమనిక. నిర్మల మానసిక స్థితి. నిర్మల మానసికానుభవము. నేను అనిపించే నేనుకు సంబంధించిన విషయానుభవము కాని, నేను అనే తలపు కాని, ఆలోచన కాని, మాట కాని నిజమైన నేను కాదు. శరీరమూ నేను కాదు. శరీర సంబంధమైన భావములు,  ఆలోచనలు, మాటలు నేనును స్పృశించవు. 

నేను తాత్పర్యము. తత్పరము. అవగాహన. నేను అర్థము కాని, వాక్యము కాని, ఉచ్ఛారణ కాని కాదు. నేను అవగాహనతో అనుభవైకవేద్యమయ్యేది మాత్రమే తప్ప భాష దానిని చేర్చలేదు. భాషలన్నీ పుట్టి లయమయ్యే మౌనమే నేను. నేను ఈ దివ్యపదము. 

విషయానుభవము కాని, విషయార్థము కాని పరమమైతే (జ్ఞాత, జ్ఞేయము ప్రసక్తి లేని నిరంతర జ్ఞానము –– కర్త, కర్మ ప్రమేయము లేని నిరంతర సత్ క్రియా లహరి – పరా) ప్రజ్ఞానము లేక వట్టి గమనిక మాత్రమే దృష్టిగా ఉంటుంది. ఇదే అసలు నేను. 

కన్నుకు రూపము, దృశ్యములు; చెవికి మాట, శబ్దము, ధ్వని; ముక్కుకు వాసన; నాలికకు రుచి; చర్మానికి స్పర్శ- గ్రహించబడే బయటి భౌతిక ప్రపంచపు వస్తువులు. వీటినే విషయములు అంటారు. ఈ విషయములు అదే సమయములో అవి కలిగించే అనుభవములను విషయానుభవములు అంటారు. విషయానుభవములనే వాసనలు – అనీ అంటారు. ఇలా బయటి ప్రపంచ విషయములను చూసి, చూపించే జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలిక, చర్మము మనసుకి దృశ్యములు – గ్రహిపబడే వస్తువులు. మనసు జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను చూడడాన్ని, విషయానుభవములను అంత:కరణముల ద్వారా దృష్టికి తేవడాన్ని (వాసనలను ప్రేరేపించడాన్ని) మనోవృత్తి ఏర్పడడం అంటారు. అలా మనోవృత్తి విషయములను కాని, విషయానుభవములను కాని వహించి ఉండవచ్చు.

ఇలా విషయములను, విషయానుభవములను వహించి ఉండే మనోవృత్తులు ప్రజ్ఞాన రూపమైన ఈ పరమమైన నేనుకు దృశ్యములు. మనోవృత్తులను “లోకములు (– లోక్యతే అంత:కరణై: ఇతి లోక: - అంత:కరణములచే చూడబడేది, గ్రహించబడేది లోకము -)  అనీ అంటారు. నేను ఫలానా వ్యక్తిని అనే స్పృహ, తలపు, పలుకు గమనికయైన ఈ అసలు నేనుచే గమనింపబడే విషయములు. 

ఇలా విషయములు, విషయానుభవములు ఏమీ గమనికలో లేకపోవడాన్ని జాగ్రత్ సుషుప్తి – మెళకువతో కూడిన నిద్ర – అంటారు. గమనికలో విషయముల, విషయానుభవముల అభావమే – లేమియే- లేకుండా ఉండడమే సుషుప్తి. అన్నీ తెలుస్తూ ఈ నిద్రపోతే అది ఆత్మస్థితి. బ్రహ్మస్థితి. శాంతి, మౌన, ఆనంద స్థితులు ఇదే. (అంతర, బహిర్ ప్రపంచములు) ఏమీ తెలియకుండా ఈ నిద్రపోతే దానిని గాఢనిద్ర అంటారు. 

విషయములు, విషయానుభవములు దృష్టిలో (గమనికలో) ఉంటే అది మానసిక దృష్టి. మస్తిష్కములోని అంతర ప్రపంచము – బయటి భౌతిక ప్రపంచపు విషయముల, విషయానుభవముల ఆంతర ముద్రల సమాహారము – భావములుగా, తలపులుగా, అనుభవములుగా దృష్టిలో ఉంటే దానిని అంతర్ముఖ దృష్టి లేక స్వప్న / కల మానసిక దశ అంటారు. మనసు మాధ్యమముగా జ్ఞానేంద్రియముల ద్వారా బయటి భౌతిక ప్రపంచము, తద్వారా కలిగే అనుభవములు దృష్టిలో ఉంటే దానిని బహిర్ముఖ దృష్టి  లేక జాగ్రత్ / మెళకువ మానసిక దశ అంటారు.
ఈ రెండు మానసిక దృష్టులు విరమింపబడిన దృష్టిని విశ్రాంత దృష్టి అంటారు. ఇది ఆత్మ దశ. నిర్మల మానసిక దశ. ఇక్కడ విశ్రాంత శబ్దము మనసు, ఇతర అంత:కరణముల యొక్క విశ్రాంతతను, విరామమును, విరమణమును సూచిస్తుంది. 


 


మనసు, ఇతర అంత:కరణములు (బుద్ధి – నిశ్చయానిశ్చయములు, విచక్షణ, తర్కము- , అహంకారము – నేను ఫలానా వ్యక్తిని అనే స్పృహ, తలపు - , చిత్తము – స్మరణము, విషయానుభవములను కలిగించడము, ప్రేరేపించడము, జ్ఞాపకములను, జ్ఞప్తిని సృష్టించడము, దృష్టిలోకి తేవడము) పనిచేయక తమ జన్మ స్థానమైన ఆత్మలో లీనమై ఉంటాయి. ఈ స్థితిని ప్రళయ స్థితి అని అంటారు. మోక్ష స్థితి అన్నా, ముక్తి పదము అన్నా ఇదే.
ఈ విధముగా నేను అసలు స్వరూపమును ఎరిగి, అసలు నేనుగా (వట్టి గమనికగా) నిలవడం, అసలు నేనుగా ఉండడం ఒక ఆధ్యాత్మిక సాధన, సాధనా ఫలమూను. 


గుణస్వరూపము
గుణము అంటే గ్రంథి. ముడి. అనుసంధానము. బంధనము. బంధము.
విషయముతోగాని, విషయానుభవముతోగాని అంత:కరణములు ముడివడిన స్థితి సగుణ స్థితి. సత్వ-రజస్-తమములు గుణ విశేషములు. ఇలా ముడివడి ఉండకపోవడము గుణరాహిత్యము. నిర్గుణస్థితి. విషయ, విషయానుభవములతో ముడి వీడిన స్థితి. వీటితో బంధనారాహిత్యము, బంధనా అభావము (బంధము లేకుండుట), సంగరాహిత్యము, నిస్సంగత్వము, నిర్మోహత్వము, నిశ్చలతత్త్వము, నివాత స్థల దీపము (సహజ నిర్వికల్పము. ఇవే అసలు నేను పదానికి తాత్పర్యములు


అసలు నేను వ్యక్తికి సంబంధించినది కాదు. మనం వ్యవహరించే నేను – వ్యావహారిక నేను – వ్యక్తికి, వ్యక్తిత్వానికీ సంబంధించిన ఊహ మాత్రమే. తలపు మాత్రమే. “నేను” వ్యక్తిని అనేది ఒక అపోహ. ఆనంద స్వరూపమైన నేనుపై ఆనింపు. వ్యక్తిత్వము ఒక తెర. ఈ తెరను తొలగించు కోవడమే ఆధ్యాత్మిక గమ్యము. ఈ తెరను అవసరము వచ్చినపుడు దించుకొని, అక్కర్లేనప్పుడు ఎత్తేసుకోగలగడమే తాత్త్విక చతురత. 

అందుకే ఆధ్యాత్మిక సాధన కత్తిమీద సాము. అనవధానము ఒక్క క్షణమైనా కూడదు. తప్పుడు అన్వయాలు వస్తాయి. ఏర్పడతాయి. వ్యక్తిత్వ విరమణమే మోక్షము. వ్యక్తిత్వ స్పృహ జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి (గాఢనిద్ర) దశలందు ఉండదు. జాగ్రత్ (మెళకువ), స్వప్న (కల) మానసిక దశలలో మాత్రమే కలుగుతుంది. ఆ విధముగా వ్యక్తిత్వము (వ్యక్తిత్వ స్పృహ) కొన్ని మానసిక దశలలో కలుగుతుంది. కొన్నిటిలో విరమింప బడుతుంది. ఉండదు. ఏర్పడదు. వ్యక్తిత్వ స్పృహ లేని  సమయములలో అహంకార, మమకారములు నిండుకొని, శాంతి, ఆనందము వెల్లి విరుస్తూంటాయి. 

వ్యక్తిత్వ స్పృహ అంటకుండా అన్ని లౌకిక, శారీరిక, మానసిక కార్యకలాపములను జరుపుకోవడమే తాత్త్విక జీవనం జీవించడం. తామరాకు మీద నీటి బొట్టులా చరించడం. శాంతి, ఆనందము, మౌనము నిండి ప్రజ్ఞానముగా నిలుచు విశ్రాంత దృష్టియే “నేను” పద లక్ష్యము, లక్షణము. మిగతావన్నీ వట్టి భావనలు మాత్రమే. ఇవి మిథ్యలు. ఒకసారి కలిగి - ఒకసారి విరమింపబడతాయి. విశ్రాంత దృష్టియే అసలు నేను స్వరూపము. అహం బ్రహ్మాస్మి! అహం రామబ్రహ్మాస్మి! 



The Real Identity of I


1.                Aham Brahma Asmi             I AM BRHMAN                  I AM SELF

      The real identity of ‘I’ is Unoccupied Awareness. The state of  SELF.
      ‘I’ is not a body, person, thought or not a sense.  ‘I’ is pure consciousness.
            ‘I’ is the impersonal Seer which is the source of mental energy and guide of    and    witness to transformation of mental energy as mental functions but unaffected by         them and transcending both mental functions   and their cessation.

2.                        Tat Tvam Asi    THAT IS YOU      YOU ARE THE SELF

Self and Pure Consciousnesses are same in nature, content, structure, form (function) and presence. At a given moment either self-consciousness or pure consciousness will be present. Self-consciousness is super imposition over pure consciousness. Pure consciousness is continuous, self-consciousness is transient and transitory.

      3.    Ayam Atma Brahma   THIS ATMAN IS BRAHMAN  ATMAN= BRAHMAN=SELF 
Atman is Brahman – Unoccupied Awareness –- Energy Presence without transformation.

      4.    Prajnanam Brahma   PRAJNANAM IS BRAHMAN       PRAJNAAM IS SELF

Brahman– as Atman –– Energy Presence – is Mental Time- Space and   Continuous Awareness.
Prajnanam is Unoccupied (by cognitions, thoughts, cognition-related and created experiences, senses or their retrieval) Awareness in Pure Consciousness.
     
      5    Raso vy Saha   AWARENESS OF MEANINGFUL EXPERIENCE/EXPERIENCED OF MEANING  IS BRAHMA ALL SOUNDS &SENSES ORIGINATE & MERGE IN SELF 

Experience of Essence of the meanings of all vakyas (sentences) - All Cognition-related experiences in the awareness of the Atman- Meaningful Experience. Silence. Peace. Bliss.  Experienced  meaning. Purport.

6.      Anando Brahma   BLISS IS BRAHMAN       STATE OF SELF IS STATE OF BLISS

Unoccupied Awareness is bliss.

7.    Sarvam Khalu Idam Brahma   ALL IDAM IS BRAHMAN  ALL KNOWN/ PERCEIVED / EXPERIENCED/UNDERSTOOD WORLD IS PART AND PARCEL OF AND CONTAINED IN SELF; IS A SUPERIMPOSITION ON THE REAL I STATE

Idam, (prapancham or jagat ) ( all the world - the collection of cognitions sensed by sense organs through the medium of manas) – is composed in, made up of, sustained by, rests in and ceases to be because of and part and parcel of psychic energy pulse generator – Atman.  
                                          
b) WHAT IS ‘I’?
The real identity of ‘I’ according to Upanishads:
The term ‘I’, denotes human consciousness. Human consciousness is awareness of human mind.
‘I’ is not a term denoting any of an individual, individual’s body, self-consciousness, the social status, age, gender etc.,
‘I’ is the unoccupied awareness or pure consciousness in the individual in the Jagrat Sishupti (wakeful sleep) consciousness state when peace, bliss, silence and oneness or non-duality is experienced.
‘I’ is not a person, a thought, a sense, an experience or an understanding. ‘I’ is a consciousness which transcends all these and is a non-transforming seer and witness to all these and is revealed and experienced as peace or bliss or silence in wakeful sleep conscious state- the mind-transcending phase when all mental activities in the form of thoughts and senses etc, -cease to be. And one has to refer to this natural mental state when one refers to ‘I’.
‘I’ is unceasing, undivided continuous blissful conscious awareness.
‘I’ or Atman is consciousness present always (in all phases of mind) and is super-imposed but untouched by mental functions during wakeful (Jagrat) and dream (Swapna) conscious states and becomes sense/mood or thought or expression.  Self-consciousness arises in these two states and then ‘I’ is identified with individual’s body, sense and thoughts about I, me, mine, mental capabilities, gender, social status, age etc, and masks pure consciousness.  In deep sleep (Sushupti) conscious state (like zero in number system without value but is essential and significant) there is no awareness of the body, the within or without of the body.  No ‘I’ expression, thought, feeling or sense or experience relating to individual exists in this mental phase.
‘I’ or Atman is an eternal consciousness transcending the three conscious states – wakeful, dream and deep sleep- and observes all the mental activities or cessation of such activities taking place in these three mental phases.  ‘I’ is also present during these phases as continuous consciousness/awareness to happenings within and without of the body.
Upanishadic awareness uses the terms Atman, Brahman, Sat (Being), Chit (Pure Consciousness), Ananda (Bliss), Prajnanam (mental time-space – Unoccupied Awareness), Santhi (Peace), Maunam (Silence/Quietude/Mental Solitude) synonymously